షాక్ ఇచ్చిన ఆమిర్ ఖాన్ | Aamir Khan's PDA with wife Kiran Rao gives us romance goals | Sakshi
Sakshi News home page

షాక్ ఇచ్చిన ఆమిర్ ఖాన్

Published Fri, Oct 21 2016 2:17 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

షాక్ ఇచ్చిన ఆమిర్ ఖాన్

షాక్ ఇచ్చిన ఆమిర్ ఖాన్

ముంబై: బాలీవుడు విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ తన మాటలు, నడవడికపై చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా పబ్లిక్ కార్యక్రమాలు, విలేకరుల సమావేశాల్లో ఆచితూచి మాట్లాడతారు. హుందాగా వ్యవహరిస్తుంటారు. ముంబైలో గురువారం 18వ జియో 'మామి' ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో ఆమిర్ ఖాన్ అందరికీ  తియ్యటి షాక్ ఇచ్చారు. తన భార్య కిరణ్ రావును ముద్దుపెట్టుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

సినిమాల్లో ముద్దుసీన్లు పండించినా పబ్లిక్ కార్యక్రమాల్లో ఆమిర్ ఖాన్ ఈ విధంగా వ్యవహరించిన సందర్భాలు లేకపోవడంతో అక్కడున్నవారంతా ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. భార్యను ఆమిర్ ఖాన్ ముద్దు పెట్టుకున్న ఫొటోలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి.  గుబురు గడ్డం, చెవికి పోగు, కళ్లజోడు, నల్లరంగు సూట్ లో మెరిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్... 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా వివాదంపై స్పందించేందుకు నిరాకరించాడు.

మరోవైపు ఆమిర్ ఖాన్ తాజాగా సినిమా 'దంగల్' విడుదలకు సిద్ధమవుతోంది. గురువారం విడుదలైన 'దంగల్' ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో యూబ్యూట్ లో 95 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement