మోసం చేసిన మహిళపై కేసు
బంజారాహిల్స్: వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయలను అప్పుగా తీసుకుని మోసం చేసిన మహిళపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్డునంబర్–14లోని శ్రీ వేంకటేశ్వరనగర్ బస్తీలో కొడాలి శ్రీలక్ష్మి అనే మహిళ 15 ఏళ్లుగా అద్దెకు ఉంటూ స్థానికంగా నమ్మకంగా ఉంటోంది. వడ్డీలు ఇస్తానంటూ పలువురి నుంచి డబ్బులు తీసుకునేది. మొదటి రెండు నెలలు వడ్డీ సక్రమంగా ఇచ్చి ఇతరులకు ఆశ లు పెంచేది.
దీంతో చాలామంది వడ్డీ వస్తుందనే ఆశతో డబ్బులు ఇచ్చేవారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో కొన్నేళ్లుగా టెలిఫోన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శ్రీలక్ష్మీ ఇదే ఆస్పత్రిలో పనిచేస్తున్న చాలామందిని సైతం మోసం చేసింది. తన కొడుకు ఫీజు చెల్లించాలంటూ వట్టికొండ రంగనాథ్ నుంచి రూ.4.75 లక్షలు అప్పుగా తీసుకుని ప్రాంసరీ నోట్ రాసిచి్చంది.
అయితే ఏళ్లు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోగా భర్త సత్యప్రకాశ్‌తో కలిసి బెదిరింపులకు పాల్పడేది. వీరికి ఇంటి యజమానురాలు పద్మ కూడా వంతపాడేది. డబ్బులు ఇచి్చన వారు ఇంటికి వస్తే పద్మ వారిని బెదిరింపులకు గురిచేసేది. బస్తీతో పాటు బసవతారకం ఆస్పత్రి ఉద్యోగుల నుంచి రూ.3 కోట్లు వసూలు చేసి బిచాన ఎత్తేసింది. మోసపోయామని గ్రహించిన సుమారు 50 మంది బాధితులు ఆధారాలతో సహా బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో వారు శ్రీలక్ష్మీతో పాటు ఆమె భర్త సత్యప్రసాద్, ఇంటి యజమానురాలు పద్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment