
పాట్నా: మద్య నిషేధం అమలులో ఉన్న బిహార్ రాష్ట్రంలో లిక్కర్ మాఫియా కొత్త కొత్త ఎత్తుగడలతో రెచ్చిపోతోంది. విదేశీ మద్యం సీసాలను నిల్వ ఉంచేందుకు ఏకంగా గ్రామంలోని ఉన్నత పాఠశాలనే గోదాముగా మార్చింది. బిహార్ రాష్ట్ర వైశాలి జిల్లా లాల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బృందావన్ గ్రామ హైస్కూలులో ఈ సంఘటన జరిగింది. పాఠశాలలోని ఓ గదిలో ఏకంగా 140 కాటన్ల అక్రమ మద్యం లభించటం అధికారులు, స్థానికులతో పాటు నెజిటన‍్లను షాక్‌కు గురి చేస్తోంది.
లిక్కర్ కాటన్లను కొందరు దుండగులు రాత్రి సమయంలో పాఠశాలలో దాచి పెట్టినట్లు ప్రధానోపాధ్యాయుడు పవన్ కుమార్ శుక్లా తెలిపారు. స్కూల్‌లోని ఓ గది తాళం పగలగొట్టి బాటిళ్లను అందులో పెట్టాక కొత్త తాళం వేశారని, బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చిన టీచర్ ఆదేశ్‌పాల్ ఈ తాళాన్ని గమనించి, ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. లాల్‌గంజ్ పోలీసులు తాళం పగలగొట్టి చూడగా గదిలో 140 పెట్టెల మద్యం నిల్వ ఉంది. మద్యాన్ని పోలీస్‌స్టేషనుకు తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పాఠశాల గదిలో దాచిన మద్యం పెట్టెలు
ఇదీ చదవండి: ఇదెక్కడి గొడవ.. కారు ఢీకొని గాల్లోకి ఎగిరిపడ్డా తగ్గేదేలే..!
Comments
Please login to add a commentAdd a comment