ఓక్లహామా : అమెరికా ఓక్లహామాలోని యాకూన్ పాఠశాలలో కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేస్తున్న హంటర్ డే (24) అనే మహిళను అక్రమ లైంగిక సంబంధాలు, నగ్న ఫొటోల మార్పిడి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థి మొబైల్ ఫోన్‌ను తల్లిదండ్రులు అనుకోకుండా చూడడంతో ఈ వ్యవహరం బట్టబయలైంది. సెక్స్ చాటింగ్, న్యూడ్ ఫొటోల షేరింగ్ చేసుకుంటున్నట్లు బయటపడింది. అంతేకాక ఇద్దరి మధ్య అక్రమ లైంగిక సంబంధాలు ఏర్పడ్డట్లు విద్యార్థి తల్లిదండ్రులు గుర్తించారు. తమ కుమారుడిని హంటర్ డే లైంగికంగా వాడుకుంటోందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. పోలీసులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న విషయం తెలియని హంటర్ డే.. ఎప్పటిలానే లైంగిక కలయిక కోసం.. మైనర్ విద్యార్థికి మెసేజ్ చేశారు. విద్యార్థి కూడా వెంటనే స్పందించారు. అనుకున్న సమయానికి హంటర్ డే ఇంటికి విద్యార్థి వెళ్లాడు. క్యాండిల్ లైట్ వెలుగులో ఇద్దరూ శృంగారం జరుగుతున్న సమయంలో పోలీసులు ఎంటరై అమెను రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.
హంటర్ డే చర్యపై స్కూల్ యాజమాన్యం, ఇతర ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. అధ్యాపకుల మీద నమ్మకంతో విద్యార్థులను స్కూలకు పంపితే.. ఇటువంటి చర్యలకు దిగడం విద్యావ్యవస్థకే మచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉండగా హంటర్ డేను స్కూల్ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment