Minor Students
-
ప్రియుడితో ఏకాంతానికి అడ్డుపడిందని..!
సాక్షి, చెన్నై: ప్రియుడితో ఏకాంతంగా గడిపిన విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతానని మందలించిన మహిళను ఇద్దరు మైనర్ విద్యార్థులు హత్య చేశారు. వివరాలు..కొడైక్కెనాల్ సమీపంలోని పణైక్కాడు ప్రాంతానికి చెందిన కేశవన్, భార్య సుందరి (31). వీరికి 11 ఏళ్ల కుమార్తె ఉంది. తరచూ మనస్పర్థలు రావడంతో మూడేళ్ల క్రితం ఇద్దరూ విడిపోయారు. కుమార్తెను కేశవన్ పెంచుతున్నాడు. సుందరికి అంతకు ముందే అదే ప్రాంతానికి చెందిన మురుగన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఇద్దరూ కలిసి ఉంటున్నారు. మురుగన్ చెన్నైలో పనిచేస్తుండడం వల్ల సుందరి ఒంటరిగా ఉండేది. ఈ క్రమంలో ఈ నెల 21న ఆమె అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కొత్త మలుపు... ఇందులో హత్య జరిగిన రోజు రాత్రి సుందరి ఇంట్లో అదే ప్రాంతానికి చెందిన ఆమె బంధువు కుమార్తె (16) ఉన్నట్లు తెలిసింది. ఆమె ప్లస్ వన్ చదువుతోంది. దీంతో పోలీసులు విద్యార్థిని వద్ద విచారణ జరిపారు. ఆమె తెలిపిన వివరాల మేరకు..దిండుగల్‌లో తనతో పాటు చదువుకుంటున్న ఓ విద్యార్థి (16) తాను ప్రేమించుకుంటున్నామని..సుందరి ఇంట్లో లేని సమయంలో ఇద్దరం ఏకాంతంగా గడిపేవారమని తెలిపింది. హత్య జరిగిన రోజు రాత్రి ఇద్దరం ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో సుందరి వచ్చిందని..ఇద్దరిని చూసి తీవ్రంగా మందలించిందని చెప్పింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతానని హెచ్చరించిందని..భయంతో సుందరిని చున్నీతో గొంతు బిగించి హత్య చేసినట్లు వివరించింది. అనంతరం తన ప్రియుడు పారిపోగా తాను అక్కడే ఉండి సుందరి హఠాత్తుగా మృతి చెందినట్లు నాటకమాడినట్లు ఒప్పుకుంది. పోలీసులు పారిపోయిన బాలుడి కోసం గాలిస్తున్నారు. -
అత్యాచారం చేస్తూ సెల్ఫీ వీడియో!
నిజామాబాద్ క్రైం: ఇద్దరూ మైనర్లే.. బాలిక పదో తరగతి.. బాలుడు ఇంటర్ చదువుతున్నారు. బాలికతో ఉన్న చనువును ఆసరాగా చేసుకొని ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతూ సెల్ఫీ వీడియోలు తీశాడు. వాటిని వాట్సాప్‌లలో స్నేహితులకు షేర్ చేశాడు. ఇదే వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తూ ఆరు నెలల పాటు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రికి అనుమానం వచ్చి నిలదీయడంతో శుక్రవారం రాత్రి ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని కోటగల్లికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలిక (15)తో ఆమె సమీప బంధువైన ఇంటర్ విద్యార్థి (17)కి స్నేహం ఏర్పడింది. ఆరు నెలల క్రితం ఆమె పుట్టిన రోజు సందర్భంగా బాలుడు తన ముగ్గురు స్నేహితులతో కలసి నగర శివారులోని నాగారం ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికతో కేక్ కట్ చేయించాడు. ఈ క్రమంలో వారి మధ్య చనువు ఏర్పడింది. రెండు నెలల క్రితం బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్ప డుతూ సెల్ఫీ వీడి యోలు తీశాడు. అప్పటి నుంచి తన వద్దకు రావాలని, లేకుంటే వీడియోను బయ ట పెడతానని బెదిరిస్తూ పలుమార్లు లొంగదీసుకున్నాడు. బాలిక భయపడి ఇంట్లో చెప్పకుండా ఉండిపోయింది. ఇటీవల బాలిక తండ్రి ఫోన్ రిపేరుకు రావడంతో అమ్మాయి సెల్‌ఫోన్ తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం బాలుడి నుంచి ఫోన్‌కాల్స్ రావడం.. అప్పటికే కూతురి ప్రవర్తనపై అనుమానం ఉండటంతో నిలదీయగా.. అసలు విషయం బయటపడింది. బాలుడిని పిలిపించి గ్రామ పెద్దమనుషుల సమక్షంలో నిలదీశాడు. అతను నేరాన్ని అంగీకరించాడు. అయితే.. సెల్‌ఫోన్, వీడియోలలో ఉన్న చిత్రాలు తొలగించాలని చెప్పగా అందుకు నిరాకరించాడు. వెంటనే అతని చేతిలో ఉన్న సెల్‌ఫోన్ లాక్కొని అన్‌లాక్ చేయించగా.. వాటిలో ఉన్న అశ్లీల చిత్రాలు చూసి నివ్వెరపోయారు. ఘోరం జరిగిపోయిందని తెలుసుకొని బోరున విలపించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. -
స్టూడెంట్‌తో లైంగిక సంబంధం.. టీచర్ అరెస్ట్
ఓక్లహామా : అమెరికా ఓక్లహామాలోని యాకూన్ పాఠశాలలో కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేస్తున్న హంటర్ డే (24) అనే మహిళను అక్రమ లైంగిక సంబంధాలు, నగ్న ఫొటోల మార్పిడి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థి మొబైల్ ఫోన్‌ను తల్లిదండ్రులు అనుకోకుండా చూడడంతో ఈ వ్యవహరం బట్టబయలైంది. సెక్స్ చాటింగ్, న్యూడ్ ఫొటోల షేరింగ్ చేసుకుంటున్నట్లు బయటపడింది. అంతేకాక ఇద్దరి మధ్య అక్రమ లైంగిక సంబంధాలు ఏర్పడ్డట్లు విద్యార్థి తల్లిదండ్రులు గుర్తించారు. తమ కుమారుడిని హంటర్ డే లైంగికంగా వాడుకుంటోందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. పోలీసులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న విషయం తెలియని హంటర్ డే.. ఎప్పటిలానే లైంగిక కలయిక కోసం.. మైనర్ విద్యార్థికి మెసేజ్ చేశారు. విద్యార్థి కూడా వెంటనే స్పందించారు. అనుకున్న సమయానికి హంటర్ డే ఇంటికి విద్యార్థి వెళ్లాడు. క్యాండిల్ లైట్ వెలుగులో ఇద్దరూ శృంగారం జరుగుతున్న సమయంలో పోలీసులు ఎంటరై అమెను రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. హంటర్ డే చర్యపై స్కూల్ యాజమాన్యం, ఇతర ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. అధ్యాపకుల మీద నమ్మకంతో విద్యార్థులను స్కూలకు పంపితే.. ఇటువంటి చర్యలకు దిగడం విద్యావ్యవస్థకే మచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉండగా హంటర్ డేను స్కూల్ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. -
ఫోన్ కోసం టీచర్‌ను చంపేశారు!
బీజింగ్: ముగ్గురు మైనర్ బాలురు తమ టీచర్‌ను అతి కిరాతకంగా హత్య చేసి అనంతరం ఆమె మొబైల్ ఫోన్, కొంత డబ్బును దొంగిలించారు. ఈ ఘటన చైనా హునాన్ ప్రావిన్స్‌లోని లియాన్‌కియో పట్టణంలో జరిగింది. ముగ్గురు మైనర్ విద్యార్థులు 52 ఏళ్ల టీచర్‌పై కర్రతో దాడి చేసి ఆపై గుడ్డలను ఆమె నోటిలో కుక్కి బాత్రూంలో పడేశారు. అనంతరం వారు మొబైల్ ఫోన్, 2000 యువాన్ నగదుతో అక్కడి నుంచి ఉడాయించారు. అనంతరం వేరే పాఠశాలలో చదువుకుంటున్న ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి బాలుర తల్లిదండ్రులు వలస కార్మికులు కావడంతో వీరిని లియాన్‌కియో పట్టణంలో ఏకోపాధ్యాయ పాఠశాలలో చేర్చితే వారు ఇంతటి ఘోరానికి పాల్పడ్డారు. -
యోగా గురువు అరెస్టు
న్యూఢిల్లీ: యోగా పాఠాలు నేర్చుకునేందుకు వచ్చిన ముగ్గురు మైనర్ విద్యార్థులపై అత్యాచారం చేసిన కీచక గురువును నగర పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు ఢిల్లీలోని వసుంధర్ ఎంక్లేవ్లోని ఓ పాఠశాలలో పార్ట్‌టైమ్ యోగా టీచర్‌గా పనిచేస్తున్న పంకజ్ సక్సేనా శుక్రవారం ఒక బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె తల్లిదండ్రులకు చెప్పగా, వాళ్లు వెంటనే వచ్చి పాఠశాల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మరో ఇద్దరు బాలికలతోనూ ఇలానే వ్యవహరించాడనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బాధితుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.