బాలయ్య ఇలాకాలో తమ్ముళ్ల వర్గపోరు | tdp group war in hindupur constituency | Sakshi
Sakshi News home page

బాలయ్య ఇలాకాలో తమ్ముళ్ల వర్గపోరు

Published Sun, Sep 13 2015 11:52 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

బాలయ్య ఇలాకాలో తమ్ముళ్ల వర్గపోరు - Sakshi

బాలయ్య ఇలాకాలో తమ్ముళ్ల వర్గపోరు

అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, సీనీ నటుడు బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో తెలుగుతమ్ముళ్ల వర్గపోరు తారాస్థాయికి చేరింది. వైరివర్గాలతో విబేధాలు ముదరడంతో నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న లేపాక్షి మాజీ ఎంపీపీ మల్లికార్జున్ వెయ్యిమంది కార్యకర్తలతోసహా పార్టీ నుంచి బయటికి వచ్చేయనున్నట్లు సమాచారం.

ఆ మేరకు నిర్ణయం తీసుకునేందుకు ఆదివారం హిందూపురంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు మల్లికార్జున్. అయితే పోలీసులు మాత్రం అనుమతి లేదంటూ ఆ సమావేశాన్ని అడ్డుకున్నారు. దీంతో మల్లికార్జున్ వర్గీయులు మరింత అసహనానికి గురయ్యారు. మరోవైపు అసంతృప్తనేతలను బుజ్జగించేందుకు టీడీపీ సీనియర్లు రంగంలోకి దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement