సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : ప్రియుడి పెళ్లి అడ్డుకున్న యువతిపై పెళ్లికొడుకు బంధువులు దాడికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో చోటుచేసుకుంది. ఏటూరునాగారానికి చెందిన మమత అనే యువతి కరకగూడెం మండలం వెంకటపురానికి చెందిన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ శివకుమార్ ప్రేమ పేరుతో తనను మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడంటూ పెళ్లిని అడ్డుకుంది.
ఆగ్రహించిన యువకుడి తరపు బంధువులు యువతి, ఆమె బంధువులపై దాడికి పాల్పడ్డారు. ఈ గొడవతో వరుడు శివకుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. తనను ప్రేమించి మరొకరితో పెళ్లికి సిధ్దపడ్డాడని, కోరుకున్న వాడితో తనకు పెళ్లి జరిపించాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
పెళ్లికొడుకు పరార్.. ప్రియురాలిపై దాడి
Published Wed, Feb 7 2018 4:42 PM | Last Updated on Mon, Jul 29 2019 6:54 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment