
సాక్షి, లక్నో : సాధారణంగా పెళ్లి కూతురును తీసుకెళ్లేందుకు పెళ్లి కొడుకు అతడి మంది మార్బలం బ్యాండ్ బాజా బారత్‌తో దర్జాగా హుందాగా వస్తాడు. వచ్చి రాగానే అతిథ్య మర్యాదలను పిల్లనిచ్చేవారు చేస్తారు. వాటిలో ఏమాత్రం లోటుపాట్లు జరిగినా అలిగి అవతలికి పోతారు. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని నయేపూర్ అనే గ్రామంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. సుమన్ రాణి పటేల్ అనే వధువే గుర్రం ఎక్కి వరుడు ఇంటికి వచ్చి ట్రెండ్ సెట్ చేసింది. తన అత్తమామలు బంధువులు ఇచ్చే మర్యాదలు స్వీకరించింది. వరుడిని త్వరగా తీసుకెళ్లాలి సిద్ధం చేయండంటూ ఆర్డర్స్ వేసింది.
అయితే, ఈ ఐడియాను ఇచ్చింది పెళ్లి కుమారుడి తండ్రేనట. డాక్టర్ కశ్యప్ అనే ఆయన సమాజంలో లింగ సమానత్వం ఉండాలని, పురుషుడు, స్త్రీలకు సమాన హక్కులు ఉండాలని ఒప్పించే క్రమంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకొని ఇరు కుటుంబాలను అంగీకరించేలా చేశాడు. రాజ్‌లక్ష్మీ గ్రామ్యాంచల్ మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలో పెళ్లి కూతురు సుమన్ రాణి ప్రస్తుతం మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. అయితే, ఆమెకు టీచర్ ఉద్యోగం అంటేనే మక్కువ అంట. ఇక పెళ్లి కుమారుడు రాజా థాకుర్ మాత్రం రైల్వేశాఖలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment