లిక్కర్ మాఫియాకు ధరూరు అడ్డా | for liquor mafia affection | Sakshi
Sakshi News home page

లిక్కర్ మాఫియాకు ధరూరు అడ్డా

Published Thu, Dec 12 2013 4:07 AM | Last Updated on Tue, Aug 21 2018 8:52 PM

for  liquor mafia affection

ధరూరు, న్యూస్‌లైన్: కృష్ణానది పుణ్యనీళ్లు ప్రవహించే ధరూరు మండలంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోందని మాజీ మంత్రి, టీడీపీ నేత డీకే. సమరసింహారెడ్డి ఆరోపించారు. పాదయాత్ర రెండో రోజు బుధవారం మం డల పరిధిలోని ఈర్లబండ, పాతపాలెం, నీలహళ్లి, నెట్టెం పాడు గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా పై గ్రామాల్లో ఆయన ప్రసంగించారు. అధికారుల, పాలకుల అండదండలతో లిక్కర్ మాఫియా పాగా వేసిందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, గద్వాల నియోజకవర్గంలో దారుణంగా ఉందన్నారు. ప్రజలకు రక్షణ కల్పిం చాల్సి పోలీసువ్యవస్థ పూర్తిగా రాజకీయ కబంద హస్తాల్లో ఉండిపోయిందని విమర్శించారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లినవారిపైనే అక్రమ కేసులు బనారుుంచడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు.
 
 తాను మంత్రిగా ఉన్న సమయంలో నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్టులకు అనుమతులు తీసుకువచ్చి జీవోలు విడుదల చేయిస్తే ఇప్పుడున్న నాయకులు తామే చేశామని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. తన హయాంలోనే మండలంలోని 27 గ్రామాలకు మంచినీటిని అందించేందుకు నాగర్‌దొడ్డి తాగునీటి పథకాన్ని ప్రారంభించానన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూ ర్తిగా విఫలమయిందని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీ పీ నాయకులు వేణుగోపాల్, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, పూజారి శ్రీధర్, గంజిపేట రాములు, అమరవాయి కృష్ణారెడ్డి, సలీం, కలీం, మస్తాన్, ప్రభాకర్, భీంరెడ్డి, ఆంజనేయులు, నర్సింహులు, తిమ్మన్న, గుట్టల సుధాకర్, సైకిల్‌షాప్ తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement