kissing on lips and fondling are not unnatural offences : మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం పెదవుల పై ముద్దు పెట్టుకోవడం, ముద్దుచేయడం వంటివి అసహజ లైంగిక నేరాలు కాదని బాంబే ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు 14 ఏళ్ల బాలుడి తండ్రి చేసిన పోలీసు ఫిర్యాదు మేరకు గతేడాది అరెస్టయిన వ్యక్తికి జస్టిస్ అనూజా ప్రభుదేసాయి బెయిల్ మంజూరు చేశారు. కేసు పూర్వాపరాల ప్రకారం....ఆ బాలుడి తండ్రి అల్మారాలో డబ్బు కనిపించకపోవడంతో కొడుకుని ఆరాతీశాడు.
అప్పుడు ఆ బాలుడు ఓలా పార్టీ' రీఛార్జ్ కోసం ముంబైలోని శివారు ప్రాంతంలో సదరు నిందితుడి దుకాణానికి వెళ్లేవాడినని, అతనికి ఇచ్చానని మైనర్ చెప్పాడు. ఐతే ఓ రోజు రీచార్జ్ చేయించుకునేందుకు వెళ్లినప్పుడూ నిందితుడు తన పెదవులపై ముద్దుపెట్టి, తన ప్రైవేట్ పార్ట్‌లను తాకాడని ఆ బాలుడు ఆరోపించాడు. దీంతో ఆ బాలుడు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు నిందితుడి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఐతే జస్టిస్ ప్రభుదేసాయి సదరు నిందితుడికి బెయిల్ మజూరు చేస్తూ..బాలుడికి నిర్వహించిన వైద్య పరీక్షలో లైంగిక వేధింపుల వాంగ్మూలం మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. అంతేకాదు ప్రస్తుత కేసులో అసహజ లైంగిక అంశం ప్రాథమికంగా వర్తించదని న్యాయమూర్తి తెలిపారు. అంతేకాదు నిందితుడు ఇప్పటికే ఏడాది పాటు కస్టడీలో ఉన్నాడని, అందువల్ల ఈ కేసు విషయమే ఇప్పట్లో విచారణ ప్రారంభమయ్యే అవకాశం లేదని హైకోర్టు పేర్కొంది.
(చదవండి: వైద్య రహస్యం చెప్పలేదని.. ఏడాదిన్నరపాటు గదిలో బంధించి..)
Comments
Please login to add a commentAdd a comment