ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే విద్యార్థిపై తన క్లాస్‌మేట్ సహా ఇద్దరు బాలురు స్కూల్ ప్రాంగణంలోనే లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత విద్యార్ధి ఫిర్యాదు మేరకు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఏడాది మే-జూన్‌లో పాఠశాల నిర్వహించిన సమ్మర్ క్యాంప్ సందర్భంగా తన క్లాస్‌మేట్ సహా వేరే సెక్షన్ విద్యార్థి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశారని తూర్పు ఢిల్లీ డీసీపీ పంకజ్ సింగ్ చెప్పారు.
పాఠశాల భవనంలోని మూడో అంతస్తులో కంప్యూటర్ ల్యాబ్ పక్కనే ఉన్న ఖాళీ గదిలోకి తనను తీసుకువెళ్లిన ఇద్దరు బాలురు లైంగికంగా వేధించారని విద్యార్థి ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఎవరికైనా ఈ విషయం చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించి నిందితులు పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడన్నారు. జరిగిన విషయం తల్లితండ్రులకు చెప్పగా వారి చొరవతో బాలుడు నిందితులపై ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment