Kissing
-
స్టేజ్‌పైనే వధువుకి ముద్దుపెట్టిన వరుడు.. తర్వాత ఏం జరిగిందంటే!
పెళ్లంటే ఎన్నో పనులు, హడావిడీ, బంధువుల సందడి.. పవిత్రమైన వివాహ బంధం ద్వారా ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే కాకుండా.. రెండు కుటుంబాలను దగ్గర చేసే వేడుక. అయితే కాలం మారుతున్న కొద్దీ పెళ్లి పద్దత్తుల్లోనూ అనేక మార్పులు జరుగుతున్నాయి. ఈ మధ్య పెళ్లికి ముందే ఫోటో, వీడియో షూట్లు చేసుకోవడం ఎక్కువైపోయింది. పెళ్లిలో తాళి కట్టే సమయంలోనూ వరుడు, వధువు నుదుటిపై ముద్దు పెట్టిస్తున్నారు. ఇలా తమకు నచ్చిన విధంగా, జీవితాంతం గుర్తిండిపోయేలా పెళ్లి చేసుకుంటున్నారు.పాపం ఇలాగే ఆలోచించిన ఓ పెళ్లికొడుకు వేదిపైనే ఏకంగా వధువుకు ముద్దు పెట్టాడు. ఇంకేముంది వరుడి చర్య ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లో హాపూర్‌లో చోటుచేసుకుంది. అశోక్ నగర్లో శనివారం ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు వివాహాలు జరిపించాడు. మొదటి పెళ్లి ఎలాంటి అవంతరాలు లేకుండా పాఫీగా జరిగింది. అయితే రెండో కూతురు పెళ్లి మాత్రం గందరగోళంగా మారింది. తాళి కట్టిన తరువాత ఇద్దరు దండలు మార్చుకుంటుండగా ఒక్కసారిగా వరుడు, వధువుకు ముద్దులు పెట్టాడు. ఎలాగో భార్యే కదా అని అనుకున్నాడో ఏమో బంధువుల సమక్షంలోనే ముద్దు పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఇది చూసిన వేదికపై ఉన్న వధువు కుటుంబ సభ్యులు.. వరుడి బంధువులపై దాడి చేశారు. దీంతో వివాహ వేదిక రణరంగంగా మారింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపటికే వధువు కుటుంబ సభ్యులు కర్రలు పట్టుకుని వేదికపైకి ఎక్కి వరుడి కుటుంబీకులను కొట్టారు. ఈ ఘర్షణలో వధువు తండ్రి సహా ఆరుగురికి గాయాలయ్యాయి. చివరికి ఈ పంచాయితీ పోలీసుల వద్దకు చేరడంతో ఇరు కుటుంబాలకు చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే వరుడు వధువును వేదికపై బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించగా.. వరమాల తర్వాత తనను ముద్దు పెట్టుకోవాలని వధువే పట్టుబట్టిందని వరుడు చెప్పాడు. ఈ కేసులో ఇరు కుటుంబాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వ్రాతపూర్వక ఫిర్యాదు రాలేదని, ఫిర్యాదు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని హాపూర్ సీనియర్ పోలీసు అధికారి రాజ్‌కుమార్ అగర్వాల్ తెలిపారు. ఇక ఈ ఘటన తర్వాత రెండు కుటుంబాలు పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాయి. -
Phu Quoc: వెహికిల్స్‌కు నో ఎంట్రీ.. ఎందుకంటే ఇది... కిస్సింగ్ బ్రిడ్జి
వియత్నాంలో అది అనగనగా ఓ వంతెన. కానీ దాన్ని కట్టింది అన్ని వంతెనల మాదిరిగా అటూ ఇటూ దాటడానికి కాదు. ముద్దులు పెట్టుకోవడానికి! అవును. వినడానికే విచిత్రంగా ఉంది కదూ! దక్షిణ వియత్నాంలోని ఫూక్వోక్ ద్వీపం అందమైన బీచ్‌లకు ప్రసిద్ధి. అక్కడి సన్‌సెట్ సిటీలో ఇటీవల నిర్మించిన 800 మీటర్ల పై చిలుకు పొడవైన బ్రిడ్జి అందరినీ ఎంతగానో అలరిస్తోంది. ఇది ముద్దుల బ్రిడ్జి కావడమే ఇందుకు కారణం. దీని డిజైన్‌ను ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్ మార్కో కాసామోంటీ రూపొందించాడు. లగ్జరీ టూరిజం డెవలపర్ సంస్థ సన్ గ్రూప్ నిర్మించింది. ఆడమ్ సృష్టికి సంబంధించి ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు మైకేలాంజిలో సిస్టిన్ చాపెల్‌లో సృజించిన ఫ్రెస్కో పెయింటింగ్ స్ఫూర్తితో దీని డిజైన్‌కు రూపకల్పన చేశారు. రెండు సగాలుగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఆ పెయింటింగ్‌లోని రెండు చూపుడు వేళ్ల మాదిరిగానే బ్రిడ్జి తాలూకు రెండు సగాలు కూడా పరస్పరం తాకవు. వాటి మధ్య 30 సెంటీమీటర్ల దూరముంటుంది. దూరంనుంచి చూస్తే ఆ రెండు కొనలూ ఒకదాన్నొకటి చుంబించుకుంటున్నట్టుగానే ఉండటం మరో విశేషం! ముద్దులాడాలనుకునే జంటలో ఒకరు ఆ సగం నుంచి, మరొకరు ఈ సగం మీద నుంచుని వీలైనంతగా ముందుకు వంగాలన్నమాట! ఆ మీదట పెదాలకు పని చెబుతూ తమ ప్రేమను వ్యక్తపరుచుకోవచ్చు. పెళ్లికి ప్రపోజ్ చేసుకోవచ్చు. ఈ బ్రిడ్జి పేరు చౌ హోన్. దాని అర్థం కూడా ‘పెళ్లికి ప్రపోజ్ చేసుకోవడం’ కావడం మరో విశేషం. వారం క్రితం ప్రారంభించిన ఈ బ్రిడ్జి చూస్తుండగానే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. దాన్ని చూడటానికి, చెరోవైపు నుంచి రొమాంటిక్‌గా ముద్దులాడటానికి జంటలు భారీగా వస్తున్నాయట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముద్దు పెట్టుకోవడం వల్ల మొటిమలు వస్తాయా?
అయిచాలామంది టీనేజ్ పిల్లలనే కాదు కొందరూ పెద్దల్లో కూడా ఈ మొటిమలు ఇబ్బంది పెడుతుంటాయి. వేడి చేసి కూడా వస్తుంటాయని అంటారు కొందరూ. కానీ వాటి వల్ల ముఖం కమిలి ర్యాషెస్ వచ్చినట్లుగా పోతాయి. ఆయిల్ వస్తువులు తినడం వల్ల వచిందా? లేక తలలోని చుండ్రు కారణమా అని మాత్రమే ఆలోచిస్తాం. కానీ ముద్దు పెట్టుకోవడం వల్ల మొటిమలు రావడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి ఇది నిజం. వినడానికి నమ్మశక్యం కానంత వింతగా అనిపిస్తుందని కొట్టిపారేయొద్దు. ఎలా సాధ్యమో సవివరంగా తెలుసుకునేందుకే ఈ కథనం. ముద్దు మీ మానసిక ఆరోగ్యానికి, వ్యక్తిగత జీవితానికి ప్రయోజనకరమైనదే అయినా ఒక్కోసారి ఇది కొన్ని సమస్యలు తెచ్చుపెడుతుంది. ముద్దు వల్ల చర్మం ఇరిటేషన్‌కి గురై ఆ తర్వాత మొటిమలు ఏర్పడేందుకు దాదితీస్తాయని చర్మ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జిడ్డు, మొటిమలు బారినపడే చర్మం ఉన్నవారైతే వారిలో బ్యాక్టీరియా, నూనెను బదిలీ చేసే కారకాలు ఎక్కువుగా ఉంటాయి. ఇలాంటి వారు ముద్దు పెట్టుకుంటే లాలాజలం ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ అయ్యి చర్మం చికాకుగా అయ్యి మొటిమలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. ముద్దు పెట్టుకున్న వెంటనే మొటిమలు రావు. అలాగే ఇది అంటు వ్యాధి కాదు. లిప్ బామ్‌లు వంటివి వాడే వారైతే అవి మీ చర్మానికి సరిపడనది అయ్యి సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు. జిడ్డు చర్మం, ప్రధానంగా డెడ్్ స్కిన్ సెల్స్, బ్యాక్టీరియాతో మూసుకుపోయిన రంధ్రాల వల్ల ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల నేరుగా రాకపోయిన వారి అపరిశుభ్రత కారణంగా పరోక్షంగా మొటిమొలు వచ్చేందుకు దోహదం చేస్తాయని చర్మ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎక్కువ సేపు ముద్దులు పెట్టుకోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రతరంగా ఉంటుంది. మీరు, మీ భాగస్వామి మధ్య అవగాహనతో మంచి పరిశుభ్రతతో ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవు. అందులో ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతలో లోపం ఉన్నా ముద్దుల వల్ల సమస్య వస్తుంది. అది మొటిమలు వరకే కాదు ఇంకే ఇతర అనారోగ్య సమస్యలైన ఇలానే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందనే విషయం మరిపోవద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: పార్లర్‌కి వెళ్లక్కర్లేకుండా..ఈ మెషిన్‌తో ఈజీగా వ్యాక్సింగ్, థ్రెడింగ్..) -
మెట్రోలో లవర్స్ పాడుపని.. ట్రెండింగ్‌లో వీడియోలు
సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు బరితెగిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పిచ్చి చేష్టలతో రెచ్చిపోతున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందన్న సోయి లేకుండా హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. బస్సు, మెట్రో, విమానం, రైల్లో ఆకతాయిల ఆగడాలు ఈమధ్య ఎక్కువై పోతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో అసాంఘిక కార్యక్రమాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. పాపులర్ కావాలని చేస్తున్నారా? లేక పొరపాటుగా అలా జరిగిపోతోందా? తెలియదుగానీ మెట్రో పరువైతే బజారున పడే పరిస్థితి దాపురించింది. ఈ క్రమంలో ట్విటర్లో #DelhiMetro హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. గతంలో కొందరు ప్రేమికులు మెట్రోలో పబ్లిక్ ముందే ముద్దులు పెట్టుకుంటూ ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలిసిందే. మరో వ్యక్తి మెట్రో రైలు కోచ్‌లో బనియన్, టవల్‌తో దర్శనమిచ్చాడు. ఇది మరవకముందే మరో జంట సిగ్గు విడిచి లిప్ కిస్ ఇచ్చుకున్నారు. నిన్న కాక మొన్న ఓ యువతి బికినీ ధరించి మెట్రోలో ప్రయాణించింది. ఈ వీడియోలన్నీ నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టాయి. అయితే వరుస సంఘటనలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు ట్విటర్లో షేర్ చేస్తూ ఫిర్యాదు చేస్తున్నారు. పబ్లిక్ ప్లేసెస్‌లో ఇలాంటి పనులేంటని ప్రశ్నిస్తూ.. వీటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. #DelhiMetro హాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో గళమెత్తుతున్నారు. कल से सिर्फ Delhi Metro में ही travel करूंगा !!!!!! pic.twitter.com/l228ZEao1q — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) April 3, 2023 View this post on Instagram A post shared by 🇮🇳मोहित गौहर 🇮🇳 (@mohitgauhar) Another video of Delhi Metro. If this is an example of WOMEN EMPOWERMENT, then alas our young generation GIRLS can be victim of such EMPOWERMENT 🤦♂️ And this is exactly what SHAMELESS FEMINISTS want. I would call it CULTURAL GEN*CIDE.#delhimetro @OfficialDMRC pic.twitter.com/BrmjBQ3u32 — Barkha Trehan 🇮🇳 / बरखा त्रेहन (@barkhatrehan16) March 31, 2023 -
బహిరంగంగానే మహిళా నేతను ముద్దు పెట్టుకున్న శివసేన ఎమ్మెల్యే?
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే ప్రకాష్ సర్వే చిక్కుల్లో పడ్డారు. దహిసర్‌లో ఆశీర్వాద్ యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ ర్యాలీలో పార్టీ మహిళా నేతను ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఎమ్మెల్యే.. పార్టీ అధికార ప్రతినిధి షీతల్ మ్హత్రేను బుగ్గ మీద ముద్దాడినట్లు కనిపిస్తుంది. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ర్యాలీకి శివసేన ఎమ్మెల్యే ప్రకాశ్ సర్వే, పార్టీ అధికార ప్రతినిధి శీతల్ మ్హత్రే హాజరయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ వాహనం మీద ఉన్నారు. ఆయన పక్కనే షీతల్ నిలబడి ఉన్నారు. ఉన్నట్టుండి ఎమ్మెల్యే రెండుసార్లు కిందకు వంగి మహిళా నేతను ముద్దు పెట్టుకున్నట్లు, ఆమె వైపు చూస్తూ నవ్వడం వీడియో ద్వారా తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ వీడియోపై ఎమ్మెల్యే స్పందించారు. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో ఫేక్ అని తేల్చారు. తన పరువు తీసేందుకు, రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి వీడియోను మార్ఫింగ్ చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. అంతేగాక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివసేన నేతలు ముద్దుపెట్టుకుంటున్న వీడియోను మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలపై ఐపీసీ సెక్షన్లు 354,509,500,34, 67 కింద దహిసర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుతో సంబంధమున్న ఇద్దరు నిందితులను 26 ఏళ్ల మానస్ కువార్, 45 ఏళ్ల అశోక్ మిశ్రాగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు. खुल्लम खुल्ला प्यार करेंगे हम दोनो. .. .. pic.twitter.com/6ubh6gg4MZ — जाग्रुत जनता (@foundat11) March 12, 2023 అంతేగాక ఈ వ్యవహారంపై శీతల్ మ్హత్రే స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్లో ’రాజకీయాల్లో ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకు ఇంత నీచానికి దిగజారుతారా? ఇదేనా మీ సంస్కృతి? మాతోశ్రీ అనే ఫేస్బుక్ పేజీ నుంచి మార్ఫింగ్ చేసిన వీడియోని అప్లోడ్ చేసినట్లు తెలిసింది. ఆ సమయంలో మీకు బాలాసాహెబ్ సంస్కారం గుర్తుకు రాలేదా?’ అంటూ దుయ్యబట్టారు. राजकारणामधील महिलेसंदर्भात बोलण्यासारखे काही नसले तर तिचे चारित्र्यहनन करणे हेच उद्ध्वस्त गटाचे संस्कार आहेत?? मातोश्री नावाच्या fb पेजवरुन एका स्त्री संदर्भात असा morphed video upload करताना बाळासाहेबांचे संस्कार नाही का आठवले? pic.twitter.com/rpaqbMtiZU — sheetal mhatre (@sheetalmhatre1) March 11, 2023 -
భయానక స్టంట్: ఏకంగా కింగ్ కోబ్రా తలపై ముద్దు: వీడియో వైరల్
ఇటీవల కాలంలో పాములతో రకరకాల స్టంట్లు చేస్తున్నారు. ఆ స్టంట్లలో చాలా వరకు బెడిసి కొట్టిన ఘటనలే చూశాం. అదీగాక విషసర్పలతో కామెడీ చేస్తే ప్రాణాలకే ముప్పు అని చాలా విషయాల్లో ప్రూవ్ అయ్యింది కూడా. ఇటీవలే ఒక వ్యక్తి నాగుపాము నుదుట ముద్దు పెట్టుకోబోతే రివర్స్‌లో కాటేసిన సంఘటన చూశాం. అయిన పలువురు స్నేక్ క్యాచర్లు ఇలాంటి స్టంట్లే చేస్తున్నారు. ఇక్కడొక స్నేక్ క్యాచర్ ఏకంగా కింగ్ కోబ్రా తలపై ముద్దు పెట్టే స్టంట్ చేశాడు. వివరాల్లోకెళ్తే..ఈ హార్ట్ రైజింగ్ స్టంట్ వీడియోని సౌరబ్ జాదవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ వీడియోలో ఒక వ్యక్తి కింగ్ కోబ్రా తలపై ముద్దు పెట్టుకునే స్టంట్ చేశాడు. ఈ స్టంట్ చేసిన వ్యక్తి వావా సురేష్ అనే కేరళ వాసి. అతను ఇప్పటివకరకు సుమారు 38 వేల విషసర్పాలను పట్టుకున్నాడు. మూడువేల సార్లుకు పైగా పాము కాటుకి గురయ్యాడు. అంతేగాదు సుమారు 190కి పైగా కింగ్ కోబ్రాలను రక్షించాడు. దీంతో అతన్ని అందరూ కేరళ స్నేక్ మ్యాన్‌గా పిలుస్తుంటారు. అసలు ఈ వీడియో చూస్తే.. అతను ఎలా ఉన్నా టెన్షన్‌తో చూస్తున్న మనకు గుండె ఆగిపోయినంత భయం వేస్తుంది. View this post on Instagram A post shared by Saurabh Jadhav Jadhav (@10_viper_21) (చదవండి: మానవత్వం అంటే ఇది కదా! రోడ్లపై చెత్త కాగితాలు ఏరుకుంటున్న ఆమెను..) -
అలిగిన టీచర్‌కు ముద్దుపెట్టిన బుడ్డోడు.. వీడియో వైరల్
పాలబుగ్గల పసివాడు తన క్లాస్ టీచర్‌కు క్షమాపణలు చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తరగతి గదిలో అల్లరి చేసినందుకు ఆ బుడ్డోడిపై టీచర్‌కు కోపం వచ్చింది. ఇకపై అతనితో మాట్లాడనని చెప్పింది. దీంతో ఆ బాలుడు ఆమె దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పాడు. టీచర్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. నవ్వు ఎప్పుడూ ఇలాగే చేస్తావ్. తప్పు చేయనని చెప్పి మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటావ్. నీతో ఇక మాట్లాడను అని అలకబూనింది. అందుకు బుడ్డోడు బదులిస్తూ.. మళ్లీ క్లాస్‌లో అల్లరిచేయనని చెప్పాడు. ఇది చివరిసారి అన్నాడు. అంతేకాదు టీచర్‌కు రెండు ముద్దులు కూడా పెట్టాడు. దీంతో ఆమె అలకవీడింది. బుడ్డోడికి కూడా రిటర్న్ కిస్ ఇచ్చింది. చూడచక్కగా ఈ వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. చాలా క్యూట్, అడోరబుల్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ऐसा स्कूल मेरे बचपन में क्यों नहीं था 😏😌 pic.twitter.com/uHkAhq0tNN — ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) September 12, 2022 చదవండి: భర్తకు ట్రాన్స్‌వుమన్‌తో ఎఫైర్.. పెళ్లికి అంగీకరించిన భార్య.. -
ముగ్గురు దొంగల చిలిపి పని... భయపడి చస్తున్న నివాసితులు!
ఇటీవల కాలంలో దొంగతనానికి వచ్చిన దొంగలు కొన్ని చిలిపి చేష్టలు చేస్తున్న ఘటనలు చూశాం. వాళ్లు ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అర్థంకాక బిత్తరపోతున్నారు జనాలు. మొన్నటికి మొన్న ఒక దొంగ ఐ లవ్ యూ అని ఒక లెటర్ రాసిపెట్టి వెళ్లిపోయాడు. మరొక దొంగ ఇంత కష్టపడి దొంగతనం చేయడానికి వస్తే ఏం పట్టికెళ్లకుండా వెనుదిరగడం చాలా కష్టంగా ఉంటుందంటూ తన ఆవేదన చెబుతూ ఒక లెటర్ రాసి మరీ వెళ్లాడు. ఇప్పుడు ఏకంగా ముగ్గురు దొంగలు సీసీటీవి వద్దకు డేర్‌గా వచ్చి ఏం చేశారో చూస్తే షాక్ అయిపోతారు. ఏం జరిగిందంటే....తమిళనాడులో రామ్‌నగర్‌లోని ఒక అపార్టమెంట్ వాసులు దొంగల బెడదతో సీసీటీవీని ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి ఆ ప్రాంతంలో దొంగలు తరుచుగా ఇళ్లపై దాడులు చేయడం జరిగింది. ఐతే ఒక రోజు ముగ్గురు దొంగలు ఆ అపార్టమెంట్ కాపౌండ్ వాల్ ఎక్కి నడుచుకుంటూ వచ్చారు. పైగా అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ వద్దకు డేర్‌గా వచ్చి ముద్దు పెట్టుకుని వెళ్లిపోయారు. మరుసటి రోజు అపార్ట్మెంట్ వాసులు సీసీపుటేజ్ చెక్ చేయగా ముగ్గురు దొంగలు చేసిన చిలిపి నిర్వాకం చూసి షాక్‌కి గురవుతారు. ఈ మేరకు భయంతో తులసీ రమేశ్ అనే వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్‌ని ట్విట్టర్లో షేర్ చేస్తూ సదరు దొంగలను గుర్తించి సాయం చేయడండి అంటూ పోలీసులు ప్రజలను కోరాడు. ఐతే చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. (చదవండి: హీరోయిన్ రేంజ్లో పరుగెత్తి... చివరికి నేలకి అతుక్కుపోయింది) -
కాలేజీ విద్యార్థుల కిస్సింగ్ కాంపిటీషన్.. పోలీసుల అదుపులో ఒకరు
మంగళూరు: యూనిఫామ్‌లో.. కౌగిలింతలు, ముద్దులతో రెచ్చిపోయారు విద్యార్థులు. ఆ వీడియో కాస్త వాట్సాప్ ద్వారా విపరీతంగా వైరల్ అయ్యింది. తల్లిదండ్రులతో పాటు కాలేజీ యాజమాన్యం దృష్టికి వెళ్లింది. ఇంకేం.. పోలీసులు రంగంలోకి దిగారు. మంగళూరులో ఓ ప్రముఖ కాలేజీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థుల వీడియో ఒకటి వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా విపరీతంగా వైరల్ అయ్యింది. పరువు పోవడంతో తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం ఈ వీడియో మీద ఫిర్యాదు చేయకుండానే పోలీసులను ఆశ్రయించారు. ఓ ప్రైవేట్ అపార్ట్మెంట్లో స్టూడెంట్స్ మధ్య ముద్దుల పోటీలో Kissing Competition భాగంగా.. ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను చిత్రీకరించిన విద్యార్థినిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరిన్ని వివరాల కోసం ప్రశ్నిస్తున్నారు. వీడియోలు తీసే టైంలో డ్రగ్స్ తీసుకున్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. అయితే కిస్సింగ్ కాంపిటీషిన్ ఘటన జరిగి ఆరు నెలలు అవుతోందని, ఓ ప్రైవేట్ ప్లాట్‌లో అది చోటు చేసుకుందని.. అయితే వారం కిందట వాట్సాప్ ద్వారా ఓ స్టూడెంట్ దానిని వైరల్ చేశాడని సిటీ పోలీస్ కమిషనర్ శశి కుమార్ వైరల్ వీడియో వివరాలను వెల్లడించారు. కిస్సింగ్ కాంపిటీషన్లో పాల్గొన్న విద్యార్థులను గుర్తించి.. వాళ్లపై సస్పెన్షన్ వేటు వేసినట్లు కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. -
ఆఫీసులోనే హవ్వ.. ప్రజాప్రతినిధి, ఉద్యోగిని సరసాలు
సాక్షి, బెంగళూరు: మంచి నడవడికతో సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి, ప్రభుత్వ ఉద్యోగిని దారి తప్పారు. ఆఫీసులోనే సరసాలకు దిగిన వైనాన్ని సీసీ కెమెరాలు బట్టబయలు చేశాయి. వారి ప్రేమపురాణం చూసి అందరూ హవ్వ అని నివ్వెరపోయారు. వివరాలు.. తుమకూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి అయిన మాదుస్వామి స్వగ్రామమైన చిక్కనాయకనహళ్ళి తాలూకాలోని జేసిపుర గ్రామ పంచాయతీ ఆఫీసులో ఈ తతంగం జరిగింది. మహిళా ఉద్యోగినితో గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ప్రసన్నకుమార్ ప్రేమాయణం నెరుపుతున్నాడు. ఆఫీసులో ఇతరులు లేని సమయంలో ముద్దుమురిపాలకు దిగారు. అయితే అక్కడే సీసీ కెమెరాలున్నసంగతిని వారు మరిచిపోయారు. ఎవరో సీసీ ఫుటేజీలను చూసి లీక్ చేయడంతో అంతటా వ్యాప్తి చెందాయి. ఫుటేజీపై ఉన్న తేదీలను బట్టి మే 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఇది జరిగినట్లు తెలుస్తోంది. -
పెదవుల పై ముద్దు పెట్టుకోవడం అసహజ నేరం కాదు
kissing on lips and fondling are not unnatural offences : మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం పెదవుల పై ముద్దు పెట్టుకోవడం, ముద్దుచేయడం వంటివి అసహజ లైంగిక నేరాలు కాదని బాంబే ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు 14 ఏళ్ల బాలుడి తండ్రి చేసిన పోలీసు ఫిర్యాదు మేరకు గతేడాది అరెస్టయిన వ్యక్తికి జస్టిస్ అనూజా ప్రభుదేసాయి బెయిల్ మంజూరు చేశారు. కేసు పూర్వాపరాల ప్రకారం....ఆ బాలుడి తండ్రి అల్మారాలో డబ్బు కనిపించకపోవడంతో కొడుకుని ఆరాతీశాడు. అప్పుడు ఆ బాలుడు ఓలా పార్టీ' రీఛార్జ్ కోసం ముంబైలోని శివారు ప్రాంతంలో సదరు నిందితుడి దుకాణానికి వెళ్లేవాడినని, అతనికి ఇచ్చానని మైనర్ చెప్పాడు. ఐతే ఓ రోజు రీచార్జ్ చేయించుకునేందుకు వెళ్లినప్పుడూ నిందితుడు తన పెదవులపై ముద్దుపెట్టి, తన ప్రైవేట్ పార్ట్‌లను తాకాడని ఆ బాలుడు ఆరోపించాడు. దీంతో ఆ బాలుడు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు నిందితుడి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఐతే జస్టిస్ ప్రభుదేసాయి సదరు నిందితుడికి బెయిల్ మజూరు చేస్తూ..బాలుడికి నిర్వహించిన వైద్య పరీక్షలో లైంగిక వేధింపుల వాంగ్మూలం మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. అంతేకాదు ప్రస్తుత కేసులో అసహజ లైంగిక అంశం ప్రాథమికంగా వర్తించదని న్యాయమూర్తి తెలిపారు. అంతేకాదు నిందితుడు ఇప్పటికే ఏడాది పాటు కస్టడీలో ఉన్నాడని, అందువల్ల ఈ కేసు విషయమే ఇప్పట్లో విచారణ ప్రారంభమయ్యే అవకాశం లేదని హైకోర్టు పేర్కొంది. (చదవండి: వైద్య రహస్యం చెప్పలేదని.. ఏడాదిన్నరపాటు గదిలో బంధించి..) -
క్లాస్‌లో అందరి ముందే లవర్‌ను ముద్దుపెట్టుకున్నాడు.. తరువాత ఏం జరిగిందంటే..
కాలేజీలో ఇద్దరు లవర్స్ రొమాన్స్ చేసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నలుగురి మధ్య ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. క్లాస్‌లో ప్రొఫెసర్ ముందే ఏకంగా ముద్దులు పెట్టుకున్నారు. ఈ వీడియోను ఓ ఇన్స్టాగ్రామ్ పేజ్ పోస్టు చేయగా దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. అయితే అందరూ ఎందుకు అంతగా నవ్వుకుంటున్నారో తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే. అప్పడే ఇందులోని ట్విస్ట్ ఎంటో తెలుస్తుంది. క్లాస్ రూమ్‌లో ప్రొఫెసర్ ఉండగా వెనకాల కూర్చున్న ఓ వ్యక్తి తన పక్కనే ఉన్న యువతితో రొమాన్స్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. యువతి భుజంపై చేయి వేసి ఆమె జుట్టును అలా ప్రేమగా కదిలిస్తూ తన చెంపను ముద్దాడుతాడు. దీనిని వెనకాల నుంచి ఓ వ్యక్తి రికార్డ్ చేశాడు. అయితే రికార్డ్ చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా కెమెరాను వెనకాల నుంచి ముందుకు తీసుకొచ్చి వాళ్ల ముఖాన్ని చూపిస్తాడు. దీంతో అసలు ‘గర్ల్‌ఫ్రెండ్’ ఎవరో చూడటమే ఈ వీడియోలోని ట్విస్ట్. View this post on Instagram A post shared by Bhutni_ke (@bhutni_ke_memes) పొడవాటి జుట్టుతో వెనక కూర్చున్న వ్యక్తి అచ్చం అమ్మాయిలాగా కనిపించినప్పటికీ అక్కడుంది అబ్బాయి. ఆ ‘ప్రియుడు’ కేవలం తన స్నేహితుడి జుట్టుతో చిలిపిగా అలా చేశాడు. చివరికి ముగ్గురు స్నేహితులు దగ్గరగా కూర్చుని నవ్వుతూ కనిపించారు. అయితే రొమాన్స్‌గా భావించిన నెటిజన్లు.. చివరికి అది 'బ్రొమాన్స్' అని తేలడంతో పడి పడి నవ్వుకున్నారు. మీరూ ఈ వీడియో చూసి నవ్వకుండా ఉండలేరు చూడండి.. చదవండి: గుడ్ క్యాచ్! ఆకాశం నుంచి పడిపోతున్న రాకెట్‌ని పట్టుకున్న హెలికాప్టర్! -
నేరస్తుడితో లిప్‌లాక్ చేసిన మహిళా న్యాయమూర్తి.. వీడియో వైరల్
ప్రేమ.. ఎప్పుడు, ఎవరి మధ్య చిగురిస్తుందో చెప్పలేం. రెండు అక్షరాల ప్రేమ రెండు జీవితాలను పెనవేస్తోంది. అయితే అందరి ప్రేమలు విజయవంతంగా ముగియవు.. కొన్ని మధ్యలోనే ముగిసిపోతాయాయి. సాధారణంగా స్నేహితులు, క్లాస్‌మెట్స్, సహోద్యోగులిద్దరూ ప్రేమలో పడటం చూశాం. కానీ న్యాయమూర్తి, నేరస్తుడితో ప్రేమలో పడినట్లు మీరు ఎప్పుడైనా విన్నారా? వినడానికి కొంచెం వింతగా నిజంగానే ఇది జరిగింది. ఒక మహిళా న్యాయమూర్తి ఏకంగా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తితో ప్రేమలో పడింది. దక్షిణ చుబుట్ ప్రావిన్స్‌లోని ఓ మహిళా న్యాయమూర్తి, నిందితుడు జైల్లో రొమాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో వీరిద్దరూ ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. డెయిలీ మెయిల్ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఘటన అర్జెంటీనాలో డిసెంబరు 29న చోటుచేసుకుంది. ఇందులో ఓ పోలీస్ అధికారిని హత్య చేసిన జైలులో ఉన్న క్రిస్టియన్ ‘మై’ బస్టోస్ అనే ఖైదీ న్యాయమూర్తి మారియల్ సువారెజ్ ముద్దుపెట్టుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది: చదవండి: వైరల్: దొంగతనానికి వచ్చి.. ఆకలేయడంతో వంటగదిలో కిచిడీ వండుతూ.. 2009లో పోలీస్ అధికారి లియాండ్రో 'టిటో' రాబర్ట్స్‌ని బస్టోస్ హత్య చేశాడు. అతనికి జీవిత ఖైదు విధించాలా వద్దా అని నిర్ణయించే న్యాయమూర్తుల ప్యానెల్లో మారియల్ భాగం. బస్టోస్‌కు జీవిత ఖైదుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఏకైక న్యాయమూర్తి ఆమె. బస్టోస్‌ను ‘అత్యంత ప్రమాదకరమైన ఖైదీ’ అని చెప్పినప్పటికీ, యావజ్జీవ శిక్షకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్యానెల్‌లోని ఏకైక న్యాయమూర్తి సువారెజ్. బస్టోస్‌ను రక్షించడానికి ఆమె ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. దీంతో అతడికి జీవిత ఖైదు శిక్ష విధించారు. మరోవైపు మహిళా న్యాయమూర్తి ఖైదీని ముద్దు పెట్టుకుంటున్న వీడియో బయటపడడంతో దీనిపై విచారణ జరుగుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి తెలిపారు. చదవండి: కోపంతో రెచ్చిపోయిన మహిళ.. రోడ్డుపై పండ్లు విసురుతూ.. వీడియో వైరల్ VIDEO DOCUMENTO. AMIGOS ARGENTINA TOCO FONDO. JUEZA QUE INTEGRO TRIBUNAL QUE CONDENO A PERPETUA AL ASESINO DE UN POLICIA EN CHUBUT, FUE HACERLE MATE Y MIMOS A LA PRISION AL CONDENADO. FUE SUMARIADA. LA JUEZA SE LLAMA, MARIEL ALEJANDRA SUAREZ. pic.twitter.com/Gf07UEIA1H — MARCELO FAVA (@MARCELOFAVAOK) January 4, 2022 -
Viral Video: బాబోయ్..! చావును ముద్దాడాడు..
ఈ మధ్య మనుషులకి వెర్రెక్కిందేమోననే అనుమానం వస్తుంది. ప్రాణాలను పెట్టుబడిగాపెట్టి ఎంతటి రిస్కుకైనా తెగిస్తున్నారు. తాజాగా అటువంటి సంఘటనకు చెందిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. పడగ విప్పి ఉన్న పామును ముద్దాడుతున్న యువకుడు ఈ వీడియోలో కనిపిస్తాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది. దీంతో లక్షల మంది ఆసక్తిగా ఈ వీడియోను వీక్షిస్తున్నారు. విష సర్పాలతో సెల్పీలు దిగడం, ముద్దాడటం... ఆ క్షణానికి థ్రిల్లింగ్‌గా అనిపించినా.. ఒక్కోసారి స్టంట్ బెడిసికొట్టి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని నెటిజన్లు సదరు వ్యక్తిపై మండిపడుతున్నారు. ఐతే మరికొందరేమో ఇది ఫేక్.. పాముకు కోరలు లేవేమోనని సరదాగా కామెంట్ చేశారు. చదవండి: Crime Story: ప్రమాదం అంచున..! View this post on Instagram A post shared by ┈┉━❀👑 🅖🅞🅖🅐 🅝🅘 🅓🅐🅨🅐 👑❀━┉┈ (@_goga_ni_daya_) -
ముద్దుల పోటీ.. మండిపడుతున్న నెటిజన్లు
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ చైనాలోని ఓ ఫ్యాక్టరీ చేసిన పనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగమైన భౌతిక దూరం నిబంధనను ఉల్లంఘిస్తూ సుజౌ నగరంలోని యుయా ఫర్నిచర్ ఫ్యాక్టరీ కిస్సింగ్ పోటీని నిర్వహించింది. ఆ పోటీలో పాల్గొనే వారు ప్లెక్సీగ్లాస్‌తో వేరు చేయబడి.. ఒకరినొకరు కిస్ చేసుకున్నారు. ఇందుకోసం ఆ ఫ్యాక్టరీ పది జంటలను ఎంపిక చేసింది. అయితే ఈ కిస్సింగ్ పోటీలో పాల్గొనేవారు.. ముద్దు పెట్టుకునే క్రమంలో వారు తమ ఫేస్ మాస్క్‌లను తొలగించారు. ఇందుకు సంబంధించిన పోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫ్యాక్టరీ చర్యను తప్పుబడుతూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, చైనాలో లాక్డౌన్ సమయంలో విధించిన అంక్షలు ఎత్తివేయడంతో ఆ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించారు. అయితే చాలా రోజుల తర్వాత ఫ్యాక్టరీలో పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ పోటీని నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఇన్ఫెక్షన్ తీవ్రతను తగ్గించడానికి జంటల మధ్య ప్లెక్సీగ్లాస్ ఉంచడం జరిగిందని ఆ ఫ్యాక్టరీ యజమాని చెప్పారు. పోటీదారుల్లో కొన్ని జంటలు(భార్య, భర్త ఇద్దరు) తమ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నట్టు చెప్పారు. కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురిచేసిందని.. ఫ్యాక్టరీలో ప్రతి ఒక్కరిని సంతోష పెట్టడానికే ఈ పోటీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. -
లిప్‌లాక్ చేసి.. నాలుక కట్ చేశాడు
అహ్మదాబాద్ : గాఢంగా ముద్దుపెట్టుకుంటున్న సమయంలో భార్య నోట్లో నాలుక ఇరుక్కుపోయిందని, ఏకంగా ఆమె నాలుకను కత్తెరతో కట్ చేశాడో భర్త. ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌కు చెందిన అయూబ్ మన్సూర్(46) ఒక రోజు తన భార్య నాలుకను కత్తెరతో కట్ చేశాడని, ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో అతను చెప్పిన సమాధానాలు విని ముక్కున వేలేసుకున్నారు. మన్సూర్ చెప్పిన కథనం ప్రకారం తాను ఎప్పటిలాగే తన భార్యతో శృంగారం చేస్తున్న సమయంలో లిప్‌లాక్ చేశానని, ఆ సమయంలో ఆమె నోట్లో నాలుక ఇరుక్కుపోయిందని, దీంతో ఊపిరిక ఆడలేదని, ఏంచేయాలో అర్థంకాక ఆమె నాలుకను కత్తెరతో కట్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. కాగా బాధితురాలిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. శస్త్ర చికిత్స ద్వారా నాలుకను అతికించామని, ప్రస్తుతం ఆమె ఎలాంటి ఆహారం తీసుకోవడంలేదని వైద్యులు పేర్కొన్నారు. అయూబ్ మన్సూర్ కాగా, బాధితురాలు మన్సూర్‌కి మూడో భార్య కావడం గమనార్హం. మొదటి బార్యను హత్య కేసులో మన్సూర్ పలు సార్లు జైలుకెళ్లి వచ్చాడు. అనంతరం ముంబైకి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. వేధింపులు తట్టుకోలేక ఆమె అతనికి దూరంగా ఉంటుంది. మన్సూర్‌పై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. -
వైరల్ వీడియో.. మోదీ ఫొటోకు ముద్దు!
న్యూఢిల్లీ: పూల్వామా ఉగ్రదాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ తీవ్రవాద తండాలపై భారత్ సైన్యం మెరుపు దాడులు చేయడంతో ప్రధాని నరేంద్ర మోదీని ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు. మోదీపై అభిమానాన్ని వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. మోదీ మహిళా అభిమానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. రైలు బోగీపై ఉన్న ప్రధాని మోదీ ఫొటోను గాఢంగా ముద్దు పెట్టుకుని, కెమెరాకు స్మైల్ ఇచ్చి ముందుకు సాగిపోయింది ఓ మహిళా అభిమాని. ట్విటర్లో ఈ వీడియో పోస్ట్ చేసి.. ‘ఇలా కూడా అభిమానాన్ని ప్రదర్శిస్తారంటూ’ కామెంట్ పెట్టారు. మోదీపై పెరుగుతున్న అభిమానానికి ఇది నిదర్శనమని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. అయితే వీడియో ఉన్న మహిళ ఎవరు? ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగింది అనే వివరాలు వెల్లడికాలేదు. మోదీ వీడియోకు సమాధానంగా ‘ఇలా కూడా జరుగుతుంది’ అంటూ రాహుల్ గాంధీని నేరుగా మహిళా ముద్దుపెట్టుకున్న వీడియోను మరొకరు రీపోస్ట్ చేశారు. -
ఆపరేషన్ థియేటర్లో నర్సుకు ముద్దుపెట్టాడు..
ఉజ్జయిని: ఆపరేషన్ థియేటర్లో విధులను మరిచి ప్రవర్తించిన ఓ ప్రభుత్వ వైద్యుడు తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి.. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళ నర్సును ఆపరేషన్ థియేటర్లో ముద్దుపెట్టుకున్నాడు. అయితే ఆపరేషన్ థియేటర్లో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఈ వీడియో తొలుత ఆస్పత్రికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం కలెక్టర్ శశాంక్ మిశ్రా దాకా వెళ్లడంతో.. ఆయన వెంటనే స్పందించారు. ఆ వైద్యుని విధుల నుంచి తొలగించడంతోపాటు, ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి మోహన్ మల్వియా మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఆ వీడియో ఎక్కడ చిత్రీకరించారనే దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, స్థానిక పోలీసులకు ఈ కేసులో అధికారింగా ఎటువంటి ఫిర్యాదు అందలేదు. -
‘ముత్యం లాంటి ముద్దు’పై వివాదమా!
సాక్షి, న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరం. అది ఢాకా యూనివర్శిటీ ప్రాంతం. అప్పుడే పెద్ద వర్షం కాస్త తుంపరగా మారింది. నేలంతా తడి తడిగా ఉంది. వెనకాల ఓ వినియోగదారుడు నెత్తున గొడుగు పట్టుకొని సెల్ఫోన్లో ఏదో వెతుక్కుంటున్నాడు. టీ కాసి పోసే వారిరువురు తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. రోడ్డు మీద బాటసారులు ఇవేమి పట్టకుండా తమ మానాన తాము పోతున్నారు. సరిగ్గా ఆ సమయంలో అక్కడ కొంత ఎత్తైన అరుగులు మీద కూర్చున్న ఇద్దరు ప్రేమికులు తమకీ ప్రపంచం పట్టనట్టు ఒకరికొకరు అత్యంత సహజంగా ముద్దు పెట్టుకుంటున్నారు. ఆ సన్నివేశంలో వారికి తెలియకుండా వారి ఫొటోను జిబాన్ అహ్మద్ తీశారు. ‘వర్షం దీవెనలతో విరిసిన కవిత, ప్రేమకు స్వేచ్ఛనివ్వండి’ అన్న నినాదంతో జిబాన్ అహ్మద్ ఆ ఫొటోను సోమవారం నాడు ఆన్లైన్లో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. లౌకిక బెంగాలీ జాతీయ వాదం, ఇస్లాం ఛాందసవాదం మధ్య తీవ్ర సంఘర్షణలు జరిగే బంగ్లాలో ఈ ఫొటోపై పెద్ద దుమారమే రేగుతోంది. ఫొటోలో కనిపిస్తున్న కళాత్మక దృశ్యాన్ని మెచ్చుకుంటున్న వాళ్లు, బరితెగించిన ప్రేమగా అభివర్ణిస్తున్న వాళ్లు ఎక్కువే ఉన్నారు. ‘ఇదే నిజమైన బంగ్లాదేశ్. ఇలాంటి ప్రేమను పాటించడం వల్ల దేశంలో ఇస్లాం ఛాందసవాదం నశించిపోతుంది. నా బంగ్లాదేశ్‌ను ప్రేమిస్తున్నాను’ అంటూ కొందరు ‘మనం అంతటా ముద్దు పెట్టుకోవాలి. తరచుగా ముద్దు పెట్టుకోవాలి. ముద్దులతోనే వ్యతిరేకులపై పోరాటం సాగిద్దాం’ అంటూ మరికొందరు ట్వీట్లు పేల్చారు. స్వచ్ఛమైన నీటి బిందువులాంటి ముద్దుపై అసలు వివాదం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్న వాళ్లూ ఉన్నారు. బరితెగించిన ప్రేమగా పరిగణించిన యువకులు మాత్రం జిబాన్ అహ్మద్‌ను వెతికి పట్టుకొని రోడ్డుపైనే కర్రలతో కొట్టారు. కాళ్లతో తన్నారు. వారిలో తోటి ఫొటోగ్రాఫర్లు కూడా ఉండడం మరీ విచారకరం. జిబాన్ ఫొటోగ్రాఫర్ ఉద్యోగం కూడా పోయింది. ఆయన పనిచేస్తున్న వెబ్సైట్ యాజమాన్యం ఆయన్ని తొలగించింది. ఇస్లాం ఛాందసవాదులతో పెట్టుకోవడం జిబాన్ అహ్మద్‌కు ఇది మొదటిసారి కాదు. 2015లో బంగ్లాదేశ్–అమెరికన్ హేతువాద బ్లాగర్ అవిజిత్ రాయ్, ఆయన భార్యపై ఇస్లాం ఛాందసవాదులు హత్యాప్రయత్నం చేశారు. రక్తం వోడుతూ ప్రాణాపాయా స్థితిలో కాపాడంటూ రాయ్ భార్య వేడుకుంటుంటే ఎవరు సాయం చేయడానికి ముందుకు రాకపోవడంతో జిబాన్ అహ్మద్‌ను ఆస్పత్రికి చేర్చారు. అందుకు ఇస్లాం ఛాందసవాదుల చేతుల్లో తన్నులు తిన్నారు. -
ఆగలేక ముద్దు పెట్టాడు.. పదవి పోయింది
-
ఆగలేక ముద్దు పెట్టాడు.. పదవి పోయింది
న్యూయార్క్ : సాధరణ పౌరులేమోగానీ నాయకులు మాత్రం ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలి. అలా కాకుండా అతి చేయాలని చూస్తే మొదటికే మోసం వస్తుంది.. పదవి పోయి తీరుతుంది. అమెరికాలో ఓ సెనేటర్ పరిస్థితి అంతే అయింది. ఓ బార్‌కు వెళ్లిన షెల్ రాక్ లోవా సెనేటర్ బిల్ డిక్స్ ఓ లాబీయిస్ట్ మహిళకు అందరి ముందే గాటు ముద్దు పెట్టాడు. ఆ దృశ్యాన్ని వీడియో తీసిన కొంతమంది ఆన్లైన్లో పెట్టడంతో అది కాస్త వైరల్ అయింది. బాధ్యత గల వ్యక్తి ఇలాగేనా ప్రవర్తించేదంటూ తీవ్ర స్థాయి దుమారం రేపింది. దాదాపు 52 నిమిషాలపాటు ఉన్న ఆ వీడియోను లిబరల్ న్యూస్ వెబ్సైట్ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో చూపిన ప్రకారం బార్లో ఉండే స్లూల్స్పై డిక్స్ మరో మహిళతో కూర్చొని ఉన్నాడు. దర్జాగా మందుకొడుతూ రెచ్చిపోయి ఆమెను గాఢంగా చుంబించాడు. అయితే, ఆ మహిళ వివరాలు మాత్రం బయటపెట్టకుండా ఆమె ఒక లాబీయిస్ట్ అంటూ సదరు న్యూస్ సంస్థ తెలిపింది. పలు మున్సిపాలిటీ గ్రూపులకు ఆమె లాబీయిస్టుగా పనిచేస్తారని వెల్లడించింది. ఈ ఘటన ఇదే నెల (మార్చి) 1న చోటు చేసుకుంది. దీంతో లోవా సెనేట్ ప్రెసిడెంట్ జాక్ వైట్వర్ ఓ కీలక ప్రకటన చేశారు. మార్చి 12 అర్ధరాత్రి 2గంటల నుంచి డిక్స్ సెనేటర్ బాధ్యతలకు ముగింపు అని వెల్లడించారు. డిక్స్ తన కుటుంబంలో మూడో తరం రైతు. బట్లర్, గ్రండి, హార్డిన్, ఇతర జిల్లాల్లో తన వ్యవసాయ కార్యకలాపాలు చూసుకునేవారు. పదేళ్లపాటు లోవా హౌస్‌లో పనిచేశారు. 2010 నుంచి వరుసగా సెనేటర్‌గా ఎంపికవుతూ వస్తున్నాడు. అయితే, ఈ ఘటనపై డిక్స్ వ్యక్తిగతంగా ఒక్క ప్రకటన కూడా చేయలేదు. అతడి పూర్తి వివరాలను అప్పుడే లోవా సెనేట్ రిపబ్లికన్స్ వెబ్సైట్ నుంచి కూడా తొలగించారు. -
ఇక పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోవచ్చు
ఒకరిని విడిచి ఒకరు వెళ్లేటపుడు అందరికి బాధగా ఉంటుంది. ఆ సమయంలో ప్రేమతో అక్కున చేర్చుకొని ఒకరినొకరు ముద్దు పెట్టుకోవాలని అనుకుంటారు. కానీ, చుట్టు ఉన్నవారు చూస్తారన్న భయంతో ఇబ్బంది పడుతుంటారు. ఈ భయానికి చెక్ పెట్టేందుకు చాలా దేశాలు పబ్లిక్‌గా ముద్దు పెట్లుకునేందుకు అనుమతి ఇస్తున్నాయి. ముద్దులు పెట్టుకునేందుకు కొన్ని దేశాలు ఏకంగా ఎయిర్‌పోర్టులలో ప్రత్యేక కిస్సింగ్ జోన్లను ఏర్పాటు చేసి, దానికి కొంత సమయాన్ని కేటాయించారు. ఆ సమయాన్ని మూడు నిమిషాలకు నిర్ణయించారు. అంతకు మించి కిస్ చేసుకోవడానికి అనుమతి లేదు. సాధారణంగా ఉద్యోగ రిత్యా మనసుకు నచ్చిన వారో, బంధువులో విదేశాలకు వెళ్లే సమయంలో భావోద్వేగానికి గురవుతారు. దానిని వ్యక్త పరచడానికి ప్రయతిస్తుంటారు. దీనిని గుర్తించిన కొన్ని ఎయిర్ పోర్టులు కిస్సింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సింగపూర్, డెన్మార్క్, పారిస్, హాంకాంగ్, రోమ్, శాన్ఫ్రాన్సిస్కో మొదలైన దేశాల్లోని ఎయిర్ పోర్టులలో కిస్సింగ్ జోన్లు ఉన్నాయి. పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకోవడం చాలా దేశాల్లో అనుమతి లేదు. -
కారు కోసం 50 గంటలు ముద్దులు
ప్రతీ గంటకు 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటూ 50 గంటలపాటు ఏకధాటిగా కారును పెదాలతో తాకిన వారికే కొత్త కారు బహుమతిగా ఇస్తామనడంతో వీరంతా ఇలా పోటీపడ్డారు. గతవారం అమెరికాలోని ఆస్టిన్‌లో జరిగిన ఈ పోటీలో 30ఏళ్ల దిలిని జయసూర్య అనే యువతి విజేతగా నిలిచి కొత్త కియా ‘ఆప్టిమా’ కారు గెల్చుకుంది. (ఇన్సెట్లో) జయసూర్య -
షాక్ ఇచ్చిన ఆమిర్ ఖాన్
ముంబై: బాలీవుడు విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ తన మాటలు, నడవడికపై చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా పబ్లిక్ కార్యక్రమాలు, విలేకరుల సమావేశాల్లో ఆచితూచి మాట్లాడతారు. హుందాగా వ్యవహరిస్తుంటారు. ముంబైలో గురువారం 18వ జియో 'మామి' ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో ఆమిర్ ఖాన్ అందరికీ తియ్యటి షాక్ ఇచ్చారు. తన భార్య కిరణ్ రావును ముద్దుపెట్టుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సినిమాల్లో ముద్దుసీన్లు పండించినా పబ్లిక్ కార్యక్రమాల్లో ఆమిర్ ఖాన్ ఈ విధంగా వ్యవహరించిన సందర్భాలు లేకపోవడంతో అక్కడున్నవారంతా ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. భార్యను ఆమిర్ ఖాన్ ముద్దు పెట్టుకున్న ఫొటోలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. గుబురు గడ్డం, చెవికి పోగు, కళ్లజోడు, నల్లరంగు సూట్ లో మెరిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్... 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా వివాదంపై స్పందించేందుకు నిరాకరించాడు. మరోవైపు ఆమిర్ ఖాన్ తాజాగా సినిమా 'దంగల్' విడుదలకు సిద్ధమవుతోంది. గురువారం విడుదలైన 'దంగల్' ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో యూబ్యూట్ లో 95 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. -
ముద్దు పెట్టుకోలేదా?
‘ముద్దుతో ఓనమాలు నేర్పించనా.. సిగ్గుల్లో ఆనమాలు చూపించనా’ అని ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాలో మోహన్‌బాబు, నగ్మా పాడుకున్న పాట గుర్తుందా? రణ్వీర్ సింగ్, వాణీ కపూర్ జంటగా ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత ఆదిత్యా చోప్రా స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తోన్న హిందీ సినిమా ‘బేఫికర్’ స్టిల్స్ చూస్తే ఠక్కున ఈ పాట గుర్తు రాకుండా ఉండదు. ‘బేఫికర్’ అంటే నిశ్చింతగా ఉండటం అని అర్థం. టైటిల్‌కి తగ్గట్టు నిశ్చింతగా గాల్లో ఎగురుతూ ప్రియుడి పెదాలపై ఓ ముద్దు.. డ్యాన్స్ చేస్తూ మరో ముద్దు.. బీచ్‌లో ఇంకో ముద్దు.. ప్యారిస్ నగరం అంతా కనబడేలా ఓ బిల్డింగ్ టై మీద కూర్చుని మళ్లీ ముద్దు.. ముద్దులు తప్ప సినిమాలో ఇంకేమీ లేనట్టు రణ్వీర్ సింగ్, వాణీ కపూర్లు లిప్‌లాక్‌లతో రెచ్చిపోయారు. పెదవి ముద్దుల పోస్టర్లతోనే సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. ఏంటీ ముద్దులు? అని ఎవరైనా అడిగితే.. కళాత్మక దృష్టితో చూడండని సలహా కూడా ఇచ్చారు చిత్రబృందం. ఇప్పటివరకూ విడుదల చేసిన పోస్టర్స్ అన్నీ ముద్దుకి సంబంధించినవే. వాణీ కపూర్ బర్త్‌డే సందర్భంగా లిప్‌లాక్ లేకుండా ఓ స్టిల్ రిలీజ్ చేసేసరికి షాకవ్వడం ప్రేక్షకుల వంతైంది. నార్మల్‌గా లిప్‌లాక్ స్టిల్స్ ఆడియన్స్‌లో డిస్కషన్స్‌కి కారణం అవుతాయి. బట్ ఫర్ ఎ చేంజ్.. ఈసారి ముద్దు పెట్టుకోలేదా ఏంటీ? అంటూ రివర్స్‌లో ఆడియన్స్ డిస్కషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమాలో మొత్తం 23 ముద్దులున్నాయట. ప్రతి ముద్దుకీ కథలో ప్రాముఖ్యత ఉంటుందట. డిసెంబర్లో ఈ సినిమా విడుదల కానుంది.