dk samarasimha reddy
-
అవినీతి ఇప్పుడే గుర్తొచ్చిందా?
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రెండోసారి అధికారంలోకి వచ్చాక మాత్రమే గుర్తుకొచ్చిందా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిం చింది. రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ గగ్గోలు పెట్టడం దారుణమని, కేసీఆర్ లాంటి వ్యక్తి అవినీతి గురించి మాట్లాడటం సిగ్గుచేటని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. మాజీమంత్రి డి.కె.సమరసింహారెడ్డితో కలసి మంగళవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. అన్ని ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టి గెలుపొం దినట్టుగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని, దీనిలో భాగంగానే రెవెన్యూలో అవినీతి అంటూ ఊదరగొడుతన్నా రని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన సైలెంట్ ఓటింగ్ కాంగ్రెస్‌కు లాభిస్తుందన్నారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు పరిపాలన రంగంపై కేసీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని డి.కె.సమరసిం హారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ మాట్లాడిన తీరు ఆయన నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. కలెక్టర్ల అధికారాలను మంత్రులకు కట్టబెట్టి డమ్మీ మంత్రుల తో పరోక్షంగా తానే అధికారం చలాయించాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు. సీఎంల ఇష్టానుసారం చట్టా లు చేయడానికి రాజ్యాంగం ఒప్పుకోదని, అలా చేస్తే కాంగ్రెస్ ఊరుకోదన్నారు. గతంలో ఎన్టీఆర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కోర్టు చీవాట్లు పెట్టింద ని గుర్తు చేశారు. రెవెన్యూను పంచాయతీరాజ్‌లో విలీనం చేయడమంటే గ్రామాల్లో రాజకీయ జోక్యా న్ని ప్రోత్సహించడమేనన్నారు. దీనిపై ఐఏఎస్ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. -
టీడీపీతోనే మంచిపాలన
గద్వాల, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ హయాంలోనే ప్రజలకు మంచిపాలన లభిస్తుందని మాజీ మంత్రి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి డీకే.సమరసింహారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా శుక్రవారం ఉదయం గద్వాలలోని వైఎస్సార్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లోనూ అవినీతి పెచ్చరిల్లిందన్నారు. గద్వాలలో రాజ్యాంగేతర శక్తుల ప్రమేయం పెరిగిపోయి, ప్రజలకు భద్రత లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో రాజ్యాంగేతర శక్తులు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అందువల్ల ప్రజలు టీడీపీని గెలిపించి మంచిపాలనను పొందాలని అన్నారు. సంక్షేమ పథకాల నుంచి కాంట్రాక్ట్ పనుల వరకు అవినీతి పరుల జోక్యం పెరిగిందన్నారు. అధికారులను సైతం బెదిరిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవడానికి వివిధ రకాల బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. విలేకరులు తమకు అనుకూలంగా రాయడం లేదని బహిరంగ వేదికల్లోనే విమర్శించే స్థాయిలో అధికార దాహం నెత్తికెక్కించుకున్నారని, ఇది సరైందికాదని విమర్శించారు. టీడీపీ ప్రజలకు సంక్షేమ పాలన అందించడంతోపాటు, అభివృద్ధిని వేగవంతం చేస్తుందని, ప్రజా పాలన అందించే సత్తా తమకు మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాములు, మున్సిపల్ మాజీ చైర్మన్ అక్కల రమాదేవి, కౌన్సిలర్ అభ్యర్థులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. -
లిక్కర్ మాఫియాకు ధరూరు అడ్డా
ధరూరు, న్యూస్‌లైన్: కృష్ణానది పుణ్యనీళ్లు ప్రవహించే ధరూరు మండలంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోందని మాజీ మంత్రి, టీడీపీ నేత డీకే. సమరసింహారెడ్డి ఆరోపించారు. పాదయాత్ర రెండో రోజు బుధవారం మం డల పరిధిలోని ఈర్లబండ, పాతపాలెం, నీలహళ్లి, నెట్టెం పాడు గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా పై గ్రామాల్లో ఆయన ప్రసంగించారు. అధికారుల, పాలకుల అండదండలతో లిక్కర్ మాఫియా పాగా వేసిందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, గద్వాల నియోజకవర్గంలో దారుణంగా ఉందన్నారు. ప్రజలకు రక్షణ కల్పిం చాల్సి పోలీసువ్యవస్థ పూర్తిగా రాజకీయ కబంద హస్తాల్లో ఉండిపోయిందని విమర్శించారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లినవారిపైనే అక్రమ కేసులు బనారుుంచడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్టులకు అనుమతులు తీసుకువచ్చి జీవోలు విడుదల చేయిస్తే ఇప్పుడున్న నాయకులు తామే చేశామని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. తన హయాంలోనే మండలంలోని 27 గ్రామాలకు మంచినీటిని అందించేందుకు నాగర్‌దొడ్డి తాగునీటి పథకాన్ని ప్రారంభించానన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూ ర్తిగా విఫలమయిందని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీ పీ నాయకులు వేణుగోపాల్, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, పూజారి శ్రీధర్, గంజిపేట రాములు, అమరవాయి కృష్ణారెడ్డి, సలీం, కలీం, మస్తాన్, ప్రభాకర్, భీంరెడ్డి, ఆంజనేయులు, నర్సింహులు, తిమ్మన్న, గుట్టల సుధాకర్, సైకిల్‌షాప్ తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.