పాట్నా: బిహార్‌లోని దర్భంగాలో దారుణం చోటు చేసుకుంది. కానిస్టేబుల్‌ని మద్యం మాఫియా ఎస్‌యూవీతో తొక్కించి హత్య చేసింది. ఈ ఘటన గురువారం రాత్రి కియోటి పోలీస్ స్టేషన్ వెలుపల జరిగింది. ఈ ఘటనపై పోలీసులు ఆరుగురుని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కానిస్టేబుల్ షఫీ-ఉర్ రెహమాన్ కియోటి పోలీస్ స్టేషన్ వెలుపల విధులు నిర్వహిస్తున్నారు. అయితే భారత్-నేపాల్ సరిహద్దు నుంచి వచ్చే ఓ ఎస్‌యూవీని ఆపడానికి సిగ్నల్ ఇచ్చాడు. కానీ డ్రైవర్ బ్రేకులు వేయకుండా వేగంగా పోనిచ్చాడు. దీంతో ఎస్‌యూవీ చక్రాలలో చిక్కుకున్న కానిస్టేబుల్‌ను వాహనం 200 మీటర్లు ఈడ్చుకుంటూ వెళ్లింది.
తీవ్ర గాయాలపాలైన రెహమాన్‌ను దర్భాంగా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందతూ మరణించారు. ఈ ఘటనపై దర్భాంగా సిటీ ఎస్పీ అశోక్ ప్రసాద్ మాట్లాడుతూ.. నేపాల్ నుంచి ఎస్‌యూవీలో భారిగా మద్యం సరుకును రవాణా చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మద్యం రవాణా చేస్తున్న ఎస్‌యూవీని, మరో కారును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా బీహార్ ప్రభుత్వం మద్యం అమ్మకం, వినియోగాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. ఇక ఫోరెన్సిక్ బృందం ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment