స్టేజ్‌పైనే వధువుకి ముద్దుపెట్టిన వరుడు.. తర్వాత ఏం జరిగిందంటే! | Kiss Gone Wrong At UP Wedding, Groom Family Beaten Up On Stage | Sakshi
Sakshi News home page

స్టేజ్‌పైనే వధువుకి ముద్దుపెట్టిన వరుడు.. తర్వాత ఏం జరిగిందంటే!

Published Thu, May 23 2024 4:30 PM | Last Updated on Thu, May 23 2024 6:01 PM

Kiss Gone Wrong At UP Wedding, Groom Family Beaten Up On Stage

పెళ్లంటే ఎన్నో పనులు, హడావిడీ, బంధువుల సందడి.. పవిత్రమైన వివాహ బంధం ద్వారా ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే కాకుండా.. రెండు కుటుంబాలను దగ్గర చేసే వేడుక. అయితే  కాలం మారుతున్న కొద్దీ పెళ్లి పద్దత్తుల్లోనూ అనేక మార్పులు జరుగుతున్నాయి. ఈ మధ్య పెళ్లికి ముందే ఫోటో, వీడియో షూట్‌లు చేసుకోవడం ఎక్కువైపోయింది. పెళ్లిలో తాళి కట్టే సమయంలోనూ వరుడు, వధువు నుదుటిపై ముద్దు పెట్టిస్తున్నారు. ఇలా తమకు నచ్చిన విధంగా, జీవితాంతం గుర్తిండిపోయేలా పెళ్లి చేసుకుంటున్నారు.

పాపం ఇలాగే ఆలోచించిన ఓ పెళ్లికొడుకు వేదిపైనే ఏకంగా వధువుకు ముద్దు పెట్టాడు. ఇంకేముంది వరుడి చర్య ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లో హాపూర్‌లో చోటుచేసుకుంది. 

అశోక్‌ నగర్‌లో శనివారం ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు వివాహాలు జరిపించాడు. మొదటి పెళ్లి ఎలాంటి అవంతరాలు లేకుండా పాఫీగా జరిగింది. అయితే రెండో కూతురు పెళ్లి మాత్రం గందరగోళంగా మారింది. తాళి కట్టిన తరువాత ఇ‍ద్దరు దండలు మార్చుకుంటుండగా ఒక్కసారిగా వరుడు, వధువుకు ముద్దులు పెట్టాడు. ఎలాగో భార్యే కదా అని అనుకున్నాడో ఏమో బంధువుల సమక్షంలోనే ముద్దు పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. 

ఇది చూసిన వేదికపై ఉన్న వధువు కుటుంబ సభ్యులు.. వరుడి బంధువులపై దాడి చేశారు. దీంతో వివాహ వేదిక రణరంగంగా మారింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపటికే వధువు కుటుంబ సభ్యులు కర్రలు పట్టుకుని వేదికపైకి ఎక్కి వరుడి కుటుంబీకులను కొట్టారు. ఈ ఘర్షణలో వధువు తండ్రి సహా ఆరుగురికి గాయాలయ్యాయి. చివరికి ఈ పంచాయితీ పోలీసుల వద్దకు చేరడంతో ఇరు కుటుంబాలకు చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే వరుడు వధువును వేదికపై బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించగా.. వరమాల తర్వాత తనను ముద్దు పెట్టుకోవాలని వధువే పట్టుబట్టిందని వరుడు చెప్పాడు. ఈ కేసులో ఇరు కుటుంబాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వ్రాతపూర్వక ఫిర్యాదు రాలేదని, ఫిర్యాదు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని హాపూర్ సీనియర్ పోలీసు అధికారి రాజ్‌కుమార్ అగర్వాల్ తెలిపారు. ఇక ఈ ఘటన తర్వాత రెండు కుటుంబాలు పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement