భోపాల్: మద్యానికి బానిసలైన మగవారివల్ల ఆడవాళ్ల జీవితాలు తలకిందులు అవుతున్నాయని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసింది ఓ గృహిణి. తమ గ్రామంలో మద్యపానంపై నిషేధం విధించాలని కోరింది.
మొరెనా జిల్లా సంకారా గ్రామానికి చెందిన ఈ మహిళ ఫిర్యాదుకు బీజేపీ ఎమ్మెల్యే సుబేదార్ సింగ్ రాజోధా ఇచ్చిన సమాధానం విని ఆమె నివ్వెరపోయింది. స్వయంగా లిక్కర్ కాంట్రాక్టర్ అయిన తాను మద్యాన్ని నిషేధించాలని ఎలా చెప్పగలను అని ఎమ్మెల్యే బదులిచ్చారు. దీంతో ఆ మహిళకు ఏం చేయాలో పాలుపోలేదు.
Women from #Morena village: Shut these #liquor shops in our village#BJP MLA: How can I shut! I, myself, am a liquor contractor.#MadhyaPradesh #MPNews pic.twitter.com/h4U3D2LvoU
— Free Press Madhya Pradesh (@FreePressMP) April 4, 2023
ఇందుకు సంబంధించి ఎమ్మెల్యేతో మహిళ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కేంద్రమంత్రి నరేంద్రసింగ్ థోమర్‌కు ఈయన అత్యంత సన్నిహితుడని పేరుంది. దీంతో సుబేదార్ సింగ్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఫైర్ అయింది.
హస్తంపార్టీ అధికార ప్రతినిధి ప్రతాప్ సింగ్ ఈ విషయంపై స్పందిస్తూ.. శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈయన సర్కార్ రాష్ట్రాన్ని మద్యంలో ముంచెత్తిందని ధ్వజమెత్తారు. లిక్కర్‌ను అక్రమంగా గ్రామాలకు సరఫరా చేసి ఊర్లలో ఏరులై పారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానే లిక్కర్ కాంట్రాక్టర్ అని బహిరంగంగా చెబుతున్న అధికార బీజేపీ ఎమ్మెల్యేను చూస్తుంటే ఈ మాఫియాను నడిపిస్తోంది ఎవరో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్నారు.
చదవండి: బీజేపీలో మున్నాబాయ్ MBBSలు ఎందరో? ఆ ఇద్దరు ఎంపీలు కూడా.. : కేటీఆర్ సెటైర్
Comments
Please login to add a commentAdd a comment