పచ్చ నేతల కబ్జాలో ఇసుక, మద్యం.. కోట్లలో వ్యాపారం: వైఎస్సార్‌సీపీ | YSRCP Serious Comments On TDP Leaders Over Sand Mafia | Sakshi
Sakshi News home page

పచ్చ నేతల కబ్జాలో ఇసుక, మద్యం.. కోట్లలో వ్యాపారం: వైఎస్సార్‌సీపీ

Published Wed, Oct 30 2024 11:01 AM | Last Updated on Wed, Oct 30 2024 1:04 PM

YSRCP Serious Comments On TDP Leaders Over Sand Mafia

సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఇసుక మొత్తం కూటమి నేతల కబ్జాలోకి వెళ్లిపోయిందని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. పచ్చ నేతలు ఇసుక, మద్యం వ్యాపారాలను కబ్జాచేసి అక్రమంగా కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. అయినా ప్రభుత్వం ఏమీ తెలియనట్లు నటిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

వైఎస్సార్‌సీపీ ట్విట్టర్‌ వేదికగా.. రాష్ట్రంలో ఇసుక మొత్తం @JaiTDP నేతల కబ్జాలోకి వెళ్ళిపోయింది. ధరను అమాంతం పెంచేసి కోట్లలో దండుకుంటున్నారు. అయినా ప్రభుత్వం ఏమీ తెలియనట్లు నటిస్తోంది.

 ఇసుక, మద్యం వ్యాపారాలను కబ్జా చేసిన @JaiTDP నేతలు ఇప్పుడు ఏకంగా సివిల్ వర్క్స్, నిర్మాణ పనులు చేసే కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. పనులు తమకు అప్పగించి  వెళ్లిపోవాలని హుకుం జారీచేస్తున్నారు. రాక్షస పాలనకు ఇది కదా నిదర్శనం.

 ఊరూరా తయారైన ఇసుకాసురులు.. ఇసుక కావాలంటే @JaiTDP నేతలకి కప్పం కట్టాల్సిందే! అని చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement