లోకేశ్వరిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి | Those Who Attacked Lokeshwari Should Be Arrested | Sakshi
Sakshi News home page

లోకేశ్వరిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి

Published Fri, Jun 15 2018 2:36 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

Those Who Attacked Lokeshwari Should Be Arrested - Sakshi

లోకేశ్వరిని పరామర్శిస్తున్న ప్రభావతి 

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): కోటవురట్ల మండలం బీకేపల్లికి చెందిన 13 ఏళ్ల లోకేశ్వరిపై హత్యాయత్నం చేసి, ఆమె తీవ్ర అనారోగ్యం పాలవడానికికారుకులైన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని, అలాగే నిందితులకు సహకరిస్తున్న కోటవురట్ల ఎస్‌ఐని  సస్పెండ్‌ చేయాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి డిమాండ్‌ చేశారు.

మైక్యూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోకేశ్వరిని గురువారం ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ జూన్‌ 10న జరిగిన  ఈ సంఘటనపై స్థానిక పోలీసుల తీరు అన్యాయంగా ఉందన్నారు. స్థానిక ఎస్‌ఐ, సీఐ కనీసం ఇంత వరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం నిందితులకు కొమ్ముకాయడమేన్నారు.

తక్షణమే   ఎస్పీ కలుగజేసుకుని నిందితులపై  కేసు నమోదు చేయాలన్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నందున  అత్యాధునిక వైద్య సేవలు అందించాలని, కలెక్టర్‌  జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి సహాయ ని«ధి నుంచి బాధితురాలి   వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్‌ చేశారు. పరామర్శించిన వారులో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement