profesor arest
-
‘మార్కులు కావాలంటే ముద్దు ఇవ్వాలి’
ముంబాయి : నీకు మార్కులు కావాలా..అయితే నాకు ఒక ముద్దు ఇవ్వు లేకపోతే నిన్ను ఫెయిల్ చేస్తానంటూ ఓ జూనియర్ కాలేజీ ఫ్రొఫెసర్, విద్యార్థిని వేధింపులకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ముంబాయిలో చోటుచేసుకుంది. ఆ ప్రబుద్దుడిని గట్కోపార్ పోలీసులు అరెస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..నగరంలో మంచి పేరున్న జూనియర్ కళాశాలో కామర్స్ చదువుతోన్న ఓ విద్యార్థిని(17) మార్కులు కావాలంటే ముద్దు ఇవ్వాలని ప్రొఫెసర్ డిమాండ్ చేయడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. కుమార్తె వింత ప్రవర్తనతో అప్రమత్తం అయిన తల్లిదండ్రులు ఆరా తీయడంతో జరిగిన విషయం బయటపడింది. ఈ విషయం పోలీసులకు తెలియజేయడంతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో చాలా మంది పిల్లల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన మార్చి 8న జరిగినట్లు విద్యార్థిని వెల్లడించింది. శనివారం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
స్కాలర్ పై ప్రొఫెసర్ లైంగిక దాడి
ఒడిశా: విశ్వ విద్యాలయాల్లోని ఆచార్యులు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. శంబాలపూర్ విశ్వవిద్యాలయంలోని ఓ పీహెచ్డీ స్కాలర్‌పై లైంగిక దాడి చేసిన సాహు అనే ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సెమినార్ పేపర్ల ప్రిపరేషన్ కోసం కంప్యూటర్ ల్యాబ్ తాళాలివ్వాల్సిందిగా ఓ స్కాలర్, మరికొందరు తోటి స్కాలర్లు కోరగా తన దగ్గర తాళం లేదని, తన చాంబర్లో ఉన్న కంప్యూటర్ వాడుకోవచ్చని సాహు చెప్పాడు. అనంతరం మిగితా వాళ్లంతా వెళ్లిపోయి ఒక్క స్కాలర్ మాత్రం పేపర్లు ప్రిపేర్ చేసుకుంటుండగా అతడు లైంగిక దాడి చేశాడు. బాధితురాలి వివరాల ప్రకారం ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. గతంలో కూడా ఇదే వర్సిటీకి చెందిన చరిత్ర విభాగం ఆచార్యుడు లైంగిక వేధింపులకు పాల్పడి ప్రస్తుతం జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు.