సాక్షి, శ్రీ సత్యసాయి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో దాదాపు ప్రతీ గ్రామంలో అడ్డగోలుగా బెల్ట్ షాపులు వెలిశాయి. కొన్ని చోట్లైతే టీడీపీ ముఖ్య నేతలు డబ్బులు తీసుకుని మరీ బెల్టు షాపులకు అనుమతి ఇస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ బాటలో చంద్రబాబు బావమరిది బాలకృష్ణ నియోజకవర్గం కూడా ఉందనే విషయం తాజాగా వెలుగు చూసింది.
హిందూపురం నియోజకవర్గంలో బెల్టు షాపులు విచ్చలవిడిగా.. భారీగా వెలిశాయి. మందుబాబులకు మూడు పెగ్గులు.. ఆరు గ్లాసులుగా నడుస్తోంది అక్కడ. ఈ నియోజకవర్గంలో దాదాపు వందకుపైగా బెల్ట్ షాపులు ఉన్నట్టు అనధికార సమాచారం. ఇక, ఈ బెల్డ్ షాపులు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వాళ్ల ఇష్టానుసారం లిక్కర్ అమ్మకాలు జరుపుతున్నారు. ఒక్కో లిక్కర్ బాటిల్‌పై రూ.20 అదనంగా తీసుకుంటున్నారు. అయితే,
ఎలా పడితే అలా బెల్ట్ షాపులకు అనుమతులు ఇవ్వమని, అలా కాదని అమ్మితే రూ.5లక్షలు జరిమానా విధిస్తామని సాక్ష్యాత్తూ సీఎం చంద్రబాబే హెచ్చరించారు. ఇక్కడ కూడా కొందరు టీడీపీ లీడర్లే ఈ దందాలు నడిపిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే ఎక్సైజ్ అధికారులు పట్టించుకోని ఈ విషయాన్ని కనీసం.. బాలయ్య అని పట్టించుకోవాలని కింది స్థాయి కూటమి నేతలు కోరుకుంటున్నారు. మరి బావ మాటలను ఇప్పటికైనా బాలకృష్ణ సీరియస్‌గా తీసుకుంటారా? లిక్కర్ మాఫియాకు అడ్డుకట్ట వేస్తారా? అనే చర్చ మొదలైంది ఇప్పడు.
Comments
Please login to add a commentAdd a comment