liquor mafia
-
టీడీపీ నాయకుడి ఇంట్లో కర్ణాటక మద్యం.. పరారీలో పచ్చ పార్టీ నేత
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: ఏపీలో పలుచోట్ల మద్యం సిండికేట్ నడుస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల టీడీపీ నేతల కనుసన్నల్లో బెల్టు షాపులు నడుస్తున్నాయి. ఇక, తాజాగా ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో టీడీపీ నేత ఇంట్లో కర్ణాటకకు చెందిన మద్యం బాటిళ్లు దొరకడం చర్చనీయాంశంగా మారింది. ఎక్సైజ్ అధికారుల దాడుల నేపథ్యంలో సదరు టీడీపీ నేత పరారీ అయ్యాడు.వివరాల ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో యథేచ్చగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. హిందూపురం మండలం కొల్లకుంటలో టీడీపీ నేత ముంజునాథ్ ఏకంగా కర్ణాటకకు చెందిన మద్యాన్ని విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఎక్సైజ్ అధికారులు ముంజునాథ్ నివాసంలో సోదాలు నిర్వహించారు. అధికారుల తనిఖీల్లో కర్ణాటకకు చెందిన దాదాపు 1248 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ అధికారుల దాడుల విషయం తెలుసుకున్న ముంజునాథ్ ఇంట్లో నుంచి పరారీ అయ్యాడు. -
బావ మాట అయినా మూడు పెగ్గులు.. ఆరు గ్లాసులే!!
సాక్షి, శ్రీ సత్యసాయి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో దాదాపు ప్రతీ గ్రామంలో అడ్డగోలుగా బెల్ట్ షాపులు వెలిశాయి. కొన్ని చోట్లైతే టీడీపీ ముఖ్య నేతలు డబ్బులు తీసుకుని మరీ బెల్టు షాపులకు అనుమతి ఇస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ బాటలో చంద్రబాబు బావమరిది బాలకృష్ణ నియోజకవర్గం కూడా ఉందనే విషయం తాజాగా వెలుగు చూసింది. హిందూపురం నియోజకవర్గంలో బెల్టు షాపులు విచ్చలవిడిగా.. భారీగా వెలిశాయి. మందుబాబులకు మూడు పెగ్గులు.. ఆరు గ్లాసులుగా నడుస్తోంది అక్కడ. ఈ నియోజకవర్గంలో దాదాపు వందకుపైగా బెల్ట్ షాపులు ఉన్నట్టు అనధికార సమాచారం. ఇక, ఈ బెల్డ్ షాపులు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వాళ్ల ఇష్టానుసారం లిక్కర్ అమ్మకాలు జరుపుతున్నారు. ఒక్కో లిక్కర్ బాటిల్‌పై రూ.20 అదనంగా తీసుకుంటున్నారు. అయితే, ఎలా పడితే అలా బెల్ట్ షాపులకు అనుమతులు ఇవ్వమని, అలా కాదని అమ్మితే రూ.5లక్షలు జరిమానా విధిస్తామని సాక్ష్యాత్తూ సీఎం చంద్రబాబే హెచ్చరించారు. ఇక్కడ కూడా కొందరు టీడీపీ లీడర్లే ఈ దందాలు నడిపిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే ఎక్సైజ్ అధికారులు పట్టించుకోని ఈ విషయాన్ని కనీసం.. బాలయ్య అని పట్టించుకోవాలని కింది స్థాయి కూటమి నేతలు కోరుకుంటున్నారు. మరి బావ మాటలను ఇప్పటికైనా బాలకృష్ణ సీరియస్‌గా తీసుకుంటారా? లిక్కర్ మాఫియాకు అడ్డుకట్ట వేస్తారా? అనే చర్చ మొదలైంది ఇప్పడు. -
పచ్చ నేతల కబ్జాలో ఇసుక, మద్యం.. కోట్లలో వ్యాపారం: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఇసుక మొత్తం కూటమి నేతల కబ్జాలోకి వెళ్లిపోయిందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. పచ్చ నేతలు ఇసుక, మద్యం వ్యాపారాలను కబ్జాచేసి అక్రమంగా కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. అయినా ప్రభుత్వం ఏమీ తెలియనట్లు నటిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా.. రాష్ట్రంలో ఇసుక మొత్తం @JaiTDP నేతల కబ్జాలోకి వెళ్ళిపోయింది. ధరను అమాంతం పెంచేసి కోట్లలో దండుకుంటున్నారు. అయినా ప్రభుత్వం ఏమీ తెలియనట్లు నటిస్తోంది.రాష్ట్రంలో ఇసుక మొత్తం @JaiTDP నేతల కబ్జాలోకి వెళ్ళిపోయింది. ధరను అమాంతం పెంచేసి కోట్లలో దండుకుంటున్నారు. అయినా ప్రభుత్వం ఏమీ తెలియనట్లు నటిస్తోంది.#IdhiMunchePrabhutvam#100DaysOfCBNSadistRule#MosagaduBabu#SadistChandraBabu pic.twitter.com/XzHu2XX3D8— YSR Congress Party (@YSRCParty) October 30, 2024 ఇసుక, మద్యం వ్యాపారాలను కబ్జా చేసిన @JaiTDP నేతలు ఇప్పుడు ఏకంగా సివిల్ వర్క్స్, నిర్మాణ పనులు చేసే కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. పనులు తమకు అప్పగించి వెళ్లిపోవాలని హుకుం జారీచేస్తున్నారు. రాక్షస పాలనకు ఇది కదా నిదర్శనం.ఇసుక, మద్యం వ్యాపారాలను కబ్జా చేసిన @JaiTDP నేతలు ఇప్పుడు ఏకంగా సివిల్ వర్క్స్, నిర్మాణ పనులు చేసే కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. పనులు తమకు అప్పగించి వెళ్లిపోవాలని హుకుం జారీచేస్తున్నారు. రాక్షస పాలనకు ఇది కదా నిదర్శనం.#IdhiMunchePrabhutvam#100DaysOfCBNSadistRule… pic.twitter.com/BSpiuSDcsL— YSR Congress Party (@YSRCParty) October 30, 2024 ఊరూరా తయారైన ఇసుకాసురులు.. ఇసుక కావాలంటే @JaiTDP నేతలకి కప్పం కట్టాల్సిందే! అని చెప్పుకొచ్చింది. ఊరూరా తయారైన ఇసుకాసురులు.. ఇసుక కావాలంటే @JaiTDP కి కప్పం కట్టాల్సిందే!#IdhiMunchePrabhutvam#100DaysOfCBNSadistRule#MosagaduBabu#SadistChandraBabu pic.twitter.com/5n2GAFyeP1— YSR Congress Party (@YSRCParty) October 30, 2024 -
చంద్ర బాబు కాదు.. మందు బాబు!
-
ఆంధ్రప్రదేశ్‌లో మాఫియా సామ్రాజ్యం... కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మళ్లీ మందు.. దందా
చంద్రబాబు పాలనలో మద్యం సిండికేట్ దోపిడీ ఏ స్థాయిలో ఉందంటే... చంద్రబాబు ఓ వైపు మద్యం రేటు తగ్గించి... తద్వారా మద్యం క్వాలిటీ తగ్గించి... తద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గించి.. డిస్టలరీలకు మాత్రం వ్యాల్యూమ్స్ పెంచి లంచాల రూపంలో తన సొంత ఆదాయాన్ని పెంచుకుంటూ... మరోవైపు ప్రభుత్వ రంగంలో ఉన్న షాపులను రద్దు చేసి తన మాఫియా సామ్రాజ్యానికి ఆ షాపులను కట్టబెట్టారు. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మళ్లీ ఓ పద్ధతి ప్రకారం మద్యం మాఫియాకు సీఎం చంద్రబాబు తెర తీశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఎన్నికలప్పుడు అబద్ధాలకు రెక్కలు కట్టి నాసిరకం లిక్కర్.. ధరలు ఎక్కువ అంటూ దుష్ప్రచారానికి తెరతీసిన చంద్రబాబు ఇప్పుడు అదే మద్యాన్ని ఎమ్మార్పీకి మించి ఇష్టారాజ్యంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకునేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. చంద్రబాబు హయాంలో అయినా.. వైఎస్సార్సీపీ హయాంలో అయినా.. మళ్లీ ఇప్పుడు బాబు హయాంలో అయినా.. అవే డిస్టిలరీస్.. లిక్కర్లో అవే స్పెసిఫికేషన్స్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీస్ ఉంటే వాటిలో 14 డిస్టిలరీలకు లైసెన్సులు ఇచ్చింది చంద్రబాబు హయాంలోనేనని గుర్తుచేశారు. మిగిలిన 6 లైసెన్సులు కూడా అంతకుముందు ప్రభుత్వాలు ఇచ్చినవేనని, వైఎస్సార్సీపీ హయాంలో ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి కూడా లైసెన్సు ఇవ్వలేదని స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ఆ బ్రాండ్లన్నీ బాబు తెచ్చినవే..చంద్రబాబు హయాంలో తెచ్చిన మద్యం బ్రాండ్లను ఒకసారి పరిశీలిస్తే.. బూమ్ బూమ్ బీర్, ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ చాయిస్, పవర్ స్టార్ 9999, రష్యన్ రోమనోవా, ఏసీబీ, 999 లెజెండ్, హెవెన్స్ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్ హాంగర్, నెపోలియన్, ఆక్టన్, సెవెన్త్ హెవెన్, హైదరాబాద్ బ్రాండ్ విస్కీ, వీరా, బ్లామ్ డే, 999 పవర్ స్టార్, హైఓల్టేజీ బోల్డ్ బోర్, ఎస్ఎన్జీ బీర్లు... ఇలా రకరకాలున్నాయి. చంద్రబాబు పోతూపోతూ.. 2019 మే 14వ తేదీన కొత్త బ్రాండ్లకు అనుమతినిచ్చారు. అలా వచ్చిందే బూమ్ బూమ్ బీర్. పైగా వైఎస్సార్సీపీ హయాంలో కొత్త బ్రాండ్లు తీసుకొచ్చామంటూ దుష్ప్రచారం చేశారు.డిస్టిలరీస్‌లో మార్పు ఉండదు. లిక్కర్‌లోనూ మార్పు ఉండదు.. బ్రాండ్లు మారతాయి అంతే. రేపొద్దున సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, మహేష్‌బాబు, బాలకృష్ణ సినిమా బ్రాండ్.. అంటూ కొత్త బ్రాండ్లను కూడా తీసుకొస్తారేమో? బ్రాండ్లేవైనా సరే ఆ మద్యం ఏ డిస్టిలరీ నుంచి వస్తోంది..? అది నోటిఫైడ్ డిస్టిలరీనేనా? అనేది ముఖ్యం. చంద్రబాబు వాస్తవాలను వక్రీకరించి మా హయాంలో విక్రయించిన మద్యం తక్కువ క్వాలిటీది అంటారు. తన హయాంలో వచ్చిన మద్యం మంచిదంటారు. ఇదెక్కడి విచిత్రమో అర్థం కావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావస్తోంది. అవే మద్యం బ్రాండ్లు, అదే క్వాలిటీతో సరఫరా చేయడం వాస్తవం కాదా? మరోవైపు ఓ పద్ధతి ప్రకారం మద్యం మాఫియాకు తెరతీశారు. సొంత మాఫియా సభ్యులకు, సిండికేట్‌కు షాపులన్నీ కట్టబెట్టారు.మంచి పాలసీ అయితే కిడ్నాప్‌లు, దాడులు ఎందుకు?చంద్రబాబు హయాంలో మద్యం మాఫియాను చూస్తుంటే ఏ స్థాయిలో దోపిడీ జరుగుతోందో అర్థమవుతోంది. ఒకవైపు మద్యం రేట్లు తగ్గిస్తామని చెబుతూ క్వాలిటీతోపాటు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని తగ్గించడం.. అదే సమయంలో డిస్టిలరీస్‌కు వాల్యూమ్స్ పెంచి లంచాల రూపంలో దండుకుంటూ సొంత ఆదాయాన్ని పెంచుకోవడమే చంద్రబాబు కొత్త మద్యం పాలసీ! గతంలో మద్యం షాపులను ప్రభుత్వం నడిపినప్పుడు ప్రతి రోజూ సాయంత్రానికల్లా ఆదాయం ప్రభుత్వ ఖాతాల్లో జమయ్యేది. అదే ఈ రోజు మాఫియా ఖాతాల్లోకి వెళ్తోంది. ప్రభుత్వ రంగంలో నడుస్తున్న షాపులను రద్దు చేసి ఇప్పుడు తమ మాఫియాకు కట్టబెట్టారు. పైగా 30 శాతం ఇస్తారా? 20 శాతం ఇస్తారా అంటూ కమీషన్ల కోసం దౌర్జన్యం.. కిడ్నాప్‌లు.. సిండికేట్‌కు సంబంధించిన వారు మాత్రమే షాపులు దక్కించుకోవడం! ఇతరులు ఎవరైనా బిడ్లు దాఖలు చేసినా.. పోలీసులే స్వయంగా వారిస్తూ.. మీరు అమ్ముకోలేరు.. మీపై దొంగ కేసులు పెడతారని బెదిరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. చంద్రబాబుకు ఇంత.. ఎమ్మెల్యేలకు ఇంత.. మాఫియా ముఠాకు ఇంత.. ! అని పంచుకునే పరిస్థితి ఉంది. నిజంగా వీళ్ల లిక్కర్ పాలసీ మంచిదే అయితే ఎమ్మెల్యేలు కిడ్నాప్‌లు, దాడులు ఎందుకు చేయాలి? ఎందుకు ఈ మాదిరిగా బెదిరిస్తున్నారు?చీప్ లిక్కర్ స్కామ్! మరో రెండు రోజులు పోతే గతంలో మాదిరిగా పర్మిట్ రూమ్‌లకు అనుమతిస్తారు. ఇంకో నాలుగు రోజులు పోతే బెల్ట్‌షాపులు పుట్టుకొస్తాయి. గ్రామ స్థాయిలోకి మద్యం మాఫియా సామ్రాజ్యాన్ని తీసుకెళ్తారు. రెండు నెలలు ఆగితే ఎమ్మార్పీకి మించి అమ్ముతారు. ఆ మొత్తంలో కూడా నీకు ఇంత.. నాకు ఇంత! అని పంచుకుంటారు. మా హయాంలో రూ.120కి అమ్మిన చీప్ లిక్కర్‌ను రూ.99కే ఇస్తానన్న చంద్రబాబు ఈరోజు రూ.130కి అమ్ముతున్నారు. కొద్దిరోజులు ఆగితే చీప్ లిక్కర్ స్కామ్ బయటికొస్తుంది. రూ.120కే సరఫరా చేసే మద్యంలో క్వాలిటీ ఉంటుందా? లేక రూ.99కే సరఫరా చేసే మద్యంలో క్వాలిటీ ఉంటుందా? సారాయిలో ఇంత రంగు నీళ్లు పోసి బాటిళ్లలో నింపి అమ్ముతారేమో? ఇదో పెద్ద స్కామ్. ప్రజల జీవితాలతోనే కాదు ప్రాణాలతోనూ చెలగాటమాడతారా? మద్యం స్కామ్‌ను వ్యవస్థీకృతం చేసేందుకే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. నియంత్రించి.. నిరుత్సాహపరిచాంవైఎస్సార్సీపీ హయాంలో ఏం చేశామో ఒక్కసారి పరిశీలించండి. మద్యం తాగాలనుకునేవారిని నిరుత్సాహపరిచే విధంగా అడుగులు వేశాం. గతంలో 4,380మద్యం షాపులుంటే మేం 2,934 దుకాణాలకు కుదించాం. దాదాపు 30శాతం షాపులు తగ్గించాం. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో పరిమితంగా షాపులు నడిపేలా పాలసీ తీసుకొచ్చాం. టైమింగ్స్ పెట్టాం. రాత్రి 9 తర్వాత లిక్కర్ షాపులు నడపకూడదని రూల్ తీసుకొచ్చాం. గతంలో చంద్రబాబు హయాంలో లిక్కర్ షాపు వద్ద పర్మిట్ రూమ్లుండేవి. అక్కడ 10–20 మంది కూర్చొని తాగుతుండేవారు. దీంతో మహిళలు అటువైపు వెళ్లేందుకు భయపడేవారు. ఇక చంద్రబాబు హయాంలో 43వేల బెల్ట్ షాపులు ఉంటే మా హయాంలో వాటిని రద్దు చేశాం. షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లు లేకుండా చేశాం. పరిమిత వేళల్లో మద్యం దుకాణాలను నిర్వహించాం. ముట్టుకుంటే షాక్ కొట్టేలా రేట్లు పెంచాం. ఇలా మద్యం వినియోగాన్ని నిరుత్సాహపరుస్తూ, నియంత్రిస్తూ ముందుకెళ్లాం. వినియోగాన్ని తగ్గించి.. ప్రభుత్వానికి ఆదాయం పెంచాంఒకసారి మద్యం విక్రయాల వాల్యూమ్స్ (సంఖ్య) గమనిస్తే ఎవరి హయాంలో ఎంత వినియోగం జరిగిందో అర్థమవుతుంది. గతంలో 2014–15లో చంద్రబాబు హయాంలో 2.88 కోట్ల కేసుల ఐఎంఎల్ విక్రయాలతో మొదలైతే.. ఆయన దిగిపోయే 2019 నాటికి 3.84 కోట్ల కేసుల ఐఎంఎల్‌కు మద్యం అమ్మకాలు పెరిగాయి. అనంతరం వైఎస్సార్సీపీ హయాంలో 3.08 కోట్ల కేసులతో విక్రయాలు ప్రారంభం కాగా, పాలన చివరి ఏడాది నాటికి 3.32 కోట్ల కేసులకు మద్యం విక్రయాలను పరిమితం చేశాం. అదేవిధంగా బీరు అమ్మకాలు చూస్తే 2014–15లో 1.74 కోట్ల కేసుల నుంచి 2018–19 నాటికి 2.77 కోట్ల కేసులకు చంద్రబాబు హయాంలో పెరిగాయి. వైఎస్సార్సీపీ హయాంలో 2019 నాటికి 2.12 కోట్ల బీరు కేసులతో మొదలు కాగా, చివరి నాటికి 1.12 కోట్ల కేసులకు బీరు విక్రయాలను తగ్గించాం. అంటేచంద్రబాబు పాలన చివరి ఏడాదితో పోలిస్తే మా హయాంలో వినియోగం గణనీయంగా తగ్గింది. మరొక పక్క రేట్లను పెంచడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పెంచగలిగాం. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని రూ.17,682 కోట్ల నుంచి రూ.25 వేల కోట్లకు తీసుకెళ్లగలిగాం. మద్యాన్ని నియంత్రించడం ద్వారా పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడుతూ మంచి చేయగలిగాం. -
వైన్ షాపులు మేమే నడపాలి.. కాదు అంటే మాత్రం.. పచ్చ బ్యాచ్ ఆగడాలు
-
ఇసుక రీచ్‌లూ కొల్లగొట్టేశారు
సాక్షి, అమరావతి: మద్యం మాఫియాతో రూ.కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమైన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఇసుక దోపిడీకి రాచమార్గం నిరి్మంచుకుంది. రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లన్నీ తమ వారికే దక్కేలా చేసుకుని వాటిపై గుత్తాధిపత్యం సాధించింది. 108 మాన్యువల్ ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలకు ఏర్పాట్లుచేసుకుని ఇప్పటికే 80కి పైగా రీచ్‌లకు షార్ట్ టెండర్లు పిలిచారు. జిల్లా ఇసుక కమిటీల ద్వారా వాటిని హస్తగతం చేసుకున్నారు. వాటిలో బుధవారం సుమారు 30 వరకు రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ప్రారంభించారు.అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చెప్పిన వారికే అన్నిచోట్లా జిల్లా ఇసుక కమిటీలు రీచ్‌లు కట్టబెట్టాయి. ఒక పథకం ప్రకారం దసరా పండుగ ముందు ఎటువంటి హడావుడి లేకుండా ఈ రీచ్‌లకు షార్ట్ టెండర్లు పిలిచారు. దానికిముందే వాటి వివరాలను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇవ్వడంతో వారు ఏ రీచ్‌కి ఎవరు టెండర్లు వేయాలి, ఎంతకి వేయాలో నిర్ణయించారు. వారు సిద్ధమైన తర్వాత జిల్లా కలెక్టర్లు వెంటనే టెండర్లు పిలిచి దాఖలు చేయడానికి రెండే రెండ్రోజుల సమయం ఇచ్చారు. ఈ సమాచారం తెలియక చాలామంది టెండర్లు దాఖలు చేయలేకపోయారు. ఆఖరి నిమిషంలో తెలుసుకుని ఎవరైనా టెండర్ వేయడానికి వస్తే వారికి టెండర్ డాక్యుమెంట్ ఇవ్వడానికి నానా ఇబ్బంది పెట్టారు.రోజంతా కూర్చోబెట్టి ఎందుకు టెండర్ దాఖలు చేయాలనుకుంటున్నారు? ఎవరి కోసం వేస్తున్నారు? తవ్వకాలకు కావల్సిన సరంజామా మొత్తం ఉన్నాయా అంటూ తెగ విసిగించారు. వేచి ఉన్న వారికి చివర్లో ఏదో ఒక సాకు చెప్పి పంపించేశారు. అన్నీ తట్టుకుని నిలబడిన కొద్దిమంది టెండర్లు దాఖలు చేసినా వారిని అధికారులే బెదిరింపులకు గురిచేసినట్లు తెలిసింది. ఇక అధికార పార్టీ వాళ్లను కాదని మీరెలా టెండర్లు వేస్తారు? వేసినా ఉపయోగం ఉండదని చెప్పడంతో కొందరు వెనక్కి తగ్గినట్లు సమాచారం. టెండర్లు వేసిన వారికీ నిబంధనల ప్రకారం ఏ విషయం చెప్పకుండా పంపించేశారు. చివరికి.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన వారికే ఇసుక కాంట్రాక్టులన్నింటినీ కట్టబెట్టేశారు. వారి ద్వారా ముఖ్యనేతకు ముడుపులు అందేలా పక్కా ప్రణాళిక రూపొందించారు. ఈ నెలాఖరులోపు మిగిలిన రీచ్‌లకు టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి వాటిని సొంతం చేసుకునేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఎమ్మెల్యేలు చెప్పినట్లే చేసిన ఇసుక కమిటీలు.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన వారికే జిల్లా స్థాయి ఇసుక కమిటీలు రీచ్‌లను కట్టబెట్టాయి. అత్యధికంగా 17 రీచ్‌లు ఉన్న తూర్పుగోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేలు బయట వ్యక్తులను కనీసం టెండర్లు వేయడానికి సైతం అనుమతివ్వలేదు. వారికి టెండర్ డాక్యుమెంట్లు ఇవ్వడానికి అధికారులు భయపడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. ⇒ కడియపులంక రీచ్‌ను రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తన బినామీకి ఇప్పించినట్లు సమాచారం. ⇒ రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో మూడు రీచ్‌లు ఉండగా ఒకదాన్ని అక్కడి ఎమ్మెల్యే బత్తుల బలరామయ్య చేజిక్కించుకున్నట్లు తెలిసింది. మరో మూడు రీచ్‌లను ఆయనతోపాటు బుచ్చయ్యచౌదరి చెప్పిన వారికి కేటాయించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ⇒ నిడదవోలు నియోజకవర్గంలోని ముక్కామల, కాకరపర్రు, మల్లేశ్వరం, తీపర్రు 2, 3, మందలపర్రు, జీడిగుంట రీచ్‌లుండగా వాటిని జనసేన, టీడీపీ నేతలు కలిసి పంచుకుని అందుకనుగుణంగా టెండర్లు దాఖలు చేయించి దక్కించుకున్నారు. ⇒ మంత్రి కందుల దుర్గేష్ రెండు రీచ్‌లను తన వారికి ఇప్పించుకోగా మిగిలిన వాటిని టీడీపీ నేతలు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వాటిల్లో టీడీపీ నేతలు చెప్పినట్లే జరిగింది. దీంతో స్థానిక జనసేన నాయకులు టీడీపీ వాళ్లతో వాగ్వాదానికి దిగినా ప్రయోజనం కనిపించలేదని చెబుతున్నారు. ⇒ కొవ్వూరు నియోజకవర్గంలోని కుమారదేవం–1, 2, 3, చిడిపి, వేగేశ్వరపురం ఇసుక రీచ్‌లను స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఇతర నేతలతో కలిసి సిండికేట్‌గా ఏర్పడి తమ వారికి ఇప్పించినట్లు సమాచారం. ⇒ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఆరు రీచ్‌లకు టెండర్లు పిలవగా ఒకటి ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పిన వారికి దక్కేలా చేశారు. మిగిలినవన్నీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య తన మనుషులకు కేటాయించేలా చేసుకున్నారు. ⇒ నందిగామ నియోజకవర్గంలో తొమ్మిది రీచ్‌లకు రెండు మినహా మిగిలినవన్నీ స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచించిన వారికి కేటాయించారు. ⇒ అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని శ్రీకాకుళం 3, 5 రీచ్‌లకు టెండర్లు పిలవగా రెండింటినీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బినామీ పేర్లతో సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఒక రీచ్‌ను తన సొంత బంధువుకి, మరో రీచ్‌ను తన అనుంగు అనుచరుడికి కట్టబెట్టినట్లు సమాచారం. బయట వ్యక్తులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడంతో ఖరారైన రీచ్‌లన్నీ టీడీపీ వారి పరమయ్యాయి. పామర్రులో టీడీపీ నేతలకు ఎమ్మెల్యే వార్నింగ్..ఇక కృష్ణాజిల్లా పామర్రులో ఐదు రీచ్‌లు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా చెప్పిన వారికే ఖరారు చేశారు. టెండర్లు దాఖలు చేయడానికి వెళ్లిన టీడీపీ నేతలను ఎమ్మెల్యే ఫోన్‌చేసి తిట్టిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తోట్లవల్లూరు ఇసుక రీచ్ కోసం మొవ్వ మండల నేత కాకర్ల బెనర్జీ తదితరులు వెళ్లగా ఆ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయనకు ఫోన్‌చేసి వార్నింగ్ ఇచ్చారు. టెండర్ వెయ్యొద్దని, తనకు తెలీకుండా ఎలా టెండర్ దాఖలు చేస్తారని ఎమ్మెల్యే బెనర్జీకి వార్నింగ్ ఇస్తున్న వీడియోను కొందరు టీడీపీ నేతలే రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. తాను ఎంతోకాలం నుంచి పార్టీలో ఉన్నానని, ఎప్పుడూ ఇలాంటివి చూడలేదని బెనర్జీ చెబుతుంటే ఎమ్మెల్యే ఆయన్ను గట్టిగా హెచ్చరించారు. మొత్తం మీద ఇసుక రీచ్‌లకు తన సొంత మనుషులతో టెండర్లు వేయించిన ఎమ్మెల్యే.. సొంత పార్టీ వారితో సహా ఇతరులెవరూ టెండర్లు వేయకూడదని హకుం జారీచేశారు. చివరికి ఆయన చెప్పిన వారికే టెండర్లు ఖరారయ్యాయి. -
మద్యం మాఫియా అరాచకం.. కూటమి నేతల బరితెగింపు!
సాక్షి, సత్యసాయి జిల్లా: ఏపీలో టీడీపీ కూటమి మద్యం మాఫీయా రెచ్చిపోతోంది. లాటరీలో మద్యం షాపు దక్కించుకున్న వారిని పచ్చ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారు. తమకే షాపులు ఇవ్వాలని ధర్మవరం, చిత్తూరులో కూటమి నేతలు వార్నింగ్ ఇస్తున్నారు.తాజాగా ధర్మవరంలో టీడీపీ కూటమి మద్యం మాఫియా రెచ్చిపోయింది. లాటరీ ద్వారా ఎర్రగుంట మద్యం షాపును బాలిరెడ్డి దక్కించుకున్నాడు. దీంతో, మద్యం షాపు తమకు రాసివ్వాలని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు బాలిరెడ్డిని బెదిరింపులకు గురిచేశారు. అయినప్పటికీ కూటమి నేతల బెదిరింపులకు బాలిరెడ్డి తలొగ్గలేదు. ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన ఎల్లో బ్యాచ్.. బాలిరెడ్డి తెచ్చిన రూ.10లక్షల విలువైన మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. అలాగే, ఎర్రగుంట మద్యం షాపులో లిక్కర్ బాటిల్స్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు.ఇక, మంత్రి సత్యకుమార్ ధర్మవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ధర్మవరం నియోజకవర్గంలో బీజేపీ నేత సందిరెడ్డి శ్రీనివాస్ లాటరీలో ఐదు మద్యం షాపులు దక్కించుకోవడం గమనార్హం. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతల కనుసన్నల్లోనే మద్యం మాఫియా చెలరేగిపోతోంది.మరోవైపు.. చిత్తూరు జిల్లాలోనూ మద్యం సిండికేట్ ముఠా బెదిరింపులకు పాల్పడుతూనే ఉంది. లాటరీలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారిని పచ్చ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారు. తాజాగా పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్న కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అరాచకం సృష్టించాడు. బాలకృష్ణ అనే వ్యక్తిని బెదిరింపులకు గురిచేసి అతడి వద్ద నుంచి బలవంతంగా షాప్ లాక్కొన్నాడు.ఈ సందర్భంగా బాధితుడు బాలకృష్ణ మాట్లాడుతూ..‘బైరెడ్డి పల్లి మండలంలో షాప్ నెంబర్ 87 లాటరీ ద్వారా నాకు వచ్చింది. నేను షాప్ పెట్టకుండా విష్ణువర్ధన్ రెడ్డి బెదిరించాడు. అంతేకాకుండా తన అనుచరులతో భౌతికంగా దాడి చేయించారు. నా చేత బలవంతంగా షాప్ వెనక్కి తీసుకుని, ఆర్-2గా వచ్చిన వారికి షాప్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.పలమనేరు నియోజకవర్గం టీడీపీ మద్యం సిండికేట్ బెదిరింపులు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. కర్ణాటకకు చెందిన వ్యక్తికి షాప్ దక్కడంతో పలమనేరు నేతలు బెదిరింపులకు దిగారు. లక్కీ డిప్ ద్వారా దుకాణాలు దక్కిన వాళ్ళు మద్యం సిండికేట్ మాట వినకుంటే బలవంతంగా ఆర్-1, ఆర్-2గా ఉన్న వాళ్లు దక్కించుకునేలా ఎక్సైజ్ అధికారులతో, పోలీసులతో రాయబారం నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో వారి మాట వినని వారిపై దాడులు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆమ్రపాలి.. ఆంధ్రాకే! -
మీరే కదా బాబూ.. లిక్కర్ మాఫియా సూత్రధారి, పాత్రధారి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘లిక్కర్ మాఫియా, సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిపోయింది. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి మీరు కాదా?’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. మీ అక్రమార్జన కోసం.. మీకు, మీ వారికి అవినీతి డబ్బు సంపాదించడంకోసం మీరు అమలు చేస్తున్న లిక్కర్ పాలసీ రాష్ట్రానికి, ప్రజల భవిష్యత్తుకు ప్రమాదకరమని హెచ్చరించారు. ‘అక్కచెల్లెమ్మల ఉసురు, యువత ఉసురు, ఆరోగ్యం రూపేణా ప్రజల ఉసురు మీరు పోసుకున్నట్లే. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను ఇప్పటికే తిరోగమన బాట పట్టించారు. అవినీతే ధ్యేయంగా తెచ్చిన లిక్కర్ పాలసీతో రాష్ట్రాన్ని మరింత వెనక్కి లాగుతున్నారు. మీ చర్యలను వెంటనే సరిదిద్దుకోండి. లేకుంటే ప్రజలు తిరగబడతారు’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన లిక్కర్ పాలసీని తీవ్రంగా తూర్పారబడుతూ సోమవారం తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. అందులో వైఎస్ జగన్ ఏమన్నారంటే... 1 లిక్కర్ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా రాష్ట్రంలిక్కర్ మాఫియాకు, సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిపోయింది. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి మీరు కాదా చంద్రబాబుగారూ? అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి, వాటిని ప్రయివేటుకు, మీ వారికి అప్పగించాలన్న మీ నిర్ణయం అవినీతి కోసం వేసిన స్కెచ్ కాదా? మీ మనుషులతో సిండికేట్ ఏర్పాటు చేసి షాపులను కొట్టేయడం నిజం కాదంటారా? రానున్న ఐదేళ్లలో పెద్ద మొత్తంలో ఎమ్మార్పీ కంటే అధిక రేట్లతో అమ్మి, మీరు అనుమతిచ్చిన డిస్టలరీల ద్వారా అమ్మకాలు భారీ స్థాయిలో పెంచేసి వేల కోట్ల రూపాయల అక్రమ రాబడికి ద్వారాలు తెరిచిన మాట వాస్తవమే కదా? 2 వాటాలు వాస్తవం కాదా?చంద్రబాబూ.. మీరు తెచ్చిన లిక్కర్ పాలసీ గొప్పదే అయితే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మీ కనుసన్నల్లో ఎందుకు బెదిరింపులకు దిగారు? నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే అరాచకాలకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకింత.. నాకింత’ అని కమీషన్ల వాటాలు వేసుకున్న మాట వాస్తవం కాదా? మీరు ఇవన్నీ చేసిన తర్వాత నిర్ణయించిన ధరకే మద్యాన్ని అమ్ముతారా? ఇది ఓ ఫార్స్ కాదా? లైసెన్స్ ఫీజులతో పాటు కింద నుంచి మీ దాకా కమీషన్లు కోసం, మీ వారికి షాపులు ఇవ్వని పక్షంలో బదులుగా వాటాలు సమర్పించడం కోసం లిక్కర్ కొనుక్కున్న వారి జేబులు గుల్లచేయడానికి మీరంతా సిద్ధం అయినట్టే కదా? మీకు ఇంత.. వారికి ఇంత.. చొప్పున నచ్చిన రేట్లకు అమ్ముకోవడానికి సిండికేట్లకు ఓకే చెప్పినట్టే కదా? దీనివల్ల తమ కుటుంబాల్లో చదువుల కోసం, ఇతర బాగోగుల కోసం ఖర్చు కావాల్సిన ప్రజల ఆదాయాలను మీ జేబుల్లోకి వేసుకోవడానికి పన్నిన అవినీతి పథకం కాదంటారా?3 ఎమ్మార్పీపై రేట్లు పెంచేసి.. కొత్త పాలసీ వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రానీయకుండా, మీరు గండికొట్టారు. ప్రజలను మభ్యపెట్టడానికి చీప్ లిక్కర్ రేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించి, దీని కోసం క్వాలిటీని తగ్గిస్తూ, ఇంకోవైపు అమ్మకాలు విపరీతంగా పెంచేసి, తద్వారా డిస్టిలరీల నుంచి లంచాల ఆదాయం పెంచుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 20 డిస్టలరీల్లో 14 మీ హయాంలో వచ్చినవే. వైఎస్సార్సీపీ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఇంకోవైపు ఎమ్మార్పీ మీద నియంత్రణ తీసివేసి, మీ వారికి, మీ మాఫియాకు షాపులు అప్పగించి, అక్కడ కూడా మీకు ఇంత.. నాకు ఇంత.. అని ఎమ్మార్పీపైన రేట్లు పెంచి వసూలు చేయడం ప్రజల నడ్డి విరగ్గొట్టడం కాదా చంద్రబాబూ?4 ఫక్తు లిక్కర్ వ్యాపారిలా చంద్రబాబుప్రభుత్వ దుకాణాల ద్వారా మద్యం అమ్మితే అమ్మకాలపై నియంత్రణ ఉంటుంది. అమ్మకం వేళలు కూడా నియంత్రణలో ఉంటాయి. దీనివల్ల మద్య నియంత్రణ అనే ప్రాథమిక బాధ్యత దిశగా ప్రభుత్వాలు కాస్తయినా పనిచేసినట్టవుతుంది. చంద్రబాబూ.. ఇప్పుడు మీ విధానం ద్వారా మీ సొంత ఆదాయం కోసం ఆ లక్ష్యానికి తూట్లు పొడిచినట్టే కదా? ఒక ఫక్తు లిక్కర్ వ్యాపారిలా ఆలోచిస్తున్నారు కానీ.. రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిలా ఎందుకు ఆలోచన చేయడం లేదు? కారణం.. ఈ కొత్త పాలసీలో మీ సొంత లాభం ఉండబట్టే కదా? 5 నాడు ఏరులై పారించారు.. మళ్లీ ఇప్పుడు..2014–19 మధ్య ఇదే మాదిరిగా రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు. ప్రజల ఆరోగ్యాలను, కుటుంబాల పరిస్థితులను పణంగా పెట్టేలా లిక్కర్ పాలసీని తెచ్చి దాని మీద కాసులు ఏరుకున్నారు. అప్పట్లో మీ సిండికేట్లు బడి పక్కన, గుడి పక్కన బెల్టు షాపులు పెట్టిమరీ ప్రతి ఇంటికీ డోర్ డెలివరీ స్థాయికి పరిస్థితులను తీసుకెళ్లాయి. కాగితాల మీద కనిపించే దుకాణాలే కాకుండా, వాటికి అదనంగా పర్మిట్ రూమ్స్, దీనికి తోడుగా 43 వేల బెల్టు షాపులతో లిక్కర్ ఏరులై పారింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే అలాంటి దారుణ పరిస్థితులను కూకటి వేళ్లతో పెకలించింది. మద్యం దళారులకు, అందులోని రాజకీయ వ్యాపారులకు చెక్ పెట్టింది. దుకాణాల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించి మద్యం అమ్మకాలను నియంత్రించింది. అమ్మకాలు కేవలం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగేలా చేసింది. లాభాపేక్ష లేనందున పర్మిట్‌రూమ్స్, బెల్టు షాపులు.. ఇవన్నీ రద్దయ్యాయి. ఈ పద్ధతిని ఇప్పుడు ఎత్తి వేసి, దుకాణాల సంఖ్యను మళ్లీ పెంచి మొత్తం అన్నింటినీ మీ మనుషులకు అప్పగించారు. ఇక వీళ్లు ఏర్పాటు చేసే పర్మిట్‌రూమ్స్, బెల్టు షాపులకు లెక్కే లేదు. మళ్లీ రాష్ట్రాన్ని పూర్వపు దారుణ పరిస్థితులకు తీసుకెళ్తున్న మాట వాస్తవం కాదా చంద్రబాబూ..? 6 రోడ్డున పడ్డ 15 వేల మంది సంగతేంటి? లక్షల సంఖ్యలో ఉద్యోగాలంటూ అబద్ధాల మీద, అబద్ధాలు చెప్పి రోజూ మీ మీడియాలో ఊదరగొట్టే మీరు.. మీ స్వార్థం కారణంగా ప్రభుత్వ లిక్కర్ షాపుల్లో పనిచేస్తున్న 15 వేల మంది ఒక్కసారిగా నిరుద్యోగులై రోడ్డున పడ్డారు. మరి, వీరి బాగోగుల సంగతేంటి చంద్రబాబూ? 7 సరిదిద్దుకోండి.. లేకుంటే ప్రజలు తిరగబడతారుచంద్రబాబూ మీ అక్రమార్జన కోసం, మీకు, మీ వాళ్లకు అవినీతి డబ్బు సంపాదించడం కోసం మీరు అమలు చేస్తున్న లిక్కర్ పాలసీ రాష్ట్రానికి, ప్రజల భవిష్యత్తుకు ప్రమాదకరం. అక్కచెల్లెమ్మల ఉసురు, యువత ఉసురు, ఆరోగ్యం రూపేణా ప్రజల ఉసురు మీరు పోసుకున్నట్టే. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను ఇప్పటికే తిరోగమనం పట్టించారు. అవినీతే ధ్యేయంగా తెచ్చిన లిక్కర్ పాలసీతో రాష్ట్రాన్ని మరింత వెనక్కి లాగుతున్నారు. మీ చర్యలను వెంటనే సరిదిద్దుకోండి. లేకుంటే ప్రజలు తిరగబడతారు. -
‘ముఖ్య’ నేత మాటే ఫైనల్.. మాఫియాదే రాజ్యం
సాక్షి, అమరావతి: టీడీపీ మద్యం మాఫియా దోపిడీకి కూటమి ప్రభుత్వం అధికారికంగా పచ్చజెండా ఊపింది. ఐదేళ్ల క్రితం వైఎస్సార్ సీపీ హయాంలో సీసాలో బంధించి బిరడా బిగించి పాతరేసిన సిండికేట్ భూతాన్ని వెలికితీసి మళ్లీ రాష్ట్రంపైకి వదిలిపెట్టింది. ప్రైవేట్ మద్యం దుకాణాల ముసుగులో టీడీపీ సిండికేట్ దోపిడీకి తలుపులు బార్లా తెరిచింది. ప్రభుత్వ ‘ముఖ్య’నేత పక్కా పన్నాగంతో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగి సిండికేట్ దందాను యథేచ్ఛగా సాగించారు. లాటరీ ప్రక్రియ ద్వారా లైసెన్సుల కేటాయింపు విధానాన్ని ప్రహసనంగా మార్చేసి ఇతరులెవరూ దరఖాస్తు చేయకుండా బెదిరింపులతో బెంబేలెత్తించారు. లాటరీ ముసుగులో 80 శాతం దుకాణాలను ఏకపక్షంగా దక్కించుకున్న టీడీపీ సిండికేట్.. మిగిలిన 20 శాతం దుకాణాల లైసెన్సులు పొందిన వారిని తీవ్ర బెదిరింపులకు గురి చేసి వాటిని సైతం హస్తగతం చేసుకునేందుకు దౌర్జన్యాలకు తెగబడుతోంది.80 శాతం ఏకపక్షం.. 20 శాతం కబ్జా– ఇదీ టీడీపీ సిండికేట్ దందా...ఊహించిందే జరిగింది..! రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేటే దక్కించుకుంది. 80 శాతం దుకాణాలకు ఇతరుల నుంచి పోటీ లేకుండా అడ్డుకుని ‘లాటరీ’ ముసుగులో ఏకపక్షంగా హస్తగతం చేసుకోగా.. మిగిలిన 20 శాతం దుకాణాల లైసెన్సులు పొందినవారిని బెదిరించి మరీ కబ్జా చేశారు. టీడీపీ మద్యం సిండికేట్ దందాకు అధికార యంత్రాంగం జీ హుజూర్ అనడంతో రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన లాటరీ ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. టీడీపీ ప్రజాప్రతినిధుల సిండికేట్ మొత్తం లాటరీ ప్రక్రియను తమకు అనుకూలంగా హైజాక్ చేసింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు నామినేట్ చేసిన వారి కనుసన్నల్లోనే అధికారులు లాటరీ ప్రక్రియను నిర్వహించి తతంగాన్ని ముగించారు. కూటమి ఎమ్మెల్యేల వర్గీయులు ముందుగానే లాటరీ నిర్వహించే ప్రాంగణాల్లో భారీ సంఖ్యలోతిష్ట వేసి అంతా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారులు ఎమ్మెల్యే వర్గీయులు చెప్పింది చేసే కీలుబొమ్మలుగా మిగిలిపోయారు. దాంతో ‘లాటరీ విధానం’లో 80 శాతం మద్యం దుకాణాలు టీడీపీ సిండికేట్‌కు దక్కాయి. కొన్ని చోట్ల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన ఇతరులు చివరి నిమిషం వరకు అజ్ఞాతంలో ఉండి లాటరీ సమయానికి వచ్చారు. అలాంటి వారికి 20 శాతం మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. దాంతో ఉలిక్కిపడ్డ టీడీపీ సిండికేట్ వారి గురించి ఆరా తీసి లాటరీ ప్రాంగణంలోనే బహిరంగంగా బెదిరించింది. మద్యం దుకాణాలను వదిలేసి వెళ్లిపోవాలని హెచ్చరించింది. కాదు కూడదు.. నిర్వహిస్తామంటే తమకు 50 శాతం వాటాగానీ ఆదాయంలో 30 శాతం కమీషన్‌గానీ ఇవ్వాలని స్పష్టం చేసింది. అందుకు సమ్మతించకుంటే మద్యం దుకాణం కూడా తెరవలేరని.. తరువాత పరిణామాలతో తమకు సంబంధం లేదని హెచ్చరికలు జారీ చేసింది. ఇలా మొత్తం 3,396 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్ గుప్పిట పట్టింది.డీల్ సెట్.. సిండికేట్‌కు పచ్చజెండాప్రభుత్వ ‘ముఖ్య’నేతతో డీల్ కుదరడంతోనే టీడీపీ మద్యం సిండికేట్‌కు ఏకపక్షంగా లైసెన్సులు దక్కాయి. అందుకే యావత్ అధికార యంత్రాంగం సిండికేట్‌కు సహకరించింది. రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే రూ.10 అధికంగా... వాటికి అనుబంధంగా నెలకొల్పనున్న బెల్ట్ దుకాణాల్లో ఎంఆర్పీ కంటే రూ.25 చొప్పున అధికంగా విక్రయించేందుకు ‘ముఖ్య’నేత అనుమతించారు. అందుకుగాను ఒక్కో బాటిల్‌పై ఆయనకు రూ.3 చొప్పున కమీషన్ చెల్లించేందుకు సిండికేట్ సమ్మతించింది. మరోవైపు డిస్టిలరీలు కూడా ‘ముఖ్య’నేతకు 20 శాతం కమీషన్ ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలో మద్యం తయారు చేసే డిస్టిలరీలన్నీ టీడీపీ నేతలవే కావడం గమనార్హం. మొత్తం 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు గతంలో 1995–2004, 2014–2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలోనే అనుమతులు ఇచ్చారు. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు అనుమతులు జారీ చేశాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో టీడీపీ నేతలకు చెందిన డిస్టిలరీలకు భారీ లాభాలు తెచ్చిపెట్టేందుకు, రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమైంది. అందుకోసం త్వరలో పర్మిట్ రూమ్‌లకు అనుమతించడంతోపాటు అనధికారికంగా దాదాపు 50 వేల బెల్ట్ దుకాణాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. తద్వారా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగి డిస్టిలరీ యాజమాన్యాలకు లాభాల పంట పండనుంది. అందుకు ప్రతిఫలంగా డిస్టిలరీలు తమ ఆదాయంలో 20 శాతం ‘ముఖ్య’నేతకు కమీషన్ రూపంలో కప్పం చెల్లించేందుకు సమ్మతించాయి. అందుకే ప్రభుత్వ యంత్రాంగం అడ్డగోలుగా వ్యవహరించి టీడీపీ మద్యం సిండికేట్‌కు ఏకపక్షంగా మద్యం దుకాణాల లైసెన్సులు దక్కేలా చేసింది.345 దుకాణాలు మహిళలకే...రాష్ట్రంలో 345 దుకాణాల లైసెన్సులు మహిళల పేరిట దక్కించుకున్నారు. మొత్తం మద్యం దుకాణాల్లో 10.2 శాతం మహిళలకు దక్కాయి. అత్యధికంగా విశాఖ జిల్లాలో 31 మంది మహిళలకు లైసెన్సులు కేటాయించగా అనకాపల్లి జిల్లాలో 25 మందికి, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో 24 మంది చొప్పున మహిళలకు లైసెన్సులు లభించాయి.రెండేళ్లలో రూ.6,384 కోట్ల ఆదాయం రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల ప్రక్రియను ఎక్సైజ్ శాఖ సోమవారం ముగించింది. ఈ నెల 16వతేదీ నుంచి కొత్త మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. మద్యం కొత్త విధానం ద్వారా ప్రభుత్వానికి 2024–26లో ఏకంగా రూ.6,384 కోట్ల ఆదాయం లభించనుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా 2017–19లో వచ్చిన ఆదాయం కంటే ఇది 349 శాతం అధికం కావడం గమనార్హం. 2017–19లో రూ.1,422 కోట్లు ఆదాయం రాగా 2024–26లో రూ.6,384 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఎకైŠస్జ్ శాఖ తాజాగా ప్రకటించింది. అందులో రూ.1,798 కోట్లు కేవలం దరఖాస్తు ఫీజుల రూపంలోనే వచ్చింది.ఇతర రాష్ట్రాలవారికీ లైసెన్సులు..శ్రీకాకుళం జిల్లాలో ఐదు మద్యం దుకాణాల లైసెన్సులను ఒడిశాకు చెందినవారు దక్కించుకున్నారు. మరోవైపు ఢిల్లీకి చెందిన నందినీ గోయల్, సారికా గోయల్, సౌరబ్ గోయల్ విశాఖపట్నం జిల్లాలో 155 షాపులకు దరఖాస్తులు చేయగా వారికి ఆరు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారికి మచిలీపట్నంలో రెండు దుకాణాల లైసెన్సులు లభించాయి. యూపీకి చెందిన ఇద్దరు మహిళలు నందిని, మంజు రాణికి రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో రెండు షాపులు లాటరీలో దక్కాయి. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన బొగ్గవరపు సరస్వతికి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో ఒక షాపు లాటరీలో తగిలింది.అంతా సిండికేట్ ఇష్టారాజ్యం..రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులన్నీ టీడీపీ ఎమ్మెల్యేలు, సిండికేట్ సభ్యులే ఏకపక్షంగా హస్తగతం చేసుకున్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు ఇవీ..అచ్చెన్నదే హవా..మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు శ్రీకాకుళం జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లలో చక్రం తిప్పారు. జిల్లాలో దాదాపు అన్ని లైసెన్సులు అచ్చెన్న వర్గం చెప్పినవారికే దక్కడం గమనార్హం. మంత్రి అచ్చెన్నాయుడు సమీప బంధువు కింజరాపు పుష్పలతకు పోలాకిలోని 81 నెంబర్ దుకాణం, కోటబొమ్మాళిలోని 113 నెంబర్ దుకాణం, జలుమూరులోని 121 నెంబర్ దుకాణం దక్కాయి. మరికొన్ని దుకాణాలను అచ్చెన్నాయుడు సోదరుడు హరివరప్రసాద్ అనుచరులు సదాశివుని రాంబాబు(120), సాహుకారి ఝాన్సీరాణి(122), మెండ మోహనరావు(123), అంధవరపు బాలరాజు(98), రత్నాల గణేష్ చౌదరి(99), కె.కె.రామయ్య(101,102), మండల రమణబాబు(104), డొంకాన మోహన్‌రావు(103), బొడ్డేపల్లి నాగవల్లి(116), పల్లి శ్రీనివాసరావు(115), బొంగు అప్పారావు(118), బొంగు దేవి(119), కూశెట్టి మోహనరావు(105), పైడిశెట్టి సంతోష్‌కుమార్(109), బెండి అరుణ్‌కుమార్(110), పులి గణపతి(111), టి.వీరాంజనేయులు(112), కొట్టి మల్లేష్(114)లకు మద్యం దుకాణాలు కేటాయించారు. ⇒ నరసన్నపేట టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోడలు భైరి మోహినికి 74 నెంబర్ దుకాణం, మరదలి కుమారుడు ధర్మాన రామప్రసాద్కు 71,72 నెంబర్ల దుకాణాలు దక్కగా... వియ్యంకుడు గుండ ఏలేశ్వరరావుకు 77, 78 నెంబర్ల దుకాణాలు లభించాయి.⇒ జనసేన నేత డాక్టర్ దానేటి శ్రీధర్ భార్య రాధారాణికి బూర్జ మండలంలోని 40వ నెంబర్ దుకాణం దక్కింది.విశాఖలో పచ్చదండు పాగా..విశాఖపట్నం జిల్లాలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, పల్లా శ్రీనివాసరావు, వంశీకృష్ణ యాదవ్ మద్యం సిండికేట్‌కు నేతృత్వం వహించారు. వారి ఆధ్వర్యంలోని జనప్రియ, పుష్కరిణి సిండికేట్లకే దాదాపు అన్ని మద్యం దుకాణాల లైసెన్సులు దక్కడం గమనార్హం.⇒ అనకాపల్లి జిల్లాలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, ఆయన వియ్యంకుడు, జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సోదరుడు, యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ నేతృత్వంలోని సిండికేట్ ఏకపక్షంగా మద్యం దుకాణాల లైసెన్సులను దక్కించుకుంది. నర్సీపట్నం, అనకాపల్లి, యలమంచిలి, పాయకారావుపేట, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో మద్యం దుకాణాలను ఈ సిండికేట్ హస్తగతం చేసుకుంది. ⇒ అల్లూరి సీతారామరాజు జిల్లాలో టీడీపీకి చెందిన గిరిజనేతర నేతలు గిరిజనుల హక్కులను కాలరాశారు. జిల్లాలో 40 మద్యం దుకాణాలను గిరిజనులకే కేటాయించగా... గిరిజనులను బినామీలుగా చేసి టీడీపీ గిరిజనేతర నేతలు మద్యం దుకాణాలను దక్కించుకున్నారు. నర్సీపట్నం కేంద్రంగా టీడీపీ వర్గీయులే ఆ 40 మద్యం దుకాణాలను హస్తగతం చేసుకోవడం గమనార్హం. ⇒ విజయనగరం జిల్లాలో నోటిఫై చేసిన 153 మద్యం దుకాణాలకు 5,237 దరఖాస్తులు దాఖలయ్యాయి. టీడీపీ నాయకులు, వారి బినామీలే షాపులను దక్కించుకున్నారు.అధికార పార్టీ అరాచకాలు⇒ వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు బరితెగించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఓ ప్రైవేట్ చానల్ అధిపతికి లాటరీ ద్వారా కమలాపురం నియోజకవర్గంలో నాలుగు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి వర్గీయులు మండిపడ్డారు. ఆ చానల్ ప్రతినిధులను పిలిపించి బెదిరించారు. తమకు 50 శాతం వాటా ఇస్తేనే దుకాణాలు నిర్వహించుకోగలరని హెచ్చరించారు. ఇక జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి స్వయంగా పలువురికి ఫోన్లు చేసి బెదిరించినట్లు సమాచారం. కడపలో లాటరీ ద్వారా దుకాణాలు దక్కించుకున్న వారంతా తన వద్దకు రావాలని.. తనకు 50 శాతం వాటాగానీ 30 శాతం కమీషన్‌గానీ ఇవ్వాలని తేల్చిచెప్పారు. లేదంటే ఒక్కరు కూడా మద్యం దుకాణాన్ని నిర్వహించలేరని బెదిరించినట్లు తెలుస్తోంది.⇒ అన్నమయ్య జిల్లాలో మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి సోదరుడు రాహుల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్‌రెడ్డి బంధువు కిరణ్, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సానపురెడ్డి సుజతోపాటు టీడీపీ సిండికేట్ సభ్యులే ఏకపక్షంగా లైసెన్సులు దక్కించుకున్నారు. సంబేపల్లి, కోడూరు, తంబళ్లపలత్లి, పీలేరు తదితర ప్రాంతాల్లో లాటరీ ద్వారా లైసెన్సులు పొందినవారిని పిలిపించి బెదిరిస్తున్నారు. ⇒ అనంతపురం జిల్లాల్లో టీడీపీ సిండికేట్ బెదిరింపులు యథేచ్ఛగా సాగాయి. ఆత్మకూరులో షాపు నెంబర్ 35 లైసెన్స్ స్వాతి అనే యువతికి లాటరీలో దక్కడంతో పరిటాల సునీత వర్గీయులు ఆమెను తీవ్రంగా బెదిరించారు. ఆమె డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నించినా అధికారులు స్వీకరించేందుకు నిరాకరించడం గమనార్హం. దాంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం పరిటాల వర్గీయులకు ఆ లైసెన్సును కేటాయించారు. ⇒ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ఐదు మద్యం షాపులు బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులుకు దక్కాయి. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు ఆయన సన్నిహితుడు. ⇒ కర్నూలు జిల్లాలో 99 దుకాణాలకు 3,046 దరఖాస్తులు అందాయి. కోడుమూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల్లో కొత్తగా దుకాణాలు దక్కించుకున్న వారిని అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ⇒ తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 125 షాపులకు లాటరీ నిర్వహించగా సింహభాగం టీడీపీ, జనసేన సిండికేట్ దక్కించుకుంది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 17 షాపులు సిండికేట్‌కు దక్కాయి. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో 175 మద్యం షాపులకు 5,627 దరఖాస్తులు రాగా లాటరీలో మొదట షాపు దక్కిన దరఖాస్తుదారుడు డ్రాప్ అవడంతో మరో రెండు రిజర్వు టోకెన్లు తీశారు.⇒ ఏలూరు జిల్లాలో 144 షాపులకు 5,499 దరఖాస్తులు అందాయి. ఆగిరిపల్లిలో మూడు షాపులను మంత్రి అనుచరుల సిండికేట్ దక్కించుకుంది. పోలవరం నియోజకవర్గం కుక్కునూరులో ఎస్టీ రిజర్వుడ్ కేటగిరీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌కు షాపు దక్కింది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 8 మంది మహిళలకు వైన్‌షాపులు దక్కాయి. ⇒ కాకినాడ జిల్లాలో 155 మద్యం షాపులకు 3,332 దరఖాస్తులు వచ్చాయి. ప్రత్తిపాడు స్టేషన్ పరిధిలోని ఒక దుకాణానికి 37 మంది పోటీ పడ్డారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసిన వారిలో 20 మంది షాపులు దక్కించుకున్నారు. ⇒ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 182 మద్యం దుకాణాలకు 3,890 దరఖాస్తులు అందాయి. 24 దుకాణాలను మహిళలు దక్కించుకున్నారు. ⇒ గుంటూరు జిల్లాలో 127 మద్యం షాపులకు 4,448 టెండర్లు దాఖలయ్యాయి. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రధాన అనుచరుడు ప్రత్తిపాడు నియోజకవర్గంలో షాపు దక్కించుకున్నారు. ⇒ బాపట్ల జిల్లాలో మద్యం దుకాణాలను మంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలోని సిండికేట్ ఏకపక్షంగా దక్కించుకుంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పీఏకి రెండు దుకాణాలు దక్కాయి. కొండపిలో మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పీఏకి ఒక దుకాణం లభించింది. మార్కాపురంలో టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అనుచరులు రెండు దుకాణాలు, జనసేన నేత ఒక దుకాణాన్ని దక్కించుకున్నారు. దర్శి టీడీపీ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి 50 శాతం కప్పం చెల్లించాలని హుకుం జారీ చేసినట్లు చెబుతున్నారు.మాచర్లలో తెలంగాణ వ్యాపారి తిప్పలుతెలంగాణకు చెందిన ఓ వ్యాపారికి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో రెండు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి వర్గీయులు ఆయన్ని బెదిరించడంతో తెలంగాణలోని ప్రజాప్రతినిధి ద్వారా సిఫార్సు చేయించుకోవాల్సి వచ్చింది. అయినా సరే 50 శాతం వాటా ఇస్తేనే సమ్మతిస్తామని జూలకంటి వర్గీయులు చెప్పడంతో ఆ వ్యాపారి సమ్మతించక తప్పలేదు. ఆ రెండు మినహా మాచర్ల నియోజకవర్గంలోని అన్ని మద్యం దుకాణాలను ఎమ్మెల్యే జూలకంటి వర్గమే ఏకపక్షంగా దక్కించుకుంది.హిందూపురంలో కిడ్నాప్.. ధర్నాసాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షిలో మద్యం షాపు (నం.57) లాటరీలో దక్కించుకున్న రంగనాథ్‌ను కిడ్నాప్ చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు సోమవారం పుట్టపర్తిలోని సాయి ఆరామం వద్ద ఆందోళన నిర్వహించారు. దీనిపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు సైతం చేశారు. రూ.15 లక్షలు ఇస్తామని.. షాపు వదిలిపెట్టాలని రంగనాథ్‌ను బెదిరింపులకు గురి చేసినట్లు సమాచారం. అయితే ఆడియో రికార్డింగ్ లీక్ కావడంతో వెనక్కి తగ్గిన కిడ్నాపర్లు రంగనాథ్‌ను వదిలేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని అనంతరం రంగనాథ్ పోలీసులతో పేర్కొన్నాడు. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల కనుసన్నల్లోనే మద్యం దరఖాస్తుల ప్రక్రియ సాగినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
అవినీతి కోసం వేసిన స్కెచ్ కాదా బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: లిక్కర్ మాఫియాకు, సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిపోయిందంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి మీరు కాదా చంద్రబాబూ? అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి, వాటిని ప్రైవేటుకు, మీవారికి అప్పగించాలన్న మీ నిర్ణయం అవినీతి కోసం వేసిన స్కెచ్ కాదా?’’ అంటూ నిలదీశారు.అక్రమ రాబడికి ద్వారాలు తెరిచారు...‘‘మీ మనుషులతో సిండికేట్ ఏర్పాటు చేసి షాపులను కొట్టేయడం నిజం కాదంటారా? రానున్న ఐదేళ్లలో పెద్దమొత్తంలో ఎమ్మార్పీ కంటే అధిక రేట్లతో అమ్మి, మీరు అనుమతిచ్చిన డిస్టలరీలద్వారా అమ్మకాలు భారీ స్థాయిలో పెంచేసి వేలకోట్ల రూపాయల అక్రమ రాబడికి ద్వారాలు తెరిచిన మాట వాస్తవమే కదా?’’ అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు.మీ జేబుల్లోకి వేసుకోవడానికి పన్నిన అవినీతి పథకం ఇది...‘‘చంద్రబాబు మీరు తెచ్చిన లిక్కర్ పాలసీ గొప్పదే అయితే రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మీ కనుసన్నల్లో ఎందుకు బెదిరింపులకు దిగారు? నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే అరాచకాలకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది? “నీకింత.. నాకింత’’ అని కమీషన్ల వాటాలు వేసుకున్న మాట వాస్తవం కాదా? మీరు ఇవన్నీ చేసిన తర్వాత నిర్ణయించిన ధరకే మద్యాన్ని అమ్ముతారా? ఇది ఓ ఫార్స్ కాదా? లైసెన్స్ ఫీజులతో పాటు కింద నుంచి మీ దాకా కమీషన్లు కోసం, మీవారికి షాపులు ఇవ్వని పక్షంలో బదులుగా వాటాలు సమర్పించడం కోసం లిక్కర్ కొనుక్కున్నవారి జేబులు గుల్లచేయడానికి మీరంతా సిద్ధం అయినట్టేకదా? మీకింత వారికింత చొప్పున నచ్చిన రేట్లకు అమ్ముకోవడానికి సిండికేట్లకు ఓకే చెప్పినట్టే కదా? దీనివల్ల తమ కుటుంబాల్లో చదువుల కోసం, ఇతర బాగోగులకోసం ఖర్చుకావాల్సిన ప్రజల ఆదాయాలను మీ జేబుల్లోకి వేసుకోవడానికి పన్నిన అవినీతి పథకం కాదంటారా చంద్రబాబూ’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.ఇదీ చదవండి: సర్కారు వారి కమీషన్ 30% ప్రజల నడ్డి విరగొట్టడం కాదా చంద్రబాబూ?‘‘కొత్తపాలసీ వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రానీయకుండా, మీరు గండికొట్టారు. ప్రజలను మభ్యపెట్టడానికి చీప్ లిక్కర్ రేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించి, దీనికోసం క్వాలిటీని తగ్గిస్తూ, ఇంకోవైపు అమ్మకాలు విపరీతంగా పెంచేసి, తద్వారా డిస్టలరీల నుంచి లంచాల ఆదాయం పెంచుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 20 డిస్టలరీల్లో 14 మీ హయాంలో వచ్చినవే. వైయస్సార్సీపీ హయాంలో ఒక్క డిస్టరీలకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఇంకోవైపు ఎమ్మార్పీమీద నియంత్రణ తీసివేసి, మీ వారికి, మీ మాఫియాకు షాపులు అప్పగించి, అక్కడకూడా మీకు ఇంత… నాకు ఇంత అని ఎమ్మార్పీపైన రేట్లు పెంచి వసూలు చేయడం ప్రజల నడ్డి విరగొట్టడం కాదా చంద్రబాబు?1.లిక్కర్ మాఫియాకు, సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిపోయింది. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి మీరు కాదా చంద్రబాబుగారూ? అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి, వాటిని ప్రయివేటుకు, మీవారికి అప్పగించాలన్న మీ నిర్ణయం అవినీతికోసం వేసిన స్కెచ్ కాదా? మీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 14, 2024ఈ కొత్త పాలసీలో మీ సొంతలాభం ఉండబట్టే కదా?..ప్రభుత్వ దుకాణాల ద్వారా మద్యం అమ్మితే అమ్మకాలపై నియంత్రణ ఉంటుంది. అమ్మకం వేళలు కూడా నియంత్రణలో ఉంటాయి. దీనివల్ల మద్య నియంత్రణ అనే ప్రాథమిక బాధ్యత దిశగా ప్రభుత్వాలు కాస్తైనా పనిచేసినట్టు అవుతుంది. చంద్రబాబుగారూ… ఇప్పుడు మీ విధానం ద్వారా మీ సొంత ఆదాయంకోసం ఆ లక్ష్యానికి తూట్లుపొడిచినట్టే కదా? ఒక ఫక్తు లిక్కర్ వ్యాపారిలా ఆలోచిస్తున్నారు కాని, రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిలా ఎందుకు ఆలోచన చేయడంలేదు? కారణం ఈ కొత్త పాలసీలో మీ సొంతలాభం ఉండబట్టే కదా?మద్యాంధ్రప్రదేశ్‌గా ఏపీ....2014-19 మధ్య ఇదేమాదిరిగా రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు. ప్రజల ఆరోగ్యాలను, కుటుంబాల పరిస్థితులను పణంగా పెట్టేలా లిక్కర్ పాలసీని తెచ్చి దాని మీద కాసులు ఏరుకున్నారు. అప్పట్లో మీ సిండికేట్లు బడిపక్కన, గుడిపక్కన బెల్టుషాపులు పెట్టిమరీ ప్రతి ఇంటికీ డోర్‌డెలివరీ స్థాయికి పరిస్థితులను తీసుకెళ్లాయి. కాగితాలమీద కనిపించే దుకాణాలే కాకుండా, వాటికి అదనంగా పర్మిట్ రూమ్స్, దీనికి తోడుగా 43వేల బెల్టుషాపులతో లిక్కర్ ఏరులై పారింది.. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే అలాంటి దారుణ పరిస్థితులను కూకటి వేళ్లతో పెకలించింది.ఇదీ చదవండి: ఉచిత ఇసుక ఎక్కడైనా దొరుకుతోందా?: వైఎస్ జగన్..మద్యం దళారులకు, అందులోని రాజకీయ వ్యాపారులకు చెక్ పెట్టింది. దుకాణాల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించి మద్యం అమ్మకాలను నియంత్రించింది. అమ్మకాలు కేవలం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగేలా చేసింది. లాభాపేక్షలేనందున పర్మిట్‌రూమ్స్, బెల్టుషాపులు.. ఇవన్నీ రద్దు అయ్యాయి. ఈ పద్ధతిని ఇప్పుడు ఎత్తివేసి, దుకాణాల సంఖ్యను మళ్లీ పెంచి మొత్తం అన్నింటినీ మీ మనుషులకు అప్పగించారు. ఇక వీళ్లు ఏర్పాటు చేసే పర్మిట్‌రూమ్స్, బెల్టుషాపులకు లెక్కే లేదు. మళ్లీ రాష్ట్రాన్ని పూర్వపు దారుణ పరిస్థితులకు తీసుకెళ్తున్న మాట వాస్తవం కాదా?’’ అంటూ చంద్రబాబు తీరును వైఎస్ జగన్ ఎండగట్టారు.సరిదిద్దుకోండి. లేకుంటే ప్రజల తరఫున ఉద్యమిస్తాం..‘‘లక్షల సంఖ్యలో ఉద్యోగాలంటూ అబద్ధాలుమీద, అబద్ధాలు చెప్పి రోజూ మీ మీడియాలో ఊదరగొట్టే మీరు, మీ స్వార్థం కారణంగా ప్రభుత్వ లిక్కర్ షాపుల్లో పనిచేస్తున్న 15వేలమంది ఒక్కసారిగా నిరుద్యోగులై రోడ్డునపడ్డారు. మరి, వీరి బాగోగుల సంగతేంటి చంద్రబాబు?. మీ అక్రమార్జనకోసం, మీకు, మీవాళ్లకు అవినీతి డబ్బు సంపాదించడంకోసం మీరు అమలు చేస్తున్న లిక్కర్ పాలసీ రాష్ట్రానికి, ప్రజల భవిష్యత్తుకు ప్రమాదకరం. అక్కచెల్లెమ్మల ఉసురు, యువత ఉసురు, ఆరోగ్యం రూపేణా ప్రజల ఉసురు మీరు పోసుకున్నట్టే. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను ఇప్పటికే తిరోగమనం పట్టించారు. అవినీతి ధ్యేయంగా తెచ్చిన లిక్కర్ పాలసీతో రాష్ట్రాన్ని మరింత వెనక్కి లాగుతున్నారు. మీ చర్యలను వెంటనే సరిదిద్దుకోండి. లేకుంటే ప్రజల తరఫున ఉద్యమిస్తాం’’ అంటూ వైఎస్ జగన్ హెచ్చరించారు. -
టెండర్ వేశావో.. ఇదే నీకు లాస్ట్ డే.. నారా రాజ్యంలో దోపిడీ దొంగలు
-
మందు‘బాబు’ దందానే!
సాక్షి, అమరావతి: శాసనసభ సాక్షిగా ‘పచ్చ’ దయ్యాలు వేదాలు వల్లించాయి! మద్యం సిండికేట్‌ను గుప్పిట్లో పెట్టుకుని గతంలో ఐదేళ్లూ యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డ చంద్రబాబు బృందం నీతు లు వల్లిస్తోంది! ఎన్నికల హామీలను అమలు చేయలేక సాకులు అన్వేషిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాల నాటకంలో బుధవారం మరో అంకానికి తెర తీశారు. ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం పేరుతో అవాస్తవాలు, అభూత కల్పనలు జోడించి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు యత్నించారు. కానీ 2014–19 మధ్య టీడీపీ హయాంలో ఏకంగా రూ.12.50 లక్షల కోట్లు కొల్లగొట్టిన టీడీపీ నేతల మద్యం దోపిడీ బహిరంగ రహస్యమే. ఎన్నికల మేనిఫెస్టోకు కట్టుబడి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019–24 వరకు దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేయడంతో విక్రయాలు తగ్గాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు, కేంద్ర ప్రభుత్వ నివేదికలే వెల్లడిస్తున్నాయి.చంద్రబాబు ఆరోపణ: మేం పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలు చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం దందాకు పాల్పడింది.నిజం ఇదీ: టీడీపీ సిండికేట్ మద్యం దోపిడీకి నిదర్శనాలివిగో..– 2014–19 మధ్య టీడీపీ మద్యం సిండికేట్ చెలరేగడంతో పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ దుకాణాలతో మద్యం ఏరులై పారింది. – ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 వరకు జోరుగా విక్రయాలు. అనధికారికంగా 24 గంటలూ దందా.– 4,380 మద్యం దుకాణాలకు అనుబంధంగా అంతే సంఖ్యలో పర్మిట్ రూమ్‌లకు అనుమతి. వీటికి తోడు 43 వేలకు పైగా బెల్ట్ దుకాణాలు. – ఎమ్మార్పీ కంటే 25 శాతం అధిక ధరలకు అమ్మకాలు. – ఏటా బార్ల సంఖ్య పెంపు.– జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం 2015–16లో ఏపీలో 34.9 శాతం మంది పురుషులకు, 0.4 శాతం మంది మహిళలకు మద్యం అలవాటు ఉంది.పచ్చ సిండికేట్ దోపిడీ రూ.12.50 లక్షల కోట్లుమద్యం దందాను వ్యవస్థీకృతం చేసి రూ.12.50 లక్షల కోట్ల దోపిడీకి పాల్పడ్డ చరిత్ర చంద్రబాబు సర్కారుదే. 2014 నుంచి 2019 వరకు మద్యం సిండికేట్‌ను టీడీపీ నేతలు తమ గుప్పిట్లో ఉంచుకుని బడి, గుడి అనే విచక్షణ లేకుండా విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు అనుమతులిచ్చేశారు. పర్మిట్ రూమ్‌ల పేరుతో అనధికారిక బార్లను తెరిచేసి మరో 43 వేల బెల్ట్ దుకాణాలను నెలకొల్పి ఏరులై పారించారు. ఎంఆర్పీ కంటే రూ.10 నుంచి రూ.25 వరకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఏడాదికి రూ.2.50 లక్షల కోట్ల చొప్పున ఐదేళ్లలో ఏకంగా రూ.12.50 లక్షల కోట్లు కొల్లగొట్టారు.చంద్రబాబు ఆరోపణ : ఊరూ పేరూ లేని బ్రాండ్లు తెచ్చారు..నిజం: అవన్నీ మీరు తెచ్చిన బ్రాండ్లే చంద్రబాబూ!– ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూ డీలక్స్ బ్రాండ్ల విస్కీకి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2017 నవంబరు 22న అనుమతి ఇచ్చారు.– గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ బ్రాండ్ల పేరుతో విస్కీ, బ్రాందీ తదితర 15 బ్రాండ్లకూ టీడీపీ సర్కారే 2018 అక్టోబరు 26న ఒకేసారి అనుమతులిచ్చింది. – హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్లతో బీరు విక్రయాలు సైతం బాబు సర్కారు నిర్వాకాలే.ఆ బ్రాండ్లకు టీడీపీ ప్రభుత్వం 2017 జూన్ 7న అనుమతి జారీచేసింది.– రాయల్ ప్యాలెస్, న్యూకింగ్, సైన్ అవుట్ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకూ చంద్రబాబే 2018 నవంబరు 9న అనుమతిచ్చారు.– బిరా –91 పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లకు 2019 మే 14న చంద్రబాబు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. అప్పటికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంకా అధికారం చేపట్టలేదు. – ఆ మర్నాడే టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకూ టీడీపీ సర్కారే అనుమతినిచ్చిందన్నది నిఖార్సైన నిజం!చంద్రబాబు ఆరోపణ: డిస్టిలరీలన్నీ లాక్కున్నారు..నిజం: ఆ డిస్టిలరీలన్నీ మీరు అనుమతిచ్చినవే... మీ వాళ్లవే చంద్రబాబూ!!రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు సీఎంగా ఉండగానే అనుమతినిచ్చారు. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొత్తగా ఒక్క డిస్టిలరీకీ అనుమతి ఇవ్వలేదు.మద్యం తయారీ డిస్టిలరీలన్నీ చంద్రబాబు అనుయాయుల గుప్పిట్లోనే ఉన్నాయన్నది నిజం. ఆ డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చిందీ కూడా గతంలో టీడీపీ ప్రభుత్వమే. ఆ డిస్టిలరీలు తయారు చేసిన మద్యాన్నే గతంలో టీడీపీ హయాంలో విక్రయించారు. అనంతరం వైఎస్సార్సీపీ హయాంలోనూ అదే మద్యాన్నే విక్రయించారు. మరి అందులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా చేసిన అక్రమం ఏముందీ? టీడీపీ అధికారంలో ఉంటే మద్యం నాణ్యమైనదని.. లేదంటే నాసిరకమని దుష్ప్రచారం చేయడం చంద్రబాబు బృందానికి, పచ్చ మీడియాకే చెల్లింది.పచ్చ ముఠాదే మద్యం దందా..రాష్ట్రంలోని డిస్టిలరీలన్నీ దాదాపుగా టీడీపీ కీలక నేతల కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి. పీఎంకే డిస్టిలరీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి అల్లుడు, టీడీపీ ఎమ్మెల్యే పుట్టా మధుసూదన్ యాదవ్ కుమారుడు, ప్రస్తుతం ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ది. – శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవులనాయుడు కుటుంబానిది. – ఎస్పీవై ఆగ్రో ప్రొడక్టŠస్ టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబానిది. వైఎస్సార్సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలోకి ఫిరాయించినందుకు నజరానాగా ఆ డిస్టిలరీకి నాడు చంద్రబాబు అనుమతిచ్చారు. – గత ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019 ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్‌లో అప్పటి మంత్రి, ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు వాటాదారుగా ఉన్నారు.చంద్రబాబు ఆరోపణ: మేనిఫెస్టోలో హామీని వైఎస్సార్సీపీ ఉల్లంఘించింది..నిజం: దశలవారీ మద్య నియంత్రణను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా అమలు చేసింది. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం దందాపై ఉక్కు పాదం మోపింది. ప్రైవేట్ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసి 2019 అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలను ప్రభుత్వపరం చేశారు. టీడీపీ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా వైఎస్ జగన్ ప్రభుత్వం వాటిని 2,934కి తగ్గించింది. మద్యం దుకాణాల వేళలను కుదిస్తూ ఉ.10 నుంచి రాత్రి 9 వరకే పరిమితంగా విక్రయాలకు అనుమతించారు. 4,380 పర్మిట్ రూమ్‌లు రద్దు చేశారు. 43 వేల బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించారు. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడుతూ మద్యం వినియోగాన్ని నిరుత్సాహపరిచేందుకు షాక్ కొట్టేలా ధరలు పెంచారు. అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిచ్చాయి. టీడీపీ హయాంతో పోలిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు సగానికి పడిపోయాయి.ఏపీలో మద్యం వినియోగం తగ్గింది– కేంద్ర ప్రభుత్వ నివేదికవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వినియోగం తగ్గిందని కేంద్ర ప్రభుత్వమే వెల్లడించడం గమనార్హం. మద్యం అలవాటు 2015–16లో పురుషుల్లో 34.9 శాతం, మహిళల్లో 0.4 శాతం ఉంది. 2019–21 మధ్య పురుషుల్లో ఈ అలవాటు 31.2 శాతానికి, మహిళల్లో 0.2 శాతానికి తగ్గినట్లు పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో కేంద్ర హోంశాఖ వెల్లడించింది.చంద్రబాబు ఆరోపణ: నాణ్యత లేని మద్యంతో వినియోగదారుల ఆరోగ్యం దెబ్బతింది.నిజం: వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో మద్యం నాణ్యతపై టీడీపీ గత ఐదేళ్లూ పదేపదే సాగించిన దుష్ప్రచారం బెడిసికొట్టింది. నాడు మద్యంలో విషపు అవశేషాలు ఉన్నట్లు చెన్నైలోని ఎస్జీఎస్ లేబొరేటరీ పేరిట ఓ తప్పుడు నివేదికను టీడీపీ ప్రచారంలోకి తెచ్చింది. అయితే అలాంటి నివేదికేదీ తాము ఇవ్వలేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. తాము పరీక్షించిన మద్యం నమూనాల్లో అవశేషాలు పరిమితికి లోబడే ఉన్నాయని, అవి ప్రమాదకరం కాని సహజ సిద్ధమైన మొక్కల నుంచి తయారైనవేనని ఆ లేబొరేటరీ ప్రకటించింది. తమ నివేదికను తప్పుగా అన్వయించారని పేర్కొంది. అయినప్పటికీ రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ మద్యం నమూనాలను హైదరాబాద్‌లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ల్యాబ్‌లో పరీక్షించింది. ఆ నమూనాలన్నీ నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని నివేదిక ఇచ్చింది.– 2014–19 మధ్య టీడీపీ హయాంలో మద్యం నాణ్యత పరీక్షలు తూతూ మంత్రంగా నిర్వహించారు. ఆ ఐదేళ్లలో 96,614 శాంపిల్స్ మాత్రమే సేకరించి పరీక్షించారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం నాణ్యత పరీక్షల కోసం బెవరేజస్ కార్పొరేషన్ రూ.12.5 కోట్లతో అత్యాధునిక లేబరేటరీలను ఏర్పాటు చేసింది. సగటున ఏడాదికి 1,26,083 శాంపిల్స్‌ను పరీక్షించారు.రాష్ట్రంలో మద్యం డిస్టిలరీలకు ఎప్పుడెప్పుడు అనుమతులు ఇచ్చారంటే...1. కాంటినెంటల్ వైన్స్, ఆటోనగర్, విజయవాడ, 1971, ఆగస్టు 92. బీఆర్కే స్పిరిట్స్, కంకిపాడు, కృష్ణాజిల్లా, 1998, సెప్టెంబరు 153. పెర్ల్ డిస్టిలరీ లిమిటెడ్, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా, 1997, ఆగస్టు 144. సోరింగ్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్, చేబ్రోలు, తూ.గోదావరి జిల్లా, 2007, నవంబరు 75. సెంటిని బయో ప్రొడక్టŠస్ ప్రైవేట్ లిమిటెడ్, గండేపల్లి, కృష్ణాజిల్లా 2010, జూన్ 96. బీవీఎస్ డిస్టిలరీస్, కంకిపాడు, కృష్ణాజిల్లా, 2017, జనవరి 27. శ్రావణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్, గంపలగూడెం, కృష్ణాజిల్లా, 2017, సెప్టెంబరు 298. గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, వంగూరు, ప.గోదావరి జిల్లా, 1997, నవంబరు 179. జీఎస్బీ అండ్ కో, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 200810. బీడీహెచ్ ఆగ్రో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కొప్పరం, తూ.గోదావరి జిల్లా, 2017, ఆగస్టు 2511. విశాఖ డిస్టిలరీస్, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 2019, ఫిబ్రవరి 2512. పీఎంకే డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 2017, అక్టోబరు 2313. ఈగిల్ డిస్టిలరీస్, తాడిగొట్ల, కడప, 1974, అక్టోబరు14. ఎస్వీఆర్ డిస్టిలరీస్, తిరుపతి, 198215. శ్రీకృష్ణా ఎంటర్ప్రైజెస్, తిమ్మ సముద్రం, చిత్తూరు జిల్లా, 1998, జులై16. ఎస్ఎన్జే సుగర్స్, ప్రొడక్ట్స్, వెంకటాచలం, నెల్లూరు జిల్లా, 2018, మే17. మోహన్ బెవరేజస్ అండ్ డిస్టిలరీస్ లిమిటెడ్, పల్లూరు, చిత్తూరు జిల్లా, 197818. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, నంద్యాల, కర్నూలు జిల్లా, 2016, సెప్టెంబరు19. ఖోడేస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, కుప్పం, చిత్తూరు జిల్లా, 197020. ప్రాగ్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, నల్లమిల్లి, తూ.గోదావరి జిల్లా, 1997, మార్చి 31. -
AP: కర్ణాటక నుంచి భారీగా అక్రమ మద్యం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలే లిక్కర్ మాఫియాలా చెలరేగుతున్నారు. కర్ణాటక, గోవా నుంచి మద్యాన్ని లారీలు, కంటైనర్లలో తెప్పించి గ్రామగ్రామాన విక్రయిస్తున్నారు. గత నెల రోజుల్లో భారీ మొత్తంలో మద్యాన్ని అక్రమంగా దిగుమతి చేసుకొని, కాసుల పంట పండించుకుంటున్నారు. భారీ మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. లారీల నంబర్లు ముందే చెప్పి తనిఖీ చేయొద్దని హుకుం జారీ చేయడంతో పోలీసులు ఆ లారీలను వదిలేస్తున్నారు. దీంతో అక్రమ మద్యం నిరాఘాటంగా రాష్ట్రంలోకి వచ్చేస్తోంది. కర్నూలులోని ఆళ్లగడ్డ, పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, కోడుమూరు సహా పలు నియోజకవర్గాలకు కర్ణాటక, గోవా మద్యం సరఫరా అవుతోంది. ఆళ్లగడ్డలో ఇప్పటికే కర్ణాటక నుంచి 3 లారీల మద్యం దిగుమతి అయింది. జిల్లా నుంచి ఇతర జిల్లాలకూ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ మద్యం దందాలో టీడీపీకి చెందిన కొందరు మాజీ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు భాగస్వామ్యమైనట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. గోవా బ్రూవరేజి కంపెనీ నుంచి.. కర్నూలు జిల్లాలో మద్యం వ్యాపారంలో ఆరితేరి మంత్రిగా పని చేసిన ఓ నేతకు గోవాలోని ఓ బ్రూవరేజి కంపెనీతో సంబంధాలు ఉన్నాయి. 2014 డిసెంబర్లో టీడీపీ ప్రభుత్వం ఉండగానే గోవా నుంచి కర్నూలు జిల్లాకు వెళుతున్న మద్యం కంటైనర్‌ను గుత్తి ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో ముగ్గురిని అరెస్టు కూడా చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా గోవాకు వెళ్లి అక్కడి బ్రూవరీని పరిశీలిస్తే నకిలీ మద్యం తయారు చేస్తున్నారని స్పష్టమైంది. అప్పట్లో మంత్రి ప్రమేయంతో ఈ కేసును నీరుగార్చారు. ఇప్పుడు మళ్లీ అధికారం దక్కడంతో అక్కడి బ్రూవరేజి కంపెనీ నుంచి తిరిగి మద్యం సరఫరా మొదలైంది. ఇప్పటికే కర్నూలు జిల్లాకు రెండు, తెలంగాణ మహబూబ్‌నగర్ జిల్లాకు ఒక కంటైనర్ మద్యం వచ్చినట్లు సమాచారం. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వాహనాల ద్వారా ఈ మద్యం సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక, గోవా లిక్కర్‌తో భారీ ఆదాయం మన రాష్ట్రంలోని మద్యం ఈఎన్ఏ (ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్) బేస్డ్తో తయారవుతుంది. కర్ణాటక, గోవాలో ఆర్ఎస్ (రెక్టిఫైడ్ స్పిరిట్) బేస్డ్తో తయారవుతుంది. ఈఎన్‌ఏతో పోలిస్తే ఆర్ఎస్ బేస్డ్ మద్యం ధర తక్కువ. అందువల్ల కర్ణాటక, గోవా మద్యం తక్కువకు లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఈఎన్ఏ మద్యం నాణ్యమైనది. కర్ణాటకలో 90 ఎంఎల్ టెట్రాప్యాకెట్ ధర రూ.45, క్వార్టర్ రూ.90 మాత్రమే. ఇది అక్కడి మద్యం షాపుల్లోని రేటు. నేరుగా బ్రూవరేజెస్ నుంచి తెప్పించుకుంటే మరింత తక్కువకు వస్తుంది. ధర తక్కువ కావడంతో కర్ణాటక, గోవా నుంచి అక్రమంగా మద్యం తెస్తున్నారు. ఇది అక్రమంగా వచ్చేది కావడంతో పన్నులు కూడా ఉండవు. దీంతో టీడీపీ నేతలు తక్కువకు కొని, ఎక్కువకు అమ్ముకొని డబ్బులు దండుకొంటున్నారు. గ్రామాల్లోనే విచ్చలవిడిగా మందు కర్నూలు నగరంలోని ప్రభుత్వ వైన్‌షాప్ పక్కనే మద్యం తాగుతున్న మందుబాబులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో మద్యం నివారించాలని బెల్ట్‌షాపులను రద్దు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో టీడీపీ నేతలే జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతల ద్వారా గ్రామాల్లోనే బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యం అమ్మేస్తున్నారు. మద్యం దుకాణాలు ఉన్న చోట సీటింగ్‌కు కూడా అనధికారికంగా అనుమతి ఇచ్చి, అక్కడా అక్రమ మద్యాన్నే తక్కువ ధరకు అమ్ముతున్నారు. -
మద్యం నిషేధించాలని వినతి..బీజేపీ ఎమ్మెల్యే సమాధానం విని మహిళ షాక్!
భోపాల్: మద్యానికి బానిసలైన మగవారివల్ల ఆడవాళ్ల జీవితాలు తలకిందులు అవుతున్నాయని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసింది ఓ గృహిణి. తమ గ్రామంలో మద్యపానంపై నిషేధం విధించాలని కోరింది. మొరెనా జిల్లా సంకారా గ్రామానికి చెందిన ఈ మహిళ ఫిర్యాదుకు బీజేపీ ఎమ్మెల్యే సుబేదార్ సింగ్ రాజోధా ఇచ్చిన సమాధానం విని ఆమె నివ్వెరపోయింది. స్వయంగా లిక్కర్ కాంట్రాక్టర్ అయిన తాను మద్యాన్ని నిషేధించాలని ఎలా చెప్పగలను అని ఎమ్మెల్యే బదులిచ్చారు. దీంతో ఆ మహిళకు ఏం చేయాలో పాలుపోలేదు. Women from #Morena village: Shut these #liquor shops in our village#BJP MLA: How can I shut! I, myself, am a liquor contractor.#MadhyaPradesh #MPNews pic.twitter.com/h4U3D2LvoU — Free Press Madhya Pradesh (@FreePressMP) April 4, 2023 ఇందుకు సంబంధించి ఎమ్మెల్యేతో మహిళ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కేంద్రమంత్రి నరేంద్రసింగ్ థోమర్కు ఈయన అత్యంత సన్నిహితుడని పేరుంది. దీంతో సుబేదార్ సింగ్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఫైర్ అయింది. హస్తంపార్టీ అధికార ప్రతినిధి ప్రతాప్ సింగ్ ఈ విషయంపై స్పందిస్తూ.. శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈయన సర్కార్ రాష్ట్రాన్ని మద్యంలో ముంచెత్తిందని ధ్వజమెత్తారు. లిక్కర్‌ను అక్రమంగా గ్రామాలకు సరఫరా చేసి ఊర్లలో ఏరులై పారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానే లిక్కర్ కాంట్రాక్టర్ అని బహిరంగంగా చెబుతున్న అధికార బీజేపీ ఎమ్మెల్యేను చూస్తుంటే ఈ మాఫియాను నడిపిస్తోంది ఎవరో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్నారు. చదవండి: బీజేపీలో మున్నాబాయ్ MBBSలు ఎందరో? ఆ ఇద్దరు ఎంపీలు కూడా.. : కేటీఆర్ సెటైర్ -
చేతి పంపు నుంచి బకెట్ల కొద్ది మద్యం.. ఎక్కడో తెలుసా?
భోపాల్: ఎక్కడైనా చేతి పంపు కొడితే తాగు నీరు రావడం సహజమే. కానీ చేతి పంపులో నుంచి మద్యం రావటం ఎప్పుడైనా చూశారా? అవునండీ.. అది నిజమే. మధ్యప్రదేశ్ గునా జిల్లాలోని భన్‌పుర అనే గ్రామంలో చేతి పంపు కొట్టగానే అందులోంచి మద్యం వచ్చింది. నాటుసారా తయారు చేసే ముఠా మెదడులోంచి పుట్టిన ఆలోచన ఇది. నాటుసారా తయారీపై సమాచారం మేరకు గునా జిల్లాలోని భన్‌పుర గ్రామ పరిసరాల్లో సోదాలు నిర్వహించారు పోలీసులు. ఈ క్రమంలో కనిపించిన ఈ దృశ్యం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రామ శివారులోని ఇళ్లకు కొద్ది దూరంలో నాటుసారా నింపిన డ్రమ్ములను భూమిలోపల పాతిపెట్టారు. వాటికి పైపును అమర్చడం ద్వారా నేల పైన చేతి పంపును ఏర్పాటు చేశారు. దాన్ని చేత్తో కొడుతూ క్యాన్లలో మద్యాన్ని నింపి పెద్ద ఎత్తున అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఆ గ్రామంలో ఇటీవల దాడి చేసిన పోలీసులు సారా మాఫియా అతి తెలివి చూసి నివ్వెరపోయారు. అక్కడ దాదాపు ప్రతి ఇంటిలోనూ నాటుసారా తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రమ్ముల కొద్దీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ‘ భూమిలో దాచిపెట్టిన నాటుసారా డ్రమ్ములకు చేతి పంపు ఏర్పాటు చేశారు. పోలీసులు చేతిపంపును కొట్టడంతో నాటుసారా పైకి వచ్చింది. లిక్కర్‌ను తీసుకునేందుకు వారు చేతిపంపును ఉపయోగిస్తున్నారు. దానిని ప్లాస్టిక్ క్యాన్లు, కవర్లలో నింపి డీలర్ల ద్వారా విక్రయిస్తున్నారు.’ అని గునా ఎస్పీ పంకజ్ శ్రీవాస్తవ తెలిపారు. शराब माफिया का दिमाग हैंडपम्प से निकली शराब गुना के भानपुरा का मामला #Guna #HandPump #Viral #Trending pic.twitter.com/eRm8H1t1wN — LALIT K PRAJAPATI (@prajapatilalit) October 11, 2022 ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్ -
పాఠశాలనే మద్యం గోదాం.. లిక్కర్ మాఫియా పనితో టీచర్స్ షాక్!
పాట్నా: మద్య నిషేధం అమలులో ఉన్న బిహార్ రాష్ట్రంలో లిక్కర్ మాఫియా కొత్త కొత్త ఎత్తుగడలతో రెచ్చిపోతోంది. విదేశీ మద్యం సీసాలను నిల్వ ఉంచేందుకు ఏకంగా గ్రామంలోని ఉన్నత పాఠశాలనే గోదాముగా మార్చింది. బిహార్ రాష్ట్ర వైశాలి జిల్లా లాల్గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బృందావన్ గ్రామ హైస్కూలులో ఈ సంఘటన జరిగింది. పాఠశాలలోని ఓ గదిలో ఏకంగా 140 కాటన్ల అక్రమ మద్యం లభించటం అధికారులు, స్థానికులతో పాటు నెజిటన్లను షాక్‌కు గురి చేస్తోంది. లిక్కర్ కాటన్లను కొందరు దుండగులు రాత్రి సమయంలో పాఠశాలలో దాచి పెట్టినట్లు ప్రధానోపాధ్యాయుడు పవన్ కుమార్ శుక్లా తెలిపారు. స్కూల్లోని ఓ గది తాళం పగలగొట్టి బాటిళ్లను అందులో పెట్టాక కొత్త తాళం వేశారని, బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చిన టీచర్ ఆదేశ్పాల్ ఈ తాళాన్ని గమనించి, ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. లాల్గంజ్ పోలీసులు తాళం పగలగొట్టి చూడగా గదిలో 140 పెట్టెల మద్యం నిల్వ ఉంది. మద్యాన్ని పోలీస్‌స్టేషనుకు తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల గదిలో దాచిన మద్యం పెట్టెలు ఇదీ చదవండి: ఇదెక్కడి గొడవ.. కారు ఢీకొని గాల్లోకి ఎగిరిపడ్డా తగ్గేదేలే..! -
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ: కుంభకోణంలో కేసీఆర్ కుటుంబీకుల పాత్ర: బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఆరోపించారు. ‘‘పాలసీ రూపకల్పన కోసం ఢిల్లీలోని ఒబెరాయ్, చండీగఢ్‌లోని హయత్ హోటళ్లలో జరిగిన భేటీల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు, సిసోడియా, ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్, ఆ శాఖ అధికారులు, లిక్కర్ మాఫియా∙వ్యక్తులు పాల్గొన్నారు. ఒబెరాయ్ హోటల్లో సూట్‌ను తెలంగాణ మద్యం మాఫియాకు చెందిన వ్యక్తి ఆర్నెల్ల కోసం బుక్ చేశాడు. డీల్ జరిగినన్ని రోజులు కేసీఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణ మద్యం మాఫియా ఏర్పాటు చేసిన ప్రైవేట్ విమానంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చేవారు. లిక్కర్ మాఫియా కమిషన్‌ను 10 శాతానికి పెంచేందుకు ఒప్పందం కుదిరింది. అందుకు ప్రతిగా తొలి విడతగా రూ.150 కోట్లు సిసోడియాకు లంచంగా ముట్టింది. దీన్ని తెలంగాణ లిక్కర్ మాఫియానే ఇచ్చింది. గోవా, పంజాబ్ ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఆప్‌కు లిక్కర్ మాఫియా అడ్వాన్స్ చెల్లింపులు జరిపింది. ఆ తర్వాతే పంజాబ్‌లోనూ, ఢిల్లీలోనూ కొత్త మద్యం విధానాల అమలు మొదలైంది. పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ తరహా ఎక్సైజ్ విధానాన్నే అక్కడ కేసీఆర్ కుటుంబీకులు అమలు చేయించారు’’ అని ఆరోపించారు. లిక్కర్ పాలసీపై కేసీఆర్ కుటుంబీకులతో భేటీ అయ్యారో లేదో సిసోడియా చెప్పాలని డిమాండ్ చేశారు. -
యువతిని ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి.. సాముహిక అత్యాచారం.. ఆపై
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అమానుషం చోటు చేసుకుంది. ఒక యువతిపై మద్యం, డ్రగ్స్ కుటుంబానికి వారు సాముహికంగా అత్యాచారం చేసి, ఆపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ సంఘటన తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా ఉన్న కస్తూర్బా నగర్‌కు చెందిన 20 ఏళ్ల యువతిని అదే ప్రాంతానికి ఉన్న ఒక యువకుడు ప్రేమించాడు. చాలా రోజులు ఆమె వెంటపడ్డాడు. యువతి ప్రేమను అంగీకరించకపోవడంతో విచారంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గతేడాది నవంబరులో జరిగింది. అయితే, తమ కుమారుడి మృతికి ఆ యువతి కారణమని యువకుడి కుటుంబ సభ్యులు ఆమెపై ద్వేషాన్ని పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆయువతిని నిన్న ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చారు. ఆమెను జుట్టుపట్టుకొని కొడుతూ.. నీచంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో కొంత మంది పురుషులు.. ఆ యువతిపై బహిరంగంగానే సాముహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అక్కడ ఉన్న మహిళలు కూడా.. యువతిపై పురుషులు అత్యాచారం చేసేలా ప్రేరేపించారు. ఆమెను నానా దుర్భాషలాడుతూ.... ఆమె జుట్టును కత్తిరించారు. ఆమె ముఖానికి నలుపు రంగు పూశారు. ఆమెను ఇష్టం వచ్చినట్లు కొడుతూ.. అవమానపర్చారు. చెప్పులు, బూట్లతో కొడుతూ.. దండలు చేసి యువతి మెడలో వేసి.. ఊరేగించారు. చనిపోయిన బాలుడు కుటుంబానికి చెందిన వారంతా మద్యం, డ్రగ్స్ వ్యాపారస్తులని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఢిల్లీ మహిళ కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళను పరామర్శించారు. వెంటనే బాధిత యువతిపై దాడిచేసిన వారందరిని అరెస్టు చేయాలని ట్విటర్ వేదికగా ఢిల్లీ పోలీసు అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఘటనపై 72 గంటలలో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు నోటిసులు జారీచేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని పోలీసువారిని ఆదేశించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. कस्तूरबा नगर में 20 साल की लड़की का अवैध शराब बेचने वालों द्वारा गैंगरेप किया गया, उसे गंजा कर, चप्पल की माला पहना पूरे इलाक़े में मुँह काला करके घुमाया। मैं दिल्ली पुलिस को नोटिस जारी कर रही हूँ। सब अपराधी आदमी औरतों को अरेस्ट किया जाए और लड़की और उसके परिवार को सुरक्षा दी जाए। pic.twitter.com/4ExXufDaO3 — Swati Maliwal (@SwatiJaiHind) January 27, 2022 చదవండి: రిపబ్లిక్ డే వేడుకలలో అపశ్రుతి.. తలపై పడిన డ్రోన్ -
Liquor Mafia: ఎస్‌యూవీతో తొక్కించి కానిస్టేబుల్ దారుణ హత్య
పాట్నా: బిహార్‌లోని దర్భంగాలో దారుణం చోటు చేసుకుంది. కానిస్టేబుల్ని మద్యం మాఫియా ఎస్‌యూవీతో తొక్కించి హత్య చేసింది. ఈ ఘటన గురువారం రాత్రి కియోటి పోలీస్ స్టేషన్ వెలుపల జరిగింది. ఈ ఘటనపై పోలీసులు ఆరుగురుని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కానిస్టేబుల్ షఫీ-ఉర్ రెహమాన్ కియోటి పోలీస్ స్టేషన్ వెలుపల విధులు నిర్వహిస్తున్నారు. అయితే భారత్-నేపాల్ సరిహద్దు నుంచి వచ్చే ఓ ఎస్‌యూవీని ఆపడానికి సిగ్నల్ ఇచ్చాడు. కానీ డ్రైవర్ బ్రేకులు వేయకుండా వేగంగా పోనిచ్చాడు. దీంతో ఎస్యూవీ చక్రాలలో చిక్కుకున్న కానిస్టేబుల్‌ను వాహనం 200 మీటర్లు ఈడ్చుకుంటూ వెళ్లింది. తీవ్ర గాయాలపాలైన రెహమాన్‌ను దర్భాంగా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందతూ మరణించారు. ఈ ఘటనపై దర్భాంగా సిటీ ఎస్పీ అశోక్ ప్రసాద్ మాట్లాడుతూ.. నేపాల్ నుంచి ఎస్‌యూవీలో భారిగా మద్యం సరుకును రవాణా చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మద్యం రవాణా చేస్తున్న ఎస్‌యూవీని, మరో కారును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా బీహార్ ప్రభుత్వం మద్యం అమ్మకం, వినియోగాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. ఇక ఫోరెన్సిక్ బృందం ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించింది. -
3 వైన్స్‌లు.. 30 ‘బెల్ట్’లు: లాభాల కోసం ‘చీప్’ ట్రిక్స్..
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో అనధికారిక మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క జిల్లా కేంద్రంలోని లైసెన్స్ వైన్ షాపుల నుంచే బెల్ట్ షాపులకు ప్రతినెలా కోట్ల రూపాయల విలువైన మద్యం తరలిపోతోంది. బెల్ట్ షాపుల నిర్వాహకులు అధిక ధరల కు మద్యం విక్రయిస్తూ వచ్చిన లాభాల్లో మద్యం షా పులు యజమానులకు వాటా పంచుతున్నారు. అనధికారిక విక్రయాలతో వచ్చే లాభం బాగుండడంతో వైన్ షాపుల యజమానులు కూడా బెల్ట్ షాపులను మరింత ప్రోత్సహిస్తున్నారు. దీంతో అనధికారిక దందా మూడు వైన్ షాపులు.. ముప్పై బెల్ట్ షాపులు అన్న చందంగా సాగుతోంది. ఆదిలాబాద్ పట్టణంలో తొమ్మిది లైసెన్స్ మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ షాపుల యజమానులంతా సిండికేటుగా ఏర్పడి అనధికారిక విక్రయాలను ప్రోత్సహిస్తున్నారు. ప్రతీనెల మూడు షాపుల నుంచి మద్యం పట్టణంతోపాటు, సమీపంలోని బెల్ట్ షాపులకు తరలించేలా ఒప్పందం చేసుకున్నారు. నెలకు ఒక్కో షాపు నుంచి రూ.75 లక్షల విలువైన మద్యాన్ని నేరుగా బెల్ట్ షాపులకే విక్రయిస్తున్నారు. మూడు షాపుల నుంచి రూ.2.25 కోట్ల విలువైన సరుకు అనధికారిక విక్రయ షాపులకు తరలిస్తున్నా రు. ఈ మద్యాన్ని బెల్ట్ షాపుల నిర్వాహకులు అధిక ధరకు మందుబాబులకు విక్రయించి లాభాలు గడిస్తున్నారు. ఇందులో మద్యం షాపులకు వచ్చే వాటా ను తొమ్మిది షాపుల యజమానులు పంచుకుంటున్నారు. విక్రయాలు, లాభాలు, వాటా లెక్కల కోసం వీరు ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారంటే లాభాలు ఏమేరకు ఉన్నాయో ఊహించుకోవచ్చు. జిల్లాలో వెయ్యికిపైగా బెల్ట్ షాపులు.. బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు అనధికారికం. ఎక్సైజ్ అధికారుల భాషలో చెప్పాలంటే అన్ ఆథరైజ్డ్ ఔ ట్‌లెట్. ప్రభుత్వ లైసెన్స్ పొందిన వైన్స్‌లు, బార్లు మద్యం విక్రయిస్తుండగా.. ఈ వైన్స్‌ల నుంచి వచ్చే సరుకును బెల్ట్ షాపుల్లో విక్రయిస్తున్నారు. జిల్లాలో 31 మద్యం షాపులు ఉన్నాయి. వీటి ద్వారా మద్యం కొనుగోలు చేసి అనధికారికంగా విక్రయించే బెల్ట్ షాపులు మాత్రం వెయ్యి నుంచి 1,200 వరకు ఉన్నాయి. వీటి నిర్వాహకులు 31 లైసెన్స్ మద్యం షాపుల నుంచి ఎమ్మార్పీ ధరకు మద్యం కొనుగోలు చేసి తీసుకెళ్లారు. అనధికారిక షాపుల్లో అధిక ధరతోపాటు, కల్తీ చేసి విక్రయిస్తున్నారు. మద్యం సీసాల మూతలు తెరిచి అందులోని మద్యం ఖాళీ సీసాలో కొంత తీసి, ఖాళీ అయిన మద్యం స్థానంలో నీళ్లు లేదా స్పిరిట్ కలుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కల్తీ మద్యాన్ని లూజ్‌గా విక్రయస్తున్నారు. దీంతో రెట్టింపు లాభాలు గడిస్తున్నారు. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ.. అనధికారిక మద్యం విక్రయ దందా జిల్లాలో జోరుగా సాగుతున్నా ఎక్సైజ్ శాఖ మాత్రం మామూళ్ల మత్తులో జోగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోనే సిండికేట్ దందా సాగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం విమర్శలకు బలం చేకూరుస్తోంది. అనధికారిక దందా, కొన్ని బ్రాడ్ల విక్రయాలు బహిరంగంగా జరుగుతున్నా ఎవరైనా ఫిర్యాదు చేస్తే ‘మా దృష్టికి రాలేదు.. తనిఖీలు చేస్తాం.. అక్రమ మద్యం విక్రయాలను అరికడతాం’ అని చెప్పి తప్పించుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. పత్రికల్లో, టీవీ చానెళ్లలో వార్తలు వచ్చినప్పుడు మాత్రం దాడుల పేరుతో రెండు మూడు రోజులు హడావుడి చేస్తారనే అపవాదు ఉంది. లాభాల కోసం ‘చీప్’ ట్రిక్స్.. జిల్లాలో మద్యం షాపుల యజమానులు అదనపు లాభాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొన్నిరకాల బ్రాండ్ల(ఎక్కువ కమీషన్ ఇచ్చే కంపెనీల) మద్యాన్ని మాత్రమే షాపుల్లో విక్రయిస్తున్నారు. తక్కువ కమీషన్ ఇచ్చే బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులో ఉంచడం లేదు. ఓ బ్రాండ్ చీప్ లిక్కర్ మాత్రం బెల్ట్ షాపుల్లో విరివిగా లభిస్తుండడం ఇందుకు నిదర్శనం. దానికి పోటీగా ఉన్న మరో బ్రాండ్ లిక్కర్ ఇటు వైన్ షాపులు, అటు బెల్ట్ షాపుల్లో దొరకదు. కమీషన్ రూపంలో లాభం పొందడమే కాకుండా అదే మద్యాన్ని బెల్ట్ షాపులకు సరఫరా చేస్తూ వారి నుంచి కూడా లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. కొన్ని మద్యం కంపెనీలు ఎమ్మార్పీపై ఇచ్చే కమీషన్‌తో పాటు ప్రతీ కాటన్‌పై అదనంగా కమీషన్ ఇస్తున్నాయి. మద్యం షాపుల యజమానులు అలాంటి బ్రాండ్ల మద్యాన్నే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. తమ లాభాల కోసం ఇలాంటి ట్రిక్స్ చేయడంలో జిల్లాలోని మద్యం షాపుల యజమానులు సిద్ధహస్తులు. -
నిన్ననే ప్రాణభయం అన్నాడు.. గంటల వ్యవధిలో శవమై కనిపించాడు
సాక్షి,లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రతాప్‌గడ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మాఫియాపై సంచలన కథనాలను అందించిన ఓ టీవీ జర్నలిస్ట్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది.తన ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ జర్నలిస్టు సులాబ్ శ్రీవాస్తవ (42) పోలీసు ఉన్నతాధికారికి లేఖ రాసిన 24గంటల్లోనే ఆదివారం రాత్రి అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు. అయితే పోలీసులు మాత్రం రోడ్డు ప్రమాదంలోనే శ్రీవాస్తవ చనిపోయినట్టు భావిస్తున్నారు. శ్రీవాస్తవ ఆదివారం రాత్రి 11 గంటలకు విధులను ముగించుకుఒని బైక్‌పై ఇంటికివస్తుండగా, దుండగులు అతనిపై ఎటాక్ చేశారు. తీవ్రంగా కొట్టి, ఒంటిపై బట్టలను దాదాపు తీసేసి రోడ్డుపక్కన ఒదిలేసి పోయినట్టు తెలుస్తోంది. అయితే పోలీసుల వెర్షన్ మాత్రం భిన్నంగా ఉంది. శ్రీవాస్తవ బైక్‌పై నుంచి కిందికి పడి, తలకు దెబ్బ తగిలడంతొ చనిపోయారని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. అపస్మారక స్థితిలో శ్రీవాస్తవను గుర్తించిన స్థానికులు కొంతమంది ఆసుపత్రికి తరలించారనీ, అప్పటికే ప్రాణాలు విడిచినట్టు వైద్యులు ప్రకటించారని సీనియర్ పోలీసు అధికారి సురేంద్ర ద్వివేది ప్రకటించారు. ఇతర కోణాలనుకూడా పరిశీలిస్తున్నామన్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, యూపీ యోగీ సర్కార్‌పై మండిపడ్డారు. అలీఆగర్‌నుంచి ప్రతాప్ఘర్వరకు మద్యం మాఫియా వేళ్లూనుకొందని విమర్శించారు. నిజాలను బయటపెడుతున్న జర్నలిస్టులపై దాడులు జరుగుతోంటే.. ప్రభుత్వం నిద్రపోతోందంటూ ప్రియాంక ట్వీట్ చేశారు. కాగా జిల్లాలోని మద్యం మాఫియాకు వ్యతిరేకంగా జూన్ 9న సంచలన కథనాన్ని ప్రసారం చేసినప్పటినుంచి తనకు బెదిరింపు లొస్తున్నాయని, తన ప్రాణభయం ఉందంటూ సీనియర్ పోలీసు అధికారికి లేఖ రాశారు. దీంతో తాను, తన కుటుంబం కూడా చాలా ఆందోళన చెందుతోందని, రక్షణ కల్సించాలని శ్రీవాస్తవ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈలేఖను ధృవీకరించిన సీనియర్ పోలీసు అధికారి దీనిపై విచారణ నిమిత్తం స్థానిక అధికారులకు సూచించినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రీవాస్తవ మృతి భయాందోళన రేపింది. शराब माफिया अलीगढ़ से प्रतापगढ़ तक:पूरे प्रदेश में मौत का तांडव करें। उप्र सरकार चुप। पत्रकार सच्चाई उजागर करे, प्रशासन को खतरे के प्रति आगाह करे। सरकार सोई है। क्या जंगलराज को पालने-पोषने वाली उप्र सरकार के पास पत्रकार सुलभ श्रीवास्तव जी के परिजनों के आंसुओं का कोई जवाब है? — Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 14, 2021 -
రెచ్చిపోయిన మద్యం మాఫియా: ఎస్ఐపై దాడి
సాక్షి, అనంతపురం : హిందూపురంలో మద్యం మాఫియా రెచ్చిపోయింది. మద్యం అక్రమ విక్రయాలను అడ్డుకున్న ఎక్సైజ్ ఎస్సై సరోజతో సహా ముగ్గురు కానిస్టేబుళ్లపై మద్యం వ్యాపారులు దాడి చేశారు. కర్నాటక మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్సై సరోజ ముగ్గురు కానిస్టేబుళ్లతో బోయపేటకు వెళ్లారు. పోలీసులను చూసిన మద్యం మాఫియా వారిపై ఒక్కసారిగా దాడికి దిగారు. ఎస్సై సరోజ ఫోన్‌ను లాక్కుని దాడికి దిగారు. ఈ దాడిలో ఎస్సైతో సహా ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో బోయపేటకు చెందిన రామాంజి, లక్ష్మినారాయణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సిండి‘కేట్లు’
ఇక్కడా వారు రంగప్రవేశం చేశారు. ఎప్పటి మాదిరిగానే రింగయ్యారు. మద్యం దుకాణాల అద్దెలపేరుతో చక్రం తిప్పారు. కొందరు అధికారులను ప్రసన్నం చేసుకున్నారు. ఇష్టానుసారం అద్దెలు పెంచేసి ఆమోదింపజేసుకున్నారు. ఓ వైపు సర్కారు ఒక లక్ష్యంతో ఆదాయమార్గమైన మద్యాన్ని దశలవారీగా నిషేధించాలని చూస్తుంటే... ప్రభుత్వ ఖజానాకు మరింతగా కన్నం పెట్టాలని చూస్తున్నారు. జిల్లాలో సాగిన ఈ సిండికేట్ వ్యవహారం ఇప్పుడు ఉన్నతాధికారుల వరకూ వెళ్లడంతో బాధ్యులైన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: మహిళల బతుకులను బాగుచేయాలని, మద్యం రక్కసి నుంచి కుటుంబాలను చక్కదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గమైనప్పటికీ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. ఇందులో తొలివిడతలో ప్రభుత్వమే మద్యం విక్రయాలు చేపడుతోంది. దీని కోసం జిల్లాలో అవసరమైన 168 దుకాణాలను అద్దెకు తీసుకునేందుకు ఇటీవల టెండర్లు కూడా పిలిచారు. అయితే ఇక్కడే మద్యం సిండికేట్లు చక్రం తిప్పారు. ఎక్సైజ్ అధికారులతో కలిసి షాపుల అద్దెలు పెంచేశారు. ఈ వ్యవహారం కాస్తా ఉన్నతాధికారుల చెంతకు చేరింది. దీంతో విషయం బయటపడుతుందనే భయంతో ఆ శాఖలోని కొందరు అధికారులు సెలవుపై వెళ్లిపోయారు. అక్టోబర్ 1 నుంచి జిల్లాలో నూతన ఎక్సైజ్ విధానం అమలు చేసేందుకు టెండర్ల ఖరారు ప్రక్రియకు జిల్లా జాయింట్ కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి గత నెల 23న నిర్వహించారు. జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం డివిజన్న్లలోని 13 ఎక్సైజ్స్టేషన్లలో ప్రస్తుతం ఉన్న 210 దుకాణాలను 80 శాతానికి కుదిస్తూ జిల్లాలో 168 ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రాంగణాలను అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు 312 టెండర్లు, ఫర్నిచర్ లేని మద్యం దుకాణాల్లో ఫర్నిచర్ సరఫరాకు 33 టెండర్లు, మద్యం దుకాణాలకు సరుకు రవాణా చేసేందుకు 43 టెండర్లు వచ్చాయి. సిండికేట్ల టెండరింగ్.. ఈ టెండర్లలో కాంట్రాక్టర్లు రింగ్ అయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 210 షాపులకు తొలివిడత 20 శాతం షాపులను తగ్గిస్తూ 168 షాపులకు టెండర్లు పిలిచారు. ఇందులో సింగిల్ టెండర్లకు ప్రాధాన్యమిచ్చారు. జిల్లాలోని సింగిల్ షాపుల యజమానులు కూడా టెండర్లు దాఖలు చేశారు. ఈ షాపుల్లో తక్కువ అద్దెకు, తక్కువగా విక్రయించే ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. అయితే చాలా చోట్ల ఎక్కువ అద్దెకు ప్రతిపాదించిన టెండర్లను ఖరారు చేశారు. చక్రం తిప్పిన మద్యం మాఫియా.. జిల్లాలోని పార్వతీపురం డివిజన్లో టీడీపీకి చెందిన మద్యం మాఫియా చక్రం తిప్పింది. ఇక్కడ షాపులను టెండర్లు వేసిన సమయంలో ఇతరులను రానీయకుండా ఓ మద్యం వ్యాపా రి తన అనుచరులు, కుటుంబ సభ్యుల పేరునే అధికంగా అద్దెల ధరలు పెంచుకుంటూ టెండ ర్లు దాఖలు చేశారు. ఈ సమయంలో స్థానిక అధికారులతో తనకున్న పాత పరిచయాలను ఉపయోగించుకున్నారు. ఇలా ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులకు దాదాపు 20కి పైగా షాపులు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. తక్కువ అద్దెకిస్తామన్నా... ప్రభుత్వం కోరిన నూతన మద్యం పాలసీ ప్రకారం అద్దెల ప్రాతిపదికన షాపులు, ఫర్నిచర్, కంప్యూటర్, ఫ్రిజ్, సీసీ కెమెరాల వంటి అన్ని పూర్తి స్థాయి ఏర్పాట్లున్న బాడంగి మండలం డొంకినవలస(ఆర్ఎస్)లోని ఓ మద్యం వ్యాపా రి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.12,000కు టెండరు దాఖలు చేశారు. అయితే ఇదే మండలంలోని మల్లంపేటలోని (టీడీపీ ప్రభుత్వ హ యాంలో తరలించేసిన) మద్యం దుకాణానికి అధికంగా నెలకు రూ.32,000కు పైగా టీడీపీ నాయకుడు వేసిన టెండర్‌ను ఎక్సైజ్ అధికారులు ఖరారు చేసినట్టు ఆ వ్యాపారి ఆరోపిస్తున్నా రు. మల్లంపేటలోని మద్యం దుకాణం (గెజిట్ నెంబర్169) జీకేఆర్ పురానికి చెందినది. దీనిని టీడీపీ మాజీ మంత్రి ఆర్వి సుజయ కృష్ణ రంగా రావు పైరవీలతో, ఇతర టీడీపీ నాయకుల ప్రో ద్బ లంతో మల్లంపేటకు గతంలో తరలించారు. గతంలో ఆ షాపు నుంచే అధికంగా బెల్ట్ షాపులను ప్రోత్సహించేవారని చెబుతున్నారు. ఆ ప్రాంతాల్లో అధికంగా సింగిల్ టెండర్లు: జిల్లాలోని బొబ్బిలి, తెర్లాం ఎక్సైజ్ సర్కిళ్ల ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపుల అద్దె టెండర్లకు అధికంగా సింగిల్ టెండర్లు నమోదయ్యేందుకు ఎక్సైజ్ అధికారులు కూడా సహకరించారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ముద్రపడిన ఓ మద్యం దుకాణాల నాయకుడు జిల్లా వ్యాప్తంగా 20 నుంచి 22 మద్యం దుకాణాలను సింగిల్ టెండర్ల ద్వారా షాపులను చేజిక్కించుకున్నారు. సాధారణంగా పట్టణాల్లో కంటే పల్లెల్లో అద్దెలు తక్కువగా ఉండాలి. కానీ మద్యం దుకాణాల అద్దెల్లో మాత్రం రివర్స్ జరిగింది. అర్బన్ ప్రాంతాల్లో లేని అద్దెలను గ్రామీణ ప్రాంతాల్లో వేసుకుని టెండర్లు చేజిక్కించుకున్నారు. మల్లంపేట, తెర్లాం, బాడంగి, బొబ్బిలి రూరల్ ప్రాంతాల్లోని షాపుల అద్దెలు మున్సి పాలిటీల్లోని షాపుల అద్దెలతో సమానంగా ఉన్నాయి. ఇవే మద్యం దుకాణాలు గ్రామీణ ప్రాంతాల్లో పది నుంచి పన్నెండు వేల రూపాయలకు (ఫర్నిచర్‌తో సహా) లభిస్తున్నా అటు అధికారులు పట్టించుకోకపోవడం విశేషం. ఉన్నతాధికారులకు చేరిన ఫిర్యాదులు: అద్దెల వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనీ వీటిని సవరించి ఇతరులకు న్యా యం చేయాలని డీపీసీ చైర్మన్ అయిన జాయిం ట్ కలెక్టర్, ఎక్సైజ్ డీసీలతో పాటు ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు కొందరు వ్యాపారులు ఫిర్యాదులు చేశారు. షాపులకు సంబంధించి పలువురు వ్యాపారులు ఎక్సైజ్ అధికారుల చుట్టూ తిరుగుతుండటంతో వారు ఏమీ చెప్పలేకపోతున్నా రు. ఇటీవల తెర్లాం తదితర సీఐలతో పాటు ఎక్సైజ్ డీసీ సైతం సెలవులోకి వెళ్లిపోయారు. కమిటీదే నిర్ణయం.. మద్యం దుకాణాల అద్దెలపై జిల్లాలో జేసీ, డీసీ తదితరులతో కూడిన కమిటీ అంతా కలసి నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయంలో నాకు స్పష్టత లేదు. షాపుల అద్దెల విషయంలో ఉన్నతాధికారులదే నిర్ణయం. – సుధీర్, డిపో మేనేజర్, బెవరేజెస్ కార్పొరేషన్, నెల్లిమర్ల ఫిర్యాదు చేశాం.. ఎక్సైజ్ శాఖ అధికారులు కొందరు బడా మద్యం వ్యాపారులకు సహకరిం చారు. అధిక అద్దెలున్న షాపులను ఎంపిక చేసి ఖజానాకు గండి కొడుతున్నారు. అధిక అద్దెల వల్ల జిల్లా వ్యాప్తంగా దాదాపు నెలకు కోటిన్నర పైనే ఖజానాకు భారం కానుంది. అలాగే ఎక్కువగా బెల్ట్‌షాపులకు నడిపించే ప్రాంతాల్లోనే ఎక్కువ షాపులను ఎంపిక చేస్తున్నారు. దీనిపై జేసీ, కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. – బార్నాల మహేశ్వరరావు, మద్యం వ్యాపారి, బొబ్బిలి -
ఆ కేసూ ‘మాఫీ’ యా!
కేసు దర్యాప్తు చేసిందీ లేదు.. మృతుడి పోస్టుమార్టం నివేదికా అందలేదు.. పోనీ ‘మద్యం తాగుతూ అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడంటున్న’ ప్రత్యక్ష సాక్షుల వాదనను అసలే పరిగణనలోకి తీసుకోలేదు.. కానీ గుండెపోటుతోనే అని ఏకపక్షంగా తేల్చేసి..సంఘటన జరిగిన 24 గంటల్లోపే కేసు క్లోజ్ చేసేశారు.. టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి ఆధ్వర్యంలోని లిక్కర్ మాఫియా పోలీసు, అబ్కారీ శాఖలపై ఎంతగా స్వారీ చేస్తోందో.. కేసులను ఎలా మేనేజ్ చేస్తోందో.. స్పష్టం చేస్తున్న సంఘటన ఇది. ఎంవీపీ కాలనీలోని వెలగపూడి సిండికేట్‌కు చెందిన శ్రీవిజయ వైన్ షాపునకు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూములో తిరుమలరావు అనే వ్యక్తి శుక్రవారం రాత్రి మద్యం సేవిస్తూ అక్కడే కుప్పకూలి మరణించగా.. అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడని పోలీసులు పేర్కొనడం చూస్తే.. సిండికేట్ నిర్వాహకులను కేసు నుంచి తప్పించే ఉద్దేశం స్పష్టమవుతోంది. కనీసం పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకైనా ఆగకుండా గుండెపోటు మరణమని తేల్చేసి.. కేసును మాఫీ చేసేయడం విస్మయానికి గురి చేస్తోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఊహించిందే జరిగింది. ఎమ్మెల్యే వెలగపూడి లిక్కర్ మాఫియా.. ఓ కళాకారుడి మృతి కేసును తారుమారు చేసేసింది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు లిక్కర్ సిండికేట్‌కు చెందిన ఎంవీపీ కాలనీలోని శ్రీ విజయ వైన్స్‌లో మర్రిపాలెంకు చెందిన కీ బోర్డ్ కళాకారుడు ఎం.తిరుమలరావు(48) శుక్రవారం రాత్రి కుప్పకూలి మృతి చెందిన సంగతి తెలిసిందే. మద్యం సేవిస్తూ అక్కడికక్కడే మృతి చెందాడని శుక్రవారం రాత్రి ప్రత్యక్షసాక్షులు స్పష్టం చేయగా... శనివారం సాయంత్రానికి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఇందుకు విరుద్ధమైన ప్రకటన చేశారు. వైన్ షాపులో మద్యం కొని బాటిల్ మూత తీయకుండానే ఫిట్స్ వచ్చి పర్మిట్ రూమ్‌లో కుప్పకూలిన అతన్ని కేజీహెచ్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యలో మరణించాడని ప్రకటించారు. వాస్తవానికి తిరుమలరావు అక్కడికక్కడే చనిపోయాడని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ‘‘శ్రీ విజయ వైన్స్‌కు సమీపంలోని శ్రీ సాయిరామా శక్తి లింగేశ్వర ఆలయంలో కార్తీకమాసం ముగింపు దృష్ట్యా శుక్రవారం రాత్రి జాగారం జరుగుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు కీ బోర్డ్ ప్లే చేసేందుకు తిరుమలరావు వచ్చారు. అప్పటి వరకు గుడిలోనే ఉన్న ఆయన సాయంత్రం 6గంటల సమయంలో చిన్న పనుంది.. ఇప్పుడే వస్తానని బయటకు వెళ్లారు. అర్ధగంటయినా రాకపోవడంతో మేము ఆరా తీయగా.. పక్కనే ఉన్న వైన్ షాపులోకి వెళ్లి కుప్పకూలాడని తెలిసింది. మేము హుటాహుటిన వెళ్లేటప్పటికే అచేతనంగా పడి ఉన్నాడు.. కేజీహెచ్‌కు తీసుకెళ్లేందుకు వాహనం ఏర్పాటు చేయమన్నా... ముందు వైన్‌షాపు నిర్వాహకులు అంగీకరించలేదు. ఆటోలో తీసుకుపొమ్మని గదమయించారు. గట్టిగా అడిగిన మీదట ప్రైవేటు అంబులెన్స్‌ను పిలిపించారు.. అప్పటికే అతను మృతి చెంచాడని అంబులెన్స్ వైద్య సిబ్బంది తేల్చారు.’’ అని దేవాలయ కమిటీ అధ్యక్షుడు సింహాద్రిబాబు, స్థానికులు చెబుతున్నారు. కానీ శనివారం నాడు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మాత్రం ఆస్పత్రికి తీసుకెళ్తుంటే మార్గమధ్యలో మృతి చెందినట్టు ప్రకటించారు. వైన్‌షాపు యాజమాన్యానికి కనీసంగా ఎటువంటి సంబంధం లేకుండా చేసేందుకే ఘటనా స్థలంలో కాకుండా మార్గమధ్యలో చనిపోయినట్టు పోలీసులు కొత్త కథ అల్లినట్టు అర్ధమవుతోంది. శనివారం ఉదయం కేజీహెచ్‌లో తిరుమలరావు మృతదేహానికి శవపంచనామా నిర్వహించగా.. ఇంకా నివేదిక మాత్రం ఇవ్వలేదు. కానీ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మాత్రం అతను గుండెపోటుతోనే చనిపోయాడని నివేదికలో తేలినట్టు చెబుతున్నారు. మరో పక్క తిరుమలరావు కుటుంబసభ్యులు కూడా అయిందేదో అయిపోయింది.. ఇప్పుడు వివాదం చేసుకున్నా వచ్చేదేమీ లేదు.. ఆయన గుండెపోటుతో చనిపోయాడని అందరూ చెబుతున్నారు.. అదే నిజమని అనుకుంటున్నాం... అని చెప్పుకొస్తున్నారు. దీన్ని బట్టి చూస్తేనే వెలగపూడి లిక్కర్ మాఫియా వ్యవస్థలను, వ్యక్తులను ఎలా ప్రభావితం చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఆ బాటిళ్లు సీజ్ చేశాం: ఎక్సైజ్ సీఐ నాయుడు శ్రీ విజయ వైన్స్‌లో తిరుమలరావు కొనుగోలు చేసిన మాన్షన్ హౌస్ బ్రాందీ 180ఎంఎల్ బాటిల్‌ను రసాయన పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపించాం... షాపులోని ఆ బ్రాండ్‌కు చెందిన 249 బాటిళ్లను విక్రయించకుండా సీజ్ చేశాం.. అని ఎక్సైజ్ సీఐ పాపునాయుడు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
రాజధానిలో లిక్కర్ చాక్లెట్లు
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగడం గురించి తెలుసు.. కానీ మద్యం తినొచ్చని మీకు తెలుసా..? అవును గ్లాసులో పోసుకుని సోడా కలుపుకొని తాగడం మనకు తెలిసిన విధానం కానీ బ్రాందీ, విస్కీ, రమ్ముతో తయారు చేసిన లిక్కర్ చాక్లెట్ల అమ్మకాలు మన హైదరాబాద్‌లోనే జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి చాక్లెట్లపై మన దేశంలో నిషేధం ఉన్నా అక్రమ విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఓ మాఫియా లిక్కర్ చాక్లెట్లను డెన్మార్క్ నుంచి అక్రమంగా తెప్పించి మెట్రోపాలిటన్ నగరాల్లో విక్రయిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ చాక్లెట్ డిస్ట్రిబ్యూటర్ ముఠాతో ఒప్పందం చేసుకొని విక్రయిస్తుండగా హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. లండన్, ఐరిస్, డెన్మార్క్‌కు చెందిన మొత్తం 96 బాక్సుల్లో ఉన్న 1,081 చాక్లెట్లను అధికారి నంద్యాల అంజిరెడ్డి స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో చాక్లెట్లో 4 శాతం ఆల్కహాల్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, గతంలో ఇలాగే లిక్క ర్ చాక్లెట్లను సరఫరా చేసిన అబిడ్స్‌కు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి ప్రస్తుతం ఇంట్లోనే లిక్కర్ చాక్లెట్ల కంపెనీ పెట్టాడు. స్థానికంగా లభించే విస్కీ, బ్రాందీ, రమ్ము తీసుకొచ్చి వాటితో చాక్లెట్లు తయారు చేసి విక్రయిస్తుండగా హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి 1.3 కిలోల విస్కీ చాక్లెట్లు, 1.5 కిలోల రమ్ము చాక్లెట్లు, 6.4 కిలోల చాక్లెట్ పదార్థాలు, లిక్కర్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. -
తీగ లాగితే.. డొంక కదిలింది!
కనిగిరి: కల్తీ మద్యం (బ్రాండ్ మిక్సింగ్) మాఫియాలో ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో సుమారు 20 మంది పాత్ర ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు నకిలీ మూతల రవాణా, బ్రాండ్ మిక్సింగ్, రెస్టారెంట్, ప్రభుత్వ లైసెన్సీ షాపుల్లో అక్రమాలకు పాల్పడిన సుమా రు 15 మందిని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. వీరిలో తొమ్మిది మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. మరో ఇద్దరు, ముగ్గురుని గుర్తించగా మరి కొందరి పాత్ర వెలుగు చూసే అవకాశం ఉంది. మరో ఐదుగురికి కోసం వేట కల్తీ మూతల రవాణాలో కీలక పాత్రధారుడు పి. శ్రీనివాసులను విచారణ అనంతరం మొత్తం 15 మందిని బ్రాండ్ మిక్సింగ్ (ఎక్కువ రేటు మద్యంలో తక్కువ రేటు మద్యం మిక్సింగ్) చేసినట్లు తేల్చారు. మరి కొందరి పాత్ర ఉండగా అందులో కీలకంగా ఉన్న అనంతపురానికి చెందిన ముగ్గురు దొరికితే కల్తీ గుట్టులో అసలు పాత్రధారులు దొరుకుతారు. అందులో కనిగిరికి చెందిన లిక్కర్ వ్యాపారులు నలుగురు, పామూరులో ముగ్గురు, సీఎస్‌పురంలో ముగ్గురు, దుత్తలూరులో ఒకరు, నందిపాడులో ఒకరుండగా అనంతపురంలో కీలక పాత్రధారులు ముగ్గురు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. పామూరు మండలం బొట్లగూడూరుకు చెందిన మాల్యాద్రి బతుకుదెరువుకు అనంతపురం వెళ్లి అక్కడా షోడాల అమ్మకాల వ్యాపారం చేస్తూ అనంతపురం లిక్కర్ మాఫీయాతో చేతులు కలిపి కనిగిరికి నకిలీ మాతల రవాణా రాకెట్ సాగించినట్లు విశ్వసనీయ సమాచారం. అనంతపురానికి చెందిన జనార్దన్, రమణతో పాటు మరో ఇద్దరి కోసం అనంతపురంలో టాస్క్ ఫోర్స్ టీమ్ ముమ్మరంగా గాలిస్తున్నట్లు సమాచారం. అనంతపురం లిక్కర్ మాఫీయా దొరికితే అసలు తయారీ గుట్టురట్టయ్యే అవకాశం ఉంది. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు దీన్ని ఛాలెంజ్‌గా తీసుకుని వేట సాగిస్తున్నారు. భారీగా మాతల మార్పిడి లిక్కర్ మూతల మార్పిడి మాఫియా మూడు, నాలుగు నెలల నుంచి తమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు స్థానిక ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నా సుమారు ఏడాది నుంచి బ్రాండ్ మిక్సింగ్ మాఫియా దందా సాగుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ టీం నివేదికలో ఉంది. అనంతపురానికి చెందిన జనార్దన్, రమణాలు పట్టుబడితే ఎంతకాలంగా మాఫియా రాకెట్ సాగుతోందనేది గుట్టురట్టు కానుంది. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాలో లిక్కర్ మాఫియా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నా కనిగిరి ప్రాంతంలోనే ఎక్కువగా కల్తీ లిక్కర్ వ్యాపారం సాగిందనే కోణంలో ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తు సాగుతోంది. -
పల్లెల్లో మద్యం పడగ
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం : నిండు వర్షాకాలంలో మంచి నీటి ఎద్దడి ఎదుర్కొనే పల్లెలు ఉండొచ్చేమో గాని.. మద్యానికి మాత్రం ఎలాంటి కొదువ లేదు. రాష్ట్ర ప్రభుత్వం గుడుంబాపై ఉక్కుపాదం మోపుతూ.. పెద్దఎత్తున దాడులు చేయిస్తోంది.. వ్యాపారులు, తయారీదారులపై పీడీ యాక్టు అమలుచేస్తోంది. ఫలితంగా సారా తయారీ, అమ్మకాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు ఈ స్థానాన్ని బెల్టు దుకాణాలు ఆక్రమించాయి. ఏ మూల చూసినా అవే దర్శనమిస్తున్నాయి. వీటిపై నియంత్రణ కొరవడడంతో పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. కిరాణం, శీతల పానీయాల దుకాణాలు, హోటళ్లు, పాన్ డబ్బాల్లో మద్యం వాసన గుప్పుమంటోంది. ఇంత జరుగుతున్నా ఆబ్కారీ, పోలీస్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. బెల్టుల సాయంతో అక్రమార్జన మహబూబ్‌నగర్ జిల్లాలో బెల్టు దుకాణాల సం ఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మద్యం వ్యాపారులు ఎక్కువ శాతం ఈ దుకాణాలపైనే దృష్టిసారిస్తున్నారు. జిల్లాలో 66 వైన్స్ దుకాణాలుండగా ఒక్కోదానికి సగటున 20 నుంచి 40 బెల్టు దుకాణాలతో సంబంధాలుండటం విశేషం. మరికొంద రు దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసి పల్లెల్లో ఇళ్ల దగ్గర, చిన్నపాటి హోటళ్లు, కిరాణ దుకాణాల్లో దర్జాగా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మార్పీ పేరుతో బోర్డులు తగిలిస్తున్న వ్యాపారులు బెల్టుల సాయంతో అక్రమార్జనకు తెరలేపుతున్నారు. ప్రతి రోజు వైన్స్‌తో సమానంగా బెల్టు దుకాణాల్లో వ్యా పారం సాగుతుందంటే పరిస్థితిని అర్థం చేసుకో వచ్చు. జిల్లాలో బెల్టు దుకాణాల ద్వారా నిత్యం రూ.50 లక్షల వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు తెలు స్తోంది. ప్రత్యేకంగా కొన్ని వైన్స్ దుకాణాలు ఇదే పనిగా ముందుకు సాగుతున్నాయి. అధికారికంగా డిపో నుంచి సరుకు తెచ్చుకుని రికార్డుల్లో నమో దు చేస్తూ బెల్టు దుకాణాలకు తరలిస్తున్నారు. నాసికరం మద్యం.. బెల్టు దుకాణాల్లో అమ్మకాలు నాసిరకం మద్యానికి దారి తీస్తున్నాయి. వైన్స్ దుకాణాల నుంచి తీసుకొచ్చిన దానికి దుకాణదారులకు చెల్లించిన దానికంటే అదనంగా రూ.20 నుంచి రూ.30 ధర పెంచి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా సీసాల్లో మద్యాన్ని తొలగించి నీళ్లు కలుపుతున్నారు. బెల్టు దుకాణాల్లో బీర్లు కొనుగోలు చేయాలన్నా అదనంగా రూ.40 చెల్లించాల్సిందే. ఎక్కువ శాతం చీప్‌లిక్కర్ తాగే వారి కోసం బెల్టు దుకాణాల్లో కొన్ని బ్రాండ్లను అసలు ధర కంటే అదనంగా రూ.40కి విక్రయాలు సాగిస్తున్నారు. జిల్లాలో సుమారు 2 వేల కంటే ఎక్కువ సంఖ్యలో బెల్టు దుకాణాలు గల్లీగల్లీలో విస్తరించాయి. బెల్టు దుకాణారులకు మద్యాన్ని సరఫరా చేయడంతో సిండికేటు దందా సాగించే వారికి రోజువారీగా సగటున రూ.20 లక్షల ఆదాయం అదనంగా సమకూరుతోందని అంచనా. రూ.లక్షలు వెచ్చించి టెండర్ల ద్వారా దుకాణాలు దక్కించుకున్నందుకు లాభసాటిగా ఉండాలనే తాపత్రయంతో నిలువునా ముంచేస్తున్నారు. మరోపక్క అదనంగా డబ్బులు చెల్లించి బెల్టు దుకాణాలను కొనసాగించినందుకు మాకు లాభం లేకపోతే ఎలా? అనే ధోరణితో బెల్టు దుకాణం నకిలీ మద్యంతో మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. లేబుల్స్ తొలగించి విక్రయాలు ఎక్సైజ్ అధికారులు నిబంధనలు మాత్రం బేషుగ్గా ఆదేశిస్తున్నారు. మద్యం సీసాలను ఏ దుకాణానికి ఏ లేబుల్‌తో పంపిణీ చేశారో అధికారికంగా రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నారు. ఆ దుకాణానికి సరఫరా చేసిన సీసాలను అక్కడే విక్రయించాలనే ఆదేశాలు సైతం జారీచేశారు. ప్రత్యేకంగా ఒక్కో దుకాణానికి ఒక్కో కోడ్‌ను కేటాయించారు. ఈ తతంగమంతా మద్యం గొలుసుకట్టు దుకాణాల విస్తరణకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతోనే. ఆచరణలో చూస్తే కేవలం కాగితాలకే ఆ నిబంధనలను పరిమితం చేసి అధికారులు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా వీధుల్లో మద్యం ఏరులై పారుతోంది. మరో పక్క ఏంచక్కా సీసాలకు ఉన్న లేబుల్స్‌ను తొలగించి విచ్చలవిడిగా బెల్టు దుకాణాలకు తరలిస్తున్నారు. ఎక్కడికక్కడ కూర్చోబెట్టి.. గ్రామాల్లో ఎక్కడ పడితే సిట్టింగ్ రూంలు అనధికారికంగా కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల పోలీసులు ఏకంగా వైన్స్ సిట్టింగ్ రూంల వద్ద వాహనాలు తనిఖీ చేసి, బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షలు చేసి కేసులు చేస్తున్నారు. దీంతో మందుబాబులు ప్రధాన మద్యం దుకాణాలను వదిలి గ్రామాల బాట పడుతున్నారు. కొత్త మద్యం పాలసీ ప్రకారం మద్యం విక్రయాలకు అనేక నిబంధనలున్నాయి. ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు చేపట్టాలి. నిల్వ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చాలి. కంప్యూటరైజ్ స్కానింగ్ చేయాలి. దీంతో ఏ రకం ఎక్కడి నుంచి ఎంత మొత్తంలో విక్రయించింది తెలుసుకునే అవకాశం ఉంటుంది. పెద్దమొత్తంలో ఒకేసారి మద్యం విక్రయాలు చేస్తే సంబంధిత దుకాణంపై నిఘా ఉంచుతారు. అయితే జిల్లాలో ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదని తెలుస్తోంది. బెల్టు దుకాణాల్లో మద్యంతోపాటు నీటి ప్యాకెట్లు, ప్లాస్టిక్ గ్లాసులు సైతం విక్రయిస్తూ అక్కడే మద్యం తాగేలా ప్రోత్సహిస్తున్నారు. -
తాగినోళ్లకు తాగినంత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కుంభమేళా మేడారం జాతరలో ఏర్పాట్లు ఎలా ఉన్నా.. మందుకు మాత్రం ఎలాంటి ఇబ్బంది రాకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త పడింది. మేడారం పరిసర ప్రాంతాల్లో వారం రోజుల పాటు తాత్కాలిక బార్లకు అనుమతి ఇచ్చింది. ఎమ్మా ర్పీ నిబంధనలను సడలించి దుకాణదారుడు ఇష్టం వచ్చిన ధరకు మద్యం అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. గిరిజనుల పేర్ల మీద గిరిజనేతర లిక్కర్ మాఫియా ఈ బార్లను దక్కించుకుంది. రోజుకు రూ.9 వేల లైసెన్స్ ఫీజు మేడారం జాతరలో ఈవెంట్ పర్మిట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 22 తాత్కాలిక బార్లను అనుమతించింది. రోజుకు రూ.9 వేల లైసెన్స్ ఫీజుతో స్థానిక గిరిజనుల పేరు మీద వీటిని ఇచ్చింది. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వారం రోజులపాటు వీటిని నిర్వహించుకోవచ్చు. మేడారం, మేడారం చెరువు, నార్లపూర్, ఊరట్టం, కన్నెపల్లి, ఎల్బాక క్రాస్ రోడ్డు, రెడ్డిగూడెం, కొత్తూరు, చింతల్ క్రాస్ రోడ్డు తదితర గ్రామాల పరిధిలో బార్లను అనుమతించింది. వాస్తవిక మద్యం ధర మీద 30 శాతం అదనపు రేటుతో టీఎస్‌బీసీఎల్ తాత్కిలిక బార్లకు సరఫరా చేస్తుంది. ప్రభుత్వం నుంచే ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు, ఎమ్మార్పీ ధరకే మద్యం విక్రయిస్తే వారికి గిట్టుబాటు కాదు కాబట్టి.. ఆ నిబంధన ఎత్తివేసినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఒక్క రోజులో రూ.2.5 కోట్ల మద్యం విక్రయం వాస్తవానికి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకే మద్యం దుకాణాలు ఇవ్వాలనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో గిరిజనేతర లిక్కర్ మాఫియా స్థానిక గిరిజనుల పేరు మీద బార్లను దక్కించుకుంది. దీనికి ఎమ్మార్పీ నుంచి సడలింపు ఉండటంతో ఇష్టం వచ్చిన కాడికి దండుకుంటున్నారు. 28న అనుమతి పొందిన దుకాణాలు 29వ తేదీ ఒక్కరోజే రూ.2.5 కోట్ల విలువైన మద్యం విక్రయించినట్లు ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాన జాతర జరిగే రోజుల్లో భారీగా లిక్కర్ వ్యాపారం జరగవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు స్థానిక మద్యం డిపోల్లో ప్రజలు ఎక్కువగా తాగే మద్యం బ్రాండ్లకు ఏ లోటు రాకుండా ఏర్పాట్లు చేశారు. -
మహిళ నగ్న ఊరేగింపు.. సీఎం స్పందన
-
మహిళ నగ్న ఊరేగింపు.. సీఎం స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. లిక్కర్ మాఫియా గురించి సమాచారం అందించిన ఓ మహిళను కొట్టి నగ్నంగా ఊరేగించిన ఘటన కలకలం రేపింది. దీనిపై ఢిల్లీ మహిళా కమీషన్ ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది. పోలీస్ చౌకీ సమీపంలో నివసించే మహిళ ప్రవీణ్.. నారెళ్లలో ఇల్లీగల్‌గా లిక్కర్ అమ్ముతున్న కొందరి గురించి ఢిల్లీ మహిళా కమీషన్‌కు సమాచారం అందించింది. దీంతో వారు దాడులు నిర్వహించి విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. అయితే ఆ మాఫియాకు చెందిన ఓ మహిళ కొందరు పురుషులతో కలిసి సమాచారం అందించిన ప్రవీణ్‌పై గురువారం దాడికి తెగబడ్డారు. రాడ్లతో ఆమెను కొడుతూ నగ్నంగా రోడ్డుపై ఊరేగించారు. ఆ దాష్టీకం మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. స్థానిక పోలీసులు మాత్రం కేవలం ఆమెపై దాడి మాత్రమే జరిగిందని.. ఆ ఘటనలో ఆమె బట్టలు చినిగిపోయాయని చెబుతున్నారు. పోలీసుల వివరణపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీసీడబ్ల్యూ పోలీస్ శాఖకు నోటీసులు జారీ చేసింది. ప్రవీణ డీసీడబ్ల్యూ వాలంటరీగా పని చేస్తోందని.. ఆమెకు అవమానం జరిగిన మాట వాస్తవమని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ అంటున్నారు. ఈ మేరకు రోహిణి డిప్యూటీ కమిషనర్ రాజ్నీశ్ గుప్తాను తమ ఎదుట హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. సిగ్గు చేటు.. సీఎం కేజ్రీవాల్ కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవీల స్పందించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవటం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి.. స్పందించని పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరతానని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు. Utterly shocking and shameful that this is happening in the capital of India. I urge Hon’ble LG to immediately intervene, take action against local policemen and ensure everyone’s safety https://t.co/Den926EgML — Arvind Kejriwal (@ArvindKejriwal) December 7, 2017 -
ఏటా రూ 100 కోట్లు దోచేస్తున్నారు
ఎక్సైజ్, పోలీసు, ఇద్దరు అధికార పార్టీ నేతలకు నెల మామూళ్లు మద్యం దుకాణాల్లో బాటిల్ మీద రూ.10, బీర్ మీద రూ.15 అదనంగా వసూలు బెల్ట్ షాపులు, దాబాల్లో 25 శాతం అదనపు దోపిడీ టీడీపీ నేతలే సిండికేట్ల రింగు లీడర్లు సాక్షి ప్రతినిధి – నెల్లూరు : టీడీపీ నేతలు రింగులీడర్ల అవతారమెత్తారు. అధికారులు వత్తాసు పలుకుతున్నారు. మద్యం సిండికేట్‌కు మద్దతుగా నిలబడుతున్నారు. జిల్లాలో మద్యం వ్యాపారులు, కొందరు అధికార పార్టీ ముఖ్య నేతలు, ఎక్సైజ్, పోలీసు, ఎన్ఫోర్స్మెంట్ శాఖలు చేతులు కలిపి ఏడాదికి రూ.100 నుంచి రూ.120 కోట్లు జనం సొమ్ము కొల్లుగొడుతున్నారు. ఈ వ్యహారాన్ని బయటపెట్టాల్సిన వ్యవస్థలకు కూడా తృణమో, పణమో ముట్టుజెబుతూ అడ్డూ అదుపూ లేకుండా అక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న వైన్‌షాపులో మద్యం బాటిల్ మీద ఉన్న ఎంఆర్పీ కంటే రూ.10 అదనం, షాపుల నుంచి సబ్ లీజు తీసుకుని నడుపుతున్న బెల్ట్ షాపుల్లో అయితే బాటిల్ మీద రూ.20 అదనం.. బీర్ల విషయానికొస్తే అనుమతి ఉన్న దుకాణాల్లో రూ.15, బెల్ట్ షాపుల్లో రూ.25 అదనపు ధర. ఇక బార్లు, డాబాల్లో అయితే ఎవరి ధర వారిదే. ఇలా చిత్తమొచ్చినట్లు దోపిడీ చేస్తున్నారు. 2015–2017ఆబ్కారీ సంవత్సరంలో జిల్లాలో 349 మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ లాటరీ నిర్వహించింది. ఇందులో 340దుకాణాలను వ్యాపారులు లాటరీలో దక్కించుకుని మద్యం దుకాణాలు నడుపుతున్నారు. సగటున జిల్లాలో రోజుకు రూ.2 కోట్ల నుంచి రూ.2.50కోట్ల మేర మద్యం విక్రయాలు సాగుతున్నాయి. నెలకు రూ.70 నుంచి రూ. 80కోట్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఎంఆర్పీ, ట్రాక్ అండ్ ట్రేసర్ విధానం, కంప్యూటర్ బిల్లింగ్ పక్కాగా అమలు, బెల్టుషాపుల నియంత్రణ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వ్యాపారులు, అధికారులు, అధికార పార్టీ నేతలు వీటన్నింటికీ సమాధి కట్టి వాటి మీద ఆదాయం సంపాదించుకుంటున్నారు. పక్కాగా దోపిడీ మద్యం దుకాణాల్లో క్వార్టర్‌పై అదనంగా రూ.10 నుంచి రూ.15వరకు, బీర్‌పై రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని. బెల్ట్ షాపుల్లో 10 శాతం రవాణా టాక్స్ కలిపి బాటిల్‌పై రూ.25 అదనంగా వసూలు చేస్తున్నారు. దాబాల్లో అయితే సర్వీస్ టాక్స్, పోలీస్ టాక్స్, ఎక్సైజ్ టాక్స్ పేరుతో మొత్తానికి 25 శాతం అదనంగా దోచేస్తున్నారు. జిల్లాలో సగటున నెలకు రూ.70 నుంచి రూ.80కోట్ల మేర విక్రయాలు సాగుతున్నాయి. అదనపు ధరల రూపంలో నెలకు రూ.10 నుంచి రూ.12 కోట్ల మేరకు జనం సొమ్ము కొల్లగొడుతున్నారు. జిల్లాలో 48బార్లు ఉన్నాయి. ఓ మోస్తరు బార్లో 180ఎంఎల్(క్వార్టర్)పై రూ. 50 నుంచి రూ.60వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. మిగిలిన వాటిలో క్వార్టర్ బాటిల్ మీద అదనంగా రూ. 100వరకు లాగేస్తున్నారు. క్వార్టర బాటిల్ మీద ఎంఆర్పీ కంటే రూ.100 అదనంగా వసూలు చేయడంపై మందుబాబులు బార్ నిర్వాహకులతో రోజూ ఎక్కడో ఒక చోట గొడవలు పడుతూనే ఉన్నారు. వాటాలు ఇలా.. జిల్లాలో 340 మద్యం దుకాణాలున్నాయి. ఒక్కో దుకాణం జరిగే రోజు వారి వ్యాపారాన్ని బట్టి ఎక్సైజ్ , పోలీస్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు మామూళ్లు చెల్లించాల్సి వస్తోంది. నెల్లూరు నగరంలో ఒక్కో దుకాణదారుడు ఎక్సైజ్ శాఖకు రూ.30వేలు, జిల్లాలోని మున్సిపాల్టీ కేంద్రాల్లో రూ. 25వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.15వేలు నెలవారీ మామూళ్లు ముట్టచెబుతున్నారు. కంప్యూటర్ బిల్లింగ్, స్కానింగ్ ఉల్లంఘనకు ఒక్కో దుకాణం రూ. 5వేలు మామూలు ముట్టచెబుతున్నారు. ఒక్కో బెల్టుషాపు రూ.3వేల వరకు మామూళ్లు చెల్లిస్తున్నారు. ఈ మొత్తం విజయవాడలోని ఆ శాఖ పెద్దల నుంచి ఎక్సైజ్ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ వరకు వాటాల రూపంలో చేరుతోంది. ఇది కాకుండా బార్ల నుంచి రూ.లక్షల్లో మామూళ్లు ముడుతున్నాయి. ఏతా వాతా చూస్తే జిల్లాలో మద్యం వ్యాపారులు ఎక్సైజ్ శాఖకు నెలకు అక్షరాల రెండున్నర కోట్ల వరకు మామూళ్లు ముట్టచెబుతున్నట్లు స్పష్టంగా కనబడుతోంది. పోలీసు శాఖకు నెల్లూరు నగరంలో ఒక్కో దుకాణం నుంచి రూ.15 నుంచి 17వేల వరకు, మున్సిపాలిటీల్లో æ రూ.15వేలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 వేల వరకు మూముళ్లు ఖరారు చేసి పంపకాలు జరుగుతున్నాయి. జిల్లా మొత్తం లెక్క కడితే పోలీసుశాఖకు నెలకు రూ కోటిన్నరకు పైగా మద్యం మామూళ్లు అందుతున్నాయి. ఈ వ్యవహారాలన్నీ బయటపెట్టాల్సిన మీడియా ప్రతినిధుల్లో కొందరికి నెలకు రూ.15 లక్షల దాకా మామూళ్లు అందుతున్నట్లు సమాచారం. సిండికేట్లదే పెత్తనం జిల్లాలో మద్యం వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి జిల్లా, నగరస్థాయి సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. సిండికేట్లలో 90 శాతం మంది తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారు. దీంతో ఆబ్కారీశాఖలో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఎంఆర్పీ ఉల్లంఘనల మీద అడపా, దడపా అయినా గట్టిగా దాడులు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తే అధికార పార్టీ ముఖ్య నేతలు వారి చేతులు కట్టేస్తున్నారు. దీంతో మద్యం అధిక ధరల దోపిడీని ప్రశ్నించే వారే లేకుండా పోయారు. ఆ రెండు నియోజక వర్గాల్లో అధికార పార్టీ ముఖ్యులకూ మామూళ్లు జిల్లాలోని 8 నియోజక వర్గాల్లో పార్టీ సభలు, సమావేశాలు,‡ ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ సమయంలో అధికార పార్టీ ముఖ్య నేతలు మద్యం దుకాణదారుల నుంచి ఉచితంగా మద్యం తీసుకుంటున్నారు. ఇందుకు భిన్నంగా వెంకటగిరి, గూడూరు నియోజక వర్గాల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు సైతం మద్యం ధరల దోపిడీలో వాటాదారులయ్యారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తన నియోజక వర్గంలో ఎంఆర్పీ ధరల కంటే అదనంగా వసూలు చేస్తున్నారని రాపూరులో ధర్నా చేశారు. మద్యం దుకాణ దారుల అధిక ధరల దోపిడీని ఒప్పుకునే ప్రసక్తే లేదని గట్టిగా హెచ్చరించారు. నియోజకవర్గంలోని మద్యం వ్యాపారులంతా సూళ్లూరుపేటకు చెందిన ఒక కాంట్రాక్టర్‌ను ఆశ్రయించారు. ఆయన మధ్యవర్తిత్వం చేసి మద్యం వ్యాపారులు, ఎమ్మెల్యేకు రాజీ కుదిర్చినట్లు ప్రచారంలో వుంది. ఇందుకు గాను మద్యం వ్యాపారులు ఎమ్మెల్యేకు ఏక మొత్తంగా రూ.40 లక్షలు బహుమతి ఇచ్చారని, ఏడాదికి ఒక్కో షాపు నుంచి రూ.లక్ష చొప్పున చెల్లించేలా ఒప్పందం కుదిరిందని అధికార పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలను ఎమ్మెల్యే ఖండిస్తున్నా, ఎంఆర్పీ ధరల కంటే 15 శాతం పెంచి మద్యం విక్రయిస్తున్నా ఆయన ఇప్పుడు పట్టించుకోవడం లేదు. గూడూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన పాశం సునీల్ కుమార్ అధికార పార్టీలోకి ఫిరాయించడంతోనే మద్యం వ్యాపారులను తన దారిలోకి తెచ్చుకున్నారు. తొలుత కొన్ని లక్షలు బహుమానంగా సమర్పించుకున్న వారు, ఇప్పుడు నియోజక వర్గంలోని ప్రతి దుకాణం నుంచి ఏడాదికి రూ.50 వేలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని టీడీపీలోనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే సునీల్ ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. అయితే మద్యం ధరల దోపిడీ మీద మాత్రం నోరెత్తడం లేదు. -
ఆయన మంచోడే కానీ...
బెంగళూరు: లిక్కర్ మాఫియాకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించి, తన ఉద్యోగానికి రాజీనామా చేసిన అనుపమా శ్ణైమరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ‘మాజీ మంత్రి పరమేశ్వర్ నాయక్ అంత చెడ్డ వ్యక్తేమీ కాదు, నా వల్లనే ఆయనకు అన్యాయం జరిగింది’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి కలకలం సృష్టించాయి. ‘నేను రాజీనామా చేశాను, మరి మీరెప్పుడు మీ పదవికి రాజీనామా చేస్తారు?’ అంటూ తన ఫేస్బుక్ పేజ్‌లో ప్రశ్నించిన అనుపమా శ్ణై పరమేశ్వర్ నాయక్ మంత్రి పదవి నుంచి తప్పుకోగానే ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఉడుపిలోని తన స్వగ్రామమైన ఉచ్చిలలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అనుపమా శ్ణైమాట్లాడారు. ‘నన్ను బదిలీ చేయడంలో కొంతమంది పెద్దల హస్తం ఉంది. పరమేశ్వర్ నాయక్ నిమిత్తమాత్రుడు. డీజీపీ ప్రోటోకాల్‌ను సైతం పక్కనపెట్టి నన్ను బదిలీ చేశారు. ఈ విషయంలో పరమేశ్వర్ నాయక్ ఒత్తిడి తీసుకువచ్చేందుకు అవకాశాలు తక్కువ. నా బదిలీ విషయంలో ఇంకా పెద్దల హస్తం ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. డీజీపీ, మాజీ మంత్రి పరమేశ్వర్ నాయక్‌లు ఆ వ్యక్తుల పేర్లను బయటపెట్టాలని అనుపమా శ్ణైడిమాండ్ చేశారు. తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణపై ఇప్పటికే మహిళా కమిషన్ అధ్యక్షురాలు మంజుల మానసకు లేఖ రాశానని తెలిపారు. ఇదే సందర్భంలో ఆమె ప్రభుత్వంపై సైతం తన విమర్శల పరంపరను కొనసాగించారు. ‘ఓ మాజీ అధికారిని ఎదుర్కొనే ధైర్యం మీకు లేదా? మీరు పోరాడదలచుకుంటే నాతో నేరుగా పోరాడండి, అంతేకానీ నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి’ అని అనుపమా శ్ణైపేర్కొన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి రాబోనని, లెక్చరర్ అవుతానని, లేదంటే ఏదైనా ఎన్జీఓలో చేరి సమాజ సేవ చేస్తానని అనుపమా శ్ణైవిలేకరుల ప్రశ్నకు బదులిచ్చారు. -
కల్తీ మద్యమే ఉసురు తీసింది!
♦ కల్తీకి పాల్పడుతున్న మద్యం మాఫియా ♦ పొరుగు రాష్ట్రాల నుంచి జోరుగా ఎన్డీపీ మద్యం ♦ ఎక్సైజ్ చెక్‌పోస్టుల్లో కేసులు నమోదు నామమాత్రమే ♦ ఎన్‘ఫార్సు’మెంట్‌గా తనిఖీలు సాక్షి, హైదరాబాద్: మద్యం వ్యాపారుల స్వార్థం అమాయకుల ఉసురు తీస్తోంది. మద్యం మాఫియా కల్తీకి పాల్పడుతున్నా.. కల్తీ మద్యం అమ్మకాలు చేపడుతున్నా ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంటు విభాగం చేష్టలుడిగి చూస్తోంది. బెల్టు షాపులు పుట్టగొడుగులు మాదిరి పుట్టుకొస్తున్నా.. ఈ షాపుల్లో సుంకం చెల్లించని మద్యం అమ్మకాలు చేపడుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. ఫలితంగా మొన్న అనంతపురంలో కల్తీ మద్యం తాగి ఇరువురు మరణించగా, సోమవారం విజయవాడలో ఐదుగురు దినసరి కూలీలు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో తెల్లవారు జామునే మద్యం అమ్మకాలు చేస్తున్నారనేందుకు విజయవాడలో ఉదయం 10.30 గంటలకే మద్యం తాగి మరణించిన సంఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కల్తీ మద్యంతో పాటు సమయపాలన లేని అమ్మకాలు అరికట్టాల్సిన ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంటు విభాగం మామూళ్ల మత్తులో జోగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి సుంకం చెల్లించని మద్యం (నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్) భారీగా దిగుమతి అవుతున్నా స్టేట్ టాస్క్ఫోర్సు విభాగం (ఎస్టీఎఫ్) చేష్టలుడిగి చూస్తోందని తెలుస్తోంది. కల్తీ మద్యం సరిహద్దులు దాటి వస్తున్నా ఎక్సైజ్ చెక్‌పోస్టుల్లో పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. అక్రమ మద్యం ఎలా చేరుతుందంటే... కర్ణాటక, తమిళనాడు, యానాంల నుంచి సరఫరా అవుతున్న ఎన్డీపీ మద్యం విక్రయాలు రాష్ట్రంలో జోరుగా సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తరలిరాకుండా ఉండేందుకు ఎకై ్సజ్ శాఖ మొత్తం 39 చెక్‌పోస్టుల్ని ఏర్పాటు చేసింది. వీటిలో రాష్ట్ర విభజన తర్వాత ఒక్క తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో కొత్తగా 14 చెక్‌పోస్టుల్ని ఏర్పాటు చేసింది. అయినా వీటి నిర్వహణ మాత్రం మొక్కుబడిగానే సాగుతోంది. రాష్ట్రంలోకి అక్రమ మద్యం ప్రవేశిస్తుందని ఎకై ్సజ్ శాఖకు పూర్తి సమాచారమున్నా, కేసులు నమోదు, వాహనాల సీజ్ మాత్రం అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అక్రమ మద్యంపై నమోదైన కేసులు, ఎన్ని వాహనాలు సీజ్ చేశారనే సమాచారం ఎక్సైజ్ శాఖ వద్ద లేకపోవడమే ఇందుకు నిదర్శనం. యానాం నుంచి ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు, తమిళనాడు నుంచి చిత్తూరు, నెల్లూరు, కర్ణాటక నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాలకు అక్రమ మద్యాన్ని సిండికేట్లు దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చీప్ లిక్కర్ కొరత ఉండటంతో దీన్ని అవకాశంగా తీసుకుని దిగుమతి చేసుకున్న చీప్ లిక్కర్లో కల్తీకి పాల్పడుతున్నారు. చెక్‌పోస్టుల్లో తనిఖీలేవీ? మద్యం డిమాండ్‌ను బట్టి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మద్యం సరఫరా అవుతుంది. ఈ మద్యం సరఫరా చేసుకునేందుకు ట్రూ ట్రాన్స్‌పోర్టు పర్మిట్లు కేటాయిస్తారు. వీటిని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేస్తారు. ఏపీలో ఐదు అంతరాష్ట్ర చెక్‌పోస్టులున్నాయి. వీటిని ట్రాన్స్‌పోర్టు, కమర్షియల్ ట్యాక్స్ తదితర శాఖలతో కలిసి ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులుగా నిర్వహిస్తున్నారు. ఈ ట్రూ ట్రాన్స్‌పోర్టు పర్మిట్లను అడ్డుపెట్టుకుని మద్యం మాఫియా ఎన్డీపీ మద్యం దిగుమతి చేసుకుంటోంది. ఇవన్నీ తెలిసినా ఎక్సైజ్ అధికారులు నెలవారీ మామూళ్లతో చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేపట్టడం లేదని విమర్శలున్నాయి. -
మళ్లీ ‘మందు’ కల్లు!
♦ తిరిగి అల్ఫ్రజోలం, డైజోఫాంతో అమ్మకాలు ♦ కల్లు మాఫియా ఒత్తిళ్లకు తలొగ్గిన ప్రభుత్వం ♦ కల్లు డిపోలపై దాడులు నిలిపివేయాలంటూ ఆదేశాలు ♦ ప్రజల ప్రాణాలు పోతున్నాయి, పిచ్చివాళ్లు అవుతున్నారని సమర్థన ♦ డీ-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసిన తరువాత దాడులు! సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మళ్లీ ‘మందు’ కల్లు వరద మొదలైంది. కల్తీకల్లు కేంద్రాలపై దాడులకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి చెప్పింది. అల్ఫ్రజోలం, డైజోఫాం వంటి రసాయనాలతో తయారుచేస్తున్న నకిలీ కల్లు మళ్లీ విజృంభిస్తోంది. కల్లు మాఫియా ఒత్తిడి మేరకే దాడులకు స్వస్తి పలకాలని ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వ పెద్దలు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ‘కల్తీ కల్లుకు అలవాటు పడ్డ జనాలు ఒక్కసారిగా మానేస్తే పిచ్చివాళ్లవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆసుపత్రులు నిండిపోతున్నాయి. కల్తీకల్లు డిపోలపై దాడులు నిలిపివేయండి..’ అంటూ వచ్చిన ఆదేశాలను ఎక్సైజ్ ఉన్నతాధికారులు జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్లకు చేరవేశారు. దీంతో మూడు రోజులుగా కల్లు దుకాణాలపై దాడులు నిలిచిపోయాయి. దీంతో తిరిగి అ ల్ఫ్రజోలం, డైజోఫాం కలిపిన కల్లు విక్రయాలు మొదలైనట్లు సమాచారం. జిల్లాలవారీగా దాడులు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్‌గా ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్‌ను ప్రభుత్వం నెలరోజుల క్రితం నియమించింది. ఆయన వెంటనే మండలాల వారీగా గుడుంబా తయారీ, విక్రయ కేంద్రాలపై దాడులకు శ్రీకారం చుట్టారు. తర్వాతి వారంలో కల్తీకల్లు దుకాణాలపై దృష్టిపెట్టారు. నిజామాబాద్‌లో మొదలైన ఈ దాడులను ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు విస్తరించారు. పాలమూరు జిల్లాలో 435 సొసైటీల ద్వారా 1,390 కల్లు దుకాణాలు అధికారికంగా నడుస్తుండగా.. అనధికారికంగా మరో వెయ్యి ఉన్నాయి. ఈ జిల్లాలో తాటి, ఈతచెట్లు తక్కువగా ఉండడంతో అల్ఫ్రజోలంతో కల్లు తయారుచేసి అమ్ముతారు. ఎక్సైజ్ దాడులు ఊపందుకోగానే అల్ఫ్రజోలం కలపడాన్ని కల్లు వ్యాపారులు నిలిపివేశారు. దీంతో ‘విత్‌డ్రాయల్ సింప్టమ్స్’ తో రోజుకు వందలాది మంది కల్తీకల్లు బాధితులు ఆసుపత్రుల పాలయ్యారు. కొందరు చికిత్స పొందుతూ చనిపోతే, మరికొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలా ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే 53 మంది మృతిచెందారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని కృత్రిమ కల్లు విక్రయించే ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు బోధనా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సర్కారు పెద్దల నుంచే ఒత్తిళ్లు.. కల్తీకల్లు దొరకక జనం మతిభ్రమించి ప్రవర్తించడం, ఉన్మాదంతో చేతులు కోసుకోవడంతో పాటు ఆత్మహత్యలకు పాల్పడడంతో పరిస్థితి చేయిదాటింది. ఆసుపత్రులన్నీ కిటకిటలాడిపోయాయి. దీంతో కల్లు మాఫియా రంగ ప్రవేశం చేసి.. సచివాలయ స్థాయిలో పైరవీ చేసింది. ప్రభుత్వ పెద్దల ద్వారా ఎక్సైజ్ అధికారులపై ఒత్తిళ్లు తె చ్చింది. ‘ఒక్కసారిగా మందు ఆపేస్తే జనం చచ్చిపోతున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. డీ-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసిన తరువాత దాడులు చేస్తే బాగుంటుంద’ని చెప్పుకొచ్చింది. దీంతో ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దాడులు నిలిచిపోయాయి. అల్ఫ్రజోలంను గుర్తించడం కష్టం! కల్లును కల్తీ చేసేందుకు, తాగినవారు మత్తులో జోగేందుకు కల్లు మాఫియా ఉపయోగించే రసాయనం అల్ఫ్రజోలం. గతంలో క్లోరల్ హైడ్రేట్ (సీహెచ్), డైజోఫాం, క్లోరోఫాంలను ఉపయోగించేవారు. వాటిని దుకాణాల వద్ద వెంటనే గుర్తించవచ్చు. దీంతో కల్తీ కల్లు విక్రయదారులు అల్ఫ్రజోలంను కలపడం ప్రారంభించారు. అల్ఫ్రజోలం కలిపితే ఎక్సైజ్ అధికారులు దుకాణాల వద్ద గుర్తించలేరు. హైదరాబాద్‌లోని ఎక్సైజ్ లేబొరేటరీలో మాత్రమే.. అదికూడా రోజుకు నాలుగు లేదా ఐదు శాంపిళ్లనే పరీక్షించే అవకాశముంది. ఇది కల్తీకల్లు వ్యాపారులకు అనుకూలంగా మారింది. కల్లు బాధితులు ఎంత మంది? కల్తీకల్లు దొరకక ‘విత్‌డ్రాయల్ సింప్టమ్స్’ తో ఆసుపత్రుల పాలైనవారు, చికిత్సపొం దుతూ చనిపోయినవారు, ఆత్మహత్యకు పాల్పడిన వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. మూడు రోజులుగా కల్తీకల్లు కేంద్రాలపై దాడులు నిలిపివేసినా.. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చాలా మంది ఇంకా కోలుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మందికి పైగా కల్తీకల్లు బాధితులు ఆసుపత్రుల పాలుకాగా, 100 మంది వరకు చనిపోయినట్లు ప్రాథమిక అంచనా. అసెంబ్లీ సమావేశాల్లో కల్తీకల్లుపై ప్రతిపక్షాల ప్రశ్నలకు జవాబు చెప్పేలా క చ్చితమైన వివరాలను ప్రభుత్వం రాబడుతోంది. దీనిపై పూర్తి వివరాలను అందజేయాలని, ‘విత్‌డ్రాయల్ సింప్టమ్స్’తో చనిపోయిన, చికిత్స పొందినవారి వివరాలను జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యాధికారుల నుంచి తీసుకోవాలని... అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులకు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ ఆదేశించారు. -
వామ్మో! మద్యం దుకాణమా?
♦ లిక్కర్ షాపుల ఏర్పాటుకు ముందుకు రాని వ్యాపారులు ♦ 20 శాతం పెరిగిన లెసైన్స్ ఫీజు, ప్రివిలేజ్ ట్యాక్స్‌తో వెనక్కు ♦ 2,216 మద్యం దుకాణాలకు గాను 1,393 షాపులకే దరఖాస్తులు ♦ హైదరాబాద్‌లోని 212 దుకాణాలలో కేవలం 24 షాపులకే దరఖాస్తులు ♦ రాష్ట్ర వ్యాప్తంగా 873 దుకాణాలకు రాని దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: లిక్కర్ మాఫియా పేరుతో రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని శాసించిన వారంతా ఇప్పుడు చల్లబడ్డారు. వేలం పాటలో రూ. కోట్లు వెచ్చించి మద్యం దుకాణం దక్కించుకున్న వ్యాపారులు.. ఇప్పుడు నిర్దేశించిన ధరకు కూడా దరఖాస్తు చేసుకోవడం లేదు. మద్యం వ్యాపారం నిర్వహించే వారికి ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలు, భారీగా పెరిగిన లెసైన్సు ఫీజులు, ఇతర నిర్వహణ ఖర్చులకు తోడు ఎక్సైజ్, పోలీస్ శాఖల వేధింపులకు భయపడి మెల్లమెల్లగా మద్యం వ్యాపారం నుంచి పక్కకు తప్పుకొంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానం కింద రెండేళ్లకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు కోరితే స్పందన అంతంత మాత్రమే. వచ్చే సోమవారం దరఖాస్తుల దాఖలుకు చివరి రోజు అయినా రాష్ట్రంలో సగం దుకాణాలకూ దరఖాస్తులు రాలేదు. 873 దుకాణాలకు దరఖాస్తులు నిల్ 2015-16, 2016-17 ఆబ్కారీ సంవత్సరాల కోసం ప్రభుత్వం మద్యం విధానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 21లోపు రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాలకు (ఎ-4 షాపులకు) గాను వ్యాపారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. కాగా శనివారం రాత్రి వరకు అందిన సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 6,537 దరఖాస్తులను విక్రయించిన ఎక్సైజ్ శాఖ రూ. 32.69 కోట్లు ఆర్జించింది. శనివారం రాత్రి వరకు 1,393 దుకాణాలకే దరఖాస్తులు అందాయి. ఇంకా 873 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌తో పాటు మారుమూల ప్రాంతాల్లోని దుకాణాలకు దరఖాస్తులు రావడం లేదు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 212 దుకాణాలకు గాను కేవలం 24 దుకాణాల కోసం 36 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ అధికారి తెలిపారు. గ్రేటర్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రాంతంలో 276, మెదక్ జిల్లా పటాన్చెరు, రామచంద్రాపురంలో 15 దుకాణాలున్నాయి. వీటిలో గత సంవత్సరం 104 దుకాణాలను ఎవరూ తీసుకోలేదు. గ్రేటర్లో గత ఏడాది లెసైన్సు ఫీజు రూ. 90 లక్షల కన్నా ఈ ఏడాది రూ. 18 లక్షలు అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో దుకాణాల పట్ల వ్యాపారుల్లో నిరాసక్తత ఏర్పడింది. అదే సమయంలో హైవేలు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లోని దుకాణాలకు డిమాండ్ అధికంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో ఒక్కో దుకాణానికి 3 నుంచి 6 దరఖాస్తులు వస్తున్నట్లు సమాచారం. ఆది, సోమ వారాలు రెండు రోజులు దరఖాస్తులను స్వీకరిస్తారు. గతంలో మద్యం వ్యాపారం అంటే సిండికేట్‌గా సాగేది. ఎక్సైజ్, పోలీసు శాఖలకు మామూళ్లు ముట్టజెపుతూ ఎంఆర్పీని పక్కనబెట్టి ఇష్టారాజ్యంగా ధరలను నిర్ణయించి వ్యాపారం చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. లెసైన్సు ఫీజుకు ఏడు రెట్లు మద్యం విక్రయాలు జరిగితే ప్రివిలేజ్ ట్యాక్స్ రూపంలో సర్కార్‌కు పన్ను చెల్లించాల్సి రావడం, అక్రమ మద్యం (ఎన్డీపీఎల్) రవాణాపై నిఘా, నిర్దేశిత విక్రయ సమయాలు వెరసి మద్యం వ్యాపారులకు లాభాలు లేకుండా చేశాయి. దీనికితోడు ఈసారి 20 శాతం లెసైన్సు ఫీజు పెంచడం కూడా వ్యాపారుల నిరాసక్తతకు కారణమైంది. అధికారులకు కొత్త తంటా! మద్యం దుకాణాలకు దరఖాస్తులు రాకపోవడంతో అధికారులు హైరానా పడుతున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా డిప్యూటీ కమిషనర్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు, సీఐలకు దుకాణాల బాధ్యతను అప్పగించారు. దరఖాస్తులు రాని దుకాణాలలో ప్రస్తుతం వ్యాపారం నిర్వహిస్తున్న వారికి సంబంధిత ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు ఫోన్లు చేసి, దరఖాస్తులు సబ్మిట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. -
లిక్కర్ మాఫియాను అడ్డుకోగలమా?
ఆందోళన చెందుతున్న ఎక్సైజ్ ఉన్నతాధికారులు సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో గుడుంబాను అరికట్టడం కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన పాలసీపై ఆబ్కారీ శాఖ తీవ్ర మదనపడుతోంది. నూతన పాలసీ ప్రకారం మండలం ఒక యూనిట్‌గా ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న జిల్లా స్థాయి మద్యం పాలసీకే లిక్కర్ మాఫియా అరాచకాలు సృష్టిస్తున్న నేపథ్యంలో మండలం యూనిట్‌గా అమలు చేస్తే వారి ఆగడాలకు అడ్డూ అదుపూ ఉండదేమోనని ఎక్సైజ్ శాఖ ఆందోళన చెందుతోంది. అంతేకాదు లిక్కర్ మాఫియా పూర్తి గుత్తాధిపత్యంతో మరింత బలపడే ప్రమాదం ఉందంటున్నారు. రాజకీయ నాయకులను, అధికారులను తమ వైపు తిప్పుకొని ధరలను ఇష్టారీతిన పెంచే ప్రమాదం లేకపోలేదని పేర్కొంటున్నారు. అదే విధంగా గ్రామాల్లో కల్తీ మద్యం ఏరులై పారినా అదుపు చేసే పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు. మొత్తం మీద ఈ విధానం వల్ల ఎక్సైజ్‌శాఖ మరింత అభాసు పాలయ్యే ప్రమాదముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. పాతరోజులు వస్తాయేమో..! ఎన్టీఆర్ హయాంలో ‘వారుని-వాహిని’ ద్వారా సారా అమ్మకాలను సొంతం చేసుకున్న వ్యక్తులు గ్రామాల్లో వారి ఏజెంట్లను నియమించుకొని అమ్మకాలు సాగించేవారు. అయితే అక్రమ సారా సరఫరా అవుతుందంటూ సదరు వ్యక్తుల తాలుకు మనుషులు ‘ప్రైవేట్ సైన్యం’గా ఏర్పడి గ్రామాలతో పాటు తండాలలో విధ్వంసం సృష్టించారు. మళ్లీ అలాంటి ముప్పు వాటిల్లుతుందేమోనని ఆబ్కారీ శాఖ అందోళన చెందుతోంది. -
సీఎం మనవడిపై మద్యం వ్యాపారుల దాడి
బీహార్ సీఎం జీనత్రాం మాంఝీ మనవడు అమిత్ మాంఝీపై కొందరు మద్యం వ్యాపారులు దాడి చేశారు. బుధవారం రాత్రి మధుబన్ జిల్లా రాణిపూర్‌లో పర్యటించిన అమిత్‌పై స్థానిక మద్యం వ్యాపారులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని, ప్రస్తుతం ఆయన సదార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. కాగా,తమపై తరచూ పోలీసులు దాడులు జరుపడానికి సీఎం మనవడు అమిత్ మాంఝీనే కారణమని మద్యం వ్యాపారులు భావించడం వల్లే ఈ దాడి జరిగినట్లు తెలిసింది. -
సిండి కేట్ల దందా !
మద్యం సిండికేట్లుమళ్లీ చెలరేగిపోతున్నాయి. ఎంఆర్పీకి మించి విక్రయిస్తున్నారు. నాడు మద్యం మాఫియాను వ్యతిరేకించిన నాయకులే నేడు అండగా నిలుస్తున్నారు. భారీగా ముడుపులు తీసుకుని బెల్ట్ షాపులను ప్రోత్స హిస్తున్నారు. అడ్డుకట్ట వేయాల్సిన ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే లక్ష్యాలను చేరుకోవాలంటే ఉదాసీనంగా ఉండకతప్పదని పరోక్షంగా చెప్పుకొస్తున్నారు. పనిలో పనిగా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీంతో మూడు పువ్వులు- ఆరు కాయలుగా సిండి కేట్ల హవా సాగిపోతోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వం ఇచ్చే టార్గెట్‌ను భారీగా పెంచింది. ఆ స్థాయికి విక్రయా లు పెంచాలని వైన్‌షాపులపై ఒత్తిళ్లు మొ దలయ్యాయి. ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉంటే తప్ప విక్రయాలు పెరగవని వ్యాపారులు మొండికేయడంతో వ్యాపారులు, అధికార పార్టీ నేతలు, ఎక్సైజ్ అధికారులు ఒక ఒప్పందానికి వచ్చారని తెలిసింది. తలో ఇంతని అనుకుని ముందుకెళ్లితేనే అందరికీ మంచిదని నిర్ణయానికొచ్చారని సమాచారం. అందులో భాగంగా ఎవరికివ్వాల్సింది వారికిచ్చేశారు. అడ్డుకునేదెవరని బరితెగించి విక్రయాలకు దిగారు. క్వార్టర్ బాటిల్‌పై ఎంఆర్పీకి అదనంగా రూ.5 నుంచి రూ. 10 పెంచి యథేచ్ఛగా విక్రయాలు చేస్తున్నారు. మందు బాబులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఎంఆర్పీకి మించి విక్రయంచడమే కాకుండా బెల్ట్‌షాపులను కూడా నడుపుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాలకు రాత్రిపూట సరుకు తరలించి, రోజంతా అమ్మకాలు సాగిస్తున్నారు. చివరికి విక్రయాల నిషేధం రోజైన పైడితల్లి అమ్మ పండగనాడు మిగతా రోజుల కంటే అధికంగా విక్రయాలు జరిపారు. ఎక్కడికక్కడా బెల్ట్‌షాపులు పెట్టి దర్జాగా అమ్మకాలు సాగించారు. ప్రశ్నించే వారికి రకరకాలగా ప్రలోభ పెట్టి దారికితెచ్చుకున్నారు. ప్రజాప్రతినిధులకు ఇప్పుడు మద్యం వ్యవహారం కాసులు కురిపిస్తోంది. పైసా పెట్టుబడి పెట్టకుండా, ఎటువంటి ప్రయాసకు లోనవ్వకుండా లక్షలు చేతికందడంతో వారు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇలా తమను చూసుకుంటే మీ జోలికి రామంటూ మద్యం వ్యాపారులకు భరోసా ఇస్తున్నారు. ప్రజల వద్ద చెడ్డ అయిపోకుండా ఉండేందుకు అప్పుడప్పుడు చేసే ప్రకటనలను పట్టించుకోవద్దని చెప్పేస్తున్నారు. వారే అంత సహకరించినప్పుడు ఇక అడ్డుఆపూ ఉండదని దర్జాగా విక్రయాలు చేసుకోవచ్చనే ధీమాకు సిండికేట్లు వచ్చేశారు. ఎక్సైజ్ అధికారులు నాటకీయ పాత్ర పోషిస్తున్నారు. కళ్లముందు ఎంఆర్పీకి మించి విక్రయిస్తున్నా చూసీ చూనడట్టు వదిలేస్తున్నారు. బెల్ట్‌షాపుల పట్లా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. విమర్శలు రాకుండా అప్పుడప్పుడు నామ్‌కే వాస్తేగా దాడులతో హడా వుడి చేస్తున్నారు. ఎంఆర్పీకి మించి విక్రయాలు, బెల్ట్‌షాపుల నిర్వహణ వ్యవహారంలో ఎక్సైజ్ అధికారులే సూత్రధారులన్న విమ ర్శలు కూడా ఉన్నాయి. వారి కనుసన్నల్లోనే అంతా నడుస్తోందని వాదనలు విన్పిస్తున్నాయి. మొత్తానికి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పుట్టుకొచ్చిన మద్యం సిండికేట్ విషసర్పం మళ్లీ బుసకొడుతోంది. బెల్ట్‌షాపులు తీసేస్తాం, అధిక ధరలను అడ్డుకుంటామని గొప్పలు పలికిన టీడీపీ నాయకులంతా ఇప్పుడు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మద్యం మాఫియాలో భాగస్వామ్యులై నాలుగు డబ్బులు వెనకేసుకుంటున్నారు. -
'జానారెడ్డి కనుసన్నల్లోనే మాఫియా'
హైదరాబాద్: మంత్రి జానారెడ్డి కనుసన్నల్లోనే నాపరాయి, ఇసుక, మద్యం మాఫియా పని చేస్తోందని టీడీపీ నాగార్జునసాగర్ నియోజకవర్గం ఇంఛార్జీ తేర చిన్నపరెడ్డిఆరోపించారు. దోపిడీ దార్లకు, దొంగల ముఠాలకు ఆయన కొమ్ముకాస్తున్నాడని విమర్శించారు. ఆయన వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకన విడుదల చేశారు. మంత్రి అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల నాగార్జునసాగర్ నియోజక వర్గం లో పరిపాలన గాడి తప్పిందని, ఫలితంగా గిరిజన బాలికలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. ఈ నియోజకవర్గం ప్రజల ఓట్లతో గెలుపొందిన మంత్రి జానారెడ్డి వారికి చేసిందేమీ లేదని విమర్శించారు. జిల్లాలో 1169 గ్రామ పంచాయితీలు ఉండగా, వీటిలో 495 గ్రామ పంచాయితీలకు మాత్రమే కార్యదర్శులు ఉన్నారని, పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లైనా జిల్లాకు ఆయన ఒరగబెట్టిందేమీ లేదన్నారు. అధికార పార్టీ ముసుగులో ఆయన చేస్తున్న అరచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు అమర్చి, రిగ్గింగ్‌ను అరికట్టాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. -
ట్రైనీ డిఎస్పీపై సారా మాఫియా దాడి
-
ట్రైనీ డిఎస్పీపై సారా మాఫియా దాడి
మహబూబ్‌నగర్‌లో సారా మాఫియా రెచ్చిపోయింది. నాగర్ కర్నూలులోని ట్రైనీ డిఎస్పీ భాషాపై సారా మాఫియా దాడి చేసింది. ఆ ఘటనలో డీఎస్పీతోపాటు మరో ముగ్గురు పోలీసుల గాయపడ్డారు. దాంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గోపాల్పేట మండలం పొల్కంపల్లి తండాలో అక్రమంగా సారా కాస్తున్నారని సమాచారం అందడంతో భాషా నేతృత్వంలోని పోలీసులు బృందం తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లింది. దాంతో స్థానిక సారా మాఫియా అగ్రహంతో వారిపై దాడికి తెగబడింది. -
మాయదారిలో మద్యం!
పాలన పడకేసినచోట ఏం జరగాలో అదే జరుగుతోంది. రాష్ట్రంలో మద్యం మాఫియా రెచ్చిపోయి చాపకింద నీరులా వ్యాపారాన్ని విస్తరించుకుంటూ జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. అడిగేవారూ, ఆరాతీసేవారూ లేకపోవడంతో నిత్యమూ పచ్చనోట్ల పండగ చేసుకుంటోంది. ‘సాక్షి’ గురువారం బయటపెట్టిన స్టింగ్ ఆపరేషన్‌ను గమనిస్తే ఈ వ్యాపారం విస్తృతి, లోతు ఎంత ఉన్నదో అర్ధమవుతుంది. రాష్ట్రం భవిష్యత్తు ఏమవుతుందోనని అందరూ కలవరపడుతుంటే మద్యం మాఫియా పేద, దిగువ తరగతివారు ఉపయోగించే కొన్ని బ్రాండ్లకు నకిలీలను సృష్టించి లారీలకు లారీల సరుకును రాష్ట్రం నలుమూలలకూ తరలిస్తోంది. అటు గోవానుంచి మాత్రమే కాదు...ఇటు కర్ణాటక, మహారాష్ట్రలనుంచి రోజూ రెక్కలు కట్టుకుని వాలుతున్న నకిలీ మద్యం మందుబాబులను ముంచేస్తోంది. రూ.3,200 ధర పలికే మద్యం బాటిళ్ల కేసును రూ.1,800కే మాఫియా సరఫరా చేస్తున్నది. ఈ దారిలో నెలకు కనీసం రూ. 100 కోట్ల వ్యాపారం సాగుతున్నదంటే ఈ మాఫియాకు ఏ స్థాయిలో అండదండలందుతున్నాయో అంచనా వేసుకోవచ్చు. మద్యం అమ్మకాలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఒక విధానమంటూ లేకపోవడంవల్ల ఏ రాష్ట్రానికా రాష్ట్రం తమ తమ సొంత విధానాలను రూపొందిం చుకుంటున్నాయి. ఏటా మద్యం విధానాన్ని ప్రకటించేటపుడు సర్కారు గంభీరమైన మాటలు వల్లిస్తుంది. ఈ ఏడాది కూడా అదే మోతమోగించింది. మద్య సేవనంవల్ల కలిగే అనర్ధాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తామని, ప్రతి జిల్లాకూ మద్యం వ్యవసాన్ని మాన్పించే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. వాటి సంగతలా ఉంచి సర్కారీ మద్యానికి పోటీగా దిగుతున్న నకిలీ మద్యం దందాను అరికట్టలేక బిక్కమొహం వేస్తోంది. ఇరుగు పొరుగు రాష్ట్రాలనుంచి నకిలీ మద్యం ఎలా ప్రవహిస్తున్నదో ‘సాక్షి’ ససాక్ష్యంగా బయటపెట్టింది. గోవా డిస్టిలరీల్లో దొంగచాటుగా తయారైన మద్యాన్ని లారీల్లో రాష్ట్రంలోని కోస్తాంధ్ర జిల్లాల దుకాణాలకు తరలిస్తున్న వైనాన్నీ....కర్ణాటక, మహారాష్ట్రల నుంచి చాటుగా వస్తున్న మద్యం ముడిసరుకును మద్యంగా మార్చి తెలంగాణ, రాయలసీమ జిల్లాలకు సరఫరా చేస్తున్న తీరునూ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతమైన నిఘా నెట్వర్క్ ఉండి, అందుబాటులో అవసరమైన బలగాలుండి, ఎన్నెన్నో ప్రాంతాల్లో చెక్పోస్టులుండి ప్రభుత్వం ఇంత చేతగానట్టుగా ఉండిపోయిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది నిద్రపోవడమా, నిద్ర నటించడమా అన్న అనుమానం కలుగుతుంది. మాఫియాలపై ఉక్కుపాదం మోపి, సిబ్బందిని ఉరుకులెత్తించి నకిలీమద్యం పనిపట్టిన ఎక్సైజ్ కమిషనర్ సమీర్ శర్మ అక్కడినుంచి బదిలీ అయ్యారు. దానికి రాష్ట్ర విభజన అంశం తోడైంది. ఇకనేం... మాఫియాలకూ, వారిని మేపేవారికి కావలసినంత స్వేచ్ఛ! స్టింగ్ ఆపరేషన్‌లో భాగంగా ‘సాక్షి’ ప్రతినిధి అడిగిన రూ.32 లక్షల విలువైన నకిలీ మద్యాన్ని ఒక్క రోజులోనే సరఫరా చేస్తామని మాఫియా హామీ ఇచ్చిందంటే ఇది ఎంతగా వేళ్లూనుకున్నదో, ఏ స్థాయిలో పనిచేస్తున్నదో అర్ధమవుతుంది. నకిలీ మద్యంతో రెండు రకాల ప్రమాదాలున్నాయి. సర్కారు పర్యవేక్షణ ఉండే డిస్టిలరీల్లో తయారయ్యే మద్యానికి బదులుగా దుకాణాలవారు చవగ్గా దొరికే నకిలీ మద్యాన్ని అమ్ముతారు. నెల తిరిగే సరికి ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుంది. మరోపక్క ఈ నకిలీ మద్యంలో ఏమాత్రం మిథైల్ ఆల్కహాల్ కలిసినా అది సేవించినవారు మృత్యువాతపడతారు. గతంలో ఇలాగే తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో పలువురు మరణించారు. ఎక్కడే బ్రాండ్లు ఎక్కువగా అమ్ముడు పోతున్నాయో తెలుసుకుని ఆ బ్రాండ్ల లేబిళ్లు అతికించి, అవసరమైన సీళ్లు తగిలించి, బ్యాచ్ నంబర్లు సైతం వేసి నిత్యం కావలసినచోటకు ఈ నకిలీ మద్యాన్ని చేరేయగలుగుతున్నారు. చిత్రమేమంటే, ఆ నకిలీ మద్యం హైగ్రో మీటర్‌కు కూడా దొరకడంలేదు. రెండేళ్లక్రితం ‘సాక్షి’ లిక్కర్ మాఫియా వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. ఒక పెద్దమనిషి అండదండలతో లిక్కర్ సిండికేట్ సామ్రాజ్యం ఎలా విస్తరించిందో చెప్పింది. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ ప్రాంతాల్లో బినామీల రాజ్యాన్ని నడిపిస్తున్న తీరును వివరించింది. జిల్లా జిల్లాకూ సిండికేట్లు విస్తరించి ఖజానాకు ఏటా రూ.4,000 కోట్ల మేర చిల్లు పెడుతున్న వైనాన్ని వెల్లడించింది. అప్పుడు ఏసీబీ చురుగ్గా రంగంలోకి దిగి ఏవో చర్యలు ప్రారంభించినా రాజకీయ ఒత్తిళ్లు క్రమేపీ పెరగడంతో అవి మరుగునపడ్డాయి. బినామీ దుకాణాల సంగతలా ఉంచి ఇప్పుడు నకిలీ మద్యం ఏరులై పారుతోంది. వివిధ జిల్లాల్లో దాదాపు 10 మాఫియా గ్యాంగులు గుట్టుచప్పుడు కాకుండా, ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పోతున్నాయి. ‘సాక్షి’ కథనం తర్వాత వివిధ జిల్లాల్లో ఎక్సైజ్ ప్రత్యేక బృందాలు తనిఖీలు ప్రారంభించాయని సమాచారం అందుతున్నది. స్టింగ్ ఆపరేషన్ సంగతి బయటపడగానే మాఫియా బృందాలన్నీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాయి గనుక ఈ తనిఖీలవల్ల తక్షణం ఒనగూడే ప్రయోజనం ఉండకపోవచ్చు. అసలు సవాలు దుకాణాల్లో కొలువుదీరిన నకిలీ మద్యం బాటిళ్లను పసిగట్టి స్వాధీనం చేసుకోవడం. ప్రజల జీవన ప్రమాణాలనూ, పోషకాహార స్థాయిని పెంచడమనే రాజ్యాంపరమైన కర్తవ్యాన్ని ప్రభుత్వాలు గాలికొదిలిన పర్యవసానంగానే ఇలాంటి వైపరీత్యాలు పుట్టుకొస్తున్నాయి. రాబడే ధ్యేయంగా ఎక్కడబడితే అక్కడ మద్యం దుకాణాలను పెట్టడం, వాటిపై కనీస పర్యవేక్షణ లోపించడం పర్యవసానంగా మాఫియాల విజృంభణకు అవకాశం ఏర్పడింది. మద్యపానంపై సంపూర్ణ నిషేధం సంగతిని ఎప్పుడో మరిచాం. నియంత్రించడం మాట కూడా ఎటో పోయింది. ఇప్పుడిక మద్యం మాఫియా సరుకే యధేచ్ఛగా దుకాణాలకు చేరుతోంది. వారికి కోట్లాది రూపాయల రాబడి తెస్తోంది. ఇక ఇక్కడ ప్రభుత్వం ఉన్నట్టా... లేనట్టా అని ఎవరికైనా అనుమానం వస్తే అందులో వింతేముంది? -
మద్యం మార్కెట్‌పై మాఫియా దండయాత్ర
-
మద్యం మార్కెట్‌పై మాఫియా దండయాత్ర
* గోవా, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి నెలకు 100 కోట్ల లిక్కర్ * మద్యం మాఫియా నకిలీ దందాపై ‘సాక్షి’ స్టింగ్ ఆపరేషన్ * బ్యూటేన్ పేరుతో ఈఎన్ఏ, సర్జికల్ కిట్‌లో క్యారామిల్, సీసా మూతల రవాణా.. గోవా డిస్టిలరీల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ * కంటెయినర్ల ద్వారా పెయింట్లు, బిస్కెట్లు, నూడుల్స్ పేరుతో రవాణా * ఆఫీసర్స్ చాయిస్, డీఎస్పీ, బ్యాగ్‌పైపర్ వంటి బ్రాండ్లకు నకిలీలు * రూ. 3,200 ధర గల క్వార్టర్ బాటిళ్ల కేసు రూ. 1,800 ధరకే సరఫరా * మద్యం వ్యాపారి పేరుతో మాఫియాను కలిసిన ‘సాక్షి’ ప్రతినిధి * షాద్‌నగర్ హైవేపై దాబా వద్ద గ్యాంగ్ లీడర్‌తో సమావేశం * తర్వాత ఉప్పల్‌లో మళ్లీ భేటీ.. నకిలీ సరుకు కోసం ఒప్పందం * శాంపిల్‌గా రెండు కేసుల ఎన్డీపీ లిక్కర్ పంపిన మాఫియా నేత * మద్యం ముడిసరుకులను తెప్పించే ముఠానూ కలిసిన ‘సాక్షి’ * ఆ దందా కేంద్రం అబిడ్స్ బ్యాంక్ స్ట్రీట్‌లోని ఓ సెల్‌ఫోన్ షాపు * ‘సాక్షి’ ప్రతినిధిని ట్రాన్స్పోర్ట్ గోడౌన్ వద్దకు తీసుకెళ్లిన నిర్వాహకులు * అక్కడికక్కడే డ్రమ్ముల్లో ఈఎన్ఏ, విస్కీ ఎసెన్స్, సీళ్లు ఇచ్చిన వైనం వర్ధెల్లి వెంకటేశ్వర్లు, సాక్షి: రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులుగా పారుతోంది. చాపకింద నీరులా విస్తరించిన మద్యం మాఫియా.. మందుబాబులకు బాటిళ్లలో నకిలీ కిక్కును సరఫరా చేస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి లారీలకు లారీలను నకిలీ మద్యం దించేస్తోంది. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టటంతో పాటు.. మందుబాబుల ప్రాణాలతోనూ చెలగాటమాడుతోంది. నెలకు కనీసం రూ. 100 కోట్ల పైబడి సాగుతున్న ఈ నకిలీ మద్యం దందా.. ప్రధానంగా పేద, దిగువ మధ్య తరగతికి చెందిన వారు తాగే చీప్ లిక్కర్, మీడియం లిక్కర్ బ్రాండ్లను టార్గెట్ చేసుకుని సాగిపోతోంది. ఎక్సైజ్ కమిషనర్ సమీర్‌శర్మ బదిలీ, రాష్ట్ర విభజన వివాదాలు మద్యం మాఫియాకు కలసిరావటంతో.. ఈ నకిలీ వ్యాపారం మూడు డ్రమ్ముల న్యూట్రల్ ఆల్కహాల్, ఆరు లారీల సరుకుగా యథేచ్ఛగా నడుస్తోంది. గోవా నుంచి ఆంధ్రాజిల్లాలకు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి తెలంగాణ, రాయలసీమ జిల్లాలకు నకిలీ మద్యం దిగుమతి అవుతోంది. ఈ మద్యం మాఫియా దందా కారణం గా ప్రభుత్వ మద్యం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. మద్యం మాఫియా నకిలీ దందాపై ‘సాక్షి’ స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది. మద్యం వ్యాపారి పేరుతో.. మాఫియా గ్యాంగ్ లీడర్లతో మాట్లాడింది. ఒక్క రోజు లోనే రూ. 32 లక్షల విలువైన 1,000 పెట్టెల నకిలీ మద్యం తెచ్చి ఇచ్చేందుకు ఓ ముఠాతో ఒప్పందం కుదుర్చుకుంది. శాం పిల్‌గా గోవా నుంచి కొంత ఎన్డీపీ (నాన్-డ్యూటీ పెయిడ్) మద్యాన్ని, కర్ణాటక నుంచి 220 లీటర్ల ఈఎన్ఏ (ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్)ను ‘సాక్షి’ ప్రతినిధి తీసుకున్నారు. ఈ నకిలీ మద్యం దందా సాగుతున్న తీరు తెన్నులు ఇవీ... మద్యం మాఫియా పొరుగు రాష్ట్రాల నుంచి రెండు రకాలుగా నకిలీ మద్యాన్ని మన రాష్ట్రంలోకి తెస్తోంది. ఒకటి.. గోవా డిస్టిలరీల నుంచి నేరుగా ఎన్డీపీ లిక్కర్. అంటే అక్కడ డిస్టిలరీల్లో దొంగతనంగా తయారు చేసిన మద్యాన్ని.. మన రాష్ట్ర ప్రభుత్వానికి సుంకం చెల్లించకుండా దొంగతనంగా తెప్పించి ఇక్కడ షాపులకు సరఫరా చేయటం. రెండోది.. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి మద్యం ముడిసరుకులను దొంగతనంగా తెప్పించి, రహస్యంగా నకిలీ మద్యం తయారు చేసి, పాత బాటిళ్లలో నింపి షాపులకు సరఫరా చేయటం. ఈ రెండు రకాల మద్యం రాష్ట్ర వ్యాప్తంగా నెలకు కనీసం 100 నుంచి 150 లారీల వరకు వస్తున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ఇలా... * కర్ణాటకలోని హుబ్లి, కోలార్, గంగావతి; మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి వీఆర్ఎల్ ట్రాన్స్‌పోర్టులో బ్యూటేన్, ప్రొఫేన్ కెమికల్ పేరుతో ఈఎన్ఏ (ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్)ను డ్రమ్ముల్లో తెప్పిస్తారు. అదే పద్ధతిలో.. సీసాలపై వేసే లేబుళ్లు, మూతల సీళ్లు, క్యారామిల్, విస్కీ ఎసెన్స్‌ను కూడా సర్జికల్ కిట్ల పేరు మాటున తెప్పిస్తారు. * ఈ నకిలీ మద్యం దందా, నగదు లావాదేవీలు హవాలా పద్ధతిలో సాగుతాయి. ఎలాగంటే.. మాఫియా గ్యాంగ్‌లు రాష్ట్రంలో పలు చోట్ల కిళ్లీ కొట్లు, సెల్‌ఫోన్ దుకాణాల రూపంలో ఆఫీసులు తెరిచాయి. ఇలాంటి ఆఫీసులే కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ పెట్టారు. బ్రోకర్ల ద్వారా ఈ వ్యాపారం నడిపిస్తున్నారు. వ్యాపారులతో ఫోన్ కాంటాక్ట్ పెట్టుకోవటం లేదు. * నకిలీ మద్యం కావాలనే లిక్కర్ వ్యాపారుల నుంచి డబ్బు తీసుకుంటారు. పొరుగు రాష్ట్రం ఆఫీసుకు ఫోన్ చేసి డబ్బు ముట్టిందని చెప్తారు. ఎంత సరుకు పంపాలో వివరిస్తారు. అంతకంటే ఎక్కువ సంభాషణ ఉండదు. అక్కడివాళ్లు ఈఎన్ఏ, క్యారామిల్, తదితర ముడిసరుకులను సదరు కంపెనీలకు డబ్బు కట్టేసి తీసుకుంటారు. వాటిని వేరే ఏవో పేర్లతో ట్రాన్స్‌పోర్టులో పంపుతారు. * ఇక్కడి లిక్కర్ వ్యాపారులు ట్రాన్స్‌పోర్టు నుంచి ఈఎన్ఏ, ఇతర ముడిసరుకులను తీసుకుని ఒక రహస్య గోదాంకు తరలిస్తున్నారు. మూడున్నర లీటర్ల ఈఎన్ఏకు ఐదున్నర లీటర్ల నీళ్లు కలిపి.. దానికి క్యారామిల్, విస్కీ ఎసెన్స్ కలిపి మద్యం తయారు చేస్తున్నారు. అంతకంటే ముందే వైన్ షాపుల నుంచి ఖాళీ క్వార్టర్ సీసాలను, హాఫ్ బాటిళ్లు, ఖాళీ అట్టపెట్టెలను సేకరించి గోదాంకు చేర్చుతున్నారు. తయారు చేసిన నకిలీ మాద్యాన్ని సీసాల్లో నింపి మూతలు పెట్టి క్యాప్ సీల్ వేస్తున్నారు. ఈ మద్యం చూడటానికి ఏపీబీసీఎల్ డిపో నుంచి వచ్చినట్టే ఉంటుంది. వాటిని అంతకు ముందే తెచ్చిన ఏపీబీసీఎల్ అట్టపెట్టెల్లో పెట్టి ప్యాక్ చేసి షాపుల్లో విక్రయిస్తున్నారు. * తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఆఫీసర్స్ చాయిస్, రాయలసీమ జిల్లాల్లో డీఎస్పీ, బ్యాగ్‌పైపర్ లిక్కర్‌ను ఎక్కువగా తయారు చేసి పంపుతున్నారు. ఇలా తయారు చేసిన నకిలీ మద్యంలో హైగ్రో మీటర్ వేసి చూస్తే అసలు మద్యం కొలతలనే చూపిస్తోంది. యూపీ 25 శాతం, ప్రూఫ్ 75 శాతం ఉంటుంది. * ఇలా నకిలీ మద్యం తయారు చేసిన వ్యక్తి.. దానిని రెండో వ్యక్తికి ఒక్కో కేసు (క్వార్టర్ బాటిళ్లు అయితే 48, ఫుల్ బాటిళ్లు అయితే 12) రూ. 1,800 చొప్పున అమ్ముతున్నాడు. అతనేమో దుకాణం యజమానికి రూ. 2,000 నుంచి రూ. 2,100 వరకు విక్రయిస్తున్నాడు. దుకాణం యజమాని రూ. 2,900 చొప్పున బెల్టు దుకాణాలకు వేస్తున్నారు. బెల్టు దుకాణాల వారు రూ. 3,200 ధరకు వినియోగదారులకు అమ్ముతున్నారు. మద్యం దందాపై ‘స్టింగ్’ ఆపరేషన్ ఇలా... నకిలీ మద్యం దందాపై దృష్టిసారించిన ‘సాక్షి’ ప్రతినిధి ముందుగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో నిజాయితీపరులైన కొంత మంది అధికారులతో మాట్లాడి.. వారి వద్ద ఉన్న సమాచారం తీసుకున్నారు. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. మద్యం మాఫియా బ్రోకర్లను కలిసేందుకు ప్రయత్నించారు. పెద్దగా కష్టపడకుండానే ఓ మధ్యవర్తిని కలిశారు. ‘‘మాకు రంగారెడ్డి జిల్లాలో బార్ అండ్ రెస్టారెంట్, మద్యం షాపు ఉన్నాయి. లాభాలు లేవు. మీరు సెకండ్ మాల్ ఇప్పిస్తారని తెలిస్తే మీ కోసం నెల రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం’’ అని ఆ మధ్యవర్తితో చెప్పారు. నకిలీ లిక్కర్ వ్యాపారంతో సంబంధం ఉన్న కొంత మంది వ్యక్తుల పేర్లు, వారితో ఉన్న పరిచయాల గురించి చెప్పి ఆయనకు న మ్మకం కలిగించారు. గ్యాంగ్ లీడర్‌తో ముఖాముఖి... సదరు మధ్యవర్తి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ హైవే పైన ఉన్న విజయ దాబా వద్ద.. ఓ మద్యం మాఫియా గ్యాంగ్ లీడర్‌కు .. మద్యం వ్యాపారిగా ‘సాక్షి’ ప్రతినిధిని పరిచయం చేశాడు. ఆ గ్యాంగ్ లీడర్ ఈ ప్రతినిధిని, ఆయనతో వచ్చిన సహచరుడిని అనేక ప్రశ్నలు అడిగి వారు నిజమైన మద్యం వ్యాపారులేనని రూఢి చేసుకున్నాడు. చివరికి.. ‘‘సరే! రేపు పొద్దున మా మనుషులు వచ్చి మీ షాపులు చూస్తారు.. అక్కడే దగ్గర ఉండండి’’ అని వారికి చెప్పాడు. అతడి ఫోన్ నంబర్ ఇవ్వాలని ‘సాక్షి’ ప్రతినిధి అడిగితే.. నిర్మొహమాటంగా ఇవ్వనని చెప్పాడు. ‘‘ఈ వ్యాపారంలో ఎప్పుడు కూడా ఫోన్ వాడొద్దు’’ అని చెప్పి వెళ్లిపోయాడు. మద్యం దుకాణం యజమానిగా... మరుసటి రోజు ‘సాక్షి’ ప్రతినిధి ఇచ్చిన వైన్స్ షాపు దగ్గరకు అనుకున్నట్టుగానే ఓ వ్యక్తి వచ్చాడు. అప్పటికే.. ‘మా తమ్మునికి పిల్లను ఇవ్వడానికి ఓ వ్యక్తి వస్తున్నాడు.. మీ షాపులో మాకు వాటాలున్నాయని ఆయనకు చెప్పా.. దయచేసి సాయం చేయండ’ని చెప్పి ‘సాక్షి’ ప్రతినిధి తనకు పరిచయం ఉన్న సదరు వైన్స్ దుకాణం యజమానిని ఒప్పించారు. నకిలీ మద్యం గ్యాంగ్ లీడర్ పనుపున వచ్చిన వ్యక్తితో కలిసి దుకాణంలోకి వెళ్లాం. కౌంటర్లో కూర్చున్న వ్యక్తులు ‘సాక్షి’ ప్రతినిధికి షాపు యజమానికి ఇచ్చే గౌరవం ప్రకారం లేచి నమస్కారం పెట్టారు. బార్ దగ్గర కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. ఈ రెండింటికి ‘సాక్షి’ ప్రతినిధే యజమాని అని.. గ్యాంగ్ లీడర్ ప్రతినిధి పూర్తిగా నమ్మాడు. అంతా చూసుకుని నిర్ధారించుకున్న తర్వాత ‘‘సరుకు ఎంత కావాలి?’’ అని మాఫియా లీడర్ ప్రతినిధి అడిగాడు. ‘‘పది రోజులకు లోడు చొప్పున కావాలన్నా’’ అని ‘సాక్షి’ ప్రతినిధి చెప్పారు. ‘‘సరే! అన్నతో కలిసి ధర మాట్లాడుకుంటే రేపు ఉదయం సరుకు దింపుతాం’’ అని చెప్పి వెళ్లిపోయాడు. మళ్లీ గ్యాంగ్ లీడర్‌తో భేటీ... మద్యం మాఫియా గ్యాంగ్ లీడర్‌ను ‘సాక్షి’ ప్రతినిధి మళ్లీ కలిశారు. ఈసారి భేటీ ఉప్పల్‌లో జరిగింది. ‘‘రంగారెడ్డి జిల్లాలో ఆఫీసర్స్ చాయిస్ బాగా తాగుతారు.. అదే తీసుకో’’ అని అతడు సలహా ఇచ్చాడు. ‘సాక్షి’ ప్రతినిధి సరే అన్నారు. ‘‘గోవా సరుకు.. అక్కడి ఫ్యాక్టరీల నుంచే వస్తుంది. నువ్వేం ఫిక ర్ చేయాల్సిన పని లేదు. ఎక్సైజోడే గుర్తుపట్టలేడు. పోలీసోనికి దీని గురించి తెల్వనే తెల్వదు. ఓ లోడు సరుకు తీసుకో’’ అని గ్యాంగ్ లీడర్ చెప్పాడు. ‘‘ధర ఎట్టా? చెప్పండన్నా’’ అని ‘సాక్షి’ ప్రతినిధి అడిగారు. ‘‘కేసుకు రూ. 2,500 పడుతుంది’’ అని అతడు చెప్పాడు. బేరమాడగా చివరకు కేసు రూ. 2,100 చొప్పున ఇచ్చేందుకు గ్యాంగ్ లీడర్ అంగీకరించాడు. అడ్వాన్స్‌గా రూ. 10 లక్షలు కట్టమన్నాడు. ‘‘మా పార్టనర్‌తో మాట్లాడి డబ్బు తీసుకుని రెండు రోజుల్లో వస్తా’’ అని ‘సాక్షి’ ప్రతినిధి బదులిచ్చారు. శాంపిల్‌గా ముందు రెండు పెట్టెలు పంపాలని కోరారు. ‘‘పిచ్చోనివారా? ఇంత చెప్పినా శాంపిల్ పంపమంటావు’’ అని గ్యాంగ్ లీడర్ కోపగించుకున్నాడు. ‘సాక్షి’ ఎలాగోలా అతడిని ఒప్పించింది. అదే రోజు ఓ ఆటోలో రెండు ఆఫీసర్స్ చాయిస్ పెట్టెలు తెచ్చి ఇచ్చారు. పరిశీలనగా చూస్తే అవి ఏపీబీసీఎల్ నుంచి వచ్చిన మద్యం బాటిల్స్లానే ఉన్నాయి. లేబులింగ్‌లో తేడా లేదు. లేబుల్స్ మీద అలైడ్ బ్లెండర్స్ నందిగామ అని ఒక పెట్టెలో.. అలైడ్ బ్లెండర్స్ గగన్‌పాడు అని మరో పెట్టెలో ఉంది. గోవా డిస్టిలరీల నుంచి ఏపీకి ఇలా.. గోవా నుంచి డిస్టిలరీ మద్యం నేరుగా రాష్ట్రానికి చేరుతోంది. మన రాష్ట్రంలో మద్యం తయారు చేయటానికి 31 డిస్టిలరీలు ఉన్నాయి. అదే గోవాలో 150 వరకు డిస్టిలరీలు ఉన్నాయి. అక్కడి రాష్ట్రంలో ఉత్పత్తికి తగ్గ డిమాండ్ లేదు. దీంతో గోవా డిస్టిలరీలు పక్కదారి పడుతున్నాయి. ఈ డిస్టిలరీల నుంచి ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు అక్రమంగా మద్యం సరఫరా అవుతున్నట్లు తేలింది. ఈ వ్యాపారం కూడా హవాలా పద్ధతిలో డబ్బు చేతులు మారుతూనే సాగుతుంది. * అక్రమార్కులు ఏ బ్రాండు మద్యం కోరితే ఆ బ్రాండు మద్యాన్ని గోవాలో తయారు చేసి ఇస్తున్నారు. మన రాష్ట్రంలో ఎక్కువగా డిమాండ్ ఉన్న ఓసీ, బీపీ, రాయల్ స్టాగ్ మద్యాన్ని ఎక్కువగా తయారు చేస్తున్నారు. * అక్రమార్కులు తమకు కావలసిన బ్రాండు మద్యం బాటిళ్లు రెండు సేకరించి వాటిని ప్యాక్ చేసి గోవా డిస్టిలరీకి కొరియర్ చేస్తున్నారు. కొందరు బస్సు డ్రైవర్‌కు ఇచ్చి పంపుతున్నారు. ఎన్ని లారీల సరుకు కావాలో కోడ్ భాషలో లెటర్ రాసి కొరియర్లోనే పంపుతున్నారు. * బాటిళ్లు తీసుకున్న గోవాలోని డిస్టిలరీ యాజమాన్యం.. అచ్చంగా ఆ బాటిళ్ల మీద ఉన్నటువంటి లేబుల్‌నే అచ్చుగుద్దుతోంది. కోరిన మద్యం తయారు చేసి సీల్ చేసి ప్యాక్ చేసి పంపుతోంది. * ఇలా తయారు చేసిన మద్యాన్ని కంటెయినర్లో వేసి సీల్ చేస్తున్నారు. దీనికి ఏషియన్ పెయింట్ పేరు మీదనో, నూడుల్స్, బిస్కెట్ ప్యాకెట్స్ పేరు మీదనో గోవా నుంచి కటక్ వరకు రూట్ పర్మిట్ తీసుకుంటున్నారు. * ఒకవేళ ఏదైనా కారణాల వల్ల పట్టుబడితే దొరకకుండా ఉండేందుకు ప్రతి 100 కి లోమీటర్లకు ఒక డ్రైవర్‌ను మార్చుతున్నారు. ఒక డ్రైవర్‌కు మరో డ్రైవర్ వివరాలు తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. * ఆఫీసర్స్ చాయిస్, అరిస్ట్రోక్రాట్, బ్యాగ్ పైపర్ లాంటి మీడియం రకం మద్యానికి.. గోవా ప్రభుత్వం కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ డిస్టిలరీలకు ఒక్కో కేసుకు (క్వార్టర్ బాటిళ్లు అయితే 48, ఫుల్ బాటిళ్లు అయితే 12) రూ.450 చెల్లించి తీసుకుంటుంది. మన రాష్ట్రంలో ఈ కేసుపై నాలుగైదు రకాల పన్నులు విధించి.. ప్రివిలిజ్ ముగిసిన షాపులకు సుమారు రూ. 3వేలకు సరఫరా చేస్తుంది. వారు ఆ కేసుపై నిర్ణయించిన గరిష్ట విక్రయ ధర ప్రకారం రూ. 3,200 మొత్తానికి విక్రయిస్తారు. * అదే గోవాలో అక్రమంగా మద్యం తయారు చేసే డిస్టిలరీ యాజమాన్యం.. తమకు ఆ ఆర్డర్ ఇచ్చిన మద్యం మాఫియాకు ఒక్కో కేసును రూ. 950 ధరకు అందిస్తుంది. ట్రాన్స్‌పోర్టు ఖర్చులు కలుపుకొని ఆ మాఫియా ఒక్కో కేసును రూ. 1800 ధరకు మద్యం దుకాణానికి చేరవేస్తాడు. ఆ షాపుల వారు తమ షాపుల్లో విక్రయిస్తే ఎంఆర్పీ ధర రూ. 3,200కు అమ్ముతారు. బెల్టు దుకాణానికి ఇస్తే రూ. 2,900 కు విక్రయిస్తున్నారు. * ప్రభుత్వం నుంచి సరఫరా చేసే మద్యానికి ఒక్కో కేసుకు రూ. 3,000 వరకూ చెల్లించాల్సి వస్తుండగా.. అదే నకిలీ మద్యం కేసు కేవలం రూ. 1,800 ధరకే షాపుకు వచ్చి చేరుతోంది. దీనివల్ల షాపుయజమానికి ఒక్కో కేసుకు రూ. 1,000 కి పైగా ఆదాయం వస్తోంది. మద్యం మాఫియాకూ ఒక్కో కేసుకు మరో రూ. 1,000 మిగులుతోంది. గోవాలో అక్రమంగా తయారు చేసే డిస్టిలరీలకూ ఒక్కో కేసుకు రూ. 500 వరకూ అదనంగా గిడుతోంది. ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ దందా.. మరో స్టింగ్ ఆపరేషన్‌లో ఎక్సైజ్ అధికారులు సూచించిన బ్రోకర్‌ను ‘సాక్షి’ ప్రతినిధి పరిచయం చేసుకున్నారు. ‘‘మాది కరీంనగర్ జిల్లా బెజ్జంకి. గతంలో నకిలీ ఫారిన్ లిక్కర్ వ్యాపారం చేశాం. అందులో పెద్దగా లాభాలు రాలేదు’’ అని చెప్పి నమ్మబలికారు. ‘‘నకిలీ మద్యంలో మంచి లాభాలు ఉన్నాయని కనకం అన్న చెప్పాడు.. నిన్ను కలిస్తే దారి దొరుకుతుందని ఆయన చెప్తే నిన్ను వెతుక్కుంటూ వచ్చామన్నా’’ అని ఆయన్ను నమ్మించారు. ఐదు డ్రమ్ముల ఈఎన్ఏ (ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్) కావాలని కోరారు. లీటర్ మీద రూ. 4 కమీషన్ ఇస్తామని చెప్పారు. బ్రోకర్ ఒప్పుకున్నాడు. ఐదు డ్రమ్ములకు రూ. 1.65 లక్షలు అవుతాయని, దానికి సరిపోను క్యారామిల్, లేబుల్స్, సీల్స్, మూతలు, విస్కీ ఎసెన్స్‌కు కలిపి మరో 1.25 లక్షలు.. మొత్తం 3.75 లక్షలు డబ్బు ఇవ్వాలని అడిగాడు. ఇప్పుడు డబ్బు ఇస్తే మూడు రోజుల తరువాత డ్రమ్ములు వస్తాయని చెప్పాడు. ‘‘అన్నా ఏ నమ్మకం లేకుండా ఇంత డబ్బు ఎలా ఇవ్వాగలం..? ఏదైనా నమ్మకం చూపించు’’ అని ‘సాక్షి’ ప్రతినిధి అడిగారు. బ్యాంక్ స్ట్రీట్‌లో సెల్‌ఫోన్ షాపు... సదరు బ్రోకర్ ఎట్టకేలకు ‘సాక్షి’ ప్రతినిధిని, ఆయన సహచరుడిని వెంటతీసుకెళ్లాడు. ఆబిడ్స్ చౌరస్తా నుంచి సితార రాయల్ హోటల్ దాటి.. బ్యాంకు స్ట్రీట్‌లో ఒక సెల్‌ఫోన్ షాపులోకి వారిని తీసుకువెళ్లాడు. షాపు సాదాసీదాగా ఉంది. పెద్దగా వ్యాపారం ఉన్నట్లు కనిపించలేదు. ఈ షాపు యజమాని పేరు సింగ్ (పూర్తి పేరు కాదు). ‘సాక్షి’ ప్రతినిధిని మద్యం వ్యాపారిగా ఆయనకు బ్రోకర్ పరిచయం చేశాడు. విషయం చెప్పాడు. ‘‘ఎప్పుడు తీసుకుంటారు?’’ అని సింగ్ అడిగాడు. ముందు ఒక డ్రమ్ము చాలు. తరువాత నాలుగు డ్రమ్ములు కావాలని ‘సాక్షి’ ప్రతినిధి చెప్పారు. ‘‘ఒక డ్రమ్మై వీఆర్ఎల్ పార్సిల్లో రెడీగా ఉంది. డబ్బు కట్టి వెళ్లి తీసుకోండి’’ అని సింగ్ చెప్పాడు. ఇంతలోనే గౌడ్ (పూర్తి పేరు కాదు) అనే వ్యక్తి రూ. 5 లక్షలు ఇచ్చి రెండు రోజుల్లో సరుకు కావాలన్నాడు. రెండు రోజుల్లో కష్టమని, మూడో రోజు వచ్చి తీసుకెళ్లాలని సింగ్ చెప్పాడు. ‘సాక్షి’ ప్రతినిధి సమక్షంలోనే సింగ్ ఎక్కడికో ఫోన్ చేసి.. రూ. 6 లక్షలు ముట్టినవి.. 9 కాటన్లు, సర్జికల్ కిట్లు పంపాలని హిందీలో చెప్పాడు. కర్ణాటక సెల్ నంబర్లకు ఫోన్లు... ‘సాక్షి’ ప్రతినిధి సదరు సింగ్‌ను మాటల్లో పెట్టి అదును చూసి ఆయన మాట్లాడిన ఫోన్ నంబర్‌ను సంపాదించారు. ఆ నంబర్ 09916044258. ఇది కాకుండా ఇంకో మూడు నంబర్లు ఉన్నాయి. అవి 08971609984, 09742570372, 09742570887. ఈ అన్ని నంబర్లు కూడా కర్ణాటక రాష్ట్రం నంబర్లే అని తేలింది. ఆ తర్వాత సింగ్‌తో పాటు ‘సాక్షి’ ప్రతినిధి వీఆర్ఎల్ పార్సిల్‌కు వెళ్లారు. అప్పటికే ఆయనకు కొరియర్ ద్వారా రశీదులు వచ్చినట్టున్నాయి. వెళ్లి కొరియర్ వాళ్లకు రశీదు ఇవ్వగానే ఆ రశీదును బట్టి డ్రమ్ము ఇచ్చారు. మరో రశీదు ఇస్తే సర్జికల్ కిట్ అని ఉన్న కవర్ ఇచ్చారు. డ్రమ్ము మీద ఉన్న లేబుల్‌పై ‘బ్యూటేన్, బాలాజీ ట్రేడర్స్, కాటేదాన్’ అని ఉంది. సర్జికల్ కిట్‌లో లిక్కర్ లేబుల్స్, క్యాప్ సీల్స్, మూతలు, విస్కీ ఎసెన్స్, క్యారామిల్ బాటిల్స్ ఉన్నాయి. వాటిని ‘సాక్షి’ ప్రతినిధి రహస్యంగా చిత్రీకరించారు. రేపు వచ్చి సరుకు తీసుకుంటామని చెప్పి అక్కడి నుంచి బయటపడ్డారు. ఇథైల్ స్థానంలో మిథైల్ కలిస్తే ప్రాణాంతకం..! ఈ అక్రమ, నకిలీ మద్యం దందాలో కీలకమైన విషయం ఏమిటంటే.. డిస్టిలరీల్లో మద్యం తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలనే దొంగతనంగా తెప్పించి, రహస్యంగా తయారు చేసి, నకిలీ లేబిళ్లు వేసి విక్రయిస్తున్నారు. అందులో ముఖ్యమైనది ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్‌ను శుద్ధిచేస్తే ఈఎన్ఏ అవుతుంది. ఇక్కడే పెను ప్రమాదానికి ఆస్కారం ఉంటుంది. ఇథైల్ ఆల్కహాల్ స్థానంలో పొరపాటున మిథైల్ ఆల్కహాల్ వస్తే.. ఇక అంతే సంగతులు. దానితో చేసిన మద్యం తాగిన వారందరూ మృత్యువాతపడతారు. ఇదే కారణంతో గతంలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గంగలకుర్తిలో నకిలీ మద్యం తాగి 18 మంది చనిపోయారు. గత ఏడాది కృష్ణా జిల్లా మైలవరంలో మరో 13 మంది గిరిజనులు కూడా ఇలాంటి నకిలీ మద్యం తాగి చనిపోయారు. డిస్టిలరీల్లో కాకుండా వెలుపల దొంగతనంగా తయారు చేసే నకిలీ మద్యంతో ఈ ప్రమాదం ఎల్లప్పుడూ పొంచే ఉంటుంది. మన డిస్టిలరీల్లో ప్రతి చుక్కకూ లెక్క..! రాష్ట్ర డిస్టిలరీల నుంచి మద్యం అక్రమంగా బయటికి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎక్సైజ్ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. ప్రతి డిస్టిలరీ ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్, కనీసం ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐలు, ఆరు మంది కానిస్టేబుళ్ల పర్యవేక్షణలో ఉంటుంది. తరచుగా ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు ఉంటాయి. లిక్కర్ తయారీకి ముడి పదార్థం ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్ఏ). ఇది ఎక్సైజ్ అధికారుల అధీనంలో ఉంటుంది. డిస్టిలరీ యాజమాన్యం ఉపయోగించిన ప్రతి చుక్క ఈఎన్ఏను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తారు. యాజమాన్యం ఈఎన్ఏ వినియోగానికి ఎక్సైజ్ కమిషనర్ నుంచి అనుమతి పొందిన దాని కంటే ఎక్కువగా వినియోగించటానికి అనుమతించరు. ఒకవేళ అనుమతించినా వెంటనే దొరికిపోతారు. స్టాకు వివరాలను ఉదయం ఓపెనింగ్ రీడింగ్, రాత్రి క్లోజింగ్ రీడింగ్‌ను రికార్డు చేస్తారు. ఆ రోజు వినియోగించిన మొత్తం ఈఎన్ఏ రీడింగ్ కూడా నమోదు చేస్తారు. వాటి ద్వారా వచ్చిన లిక్కర్ కేసుల వివరాలు రికార్డు చేస్తారు. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా వెంటనే తెలిసిపోతుంది. అదే జరిగితే ముందు ఎక్సైజ్ అధికారుల మీద తక్షణ వేటు పడుతుంది. తరువాత డిస్టిలరీ మీద చర్యలు ఉంటాయి. కాబట్టి మన రాష్ట్రంలో డిస్టిలరీ యాజమాన్యాలు మద్యాన్ని కానీ, ఈఎన్ఏను కానీ అక్రమంగా బయటికి పంపడానికి సాహసించ వు. -
లిక్కర్ మాఫియాకు ధరూరు అడ్డా
ధరూరు, న్యూస్‌లైన్: కృష్ణానది పుణ్యనీళ్లు ప్రవహించే ధరూరు మండలంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోందని మాజీ మంత్రి, టీడీపీ నేత డీకే. సమరసింహారెడ్డి ఆరోపించారు. పాదయాత్ర రెండో రోజు బుధవారం మం డల పరిధిలోని ఈర్లబండ, పాతపాలెం, నీలహళ్లి, నెట్టెం పాడు గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా పై గ్రామాల్లో ఆయన ప్రసంగించారు. అధికారుల, పాలకుల అండదండలతో లిక్కర్ మాఫియా పాగా వేసిందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, గద్వాల నియోజకవర్గంలో దారుణంగా ఉందన్నారు. ప్రజలకు రక్షణ కల్పిం చాల్సి పోలీసువ్యవస్థ పూర్తిగా రాజకీయ కబంద హస్తాల్లో ఉండిపోయిందని విమర్శించారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లినవారిపైనే అక్రమ కేసులు బనారుుంచడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్టులకు అనుమతులు తీసుకువచ్చి జీవోలు విడుదల చేయిస్తే ఇప్పుడున్న నాయకులు తామే చేశామని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. తన హయాంలోనే మండలంలోని 27 గ్రామాలకు మంచినీటిని అందించేందుకు నాగర్‌దొడ్డి తాగునీటి పథకాన్ని ప్రారంభించానన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూ ర్తిగా విఫలమయిందని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీ పీ నాయకులు వేణుగోపాల్, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, పూజారి శ్రీధర్, గంజిపేట రాములు, అమరవాయి కృష్ణారెడ్డి, సలీం, కలీం, మస్తాన్, ప్రభాకర్, భీంరెడ్డి, ఆంజనేయులు, నర్సింహులు, తిమ్మన్న, గుట్టల సుధాకర్, సైకిల్‌షాప్ తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.