సాక్షి, విశాఖపట్నం: వన్‌టౌన్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ బర్రి రమేష్ మృతికేసును పోలీసులు చేధించారు. రమేష్ మృతి కేసులో అతడి భార్య శివజ్యోతి అలియాస్ శివానినే హంతకురాలిగా పోలీసులు తేల్చారు. ప్రియుడి మోజులో పడి శివాని.. రమేష్‌ను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు విశాఖ నగర కమిషనర్ త్రివిక్రమ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.
ఈ క్రమంలో సీపీ త్రివిక్రమ్ వర్మ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కానిస్టేబుల్ రమేష్‌ను అతడి భార్య శివాని హత్య చేయించింది. మూడు రోజుల క్రితం రమేష్ అనుమానాస్పదంగా మృతిచెందాడని శివాని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రమేష్ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో డెడ్‌బాడీని పోస్టుమార్టంకు పంపించాం. రిపోర్టులో రమేష్.. ఊపిరాడక చనిపోయినట్టు తేలింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో లోతుగా విచారణ చేపట్టాం.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా భార్య శివానినే ప్రియుడి కోసం భర్త రమేష్‌ను చంపించింది. మూడు రోజుల క్రితం రమేష్‌తో మద్యం తాగించి వీడియో తీసింది. ఆ తర్వాత రమేష్ పడుకునే వరకు ప్రియుడు రామారావు బయటే ఉన్నాడు. అనంతరం, ఇంట్లోకి వెళ్లిన రామారావు, అతడి స్నేహితుడు రమేష్‌ను దిండుతో నొక్కి చంపాడు. ఆ సమయంలో రమేష్ కాళ్లు కదలకుండా భార్య శివానీ అతడిని పట్టుకుంది. కాగా, రమేష్‌ను చంపేందుకు నీలా అనే వ్యక్తికి లక్ష రూపాయలు సుపారీ ఇచ్చారు.
అయితే.. రమేష్, శివానీ ప్రేమ వ్యవహారంపై గతంలో అనేక గొడవలు జరిగాయి. పిల్లల్ని వదిలి ప్రియుడితో వెళ్లిపోవాలని రమేష్ కోరాడు. కాగా, తమ వ్యవహారానికి రమేష్ అడ్డుగా ఉన్నారని వారిని చంపేశారు. ఇక, శివాని.. రామారావుకు బంగారం తాకట్టు పెట్టి లక్షన్నర ఇచ్చింది. శివానికి నేర స్వభావం ఉంది. ఆమె తల్లిదండ్రులతో సైతం గొడవలు ఉన్నాయి. ఈ కేసులో ఏ1గా భార్య శివాని, ఏ2గా ప్రియుడు రామారావు, ఏ3గా నీలాను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: యువతిని రూమ్‌కు తీసుకెళ్లి.. కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఫొటోలు.. ఆపై..
Comments
Please login to add a commentAdd a comment