
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అమానుషం చోటు చేసుకుంది. ఒక యువతిపై మద్యం, డ్రగ్స్ కుటుంబానికి వారు సాముహికంగా అత్యాచారం చేసి, ఆపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ సంఘటన తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా ఉన్న కస్తూర్బా నగర్‌కు చెందిన 20 ఏళ్ల యువతిని అదే ప్రాంతానికి ఉన్న ఒక యువకుడు ప్రేమించాడు. చాలా రోజులు ఆమె వెంటపడ్డాడు.
యువతి ప్రేమను అంగీకరించకపోవడంతో విచారంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గతేడాది నవంబరులో జరిగింది. అయితే, తమ కుమారుడి మృతికి ఆ యువతి కారణమని యువకుడి కుటుంబ సభ్యులు ఆమెపై ద్వేషాన్ని పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆయువతిని నిన్న ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చారు. ఆమెను జుట్టుపట్టుకొని కొడుతూ.. నీచంగా ప్రవర్తించారు.
ఈ క్రమంలో కొంత మంది పురుషులు.. ఆ యువతిపై బహిరంగంగానే సాముహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అక్కడ ఉన్న మహిళలు కూడా.. యువతిపై పురుషులు అత్యాచారం చేసేలా ప్రేరేపించారు. ఆమెను నానా దుర్భాషలాడుతూ.... ఆమె జుట్టును కత్తిరించారు. ఆమె ముఖానికి నలుపు రంగు పూశారు. ఆమెను ఇష్టం వచ్చినట్లు కొడుతూ.. అవమానపర్చారు. చెప్పులు, బూట్లతో కొడుతూ.. దండలు చేసి యువతి మెడలో వేసి.. ఊరేగించారు.
చనిపోయిన బాలుడు కుటుంబానికి చెందిన వారంతా మద్యం, డ్రగ్స్ వ్యాపారస్తులని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఢిల్లీ మహిళ కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళను పరామర్శించారు. వెంటనే బాధిత యువతిపై దాడిచేసిన వారందరిని అరెస్టు చేయాలని ట్విటర్ వేదికగా ఢిల్లీ పోలీసు అధికారులను ఆదేశించారు.
అదే విధంగా ఘటనపై 72 గంటలలో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు నోటిసులు జారీచేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని పోలీసువారిని ఆదేశించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
कस्तूरबा नगर में 20 साल की लड़की का अवैध शराब बेचने वालों द्वारा गैंगरेप किया गया, उसे गंजा कर, चप्पल की माला पहना पूरे इलाक़े में मुँह काला करके घुमाया। मैं दिल्ली पुलिस को नोटिस जारी कर रही हूँ। सब अपराधी आदमी औरतों को अरेस्ट किया जाए और लड़की और उसके परिवार को सुरक्षा दी जाए। pic.twitter.com/4ExXufDaO3
— Swati Maliwal (@SwatiJaiHind) January 27, 2022
చదవండి: రిపబ్లిక్ డే వేడుకలలో అపశ్రుతి.. తలపై పడిన డ్రోన్
Comments
Please login to add a commentAdd a comment