hindupur constituency
-
నందమూరి బాలకృష్ణ ఇలాకాలో ఏరులై పారుతున్న అక్రమ మద్యం
-
టీడీపీ నాయకుడి ఇంట్లో కర్ణాటక మద్యం.. పరారీలో పచ్చ పార్టీ నేత
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: ఏపీలో పలుచోట్ల మద్యం సిండికేట్ నడుస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల టీడీపీ నేతల కనుసన్నల్లో బెల్టు షాపులు నడుస్తున్నాయి. ఇక, తాజాగా ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో టీడీపీ నేత ఇంట్లో కర్ణాటకకు చెందిన మద్యం బాటిళ్లు దొరకడం చర్చనీయాంశంగా మారింది. ఎక్సైజ్ అధికారుల దాడుల నేపథ్యంలో సదరు టీడీపీ నేత పరారీ అయ్యాడు.వివరాల ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో యథేచ్చగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. హిందూపురం మండలం కొల్లకుంటలో టీడీపీ నేత ముంజునాథ్ ఏకంగా కర్ణాటకకు చెందిన మద్యాన్ని విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఎక్సైజ్ అధికారులు ముంజునాథ్ నివాసంలో సోదాలు నిర్వహించారు. అధికారుల తనిఖీల్లో కర్ణాటకకు చెందిన దాదాపు 1248 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ అధికారుల దాడుల విషయం తెలుసుకున్న ముంజునాథ్ ఇంట్లో నుంచి పరారీ అయ్యాడు. -
బావ మాట అయినా మూడు పెగ్గులు.. ఆరు గ్లాసులే!!
సాక్షి, శ్రీ సత్యసాయి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో దాదాపు ప్రతీ గ్రామంలో అడ్డగోలుగా బెల్ట్ షాపులు వెలిశాయి. కొన్ని చోట్లైతే టీడీపీ ముఖ్య నేతలు డబ్బులు తీసుకుని మరీ బెల్టు షాపులకు అనుమతి ఇస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ బాటలో చంద్రబాబు బావమరిది బాలకృష్ణ నియోజకవర్గం కూడా ఉందనే విషయం తాజాగా వెలుగు చూసింది. హిందూపురం నియోజకవర్గంలో బెల్టు షాపులు విచ్చలవిడిగా.. భారీగా వెలిశాయి. మందుబాబులకు మూడు పెగ్గులు.. ఆరు గ్లాసులుగా నడుస్తోంది అక్కడ. ఈ నియోజకవర్గంలో దాదాపు వందకుపైగా బెల్ట్ షాపులు ఉన్నట్టు అనధికార సమాచారం. ఇక, ఈ బెల్డ్ షాపులు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వాళ్ల ఇష్టానుసారం లిక్కర్ అమ్మకాలు జరుపుతున్నారు. ఒక్కో లిక్కర్ బాటిల్‌పై రూ.20 అదనంగా తీసుకుంటున్నారు. అయితే, ఎలా పడితే అలా బెల్ట్ షాపులకు అనుమతులు ఇవ్వమని, అలా కాదని అమ్మితే రూ.5లక్షలు జరిమానా విధిస్తామని సాక్ష్యాత్తూ సీఎం చంద్రబాబే హెచ్చరించారు. ఇక్కడ కూడా కొందరు టీడీపీ లీడర్లే ఈ దందాలు నడిపిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే ఎక్సైజ్ అధికారులు పట్టించుకోని ఈ విషయాన్ని కనీసం.. బాలయ్య అని పట్టించుకోవాలని కింది స్థాయి కూటమి నేతలు కోరుకుంటున్నారు. మరి బావ మాటలను ఇప్పటికైనా బాలకృష్ణ సీరియస్‌గా తీసుకుంటారా? లిక్కర్ మాఫియాకు అడ్డుకట్ట వేస్తారా? అనే చర్చ మొదలైంది ఇప్పడు. -
బాలకృష్ణ ముంచేశాడు!
అనంతపురం (హిందూపురం): ‘‘హిందూపురంలో తాగునీటి సమస్య తీరుస్తామని గొప్పలు చెప్పిన ఎమ్మెల్యే బాలకృష్ణ మున్సిపాలిటీపై అప్పుల కుప్ప పెట్టాడు. ‘అమృత్’ పథకం కింద గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురం వరకు నూతన పైప్‌లైన్‌కు రూ.194 కోట్లు ఖర్చుకాగా, కేంద్రం వాటాగా రూ.56.83 కోట్లు ఇచ్చింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.22 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. మున్సిపాలిటీ వాటా కింద మిగతా మొత్తం రూ.114.67 కోట్లు చెల్లించారు. అప్పుడు చేసిన అప్పులకు ఇప్పటి మున్సిపాలిటీ ఆదాయంతో పాటు 14, 15 ఫైనాన్స్ నిధులూ వడ్డీలకే సరిపోతున్నాయి. అయినా మీరు మూడు దశాబ్దాల్లో చేయలేని పనులు మేము మూడేళ్లలోనే చేసి చూపించాం.’’ అని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు టీడీపీ కౌన్సిలర్లకు సమాధానం ఇచ్చారు. 1983 నుంచి టీడీపీ నాయకులే హిందూపురం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నా.. కనీసం డ్రైనేజీ కూడా వేయించలేకపోయారని, ఇప్పుడు అధికార పార్టీ ఏం చేసిందో చెప్పాలని అడిగేందుకు టీడీపీ కౌన్సిలర్లకు సిగ్గుండాలన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా హిందూపురం అభివృద్ధికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తొలుత వైస్ చైర్మన్ బలరామిరెడ్డి, కౌన్సిలర్ శివ మాట్లాడుతూ... సచివాలయాల పరిధిలో జరిగే అభివృద్ధి పనుల విషయాలు వార్డు సభ్యులకూ తెలియజేయాలని కోరారు. అప్పుడే వివిధ సమస్యలతో తమ వద్దకు వచ్చే ప్రజలకు తాము సమాధానం చెప్పగలమన్నారు. అలాగే నిర్మాణంలో ఉన్న ఓపెన్ షెడ్లు ఎన్ని..?, నిర్మాణ నిబంధనలు, వాటి నుంచి వస్తున్న ఆదాయ వివరాలు సభ్యులకు తెలపాలని కోరారు. అలాగే పన్నుల విషయంలో ప్రజలు అహుడా, మున్సిపాలిటీలకు చెల్లిస్తూ రెండు విధాలుగా నష్టపోతున్నారని, దీనిపై వార్డు అడ్మిన్ సెక్రటరీలతో మీటింగ్ ఏర్పాటు చేసి వార్డుల వారీగా ఏ నిర్మాణాలు అహుడా పరిధిలోకి వస్తాయి...ఏవి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తాయో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ► కమిషనర్ వెంకటేశ్వరరావు సమాధానమిస్తూ... సచివాలయాల పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, నీటి సమస్యలు..పరిష్కారానికి తీసుకున్న చర్యలతో పాటు ఇతర వివరాలన్నీ సభ్యులకు వివరిస్తామన్నారు. ► అనంతరం కౌన్సిలర్ గిరి మాట్లాడుతూ... తన వార్డులో ఇప్పటికే రూ.2.50 కోట్ల అభివృద్ధి పనులు చేస్తే... కొందరు యాత్రలపేరుతో వార్డులో ఏం జరగలేదని నోటికివచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారు కనీసం మున్సిపాల్టీకి వచ్చి లెక్కలు చూసి మాట్లాడాలన్నారు. ► కౌన్సిలర్ ఆసీఫుల్లా మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో కొందరు అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, ఇటీవల ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారని కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. పారదర్శకత కోసం మున్సిపాలిటీకి ఒక యాప్ తయారుచేసి అందులో మొత్తం వివరాలు పెడితే, అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చన్నారు. ఇటీవల విద్యానగర్‌లోని ఒక ఇంటి యజమానికి ప్రాపర్టీ టాక్సు విషయంలో రీవోక్ చేయాలని నోటీస్ పంపారని, అధికారులు మారితే పన్నులు మారతాయా..అని ప్రశ్నించారు. ప్రతినెలా ప్రాపర్టీ ట్యాక్సుల నోటీæసులు ఇచ్చినవాటి వివరాలు కౌన్సిల్‌కు తెలపాలన్నారు. ► పలువురు సభ్యులు మాట్లాడుతూ.. మార్కెట్ వల్ల ఎంజీఎం మైదానం అధ్వానంగా మారుతోందని, వ్యాపారులకు ఇబ్బందులు కలగకూడదంటే వారిని మరోచోటకు పంపి...మైదానాన్ని క్రీడాకారులకు అందుబాటులో ఉంచాలని కమిషనర్‌ను కోరారు. అనంతరం 57 అంశాలతోపాటు టేబుల్ అజెండా అంశాలను తీర్మానిస్తూ ఆమోదం తెలిపారు. టీడీపీ కౌన్సిలర్ల రభస అంతకుముందు ‘పురం’ అభివృద్ధికి మూడేళ్లలో ఏం చేశారో చెప్పాలంటూ టీడీపీ కౌన్సిలర్లు సభలో రభస చేశారు. ఇందుకు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నాగేంద్రబాబు మాట్లాడుతూ...వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ‘పురం’ దాహార్తి తీర్చడానికి పీఏబీఆర్ పైప్‌లైన్ ఏర్పాటు చేస్తే రాజకీయం చేసి సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. నాసిరకం పైపులని నానా యాగీ చేసిన టీడీపీ వారి హయాంలో చేసిందేమిటో చెప్పాలన్నారు. గత మూడేళ్లుగా అదే పీఏబీఆర్ పైపుల నుంచే తాగునీరు పల్లెలు, ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయని, అవి నాసిరకమైతే ఎందుకు పగలడం లేదో చెప్పాలన్నారు. టీడీపీ నేతలు స్వార్థం, స్వలాభం కోసం ఏపీబీఆర్ నీటి పథకాన్ని నిరీ్వర్యం చేసి, గొల్లపల్లి పైప్‌లైన్ తెరపైకి తెచ్చారన్నారు. దీనిపై టీడీపీ కౌన్సిలర్లు అభ్యతరం తెలపగా వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు దీటైన సమాధానం ఇచ్చారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగి అరుపులతో అడ్డుకోవడానికి ప్రయతి్నంచగా వైస్ చైర్మన్ జబివుల్లా సర్దిచెప్పారు. -
నిజమైన నాయకుడిని చూస్తున్నా: ఎమ్మెల్సీ
సాక్షి, హిందూపురం: విశ్రాంత ఐజీ, హిందూపురం వైఎస్సార్ సీపీ నేత షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈనెల 14న ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా.. అసెంబ్లీలో వైఎస్సార్సీపీకి ఉన్న సంఖ్యాబలం పరంగా ఇక్బాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సోమవారం శాసనమండలి చాంబర్లో రిట్నరింగ్ అధికారి బాలకృష్ణామాచార్యులు ప్రకటించారు. అనంతరం ధ్రువపత్రాన్ని అందజేశారు. దీంతో హిందూపురంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఐజీ టూ ఎమ్మెల్సీ.. ఇక్బాల్ ప్రస్తానమిది షేక్ మహమ్మద్ ఇక్బాల్ స్వగ్రామం కర్నూలు జిల్లా కోవెలకుంట్ల. 1958 ఏప్రిల్ 24న జన్మించిన ఆయన.. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత పోలీసు శాఖలో ప్రవేశించి ఐజీ స్థాయికి ఎదిగారు. విధి నిర్వహణలో నిజాయతీ కల్గిన పోలీస్ అధికారిగా పేరు సంపాదించారు. అంతేగాక రాయలసీమ ఐజీగా ఓవైపు విధులు నిర్వహిస్తూ మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని మౌలిక సదుపాయల కల్పనకు కృషి చేశారు. విద్యార్థులకు కంప్యూటర్లు, కీడ్రాసామగ్రి, పుస్తకాల పంపిణీ చేశారు. తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పాటు క్రీడాప్రాగంణాలు అభివృద్ధి చేశారు. ఆయన ఐజీగా ఉన్న సమయంలోనే హిందూపురం ప్రాంతంలో కూడా పలు పాఠశాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హిందూపురం నుంచి పోటీ ముందునుంచీ రాజకీయాలపై ఆసక్తి కల్గిన మహమ్మద్ ఇక్బాల్.. రాయలసీమ ఐజీగా పదవీ విరమణ పొందిన తర్వాత 2018 మే 16న వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. రాజకీయ పరిజ్ఞానం మెండుగా ఉన్న మహమ్మద్‌ఇక్బాల్‌పై సీఎం జగన్మోహన్రెడ్డి ప్రత్యేక అభిమానాన్ని చూపారు. ఈక్రమంలోనే 2019 ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. ఎన్నికలకు కేవలం 22 రోజుల వ్యవధి మాత్రమే ఉన్నప్పటికీ తనవంతు కృషి చేశారు. అయినప్పటికీ స్వల్ప మెజార్టీతో ఓటమి చవిచూశారు. మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో ఐదు స్థానాలను మైనార్టీలకు కేటాయించింది. ఇందులో నాలుగు స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఓటమి చవిచూసిన ఇక్బాల్‌ను కూడా ఎమ్మెల్సీగా చేసి చట్టసభలకు తీసుకువెళ్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరులో జరిగిన ముస్లింమైనార్టీల సభలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇక్బాల్‌ను ఎమ్మెల్సీగా గెలిపించి తన మాటను నిలబెట్టుకున్నారు. ముబారక్ ఇక్బాల్ సాబ్ రాజకీయ నాయకులకు ఎన్నికల సమయంలోనే మైనార్టీలు గుర్తుకువస్తారు. ఒకటో, రెండో సీట్లు ఇస్తారు. ఓడిపోతే వారివైపు కన్నెత్తి చూడరు. కానీ నేను ఓడినా సోదరభావంతో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డిలో నిజమైన నాయకుడిని చూస్తున్నా. మైనార్టీల సంక్షేమంపై ఆయనకున్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. సామాజిక, ఆర్థిక, రాజకీయంగా అన్ని వర్గాలు ఎదగాలని ఆకాంక్షించే నాయకుడి నేతృత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. – మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్సీ -
ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్తా
హిందూపురం: కొత్తగా ఏర్పడిన వైఎస్సార్సీపీ ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తానని అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత బాలకృష్ణ, వసుంధర దంపతులు మొదటిసారిగా నియోజకవర్గానికి విచ్చేశారు. వారికి పార్టీ నాయకులు, అభిమానులు స్వాగతం పలికారు. మంగళవారం ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఎస్బీఐ, గురునాథ్ సర్కిళ్లలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు బాలకృష్ణ పూలమాలలు వేసి కేకును కత్తిరించారు. బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, పార్టీకోసం నిరంతరం కష్టపడిన కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి హిందూపురం ప్రజలు పార్టీని ఆదరిస్తూ వస్తున్నారని, రెండోసారి తనను గెలిపించిన హిందూపురం ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. అహుడా చైర్మన్ అంబికా లక్ష్మినారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి పాల్గొన్నారు. -
హిందూపురం ఎంపీ టికేట్పై మడకశిర నేతలు తిరుగుబాటు
-
అనంతపురం జిల్లాలో హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్తత
-
ఇసుక ‘తోడే’ళ్లు
► ఇసుక తరలింపుతో అడుగంటిన భూగర్భజలాలు ► ఎండిపోయిన పరివాహక ప్రాంతాల బోరుబావులు హిందూపురం: హిందూపురం నియోజకవర్గంలోని పెన్నానదికి ఉపనదులైన జయమంగళి, కుముద్వతీ నదులతో పాటు చిలమత్తూరు మండలంలోని చిత్రావతి, కుషావతి పరీవాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తరలింపుతో భూగర్భజలాలు పూర్తిగా ఎండిపోయి 1000 అడుగుల బోరు వేస్తే కానీ నీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. నదీ పరీవాహక ప్రాంతాల్లోని వాగులు, చెరువుల్లో కూడా ఏపీ వాల్టా చట్టాన్ని అధికారులు అమలు చేయడం లేదు. నదీ పరీవాహక ప్రాంతాల్లో వేసిన పైప్లైన్లను కూడా వదలకుండా ఇసుక తోడేశారు. 2002లో ఏపీ వాల్టా చటాన్ని తీసుకువచ్చినా చంద్రబాబు కేవలం తమ అనుచరుల కోసం ఇసుక టెండర్లకు తెరదీసి స్థాయికి మించి ఇసుకను అక్రమ రవాణా చేశారు. దీంతో సమీప పరిసరాల్లో ఉన్న వ్యవసాయ బోర్లు, తాగునీటి బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. పెన్నానది పరీవాహక ప్రాంతం హిందూపురానికి, కర్ణాటక సరిహద్దు నుంచి పరిగి మండలం వరకు సుమారు 30 కిలోమీటర్ల పైన ఇసుక టెండర్లు వేసి ప్రభుత్వం లాంఛనంగా ఇసుక అక్రమ తరలింపునకు పచ్చజెండా ఊపడంతో ఈ నది పరీవాహక ప్రాంతాల్లోని ఇసుక అంతా కర్ణాటక కు చేరింది. ఎండిపోయిన బోర్లు, వందలఎకరాల్లో పంట నష్టం పెన్నానది పరీవాహక సమీపాన ఉన్న గ్రామాల్లోని వ్యవసాయ బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. అనుమతికి మించి ఇసుకను తోడేయడంతో భూగర్భజలాలు అడుగంటాయి. తద్వారా వందలాది ఎకరాల్లో రైతులు వేసుకున్న పంటలు నిట్టనిలువునా ఎండిపోయాయి. ఫలితంగా వందలాది మంది రైతులు నిరాశ్రయులయ్యారు. వర్షాలు వచ్చినా భూగర్భజలాలు పెరగవు పెన్నానది పరీవాహక ప్రాంత గ్రామాలైన పెద్దిరెడ్డిపల్లి, మోదా, చెర్లోపల్లి, శ్రీరంగరాజుపల్లి, మోతుకుపల్లి, ఉటుకూరు, పైడేటి తదితర గ్రామ ప్రజలు 1980 కంటే ముందు వేసవిలో నీళ్ల కోసం జయమంగళి, పెన్నానదిలో ఇసుక తోడితే నీరు వచ్చేది. అయితే ప్రస్తుతం ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఇసుకను అధికంగా తోడేయడంతో కనీసం నది ఛాయలు కూడా లేకుండా ముళ్లపొదలు దర్శనమిస్తున్నాయి. - వెంకటరామిరెడ్డి, రైతు సంఘం నాయకులు ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు గతంలో ఇసుక టెండర్లను అడ్డుపెట్టుకుని మితిమీరిన నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించుకుపోయేవారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ముసుగులో ఎవరైనా ఇసుక అక్రమంగా సరిహద్దును దాటించేందుకు ప్రయత్నించకుండా సంతేబిదనూర్ వద్ద ప్రత్యేక చెక్‌పోస్టును ఏర్పాటు చేస్తున్నాం. - విశ్వనాథ్, తహశీల్దార్ -
బాలయ్య ఇలాకాలో తమ్ముళ్ల వర్గపోరు
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, సీనీ నటుడు బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో తెలుగుతమ్ముళ్ల వర్గపోరు తారాస్థాయికి చేరింది. వైరివర్గాలతో విబేధాలు ముదరడంతో నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న లేపాక్షి మాజీ ఎంపీపీ మల్లికార్జున్ వెయ్యిమంది కార్యకర్తలతోసహా పార్టీ నుంచి బయటికి వచ్చేయనున్నట్లు సమాచారం. ఆ మేరకు నిర్ణయం తీసుకునేందుకు ఆదివారం హిందూపురంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు మల్లికార్జున్. అయితే పోలీసులు మాత్రం అనుమతి లేదంటూ ఆ సమావేశాన్ని అడ్డుకున్నారు. దీంతో మల్లికార్జున్ వర్గీయులు మరింత అసహనానికి గురయ్యారు. మరోవైపు అసంతృప్తనేతలను బుజ్జగించేందుకు టీడీపీ సీనియర్లు రంగంలోకి దిగారు.