POSCO Act
-
యడ్యూరప్పకు హైకోర్టులో ఊరట
బెంగళూరు: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్పకు శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది. యడ్యూరప్పను అరెస్టు చేయవద్దని కర్నాటక హైకోర్టు సీఐడీ పోలీసులను ఆదేశించింది. పోస్కో చట్టం కింద నమోదైన కేసును విచారిస్తున్న సీఐడీ ఎదుట ఈనెల 17న హాజరుకావాలని బీజేపీ సీనియర్ నేత, 81 ఏళ్ల యడ్యూరప్పను హైకోర్టు ఆదేశించింది. -
శృంగారానికి సమ్మతి వయసు మార్చొద్దు
న్యూఢిల్లీ: శృంగార కార్యకలాపాల్లో పాల్గొనే విషయంలో ‘సమ్మతి వయసు’ను తగ్గించాలన్న వాదనను లా కమిషన్ వ్యతిరేకించింది. ఈ విషయంలో ఎలాంటి మార్పులు చేయొ ద్దని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. లైంగిక హింస నుంచి చిన్నారులకు రక్షణ కలి్పంచేందుకు తీసుకొచ్చిన పోక్సో చట్టం ప్రకారం.. శృంగారానికి సమ్మతి వయసు ప్రస్తుతం 18 ఏళ్లుగా ఉంది. దీన్ని 16 ఏళ్లకు తగ్గించాలన్న వినతులు వచ్చాయి. లా కమిషన్ తన నివేదికను తాజాగా కేంద్రప్రభుత్వానికి సమర్పించింది. పోక్సో చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వయసు వారంతా బాలలే. వారిపై అత్యాచారానికి, లైంగిక నేరాల కు పాల్పడితే 20 ఏళ్లకుపైగా జైలు శిక్ష విధించవచ్చు. -
జడలు విప్పుతున్న వికృత హింస.. చుట్టూ పరిస్థితులు మారాలి
ఇటీవల హైదరాబాద్‌లోని ఓ పాఠశాలలో ముక్కు పచ్చ లారని చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. దీనిని చూస్తుంటే ఆడ పిల్లలు చిన్నా పెద్దా తేడా లేకుండా ఎక్కడైనా, ఎప్పుడైనా లైంగిక దాడికి గురయ్యే అవకాశం ఉందని అర్థమవుతోంది. జడలు విప్పుతున్న ఈ వికృత అమానవీయ హింస ఆడ పిల్లల తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. లైంగిక దాడులకు ప్రేరేపించే సంస్కృతి మన చుట్టూ విశృంఖల స్థాయిలో విస్తరిస్తున్నది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా... లైంగిక దాడులు కొనసాగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రక్త సంబంధీకులు, టీచర్లు, డ్రైవర్లు... ఇలా మన చుట్టుపక్కల ఉండే మనకు పరిచయం ఉన్నవారూ, లేనివారి రూపాల్లో లైంగికదాడులు పొంచి ఉంటున్నాయి. ఈ ఘటనలు చోటు చేసుకున్న సందర్భాల్లో పలుకుబడి ఉన్న నిందితులు బెదిరించడం వల్ల చాలామంది బాధిత కుటుంబాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడానికీ భయపడుతున్నారు. అలాగే లైంగిక దాడి సంగతి బయటికి తెలిస్తే పరువు పోతుందన్న భయం భారతీయ సమాజంలోని తల్లిదండ్రులకు సహజంగానే ఉంటుంది. అందుకే ఎవరికీ చెప్పు కోలేక తమలో తాము కుమిలిపోతూ ఉంటారు. అటువంటి కుటుంబాలపై దాడులు మరిన్ని జరిగే అవకాశం ఉంది. అందుకే బాధిత కుటుంబాలు వెంటనే పోలీస్ సహాయం పొందాలి. చిన్నపిల్లల విషయంలో ఆడ, మగ అన్న తేడాను చూపించకుండా ఇద్దరిపైనా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ క్రూరులు మరో అడుగు ముందుకువేసి చైల్డ్ సెక్స్, చైల్డ్ పోర్నోగ్రఫీల రూపంలో ఈ భయంకర సంస్కృతిని ఇంటర్నెట్లో పెట్టి డబ్బు చేసుకునే పనీ చేస్తున్నారు. అంటే వీళ్లు ఈ అసాంఘిక, అమానవీయ కార్యకలాపాలను ‘మార్కెట్ సరుకు’గా మార్చేశారన్న మాట. ‘వర్జిన్ సెక్స్’ పేరుతో టీనేజ్ పిల్లలపై లైంగికదాడులు చేస్తూ అంతర్జాలంలో ఆ వీడియోలు వైరల్ చేసి డబ్బులు సంపాదించడం ఇందులో భాగంగానే చూడాలి. ఈ దాడులకు గురైన పిల్లలు క్రమంగా సెక్స్ వ్యాపారం ఊబిలో కూరుకుపోయి జీవితాలను కోల్పోతున్నారు. ఆధునిక యాంత్రిక ప్రపంచంలో తల్లిద్రండులు పిల్లలకు పట్టించుకునే తీరిక లేకపోవడం వల్ల నేరస్థులు పిల్లలను ట్రాప్ చేయగలుగుతున్నారు. అలాగే పిల్లలకు సెల్‌ఫోన్ అందుబాటులో ఉండటం వల్ల అన్నీ చూసే అవకాశం ఏర్పడుతోంది. మాదక ద్రవ్యాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఫలితంగా వారు దారితప్పుతున్నారు. టీవీల్లో ప్రసారం అవుతున్న కంటెంట్ కూడా ఈ దురాగతాలకు కారణమవుతున్నది. ఈ పరిస్థితి మారాలంటే పాఠశాల స్థాయిలోనే మోరల్ సైన్స్ క్లాస్‌లను తప్పని సరిగా విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉంది. బ్యాడ్ టచ్, గుడ్ టచ్‌ల గురించిన అవగాహన పిల్లలకు కల్పించాలి. పిల్లలపై లైంగిక దాడుల నియంత్రణ, వాటిని ఎదుర్కోవడానికి రూపొందించిన ‘పోక్సో’ తరహా చట్టాల పట్ల అవగాహన కూడా సమాజాన్ని అప్రమత్తం చేయటంలో ఉపకరిస్తాయి. (క్లిక్ చేయండి: ఆపన్నులకు ఫ్యామిలీ డాక్టర్ భరోసా) - డా. కడియం కావ్య కడియం ఫౌండేషన్ ఛైర్పర్సన్ -
పసిమొగ్గపై కిరాతకం
బనశంకరి: గత పదేళ్లుగా నిరంతరం తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ బాలిక ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బెంగళూరు తూర్పువిభాగ మహిళా పోలీస్‌స్టేషన్‌లో 8 మందిపై కేసు నమోదుచేశారు. లైంగికదాడి, పోక్సో చట్టాల కింద అభియోగాలను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. బాలిక తండ్రి చర్చ్ ఫాదర్‌గా పనిచేస్తుంటాడు. ఆమెకు 6 ఏళ్ల వయసులో స్నేహితుని ఇంట్లో వదలిపెట్టాడు. 10 ఏళ్లు వయసులో స్నేహితుని కుమారుడు బాలికకు మొబైల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు, వీడియోలు చూడాలని బలవంతం చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. మూడునాలుగేళ్లు దారుణం కొనసాగించాడు. అతని వేధింపులను తట్టుకోలేక బాలిక పాఠశాల ఉపాధ్యాయునికి మొరపెట్టుకుంది. ఆ ఉపాధ్యాయుడు, అతడి భార్య కలిసి యువకున్ని మందలించారు. అదే సమయంలో నీ గురించి అందరికీ చెబుతానని బెదిరించిన ఆ ఉపాధ్యాయుడు బాధిత బాలిక మీద రెండేళ్ల నుంచి అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. తన స్నేహితురాలిపై కూడా లైంగికదాడికి పాల్పడ్డాడని, ఇది తెలిసి మరో 6 మంది తమపై దారుణానికి ఒడిగట్టారని బాలిక ఆరోపించింది. నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామాంధ తండ్రికి జైలుశిక్ష బనశంకరి: కంటికి రెప్పలా బిడ్డను చూసుకోవాల్సిన తండ్రి కామంతో కళ్లు మూసుకుపోయి అకృత్యానికి ఒడిగట్టాడు. ఆ కిరాతక తండ్రికి 20 ఏళ్ల కఠిన శిక్ష విధిస్తూ బుధవారం మంగళూరు జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. విట్ల పేరువాయి గ్రామ నివాసి 2020 మార్చిలో మైనర్ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేరంపై విట్ల పోలీస్‌స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి కేఎం.రాధాకృష్ణ దోషికి 20 ఏళ్ల కఠినశిక్షతో పాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. (చదవండి: విశాఖ ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో బిగ్ ట్విస్ట్) -
పెదవుల పై ముద్దు పెట్టుకోవడం అసహజ నేరం కాదు
kissing on lips and fondling are not unnatural offences : మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం పెదవుల పై ముద్దు పెట్టుకోవడం, ముద్దుచేయడం వంటివి అసహజ లైంగిక నేరాలు కాదని బాంబే ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు 14 ఏళ్ల బాలుడి తండ్రి చేసిన పోలీసు ఫిర్యాదు మేరకు గతేడాది అరెస్టయిన వ్యక్తికి జస్టిస్ అనూజా ప్రభుదేసాయి బెయిల్ మంజూరు చేశారు. కేసు పూర్వాపరాల ప్రకారం....ఆ బాలుడి తండ్రి అల్మారాలో డబ్బు కనిపించకపోవడంతో కొడుకుని ఆరాతీశాడు. అప్పుడు ఆ బాలుడు ఓలా పార్టీ' రీఛార్జ్ కోసం ముంబైలోని శివారు ప్రాంతంలో సదరు నిందితుడి దుకాణానికి వెళ్లేవాడినని, అతనికి ఇచ్చానని మైనర్ చెప్పాడు. ఐతే ఓ రోజు రీచార్జ్ చేయించుకునేందుకు వెళ్లినప్పుడూ నిందితుడు తన పెదవులపై ముద్దుపెట్టి, తన ప్రైవేట్ పార్ట్‌లను తాకాడని ఆ బాలుడు ఆరోపించాడు. దీంతో ఆ బాలుడు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు నిందితుడి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఐతే జస్టిస్ ప్రభుదేసాయి సదరు నిందితుడికి బెయిల్ మజూరు చేస్తూ..బాలుడికి నిర్వహించిన వైద్య పరీక్షలో లైంగిక వేధింపుల వాంగ్మూలం మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. అంతేకాదు ప్రస్తుత కేసులో అసహజ లైంగిక అంశం ప్రాథమికంగా వర్తించదని న్యాయమూర్తి తెలిపారు. అంతేకాదు నిందితుడు ఇప్పటికే ఏడాది పాటు కస్టడీలో ఉన్నాడని, అందువల్ల ఈ కేసు విషయమే ఇప్పట్లో విచారణ ప్రారంభమయ్యే అవకాశం లేదని హైకోర్టు పేర్కొంది. (చదవండి: వైద్య రహస్యం చెప్పలేదని.. ఏడాదిన్నరపాటు గదిలో బంధించి..) -
నిందితున్ని నగ్నంగా ఊరేగింపు
యశవంతపుర: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువకున్ని అరెస్ట్ చేసిన పోలీసులు పోక్సో కేసు పెట్టి అతన్ని బట్టలు విప్పి ఊరేగించారు. ఇందులో బాలిక బంధువుల పాత్ర కూడా ఉంది. హావేరి జిల్లా హిరేకెరూరు తాలూకా హంసబావి పోలీసుస్టేషన్ పరిధిలో ఈ నెల 21న ఈ ఘటన జరిగింది. దీంతో యువకుని తల్లిదండ్రులు 11 మందిపై ఫిర్యాదు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందింది. (చదవండి: న్యూసెన్స్ ప్రియుడు అరెస్టు ) -
విద్యార్థులతో మేడమ్ రాసలీలలు వైరల్.. దర్యాప్తు ముమ్మరం
చెన్నై: తమిళనాడులో ఓ గవర్నమెంట్ టీచర్ చేసిన పని సంచలనంగా మారింది. ముగ్గురు విద్యార్థులతో శారీరకంగా కలవడమే కాదు.. ఆ చెండాలాన్ని వీడియో తీసి వైరల్ చేసిన ఘటన పెనుదుమారం రేపింది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే ఘటన కావడంతో స్వయంగా తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. మధురైలోని ఓ ప్రభుత్వ పాఠశాలలలో పని చేస్తోంది సదరు టీచర్(42). ఈ క్రమంలో ఓరోజు ముగ్గురు విద్యార్థులను ఇంటికి రప్పించుకుని.. వాళ్లతో శారీరకంగా కలిసింది. ఈ తతంగాన్ని 39 ఏళ్ల వయసున్న ఆమె ప్రియుడు, స్థానిక వ్యాపారవేత్త ఒకడు వీడియో తీశాడు. ఆపై ఆ వీడియోను తన స్నేహితుల సాయంతో వాట్సాప్ ద్వారా సర్క్యూలేట్ చేశాడు. వీడియో వ్యవహారం పోలీసుల దృష్టికి చేరడంతో తమిళనాడు డీజీపీ కార్యాలయం స్పందించింది. తక్షణమే ఆ వీడియోను తొలగించే ప్రయత్నాలు చేయాలని మధురై సైబర్ సెల్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారంపై టీచర్, ఆమె ప్రియుడ్ని మధురై పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. భర్త నుంచి విడిపోయిన సదరు మహిళ.. 2010 నుంచి సదరు వ్యాపారవేత్తతో సహజీవనం చేస్తోంది. కేవలం వైరల్ కావడం కోసమే ఆ వీడియో తీశారా? లేదంటే.. అశ్లీల సైట్లలో అప్లోడ్ చేసి డబ్బు సంపాదించాలనుకున్నారా? బ్లాక్‌మెయిలింగ్ కోణం ఉందా? అనేది సైబర్‌విభాగం తేల్చాల్సి ఉంది. వీడియోను ఎవరికి పంపారు? అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఆ ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు సదరు టీచర్‌పై, ఆమె ప్రియుడిపై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. -
Chittoor: కీచకుడి వికృత చేష్టలు.. బాలికలను మిద్దె మీదకు తీసుకెళ్లి..
చిత్తూరు: చిత్తూరు జిల్లా బీ కొత్తపేట మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఒక కామాంధుడు ఇద్దరు చిన్నారులపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇందిరమ్మకాలనీలో నిన్నరాత్రి (మంగళవారం) ఇద్దరు చిన్నారులు ఇంటి బయట ఆడుకుంటున్నారు.ఈ క్రమంలో అనిల్ కుమార్(21) అనే కీచకుడి కళ్లు వారిపై పడ్డాయి. దీంతో వారివద్దకు చేరుకుని మాయమాటలు చెప్పాడు. ఆ తర్వాత వారిని మిద్దెపైకి తీసుకెళ్లి తొలుత 9 ఏళ్ల వయసున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో ఏడేళ్ల బాలిలకను తొడలమీద కూర్చోబెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత 9 ఏళ్ల బాలిక ఏడ్చుకుంటూ వెళ్లి తన అమ్మమ్మ సావిత్రికి చెప్పింది. దీంతో సావిత్రి వెంటనే మిద్దేమీదకు వెళ్లి చూడగా కీచకుడు తన అసభ్య ప్రవర్తను కొనసాగిస్తున్నాడు. కాగా, వెంటనే సావిత్రి దిశయాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐదు నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకున్నపోలీసులు కీచకుడు అనిల్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సోచట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, పోలీసులు ఆలస్యంగా వచ్చి ఉంటే మరో దారుణం జరిగి ఉండేదని స్థానికులు భావిస్తున్నారు. చదవండి: చిన్నారి అత్యాచారం కేసు: తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ -
మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్!
న్యూఢిల్లీ: గురువులే కీచకలుగా మారి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉదంతాలను ఎన్నో మనం చూశాం. ప్రస్తుతం ఇదే తరహలో ఒక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్లితే...రాంపూర్‌లోని ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న అలోక్ సక్సేనాను అనే ఉపాధ్యాయుడు సివిల్ లైన్ ప్రాంతంలో కోచింగ్ సెంటర్‌ను నడుపుతున్నాడు. ఈక్రమంలో ఆ ఉపాధ్యాయుడు తన కూతురు ముఖంపై కేకు పూసి అసభ్యకరంగా ప్రవర్తించడంటూ... ఓ మైనర్ బాలిక తండ్రి అతని పై కేసు పెట్టారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలో "నిన్ను ఇప్పుడు ఎవరూ కాపాడతారు"..అంటూ నిందితుడు మాట్లాడిన మాటలు స్పష్టంగా వినిపిస్తోంది. ఈ ఘటన ఉపాధ్యాయ దినోత్సవం రోజు జరగడం విచారకరం. -
ప్రైవేటు టీచర్ బాగోతం.. ఆన్లైన్ క్లాసుల పేరిట అమ్మాయిని..
సాక్షి, సంగారెడ్డి (మెదక్): ఆన్లైన్ క్లాస్‌ల పేరిట ఓ ప్రైవేటు టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన బుధవారం పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేశ్ వివరాల ప్రకారం ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తున్న వినయ్‌రాజ్ అదే స్కూల్లో చదువుతున్న అమ్మాయిని ఆన్లైన్ క్లాస్‌ల పేరిట లైంగికంగా వేధించసాగాడు. ఈ క్రమంలో యువతి గత కొన్ని రోజులుగా తీవ్రంగా ఇబ్బందిపడుతుంది. దీంతో అమ్మాయి తల్లిదండ్రులకు తన బాధను తెలియజేసింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని అదృశ్యం పటాన్చెరు టౌన్: సాఫ్ట్వేర్ ఉద్యోగిని అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సాయిలు కథనం ప్రకారం పటాన్చెరు పట్టణం జేపీ కాలనీకి చెందిన విఠల్ కూతురు రాయినీ అంబిక గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. రాత్రి వరకు అంబిక ఇంటికి రాకపోవడం, బంధువుల వద్ద వెతికినా ఆచూకి లభించకపోవడంతో అంబిక సోదరుడు విశాల్ పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
17 ఏళ్ల విద్యార్థినిని పెళ్లి చేసుకొంటానని ఆశచూపి..
సాక్షి, కెలమంగలం(కర్ణాటక): అంచెట్టి తాలూకా తగ్గట్టి సమీపంలోని బేడరహళ్లి గ్రామానికి చెందిన కేశవన్ (21) అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల ప్లస్‌టూ విద్యార్థినిని పెళ్లి చేసుకొంటానని ఆశచూపి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనితో విద్యార్థిని గర్భం దాల్చింది. విషయం తెలుసుకొన్న కేశవన్ ఆమెను అబార్షన్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని తెలుసుకొన్న విద్యార్థిని తల్లితండ్రులు డెంకణీకోట మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేశవన్‌ను అరెస్ట్ చేశారు. అతనికి సహకరించిన అళగేశన్(28), పచ్చముత్తు(25), ఆనంద్(28), పచ్చప్ప(32), క్రిష్ణన్(30), వాసన్, మాదప్పన్లతోపాటు 8 మందిపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
భవన నిర్మాణ కార్మికుడి పైశాచికం.. బాలికను బెదిరించి..
సాక్షి, కెలమంగలం (కర్ణాటక): అంచెట్టి తాలూకా వన్నాతిపట్టి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు మాదప్పన్(26). ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇతడు ఓ నిర్మాణ పనులకోసం వెళ్లి 16 ఏళ్ల బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం బాలిక అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్లు బాలిక రెండు నెలల గర్భవతిగా తేల్చారు. దీంతో తల్లిదండ్రులు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాదప్పపై పోక్సో కేసు నమోదు చేసి తీవ్రంగా గాలిస్తున్నారు. వివాహిత ఆత్మహత్య హోసూరు: దంపతుల మధ్య ఏర్పడిన గొడవ ఒకరి ఆత్మహత్యకు దారి తీసింది. వివరాలు... ఊత్తంగేరి సమీపంలోని పెరుమాళ్‌కుప్పం గ్రామానికి చెందిన గుణశేఖరన్, విజయలక్ష్మి (24)కి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఒక పాప ఉంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. శనివారం రాత్రి కూడా రగడ జరగడంతో జీవితంపై విరక్తి చెందిన విజయలక్ష్మీ ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఊత్తంగేరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
బుగ్గలు గిల్లితే లైంగిక వేధింపులు కావు
ముంబై: మనసులో చెడు ఉద్దేశాలు లేకుండా మైనర్ బాలిక బుగ్గలు గిల్లితే అది నేరం కాదని ముంబైలోని పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. ఒక బాలిక బుగ్గల్ని మాటిమాటికి తడిమిన 28 ఏళ్ల వయసున్న ఎలక్ట్రీషియన్‌ను కేసు నుంచి విముక్తుడిని చేసింది. అయితే అదే సమయంలో ఆ బాలిక తల్లిపై చేసిన అత్యాచార యత్నం కేసులో నేరస్తుడిగా తీర్పు చెప్పి అతనికి ఏడాది జైలు శిక్ష, రూ.పది వేలు జరిమానా విధించింది. అసలేం జరిగిందంటే..? 2017, జూన్2న జరిగిన ఈ ఘటనలో మధ్యాహ్నం పూట తల్లీ, కూతుళ్లిద్దరూ ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో రిఫ్రిజిరేటర్ బాగు చేయడానికి ఒక ఎలక్ట్రీషియన్ వాళ్లింటికి వచ్చాడు. ఫ్రిజ్‌ని పరీక్షించి చూసిన అతను స్పేర్ పార్ట్ వెయ్యాలని చెప్పాడు. ఇంట్లో ఎవరూ లేరని గమనించి ఆ కూతురి బుగ్గలు గిల్లాడు. దీంతో తల్లి ఎలక్ట్రీషియన్ని గట్టిగా మందలించి తన కూతురి ఒంటిపై చెయ్యి వెయ్యొద్దని హెచ్చరించింది. ఇంతలో వంటగదిలో ఏదో పని ఉందని లోపలికి వెళ్లిన ఆ మహిళను వెనక నుంచి వచ్చి అతను కౌగిలించుకున్నాడు. ఆమె గట్టిగా కేకలు వేసి ఇంటి నుంచి వెళ్లిపొమ్మని చెప్పింది. అప్పుడు ఆ ఎలక్ట్రీషియన్ మళ్లీ ఆమె కుమార్తె బుగ్గలు గిల్లాడు. దీంతో ఆమె ఆ ఎలక్ట్రీషియన్ పని చేస్తున్న సంస్థకి, పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు అతనిని అదుపులోనికి తీసుకున్నారు. కోర్టు ఏమందంటే.. : ఈ కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు ఆ మహిళ చెప్పిందంతా విని బాలిక బుగ్గలు గిల్లడం పోక్సో చట్టం కింద నేరంగా భావించలేమని స్పష్టం చేసింది. మనసులో శృంగారపరమైన వాంఛలు లేకుండా బుగ్గ గిల్లితే దానిని నేరం కింద చూడలేమని పేర్కొంది. మరోవైపు ఆ మహిళపై అత్యాచార యత్నం చేసినందుకు నిందితుడైన ఎలక్ట్రీషియన్‌కు ఏడాది జైలు శిక్ష విధించింది. ఇటీవలి కాలంలో రకరకాల లైంగిక వేధింపులు పోక్సో చట్టం కింద నేరం కావంటూ మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పులు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ కోవలోనే ఈ తీర్పు వెలువడటం గమనార్హం. -
17 రోజుల్లోనే జీవిత ఖైదు
జైపూర్: చిన్నారి బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 17 రోజుల్లోనే తీర్పు ప్రకటించి రాజస్తాన్‌లోని ఒక పోక్సో (ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రెన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్) ప్రత్యేక కోర్టు చరిత్ర సృష్టించింది. చురు జిల్లాలో నవంబర్ 30వ తేదీన 21 ఏళ్ల దయారాం మేఘ్వాల్ నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మర్నాడే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీతో పాటు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డిసెంబర్ 7వ తేదీన చార్జిïషీటు దాఖలు చేశారు. డిసెంబర్ 17న దయారాంకు జీవిత ఖైదు విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. అంటే, 17 రోజుల్లోనే పోలీసు దర్యాప్తు, కోర్టు విచారణ, తీర్పు.. అన్నీ ముగిశాయి. ‘పోలీసులు చురుగ్గా పనిచేశారు. సకాలంలో శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. బాధిత బాలిక వాంగ్మూలం కీలక పాత్ర పోషించింది. కోర్టు రోజువారీ విచారణ జరిపింది. దాంతో త్వరితగతిన తీర్పు సాధ్యమైంది’ అని చురు జిల్లా ఎస్పీ తేజస్విని గౌతమ్ వివరించారు. దోషి దయారాం తండ్రికి కూడా గతంలో ఒక రేప్ కేసులో జైలు శిక్ష విధించారు. -
ఒంగొలు: మగ గొంతుతొ యువతులకు వల
-
ఆమె ఇంట్లో కృత్రిమ లైంగిక సాధనాలు, ప్రేమలేఖలు
తీగ లాగితే డొంకంతా కదులుతోంది. విచారణలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వాస్తవాలు చూసి పోలీసులకే దిమ్మ తిరుగుతోంది. ఒంగోలులో పెంట్ హౌస్ నుంచి దూకిన ఘటన వెనుక అతడి భార్య పాత్ర విస్తు గొలుపుతోంది. భార్య చేసిన సిగ్గుమాలిన పని పోలీసులకు తెలియడం అవమానంగా భావించిన భర్త ఆత్మహత్యకు పాల్పడగా ఆ కేసు దర్యాప్తులో తవ్వే కొద్దీ ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆడ పుట్టుక పుట్టి మగాడిలా బాలికలకు రాసిన ప్రేమ లేఖలు.. కృత్రిమ పరికరాలు, అసహజ లైంగిక కార్యకలాపాలు.. ఇలా ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. సత్ సంప్రదాయమైన కట్టూ బొట్టుతో కనిపించే మహిళలో ఎవరికీ తెలియని ఇలాంటి కోణం మరొకటి ఉందంటే నమ్మశక్యం కాదు. మైనర్‌పై లైంగిక దాడి కేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు నిందితురాలి కాల్‌డేటా పరిశీలించడంతో సుమలత గుట్టు రట్టవుతోంది. సాక్షి, ఒంగోలు: సంతనూతలపాడు మండలం ఎనికెపాడుకు చెందిన గోనుగుంట ఏడుకొండలు కొండపిలో ఆర్ఎంపీగా ప్రాక్రీసు చేస్తుండేవాడు. అదే సమయంలో కొండపి మండలానికి చెందిన సుమలత కుట్టు మిషన్ నేర్చుకునేందుకు వెళ్తుండేది. ఈ క్రమంలో ఏడుకొండలు, సుమలతకు పరిచయమయ్యాడు. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారైనప్పటికీ అప్పటికే రెండు పెళ్లిళ్లయిన సుమలతను ఒక వివాహమైన ఏడుకొండలుకు జత కుదిరింది. ఏడేళ్ల కిందట ఓ మధ్య వర్తి సాయంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరు ఒంగోలు మారుతీ నగర్‌కు మకాం మార్చారు. ఇప్పటికీ వీరికి పిల్లలు మాత్రం కలగలేదు. ఇదిలా ఉండగా ఈనెల 4వ తేదీన తనకు మత్తు ఇచ్చి కొందరు లైంగిక దాడి చేశారంటూ 17 ఏళ్ల బాలిక స్పందనలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో ఏడుకొండలు, సుమలత పేర్లను కూడా చేర్చింది. దీనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తమకు అందిన సమాచారం మేరకు బుధవారం ఏడుకొండలు ఇంటికి వెళ్లి తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఓ బ్యాగులో కృత్రిమ జననాంగాలను పోలిన వస్తువులు కనిపించాయి. అది తెలిసి, తన భార్య వల్లే ఇదంతా.. అంటూ అవమాన భారంతో ఏడుకొండలు పెంట్ హౌస్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడుకొండలు ఇంట్లో సోదాలు చేస్తున్న తాలూకా సీఐ లక్ష్మణ్ తదితరులు పడతుల మధ్య ప్రేమ లేఖలు.. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గురువారం నిందితురాలి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మగరాయుడిలా కనిపించేందుకు సుమలత ధరించే దుస్తులు, లైంగిక చర్యకు ఉపయోగించే కృత్రిమ పరికరం, నడుముకు చుట్టుకునే బెల్టు వంటి వాటిని సీజ్ చేశారు. కొన్ని ప్రేమలేఖలు బయటపడ్డాయి. అవి సుమలతే మగవారు రాసినట్టుగా బాలికలకు రాసినవిగా భావిస్తున్నారు. సుమలత దంపతులు మైనర్లను ట్రాప్‌చేసి, వ్యభిచార రాకెట్ నడుపుతున్నారేమో అని పోలీసులు అనుమానించారు. కృత్రిమ పరికరం బయటపడడంతో ఇదేదో అసహజ లైంగిక చర్యగా భావించి విచారణ చేపట్టారు. తమకు ఫిర్యాదు ఇచ్చిన మైనర్‌ను ట్రాప్ చేసి మగ వేషంలో లైంగిక దాడికి పాల్పడింది కూడా సుమలతగానే నిర్దారణకు వచ్చారు. ఈ క్రమంలో ఆమె వినియోగించిన సెల్‌ఫోన్ సిమ్‌కార్డుల ఆధారంగా కాల్ డేటాపై దృష్టి సారించారు. ఆ కాల్ డేటాలో ఆమె అనేక మంది మైనర్లను ట్రాప్ చేసినట్లుగా గుర్తించారు. ఈ కేసులో నిందితురాలు ఇంకేదైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలికి ఇంకెవరైనా సహకరించారా అని కూడా ఆరా తీస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఇంకెన్ని అంశాలు వెలుగుచూస్తాయో అనే ఉత్కంఠ నెలకొంది. నిందితురాలికి 15 రోజుల రిమాండ్.. బాలికపై అసహజ రీతిలో లైంగిక దాడికి పాల్పడిందనే ఫిర్యాదుపై జరుగుమల్లి పోలీసులు సుమలతను అరెస్టు చేసి గురువారం కందుకూరు కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్ విధించగా ఆమెను ఒంగోలు జిల్లా జైలుకు తరలించారు. భార్య చేసి సిగ్గుమాలిన పని పోలీసులకు తెలియడం అవమానంగా భావించిన ఆమె భర్త మూడో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి విదితమే. ఈ కేసులో తాలూకా పోలీసులు ఏడుకొండలు మృతదేహానికి స్థానిక ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తల్లి లక్ష్మమ్మకు అప్పగించారు. గురువారం నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు నిందితురాలి ఇంట్లో కొన్ని ప్రేమలేఖలు గుర్తించారు. అవి ఆమె బాధితురాలైన బాలికకు రాసినవిగా భావిస్తున్నారు. నిందితురాలిని 24 గంటల్లో అరెస్టు చేయాల్సి రావడం, భర్త ఆత్మహత్యకు పాల్పడడం వంటి కారణాలతో దాదాపు 15 మంది పోలీసులు ఈ విచారణలో పాల్గొని అనేక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. ఆమె కాల్‌డేటాపై దృష్టి పెట్టిన పోలీసులకు నిర్ఘాంతపోయే నిజాలు బయటపడ్డాయి. ఆమె అనేక మంది మైనర్లను ట్రాప్ చేసినట్లుగా గుర్తించారు. -
పిల్లలపై అత్యాచారాలు 82 శాతం పెరిగాయా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల పిల్లలపై పెరుగుతున్న పలు అత్యాచార సంఘటనలపై స్పందించిన పలు ప్రాంతీయ, జాతీయ పత్రికలు 2015 నుంచి 2016 మధ్య ఏడాది కాలంలోనే పిల్లలపై అత్యాచార సంఘటనలు ఏకంగా 82 శాతం పెరిగాయంటూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. జాతీయ నేరాల రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 2015లో పిల్లలపై అత్యాచార కేసులు 10,854 నమోదు కాగా, 2016లో 19,765 కేసులు నమోదయ్యాయని, అంటే 82 శాతం కేసులు పెరిగాయని కూడా ఆ పత్రికలు పేర్కొన్నాయి. భారత్‌లో రోజురోజుకు పిల్లలపై అత్యాచారాలు పెరిగి పోతున్నాయంటూ అంతర్జాతీయ పత్రికలైన ‘ది న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్, ది వాషింగ్టన్ పోస్ట్ పత్రికలు కూడా ఈ లెక్కలనే గతంలో పేర్కొన్నాయి. వాస్తవానికి ఆ ఏడాది కాలంలో పిల్లలపై అత్యాచార ఘటనలు ఒక్క శాతానికన్నా ఎక్కువ పెరగలేదు. మరి ఎందుకు లెక్కలు తప్పాయి ? జాతీయ నేరాల రికార్డు బ్యూరో లెక్కల్లోనే తేడా ఉందా ? పత్రికల్లో పేర్కొన్న లెక్కల్లోనే తేడా వచ్చిందా? దేశంలో నకిలీ వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన వాస్తవాలను కూడా గ్రహించాల్సి అవసరం ఉంది. 2012 సంవత్సరం వరకు రేప్ కేసులను బాధితుల వయస్సుతో నిమిత్తం లేకుండా భారతీయ శిక్షాస్మతి (ఐపీసీ–1860) కింద నమోదు చేసేవారు. 2012లో ‘లైంగిక నేరాల నుంచి పిల్లలను పరిరక్షించే చట్టం (పోస్కో)ను తీసుకొచ్చారు. అప్పటి నుంచి పిల్లలపై జరుగుతున్న రేప్ కేసులను రెండు సెక్షన్ల కింద నమోదు చేస్తూ వస్తున్నారు. ‘క్రైమ్ ఇన్ ఇండియా 2016–స్టాటటిక్స్’ పేరిట జాతీయ నేరాల రికార్డు బ్యూరో 2017, డిసెంబర్ నెలలో ఓ నివేదికను విడుదల చేసింది. అందులో ఐపీసీ, పోస్కో చట్టాల కింద నమోదైన రేప్ కేసులను రెండు కలిపి 19,765 కేసులుగా పేర్కొంది. 2015లో జరిగిన రేప్‌లకు సంబంధించి కేవలం ఐపీఎస్ కింద నమోదయిన 10,854 కేసులను పేర్కొంది. మరోచోట ఎక్కడో పోస్కో చట్టం కింద 8,800 కేసులు నమోదయినట్లు పేర్కొన్నది. ఈ రెండింటిని కలిపితే 19,654 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. 2016లో నమోదైనట్లు పేర్కొన్న రేప్ కేసుల సంఖ్య 19,765 నుంచి ఈ 19,654 కేసులను తీసినేస్తే తేలే సంఖ్య 111. అంటే ఒక్క శాతానికి మించి కూడా కేసులు పెరగలేదన్న మాట. ఒక ఏడాదికి ఐపీసీ కింద నమోదైన సంఖ్యను మాత్రమే తీసుకొని ఆ తర్వాత సంవత్సరానికి ఐపీసీతోపాటు పోస్కో చట్టం కింద నమోదైన కేసులను పరిగణలోకి తీసుకోవడం వల్ల పొరపాటు జరిగిందని తేలిపోతోంది. పిల్లలకు సంబంధించిన రేప్ కేసులను పరిగణలోకి తీసుకోవాలనుకున్నప్పుడు రెండు సెక్షన్ల కింద నమోదైనవి కాకుండా ‘పోస్కో’ చట్టం కింద నమోదయిన కేసులను మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. -
ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో మైనర్ బాలికపై అత్యాచారం
కోల్‌కతాలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన శనివారం సాయంత్రం ఆర్మీ తూర్పు కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌లోని మైనర్ బాలిక ఇంట్లో జరిగింది. బాలిక తండ్రి ఆర్మీ ఉద్యోగి కాగా, బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి ఆర్మీలో కింది స్థాయి (గ్రూప్–డీ) ఉద్యోగి. నిందితుడి నివాసం కోల్‌కతా ఫోర్ట్ విలియంలోని బాలిక ఇంటికి అతి సమీపంలోనే ఉంది. అత్యాచారం చేసిన తరువాత అతను పారిపోవడంతో పోలీసులు మంగళవారం పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లలు రక్షణ) చట్టం కింద అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హాజరు పర్చగా, జూన్ 24 వరకు పోలీస్ కస్టడీ విధించింది. -
బాలికల హాస్టల్ వార్డెన్ అరెస్టు
-
బాలిక అత్యాచార కేసులో హాస్టల్ వార్డెన్ అరెస్టు
సాక్షి చిత్తూరు : తిరుపతిలో ప్రభుత్వ బాలికల వసతి గృహంలో దారుణం చోటుచేసుకుంది. బాలికల వసతి గృహంలో వార్డెన్ నందగోపాల్ హస్టల్ విద్వార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. అతన్ని అరెస్ట్ చేశారు. పోస్కో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి.. 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ ఈ నెల 23న వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. -
కోర్కె తీర్చేందుకు నిరాకరించడంతో..
భోపాల్ : తన కోర్కెను తీర్చేందుకు నిరాకరించిందనే కోపంతో మహిళ కుమార్తె ఏడాది పసికందుపై ఓ వ్యక్తి లైంగిక దాడికి తెగబడ్డ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. మహిళ పెద్దకుమార్తె ఫిర్యాదు చేయడంతో ఈ దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. బాధితురాలి కుటుంబానికి బంధువైన నిందితుడు కొద్దిరోజులుగా మహిళను లోబరుచుకునేందుకు యత్నిస్తుండగా ఆమె తిరస్కరించింది. లైంగిక దాడికి తెగబడేందుకు బాధితురాలి ఇంటికి వెళ్లగా ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో ఆమె ఏడాది కుమార్తెపై దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అదే రాత్రి మరోసారి బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె నాలుగేళ్ల కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ఏడాది మే 21న మధ్యప్రదేశ్‌లోని రెహ్లిలో తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి ఘటన జరిగిన 46 రోజుల్లోగా మరణ శిక్ష విధించారు. ఘటన జరిగిన 72 గంటల్లోనే నిందితుడిని పట్టుకుని సెషన్స్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. లైంగిక దాడి జరిగిందని డీఎన్ఏ నివేదికలో తేలడంతో నిందితుడుని దోషిగా తేల్చిన న్యాయస్ధానం మరణ శిక్ష విధించింది. -
తొమ్మిదో తరగతి విద్యార్థిపై దారుణం..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే విద్యార్థిపై తన క్లాస్మేట్ సహా ఇద్దరు బాలురు స్కూల్ ప్రాంగణంలోనే లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత విద్యార్ధి ఫిర్యాదు మేరకు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఏడాది మే-జూన్‌లో పాఠశాల నిర్వహించిన సమ్మర్ క్యాంప్ సందర్భంగా తన క్లాస్మేట్ సహా వేరే సెక్షన్ విద్యార్థి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశారని తూర్పు ఢిల్లీ డీసీపీ పంకజ్ సింగ్ చెప్పారు. పాఠశాల భవనంలోని మూడో అంతస్తులో కంప్యూటర్ ల్యాబ్ పక్కనే ఉన్న ఖాళీ గదిలోకి తనను తీసుకువెళ్లిన ఇద్దరు బాలురు లైంగికంగా వేధించారని విద్యార్థి ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఎవరికైనా ఈ విషయం చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించి నిందితులు పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడన్నారు. జరిగిన విషయం తల్లితండ్రులకు చెప్పగా వారి చొరవతో బాలుడు నిందితులపై ఫిర్యాదు చేశాడు. -
అత్యాచారం చేస్తూ సెల్ఫీ వీడియో!
నిజామాబాద్ క్రైం: ఇద్దరూ మైనర్లే.. బాలిక పదో తరగతి.. బాలుడు ఇంటర్ చదువుతున్నారు. బాలికతో ఉన్న చనువును ఆసరాగా చేసుకొని ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతూ సెల్ఫీ వీడియోలు తీశాడు. వాటిని వాట్సాప్‌లలో స్నేహితులకు షేర్ చేశాడు. ఇదే వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తూ ఆరు నెలల పాటు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రికి అనుమానం వచ్చి నిలదీయడంతో శుక్రవారం రాత్రి ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని కోటగల్లికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలిక (15)తో ఆమె సమీప బంధువైన ఇంటర్ విద్యార్థి (17)కి స్నేహం ఏర్పడింది. ఆరు నెలల క్రితం ఆమె పుట్టిన రోజు సందర్భంగా బాలుడు తన ముగ్గురు స్నేహితులతో కలసి నగర శివారులోని నాగారం ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికతో కేక్ కట్ చేయించాడు. ఈ క్రమంలో వారి మధ్య చనువు ఏర్పడింది. రెండు నెలల క్రితం బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్ప డుతూ సెల్ఫీ వీడి యోలు తీశాడు. అప్పటి నుంచి తన వద్దకు రావాలని, లేకుంటే వీడియోను బయ ట పెడతానని బెదిరిస్తూ పలుమార్లు లొంగదీసుకున్నాడు. బాలిక భయపడి ఇంట్లో చెప్పకుండా ఉండిపోయింది. ఇటీవల బాలిక తండ్రి ఫోన్ రిపేరుకు రావడంతో అమ్మాయి సెల్‌ఫోన్ తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం బాలుడి నుంచి ఫోన్‌కాల్స్ రావడం.. అప్పటికే కూతురి ప్రవర్తనపై అనుమానం ఉండటంతో నిలదీయగా.. అసలు విషయం బయటపడింది. బాలుడిని పిలిపించి గ్రామ పెద్దమనుషుల సమక్షంలో నిలదీశాడు. అతను నేరాన్ని అంగీకరించాడు. అయితే.. సెల్‌ఫోన్, వీడియోలలో ఉన్న చిత్రాలు తొలగించాలని చెప్పగా అందుకు నిరాకరించాడు. వెంటనే అతని చేతిలో ఉన్న సెల్‌ఫోన్ లాక్కొని అన్‌లాక్ చేయించగా.. వాటిలో ఉన్న అశ్లీల చిత్రాలు చూసి నివ్వెరపోయారు. ఘోరం జరిగిపోయిందని తెలుసుకొని బోరున విలపించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. -
భార్య చెల్లిపై కన్నేశాడు.. కానీ..
సాక్షి, హైదరాబాద్ : మరదలిని(మైనర్) బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు ఓ బావ. ఈ ఘటన ఆదివారం నగరంలోని వినాయకనగర్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తిని నేరేడ్మెట్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. వినాయకనగర్‌కు చెందిన తుపాకుల రమేష్(32) రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఓల్డ్ సఫిల్ గూడకు చెందిన కరుణశ్రీని వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కరుణశ్రీకి పదహారేళ్ల సోదరి ఉంది. ఆ యువతిపై రమేష్ కన్నేశాడు. తల్లిదండ్రులు లేని సమయంలో రమేష్ తరచూ వారి ఇంటికి వెళ్లేవాడు. అంతేకాక ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆ యువతిని మభ్యపెట్టాడు. అందుకు ఆమె తిరస్కరించింది. గత మార్చి నెలలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెపై కొన్నిసార్లు లైంగిక దాడి చేశాడు. భార్యకు నీ చెల్లెల్నీ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకు ఆమె రమేష్‌ను మందలించి వదిలేసింది. ఈ క్రమంలో గత నెల (మే) 25న బాలికను బలవంతంగా యాదగిరి గుట్టకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ యువతిని రమేష్ తిరుపతి తీసుకెళ్లాడు. మే నెల 31న తల్లిదండ్రుల ఇంటి వద్ద ఆమెను వదిలి వెళ్లిపోయాడు. జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్కో చట్టం కింద నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
పోక్సో ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదముద్ర