cbn govt
-
పచ్చ నేతల కబ్జాలో ఇసుక, మద్యం.. కోట్లలో వ్యాపారం: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఇసుక మొత్తం కూటమి నేతల కబ్జాలోకి వెళ్లిపోయిందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. పచ్చ నేతలు ఇసుక, మద్యం వ్యాపారాలను కబ్జాచేసి అక్రమంగా కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. అయినా ప్రభుత్వం ఏమీ తెలియనట్లు నటిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా.. రాష్ట్రంలో ఇసుక మొత్తం @JaiTDP నేతల కబ్జాలోకి వెళ్ళిపోయింది. ధరను అమాంతం పెంచేసి కోట్లలో దండుకుంటున్నారు. అయినా ప్రభుత్వం ఏమీ తెలియనట్లు నటిస్తోంది.రాష్ట్రంలో ఇసుక మొత్తం @JaiTDP నేతల కబ్జాలోకి వెళ్ళిపోయింది. ధరను అమాంతం పెంచేసి కోట్లలో దండుకుంటున్నారు. అయినా ప్రభుత్వం ఏమీ తెలియనట్లు నటిస్తోంది.#IdhiMunchePrabhutvam#100DaysOfCBNSadistRule#MosagaduBabu#SadistChandraBabu pic.twitter.com/XzHu2XX3D8— YSR Congress Party (@YSRCParty) October 30, 2024 ఇసుక, మద్యం వ్యాపారాలను కబ్జా చేసిన @JaiTDP నేతలు ఇప్పుడు ఏకంగా సివిల్ వర్క్స్, నిర్మాణ పనులు చేసే కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. పనులు తమకు అప్పగించి వెళ్లిపోవాలని హుకుం జారీచేస్తున్నారు. రాక్షస పాలనకు ఇది కదా నిదర్శనం.ఇసుక, మద్యం వ్యాపారాలను కబ్జా చేసిన @JaiTDP నేతలు ఇప్పుడు ఏకంగా సివిల్ వర్క్స్, నిర్మాణ పనులు చేసే కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. పనులు తమకు అప్పగించి వెళ్లిపోవాలని హుకుం జారీచేస్తున్నారు. రాక్షస పాలనకు ఇది కదా నిదర్శనం.#IdhiMunchePrabhutvam#100DaysOfCBNSadistRule… pic.twitter.com/BSpiuSDcsL— YSR Congress Party (@YSRCParty) October 30, 2024 ఊరూరా తయారైన ఇసుకాసురులు.. ఇసుక కావాలంటే @JaiTDP నేతలకి కప్పం కట్టాల్సిందే! అని చెప్పుకొచ్చింది. ఊరూరా తయారైన ఇసుకాసురులు.. ఇసుక కావాలంటే @JaiTDP కి కప్పం కట్టాల్సిందే!#IdhiMunchePrabhutvam#100DaysOfCBNSadistRule#MosagaduBabu#SadistChandraBabu pic.twitter.com/5n2GAFyeP1— YSR Congress Party (@YSRCParty) October 30, 2024 -
పూర్తిగా మైండ్ దొబ్బింది ఫైనల్ స్టేజ్ లో చంద్రబాబు
-
సుప్రీంకోర్టులో సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
-
చంద్రబాబు కుటుంబ సభ్యుల తీరు చూసి నివ్వెరపోతున్న ప్రజలు
-
ఎన్టీఆర్‌పై చెప్పులు విసరడం నా కళ్లారా చూశా: మోహన్ బాబు
తెలుగుదేశం అధినేత, మాజీసీఎం నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో రూ. 371 కోట్లను మళ్లించినట్లు ఏపీ సీఐడీ దర్యాప్తులో తేలింది. ఆ నిధులను షెల్ కంపెనీలకు మళ్లించినట్లు ఏపీ సీఐడీ స్పష్టం చేసింది. ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించింది. పక్కా ప్లానింగ్‌తోనే నిధులు మళ్లించినట్లు తేలిందని ఏపీ సీఐడీ వెల్లడించింది. స్కిల్ స్కాంలో ప్రధాన సూత్రధారి చంద్రబాబేనని, ఆయన కనుసన్నల్లోనే స్కాం జరిగిందని తెలిపింది. ఆనాటి ఒప్పందంతో తమకు సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ చెప్పిందని ఏపీ సీఐడీ పేర్కొంది. కాగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే చంద్రబాబు కేసు నేపథ్యంలో ఆయన గతంలో సీనియర్ ఎన్టీఆర్‌కు మోసం చేసిన సంఘటనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు నిజస్వరూపం గురించి గతంలో టాలీవుడ్ సీనియర్ నటుడు మెహన్‌బాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అప్పట్లో వైశ్రాయి హోటల్ వద్ద అన్నయ్య ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరిన ఘటనను తన కళ్లారా చూశానని వెల్లడించారు. గతంలో మోహన్‌బాబు మాట్లాడుతూ..'చంద్రబాబుకు, నాకు దాదాపు 40 ఏళ్ల అనుబంధం. చంద్రబాబు గురించి మీకంటే నాకే బాగా తెలుసు. అతనికి పుట్టుకతోనే అసత్యాలు మాట్లాడటం నరనరాన జీర్ణించుకుపోయింది. తెలుగులో నంబర్‌వన్ హీరోగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు సినిమాలు మానేసి.. తన కుమారుడు హరికృష్ణతో కలిసి ట్రావెల్ చేస్తూ నిద్రాహారాలు మాని తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఇండియాలోనే ఓ శతాబ్ద పురుషునిగా నిలిచారు. ఆ మహానుభావుడు ఇతనికి కన్యాదానం చేస్తే.. ఆ మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, నా స్నేహితుడు చంద్రబాబు నాయుడు. అంతకంటే ఘోరం ఇంకొకటి ఉంటుందా? నన్ను ఎన్టీఆర్ అన్నయ్య రాజ్యసభ ఎంపీగా పంపారు. కానీ వైస్రాయి హోటల్ దగ్గర జరిగిన ఘటనను కళ్లారా చూసినవాణ్ని నేను. అప్పట్లో ఎన్టీఆర్ అన్నయ్య నేను ఏదైనా తప్పు చేసి ఉంటే చెప్పండి.. నా తప్పును సరిదిద్దుకుంటానని అడిగారు. కానీ అక్కడున్న నేతలు ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరారు. ఆ ఘటనకు నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇదీ చంద్రబాబు నైజం. ఎవరినైనా వాడుకుని కరివేపాకులా వదిలేయడం చంద్రబాబు క్యారెక్టర్. అన్నయ్య స్థాపించిన తెలుగుదేశం కాదు అది. చంద్రబాబు లాక్కున్న తెలుగుదేశం. పంచభూతాల సాక్షిగా ఇదే వాస్తవం. ఎన్టీఆర్ కుటుంబాన్ని నిలువున మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. పచ్చి అబద్ధాలకోరు, నీచుడు చంద్రబాబు. ఒకరిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎలా మంచివాడవుతారు.' అని అన్నారు. -
మూడో కంటికి తెలియకుండా థాయిలాండ్ లో బాబు పర్యటన
-
సుజలం.. విఫలం
మండపేట: అధికారంలోకి వచ్చిన వెంటనే.. ‘ఎన్టీఆర్ సుజల’ పథకం కింద ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందజేస్తామన్న చంద్రబాబు హామీ ఆచరణలోకి వచ్చేసరికి నీరుగారిపోయింది. 2014 అక్టోబరు 4న కపిలేశ్వరపురం మండలం అంగరలో ఏర్పాటు చేసిన తొలి విడత జన్మభూమిలో భాగంగా మొట్టమొదటి ఎన్టీఆర్ సుజల ప్లాంటును చంద్రబాబు ప్రారంభించారు. జిల్లాలో 1072 పంచాయతీలకు గాను తొలిదశలో దాతల సాయంతో 234 ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు ఏర్పాటు చేయగా, రాష్ట్ర అభివృద్ధి నిధులు (ఎస్డీఎఫ్) నుంచి 19 ప్లాంట్లను ఏర్పాటు చేశారు. మరికొన్ని గ్రామాల్లో ఎస్డీఎఫ్ నిధులతో ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించినా నిధుల లేమితో కార్యరూపం దాల్చలేదు. తాగునీటి సమస్య అధికంగా ఉన్న సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయలేదు. నిర్వహణ భారంతో ఇప్పటికే దాదాపు 25 శాతం ప్లాంట్లు మూతపడ్డాయి. రాజోలు నియోజకవర్గంలో మూడు ప్లాంట్లు మూతపడగా, అమలాపురంలో నాలుగు, ముమ్మిడివరంలో రెండు, పి.గన్నవరంలో రెండు ప్లాంట్లు మూతపడ్డాయి. మిగిలిన నియోజకవర్గాల్లోను పలు ప్లాంట్లు మూతపడినట్టు అధికారులు చెబుతున్నారు. అంగరలో సీఎం చంద్రబాబు ప్రారంభించిన సుజల ప్లాంటు మూతపడి ఆరు నెలలు కావస్తోంది. 20 లీటర్లకు రెండు రూపాయలు తీసుకోవాల్సి ఉండగా నిర్వహణ భారంతో కొన్నిచోట్ల రూ.ఐదు నుంచి రూ.10 వరకు తీసుకుంటున్నారు. అడుగుపడని క్లస్టర్లు రెండో విడతగా జిల్లాలోని కోనసీమలో 204 గ్రామాలకు మినరల్ వాటర్‌ను అందించేందుకు అంబాజీపేట, కాట్రేనికోన, పి. గన్నవరం క్లస్టర్లుగా అధికార యంత్రాంగం విభజించింది. రూ.11.53 కోట్ల వ్యయంతో ఆయా చోట్ల మదర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి గ్రామాల్లో డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల ద్వారా రూ.రెండుకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందజేయాలన్నది లక్ష్యం. మదర్ ప్లాంట్ల ఏర్పాటు కోసం మూడు క్లస్టర్ల పరిధిలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు జనవరిలో బోర్లు తీయించారు. నిధుల కొరతతో బోర్ల దశలోనే పనులు నిలిచిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలకు రూ.2కు మినరల్ వాటర్ అందలేదు. పథకం అమలులో చంద్రబాబు సర్కారు వైఫల్యం తమకు మినరల్ వాటర్ అందకుండా చేసిందని ప్రజలు మండిపడుతున్నారు. కేవలం 23 శాతం పంచాయతీల్లో మాత్రమే ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారని విమర్శిస్తున్నారు. ప్రైవేటు ప్లాంట్ల వద్ద 20 లీటర్ల నీటికి రూ.10 నుంచి రూ.30 వరకు వెచ్చించ వలసి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రలోభాల వల.. కాపుల విలవిల..
సాక్షి, ద్రాక్షారామ (తూర్పు గోదావరి): నాలుగన్నరేళ్లపాటు ఎన్నికల హామీల ఊసెత్తని చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంక్షేమ పథకాల జోరు పెంచింది. అయితే ఇందులోనూ మోసానిదే పైచేయిగా నిలుస్తోంది. పథకాలు ప్రకటించడం, అరకొరగా అమలు చేయడం, గొప్పగా అమలు చేసినట్లు ప్రచారం చేసుకోవడం బాబు నైజంగా మారింది. ఇందులో భాగంగానే కాపు రుణాలు భారీగా ఇచ్చినట్లు ప్రచారం చేసుకోవడమే కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. ద్రాక్షారామ డిస్ట్రిక్ట్ కోపరేటివ్ బ్యాంకు పరిధిలో 1200 మంది 2018–19 ఆర్ధిక సంవత్సరంలో కాపు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 150 మందికి ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేసింది. మిగిలిన వారికి నేటికీ సబ్సిడీ విడుదల కాలేదు. ఈ అంశంలో ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యేపై కాపు సామాజికవర్గంలో అంతర్గతంగా వ్యతిరేకత ఏర్పడడంతో సరిదిద్దుకోలేక సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు రుణం సబ్సిడీ విడుదల కాకపోయినా లబ్ధిదారులకు ఫోన్లు చేసి స్టాంపు పేపర్లు తెచ్చుకోవాలని, డాక్యుమెంటేషన్ చేస్తున్నామని తెలపడంతో గురువారం బ్యాంకు వద్ద పోటెత్తారు. దీంతో ఎన్నికల సంఘానికి ‘సీ విజిల్ యాప్’ ద్వారా కాపు కార్పొరేషన్ లబ్ధిదారులను మభ్యపెడుతున్నారని, సొమ్ములు మంజూరు కాకపోయినా డ్యాక్యుమెంటేషన్ పేరుతో త్వరలో లోన్లు వచ్చేస్తాయనే భ్రమ వారికి కలిగేలా చేస్తున్నారని సమాచారం చేరడంతో కాకినాడ కలెక్టర్ కంట్రోల్ రూం నుంచి అందిన ఆదేశాల మేరకు ఫ్లయింగ్‌స్వ్కాడ్ టీం లీడర్ ఆర్.మధుసూదనరావు, ఎంసీసీ టీం లీడర్ పీవీవీ సత్యనారాయణలు తమ సిబ్బందితో బ్యాంకుకు చేరుకుని బ్యాంకు మేనేజర్ వద్ద నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకున్నారు. సబ్బిడీ ఇంకా విడుదల కాని కారణంగా ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఇకపై ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎటువంటి చర్యలు తీసుకోం అంటూ లిఖిత పూర్వక హామీ తీసుకుని ఎన్నికల అధికారులు వెళ్లారు. ఇబ్బందులపాలైన కాపు రుణాల లబ్ధిదారులు.. బ్యాంకు అధికారుల నుంచి వచ్చిన ఫోన్ల మేరకు డాక్యుమెంటేషన్‌కు కావల్సిన స్టాం పు పేపర్లు తీసుకోవడం, పేపర్లు సిద్ధం చేసుకోవడానికి మూడు రోజులుగా పనుల మానుకుని తిరుగుతున్నామని, మరోవైపు సుమారు రూ.1000 వరకు ఖ ర్చులు అయిపోయాయని లబ్ధి దారులు ఆవేదన వ్యక్తం చేశా రు. రుణం సబ్బిడీ మంజూరైన తరువాత చేయాల్సిన డ్యాక్యుమెంటేషన్ కోసం సొమ్ములు విడుదల కాకుండానే తిప్పడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులను మభ్యపెట్టడమే టీడీపీ లక్ష్యం కాపులకు మేలు చేయాలని ఏమాత్రం చిత్తశుద్ధి లేని పార్టీ తెలుగుదేశం. అందుకే కాపు కార్పొరేషన్ రుణాలు మంజూరు చేసినట్లు కాగితాల మీద చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ముందస్తుగా విడుదలైన కాపు రుణాలు టీడీపీ పార్టీ నేతలు పంచుకుని నిజమైన లబ్ధిదారుల వద్దకు వచ్చేసరికి మొండిచేయి చూపించారు. బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు లేకుండా డాక్యుమెంటేషన్ పేరుతో మభ్యపెట్టాలని చూస్తున్నారు. – మాగాపు అమ్మిరాజు, వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి -
అమలు కాని ఎన్నికల కోడ్
సాక్షి, చాట్రాయి: ఎన్నికల కోడ్ సందర్భంగా గ్రామాల్లో రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, ప్రభుత్వ పథకాల ఫ్లెక్సీలు, బోర్డులు తొలగించాలని ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలు అధికారులకు కానరావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలోని చాలా గ్రామాల్లో ప్రభుత్వ ప«థకాలకు సంబంధించిన బోర్డులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రుల ఫోటోలు దర్శనమిస్తున్నాయి. చాలా గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్ల సమాచారం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాలకు పసుపు రంగు వేశారు. ఆ రోడ్లు స్థానిక టీడీపీ నాయకులు ఏర్పాటు చేయడం, వేసిన పసుపు రంగు టీడీపీకీ చెందడంతో ఆ రంగును తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
‘ఓటు’ దూరం..!
ఏలూరు రూరల్: ఎన్నికల అధికారులు టీడీపీ నేతల గుప్పెట్లో బందీలయ్యారు. వారు చెప్పింది, చెప్పినట్టుగా చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు, ఎస్సీ వర్గానికి చెందిన వారి ఓట్ల చిరునామాలు మార్చేస్తున్నారు. దూరపు పోలింగ్‌బూత్‌ల పరిధిలో చేర్చుతున్నారు. ఫలితంగా పోలింగ్ బూత్ దూరమైతే అంతదూరం వెళ్లి ఓటు వేయరనే కుయుక్తితోనే ఇలా చేస్తున్నారనే వాదన వ్యక్తమవుతోంది. ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ బూరాయిగూడెంకు చెందిన కాకి రత్నప్రత్యూష ఇటీవల ఓటు కోసం ఆన్లైన్లో దరకాస్తు చేసుకున్నారు. ఈమెకు వెంకటాపురం పంచాయతీ సుంకరవారిగూడెం చిరునామాతో ఓటు మంజూరైంది. ఆన్లైన్లో పరిశీలించుకున్న ప్రత్యూష మరోసారి చిరునామా మార్పునకు దరఖాస్తు చేశారు. ఈసారి ఏకంగా తంగెళ్లమూడి పంచాయతీ బీడీకాలనీని చిరునామాగా పేర్కొంటూ అధికారులు ఓటు మంజూరు చేశారు. దీనిపై అనుమానం వచ్చి పలువురు బూరాయిగూడెం వాసులు ఓటర్ల జాబితా పరిశీలించగా, చాలా చిరునామాలు తారుమారైనట్టు గుర్తించారు. మరిన్ని ఆధారాలు ఇవిగో.. గత 30 ఏళ్ళుగా బూరాయిగూడెంలో నివాసం ఉంటూ ఓటు వేస్తున్న కొట్టె అవ్వమ్మ ఓటు ఈ సారి ఏలూరు నగరం సెయింట్ గ్జెవియర్ స్కూల్ బూత్‌కు బదిలీ అయ్యింది. - వాసే వెంకటేశ్వరరావు ఓటు సైతం తారుమారైంది. - నాలుగు నెలల క్రితం దాకారపు మాణెమ్మ ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ మంజూరు కాలేదు. వీటిపై వైఎస్సార్కాంగ్రెస్పార్టీ నాయకులు, స్థానిక యువకులు విచారణ చేయగా ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. టీడీపీ నేతల ఇళ్ల వద్దే పరిశీలన వాస్తవానికి ప్రజలు ఓటుకు దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల అధికారి ద్వారా ఏరియా సూపర్వైజర్కు అది చేరుతుంది. సూపర్వైజర్తో పాటు బూత్‌లెవెల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి దరఖాస్తుదారుడు చిరునామా నిర్ధారించుకుని ఓటు మంజూరుకు ఉన్నతధికారులకు సమాచారం ఇవ్వాలి. కానీ క్షేత్రస్దాయి పరిశీలనకు వెళుతున్న సూపర్వైజర్లు, బీఎల్ఓలు స్థానిక టీడీపీ నాయకుల ఇళ్లకు చేరుకుంటున్నారు. వారికి దరఖాస్తుదారుడు వివరాలు చెబుతున్నారు. దీన్ని గ్రహించిన టీడీపీ నేతలు దరఖాస్తుదారుడు తమ పార్టీకి వ్యతిరేకమా, అనూకూలమా గుర్తించి తప్పుడు సమాచారం అందిస్తున్నారు. దీన్ని తీసుకుంటున్న ఎన్నికల అ«ధికారులు అదే సమాచారం ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. ఇలా టీడీపీ నాయకులు తమకు వ్యతిరేకమైన ఓటర్ల చిరునామాలు మార్చేస్తున్నారు. దూరాన ఉన్న బూత్‌లకు బదిలి అయ్యేలా కుట్రలు చేస్తున్నారు. ఫలితంగా ఓటరు విసిగి చెంది ఓటు వేయకుండా ఉంటాడని భావిస్తున్నారు. మరోపక్క మండలంలో కొందరు ఎన్నికల అధికారులు ఫారం–6లను తీసుకుని పంచాయతీ, వీఆర్వో కార్యాలయాల వద్ద కూర్చుని దరఖాస్తుదారుడుకు ఫోన్ చేసి నిర్ధారించుకుంటున్నారు. దరఖాస్తుదారుడు ఫోన్‌కు స్పందించకపోతే అధికారులు తమ ఇస్టానుసారం మార్చేస్తున్నారు. ఫలితంగా మండలంలో వెంకటాపురం, తంగెళ్లమూడి, శనివారపుపేట తదితర గ్రామాల్లో ఓటర్ల చిరునామాలు పెద్ద సంఖ్యలో తారుమారయ్యాయి. మూడుసార్లు చిరునామా మార్చుకున్నా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఏ «అధికారీ మా ఇంటికి వచ్చి పరిశీలన చేయలేదు. నా వివరాలు సేకరించలేదు. మరి నాకు ఓటు ఎలా మంజూరు చేశారో తెలియడం లేదు. ఓటర్ ఐడీలో చిరునామా మార్పు కోసం ఇప్పటికి మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నాను. మొదటసారి సుంకరవారిగూడెం అడ్రస్‌తో ఓటు వచ్చింది. తర్వాత బీడీకాలనీలో వచ్చింది. ఇప్పుడు ఆన్లైన్లో నా ఓటు పరిశీలిస్తే రెండు చిరునామాల్లో ఓటు ఉన్నట్టుగా కనిపిస్తోంది. నేను ఓటు ఎక్కడ వేయాలి. – కాకి రత్నప్రత్యూష, బూరాయిగూడెం నేను ఉంటున్న చోటే ఓటు కావాలి కొన్నేళ్ళుగా నేను, నా భర్త బూరాయిగూడెంలో ఉంటున్నాం. ఎంతోకాలంగా సాయినగర్ బూత్ నెంబర్ 184లో ఓటు వేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా మా ఓట్లు ఏలూరు సెయింట్ గ్జేవియర్లో బూత్‌నెంబర్ 48లో ఉన్నట్లు చూపుతున్నారు. ఓటు కోసం అంతదూరం ఎలా వెళ్లగలం. ఉన్న చోటే మాకు ఓటు కావాలి. దరఖాస్తు చేసుకోవడం మాకు తెలియదు. ఏం చేయాలి. – వాసా ఏడుకొండలు, స్థానికురాలు -
చంద్రబాబు అవకాశవాది: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అవకాశాన్ని బట్టి మాట్లాడే వ్యక్తి అని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం కాదని తెలిసినా ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారని, హోదా వచ్చిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఎన్ని కంపెనీలు స్థాపించారు.. ఎన్ని ఉద్యోగాలొచ్చాయో చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు గత వారం రోజులుగా ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని విజయసాయి రెడ్డి ఆదివారం సందర్శించారు. అనంతరం విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఆ విషయాన్ని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. బంద్‌ల వల్ల ప్రయోజనం లేదని సీఎం అంటున్నారని, అధికారంలో లేని రోజుల్లో టీడీపీ ఎన్నిసార్లు బంద్‌కు పిలుపునిచ్చిందో గుర్తు చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదా కోసం తమతో కలిసివచ్చే ప్రతి పార్టీకి వైఎస్సార్సీపీ మద్ధతుగా నిలుస్తుందని వెల్లడించారు. మీ ఎంపీలు కేవలం కేంద్ర మంత్రి పదవులకే రాజీనామా చేశారని, మీకు హోదాపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎంపీ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
సర్కారు చర్య సిగ్గుచేటు
► ప్రతిపక్ష నేతపై అక్రమ కేసులు బనాయిస్తారా..? ► ప్రభుత్వ తీరుపై వైఎస్సార్ సీపీ మండిపాటు ► నేడు మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు ► విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని పిలుపు ఒంగోలు అర్బన్: ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేయడం, అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు పక్కనపెట్టి అధికారం, స్వార్ధ ప్రయోజనాలే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన మండిపడ్డారు. కృష్ణాజిల్లాలో బుధవారం జరిగిన బస్సు ప్రమాద ఘటనను నీరుగార్చేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని, పోస్టుమార్టం చేస్తే నిజాలు బయటకొస్తాయన్న భయంతోనే నాటకమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిమంది మృతికి కారకుడైన డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయమని అడిగితే అక్రమ కేసులు బనాయిస్తారా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జగన్మోహన్రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా గురువారం అన్ని మండల కేంద్రాల్లోని తహశీల్దారు కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టాలని బాలినేని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.