ముద్దు పెట్టుకోవడం వల్ల మొటిమలు వస్తాయా? | How Kissing And Touching Skin Causes | Sakshi
Sakshi News home page

ముద్దు పెట్టుకోవడం వల్ల మొటిమలు వస్తాయా?

Published Wed, Oct 4 2023 11:30 AM | Last Updated on Wed, Oct 4 2023 12:01 PM

How Kissing And Touching Skin Causes  - Sakshi

అయిచాలామంది టీనేజ్‌ పిల్లలనే కాదు కొందరూ పెద్దల్లో కూడా ఈ మొటిమలు ఇబ్బంది పెడుతుంటాయి. వేడి చేసి కూడా వస్తుంటాయని అంటారు కొందరూ. కానీ వాటి వల్ల ముఖం కమిలి ర్యాషెస్‌ వచ్చినట్లుగా పోతాయి. ఆయిల్‌ వస్తువులు తినడం వల్ల వచిందా? లేక తలలోని చుండ్రు కారణమా అని మాత్రమే ఆలోచిస్తాం. కానీ ముద్దు పెట్టుకోవడం వల్ల మొటిమలు రావడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి ఇది నిజం. వినడానికి నమ్మశక్యం కానంత వింతగా అనిపిస్తుందని కొట్టిపారేయొద్దు. ఎలా సాధ్యమో సవివరంగా తెలుసుకునేందుకే ఈ కథనం. 

ముద్దు మీ మానసిక ఆరోగ్యానికి, వ్యక్తిగత జీవితానికి ప్రయోజనకరమైనదే అయినా ఒక్కోసారి ఇది కొన్ని సమస్యలు తెచ్చుపెడుతుంది. ముద్దు వల్ల చర్మం ఇరిటేషన్‌కి గురై ఆ తర్వాత మొటిమలు ఏర్పడేందుకు దాదితీస్తాయని చర్మ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జిడ్డు, మొటిమలు బారినపడే చర్మం ఉన్నవారైతే వారిలో బ్యాక్టీరియా, నూనెను బదిలీ చేసే కారకాలు ఎక్కువుగా ఉంటాయి. ఇలాంటి వారు ముద్దు పెట్టుకుంటే లాలాజలం ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్‌ఫర్‌ అయ్యి చర్మం చికాకుగా అయ్యి మొటిమలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు.

ముద్దు పెట్టుకున్న వెంటనే మొటిమలు రావు. అలాగే ఇది అంటు వ్యాధి కాదు. లిప్‌ బామ్‌లు వంటివి వాడే వారైతే అవి మీ చర్మానికి సరిపడనది అయ్యి సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు. జిడ్డు చర్మం, ప్రధానంగా డెడ్‌్‌ స్కిన్‌ సెల్స్‌, బ్యాక్టీరియాతో మూసుకుపోయిన రంధ్రాల వల్ల ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల నేరుగా రాకపోయిన వారి అపరిశుభ్రత కారణంగా పరోక్షంగా మొటిమొలు వచ్చేందుకు దోహదం చేస్తాయని చర్మ నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా ఎక్కువ సేపు ముద్దులు పెట్టుకోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రతరంగా ఉంటుంది. మీరు, మీ భాగస్వామి మధ్య అవగాహనతో మంచి పరిశుభ్రతతో ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవు. అందులో ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతలో లోపం ఉన్నా ముద్దుల వల్ల సమస్య వస్తుంది. అది మొటిమలు వరకే కాదు ఇంకే ఇతర అనారోగ్య సమస్యలైన ఇలానే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందనే విషయం మరిపోవద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. 

(చదవండి: పార్లర్‌కి వెళ్లక్కర్లేకుండా..ఈ మెషిన్‌తో ఈజీగా వ్యాక్సింగ్, థ్రెడింగ్‌..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement