అత్యాచారం చేస్తూ సెల్ఫీ వీడియో! | Gang Rape Attempt on Minor Girl in Nizamabad District | Sakshi
Sakshi News home page

అత్యాచారం చేస్తూ సెల్ఫీ వీడియో!

Published Sun, Jun 24 2018 4:17 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

Gang Rape Attempt on Minor Girl in Nizamabad District - Sakshi

నిజామాబాద్‌ క్రైం: ఇద్దరూ మైనర్లే.. బాలిక పదో తరగతి.. బాలుడు ఇంటర్‌ చదువుతున్నారు. బాలికతో ఉన్న చనువును ఆసరాగా చేసుకొని ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతూ సెల్ఫీ వీడియోలు తీశాడు. వాటిని వాట్సాప్‌లలో స్నేహితులకు షేర్‌ చేశాడు. ఇదే వీడియోలతో బ్లాక్‌మెయిల్‌ చేస్తూ ఆరు నెలల పాటు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రికి అనుమానం వచ్చి నిలదీయడంతో శుక్రవారం రాత్రి ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని కోటగల్లికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలిక (15)తో ఆమె సమీప బంధువైన ఇంటర్‌ విద్యార్థి (17)కి స్నేహం ఏర్పడింది. ఆరు నెలల క్రితం ఆమె పుట్టిన రోజు సందర్భంగా బాలుడు తన ముగ్గురు స్నేహితులతో కలసి నగర శివారులోని నాగారం ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికతో కేక్‌ కట్‌ చేయించాడు. ఈ క్రమంలో వారి మధ్య చనువు ఏర్పడింది. రెండు నెలల క్రితం బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్ప డుతూ సెల్ఫీ వీడి యోలు తీశాడు.

అప్పటి నుంచి తన వద్దకు రావాలని, లేకుంటే వీడియోను బయ ట పెడతానని బెదిరిస్తూ పలుమార్లు లొంగదీసుకున్నాడు.  బాలిక భయపడి ఇంట్లో చెప్పకుండా ఉండిపోయింది. ఇటీవల బాలిక తండ్రి ఫోన్‌ రిపేరుకు రావడంతో అమ్మాయి సెల్‌ఫోన్‌ తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం బాలుడి నుంచి ఫోన్‌కాల్స్‌ రావడం.. అప్పటికే కూతురి ప్రవర్తనపై అనుమానం ఉండటంతో నిలదీయగా.. అసలు విషయం బయటపడింది. బాలుడిని పిలిపించి గ్రామ పెద్దమనుషుల సమక్షంలో నిలదీశాడు.

అతను నేరాన్ని అంగీకరించాడు. అయితే.. సెల్‌ఫోన్, వీడియోలలో ఉన్న చిత్రాలు తొలగించాలని చెప్పగా అందుకు నిరాకరించాడు. వెంటనే అతని చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ లాక్కొని అన్‌లాక్‌ చేయించగా.. వాటిలో ఉన్న అశ్లీల చిత్రాలు చూసి నివ్వెరపోయారు. ఘోరం జరిగిపోయిందని తెలుసుకొని బోరున విలపించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement