యోగా గురువు అరెస్టు
Published Mon, Dec 16 2013 11:21 PM | Last Updated on Wed, May 29 2019 2:59 PM
న్యూఢిల్లీ: యోగా పాఠాలు నేర్చుకునేందుకు వచ్చిన ముగ్గురు మైనర్ విద్యార్థులపై అత్యాచారం చేసిన కీచక గురువును నగర పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు ఢిల్లీలోని వసుంధర్ ఎంక్లేవ్‌లోని ఓ పాఠశాలలో పార్ట్‌టైమ్ యోగా టీచర్‌గా పనిచేస్తున్న పంకజ్ సక్సేనా శుక్రవారం ఒక బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె తల్లిదండ్రులకు చెప్పగా, వాళ్లు వెంటనే వచ్చి పాఠశాల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మరో ఇద్దరు బాలికలతోనూ ఇలానే వ్యవహరించాడనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బాధితుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement