‘మార్కులు కావాలంటే ముద్దు ఇవ్వాలి’ | Professor seeks kiss..in return for good marks | Sakshi
Sakshi News home page

‘మార్కులు కావాలంటే ముద్దు ఇవ్వాలి’

Published Sun, Mar 25 2018 10:33 AM | Last Updated on Fri, Nov 9 2018 5:06 PM

Professor seeks kiss..in return for good marks - Sakshi

ముంబాయి : నీకు మార్కులు కావాలా..అయితే నాకు ఒక ముద్దు ఇవ్వు లేకపోతే నిన్ను ఫెయిల్‌ చేస్తానంటూ ఓ జూనియర్‌ కాలేజీ ఫ్రొఫెసర్‌, విద్యార్థిని వేధింపులకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ముంబాయిలో చోటుచేసుకుంది. ఆ ప్రబుద్దుడిని గట్కోపార్‌ పోలీసులు అరెస్ట్‌ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చిం‍ది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..నగరంలో మంచి పేరున్న జూనియర్‌ కళాశాలో కామర్స్‌ చదువుతోన్న ఓ విద్యార్థిని(17)  మార్కులు కావాలంటే ముద్దు ఇవ్వాలని ప్రొఫెసర్‌ డిమాండ్‌ చేయడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది.

కుమార్తె వింత ప్రవర్తనతో అప్రమత్తం అయిన తల్లిదండ్రులు ఆరా తీయడంతో జరిగిన విషయం బయటపడింది. ఈ విషయం పోలీసులకు తెలియజేయడంతో పాటు సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడంతో చాలా మంది పిల్లల తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సంఘటన మార్చి 8న జరిగినట్లు విద్యార్థిని వెల్లడించింది. శనివారం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement