attack on girl
-
పుట్టపర్తిలో దారుణం..
-
అనకాపల్లిలో మైనర్ బాలిక హత్య కేసులో ముమ్మర దర్యాప్తు
-
అనకాపల్లిలో ప్రేమోన్మాది ఘాతుకం..
-
జైలుకు పంపిందనే కోపంతో బాలికపై దాడి
-
యువతిని ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి.. సాముహిక అత్యాచారం.. ఆపై
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అమానుషం చోటు చేసుకుంది. ఒక యువతిపై మద్యం, డ్రగ్స్ కుటుంబానికి వారు సాముహికంగా అత్యాచారం చేసి, ఆపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ సంఘటన తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా ఉన్న కస్తూర్బా నగర్‌కు చెందిన 20 ఏళ్ల యువతిని అదే ప్రాంతానికి ఉన్న ఒక యువకుడు ప్రేమించాడు. చాలా రోజులు ఆమె వెంటపడ్డాడు. యువతి ప్రేమను అంగీకరించకపోవడంతో విచారంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గతేడాది నవంబరులో జరిగింది. అయితే, తమ కుమారుడి మృతికి ఆ యువతి కారణమని యువకుడి కుటుంబ సభ్యులు ఆమెపై ద్వేషాన్ని పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆయువతిని నిన్న ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చారు. ఆమెను జుట్టుపట్టుకొని కొడుతూ.. నీచంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో కొంత మంది పురుషులు.. ఆ యువతిపై బహిరంగంగానే సాముహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అక్కడ ఉన్న మహిళలు కూడా.. యువతిపై పురుషులు అత్యాచారం చేసేలా ప్రేరేపించారు. ఆమెను నానా దుర్భాషలాడుతూ.... ఆమె జుట్టును కత్తిరించారు. ఆమె ముఖానికి నలుపు రంగు పూశారు. ఆమెను ఇష్టం వచ్చినట్లు కొడుతూ.. అవమానపర్చారు. చెప్పులు, బూట్లతో కొడుతూ.. దండలు చేసి యువతి మెడలో వేసి.. ఊరేగించారు. చనిపోయిన బాలుడు కుటుంబానికి చెందిన వారంతా మద్యం, డ్రగ్స్ వ్యాపారస్తులని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఢిల్లీ మహిళ కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళను పరామర్శించారు. వెంటనే బాధిత యువతిపై దాడిచేసిన వారందరిని అరెస్టు చేయాలని ట్విటర్ వేదికగా ఢిల్లీ పోలీసు అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఘటనపై 72 గంటలలో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు నోటిసులు జారీచేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని పోలీసువారిని ఆదేశించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. कस्तूरबा नगर में 20 साल की लड़की का अवैध शराब बेचने वालों द्वारा गैंगरेप किया गया, उसे गंजा कर, चप्पल की माला पहना पूरे इलाक़े में मुँह काला करके घुमाया। मैं दिल्ली पुलिस को नोटिस जारी कर रही हूँ। सब अपराधी आदमी औरतों को अरेस्ट किया जाए और लड़की और उसके परिवार को सुरक्षा दी जाए। pic.twitter.com/4ExXufDaO3 — Swati Maliwal (@SwatiJaiHind) January 27, 2022 చదవండి: రిపబ్లిక్ డే వేడుకలలో అపశ్రుతి.. తలపై పడిన డ్రోన్ -
బాలికపై మాంత్రికుడి కీచక చేష్టలు
రాజేంద్రనగర్ : మంత్రం వేసి అనారోగ్యాన్ని మాయం చేస్తానని నమ్మించి ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మాంత్రికుడిని నార్సింగి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని 16 సంవత్సరాలు పదో తరగతి చదువుతోంది. వారం రోజుల క్రితం కాళ్లు, చేతులు తరుచు తిమ్మిర్లు పడుతుండడంతో అస్వస్తతకు గురైంది. స్థానికంగా డాక్టర్లకు చూపించినా నయం కాలేదు. దీంతో బాలిక తల్లి నగరంలోని ఆస్పత్రిలో చూపించేందుకు ఆటోలో కూతురుతో కలిసి బయల్దేరింది. ఆటో డ్రైవర్ మాటలు కలిపి ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. తన కూతురు అనారోగ్య పరిస్థితి గురించి వివరించింది. ఆటో డ్రైవర్ హైదర్షాకోట్ ప్రాంతంలోని అబీబ్ అలీఖాన్(48) మంత్రాలు వేసి రోగాలు నయం చేస్తాడని చెప్పాడు. తిమ్మిర్లు మంత్రంతో నయం అవుతాయని నమ్మించాడు. దీంతో బాలిక తల్లి మంత్రగాడి దగ్గరకు తీసుకువెళ్లాలని చెప్పడంతో ఆటో డ్రైవర్ హైదర్షాకోట్లో దించి వెళ్లిపోయాడు. బాలికను పరీక్షించి వరుసగా మూడు రోజులు మంత్రం వేయాలని అబీబ్ అలీఖాన్ తెలిపాడు. మూడ్రోజుల పాటు మంత్రం వేసిన తగ్గకపోవడంతో తల్లి మంత్రగాడిని ప్రశ్నించింది. దీంతో మంత్రం పూర్తిగా శరీరానికి వేయాలని బయట కూర్చోమని తల్లికి సూచించాడు. బాలికను రూమ్‌లోకి తీసుకెళ్లి దుస్తులు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో భయబ్రాంతులకు గురైన విద్యార్థిని ఇంటికి వెళ్లే సమయంలో మాంత్రికుడి కీచక చేష్టలను తల్లికి వివరించింది. మరోసారి అక్కడకు వద్దు బయట తెలిస్తే పరువుపోతుందని తల్లి కూతుళ్లు మిన్నకుండిపోయారు. రెండు రోజుల పాటు రాకపోవడంతో మంత్రగాడు సోమవారం ఉదయం తల్లికి ఫోన్ చేసి రావాలని సూచించాడు. రానని తెలపడంతో బెదిరించాడు. దీంతో తల్లి సోమవారం రాత్రి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఉదయం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
లోకేశ్వరిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): కోటవురట్ల మండలం బీకేపల్లికి చెందిన 13 ఏళ్ల లోకేశ్వరిపై హత్యాయత్నం చేసి, ఆమె తీవ్ర అనారోగ్యం పాలవడానికికారుకులైన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని, అలాగే నిందితులకు సహకరిస్తున్న కోటవురట్ల ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి డిమాండ్ చేశారు. మైక్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోకేశ్వరిని గురువారం ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ జూన్ 10న జరిగిన ఈ సంఘటనపై స్థానిక పోలీసుల తీరు అన్యాయంగా ఉందన్నారు. స్థానిక ఎస్ఐ, సీఐ కనీసం ఇంత వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం నిందితులకు కొమ్ముకాయడమేన్నారు. తక్షణమే ఎస్పీ కలుగజేసుకుని నిందితులపై కేసు నమోదు చేయాలన్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నందున అత్యాధునిక వైద్య సేవలు అందించాలని, కలెక్టర్ జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి సహాయ ని«ధి నుంచి బాధితురాలి వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు. పరామర్శించిన వారులో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ఉన్నారు. -
పెళ్లికొడుకు పరార్.. ప్రియురాలిపై దాడి
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : ప్రియుడి పెళ్లి అడ్డుకున్న యువతిపై పెళ్లికొడుకు బంధువులు దాడికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో చోటుచేసుకుంది. ఏటూరునాగారానికి చెందిన మమత అనే యువతి కరకగూడెం మండలం వెంకటపురానికి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ శివకుమార్ ప్రేమ పేరుతో తనను మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడంటూ పెళ్లిని అడ్డుకుంది. ఆగ్రహించిన యువకుడి తరపు బంధువులు యువతి, ఆమె బంధువులపై దాడికి పాల్పడ్డారు. ఈ గొడవతో వరుడు శివకుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. తనను ప్రేమించి మరొకరితో పెళ్లికి సిధ్దపడ్డాడని, కోరుకున్న వాడితో తనకు పెళ్లి జరిపించాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
మాజీ ప్రేయసిని చంపబోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
ఇద్దరు ఒకప్పుడు గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ ఆ తర్వాత విడిపోయారు. ఇప్పుడు ఒకే ఆఫీసులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఫోన్ నెంబర్ ఇవ్వమని మాజీ ప్రియుడు అడిగితే.. నీకూ నాకూ కటీఫ్ కాబట్టి ఇక నా నంబర్ ఎందుకు, ఇవ్వబోనని ఆమె తెగేసి చెప్పింది. అతడు ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం వచ్చింది. దాంతో ఒక్కసారిగా కోపం వచ్చిన ప్రియుడు తాము వెళ్తున్న కారులోనే ఆమెపై దాడికి దిగాడు. విచక్షణా రహితంగా కొట్టడంతో పాటు కారులోంచి బయటకు తోసేసే ప్రయత్నం చేశాడు. ఇదంతా మహారాష్ట్రలోని పుణె నగరంలో జరిగింది. మగర్‌పట్ట సిటీలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న జుబై పటేల్ (25) అనే వ్యక్తి, తన మాజీ ప్రియురాలిపై దాడి చేసినందుకు అతడిపై ఖడ్కి పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. రాత్రి షిఫ్టు ముగించుకుని తిరిగి వస్తుంటే కారులో ఇద్దరి మధ్య ఫోన్ నంబర్ విషయమై గొడవ జరిగింది. ఎన్నిసార్లు అడిగినా ఆమె మాత్రం తన కొత్త నంబర్ ఇచ్చేది లేదని చెప్పడంతో అతడికి బాగా కోపం వచ్చింది. ఆమెను కారులో విపరీతంగా కొట్టి, తలుపు తెరిచి కిందకు తోసేయబోయాడు. దాంతో భయపడిన డ్రైవర్ కారును ఆపగా, అమెను జుట్టుపట్టుకుని బయటకు ఈడ్చేశాడు. ఆమె కడుపులో కొడుతూ.. చివరకు పీకనొక్కేయడానికి కూడా ప్రయత్నించాడు. అంతలో ఇతరులు వచ్చి విడదీశారు. ఆమె స్పృహతప్పి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. నిందితుడి మీద హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్పటారు. కొన్నేళ్ల క్రితం వరకు వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ, పటేల్ తల్లిదండ్రులకు వాళ్ల పెళ్లి ఇష్టం లేకపోవడంతో విడిపోయారు. పటేల్ మాత్రం పెళ్లి మాట ఎలా ఉన్నా కొన్నాళ్లు కలిసుందామని ప్రతిపాదించాడు. దానికి ఆమె అంగీకరించలేదు. దాంతో ఇద్దరి మధ్య విడిపోదామంటూ ఒక ఒప్పందం కూడా కుదిరింది. తాను ఆమెతో మాట్లాడదామని ప్రయత్నించినా ఆమె ఒప్పుకోకపోవడంతో నిరాశ చెందానని, అందుకే ఆమెను చంపేయాలనుకున్నానని పోలీసుల విచారణలో పటేల్ చెప్పాడు.