న్యూఢిల్లీ: శృంగార కార్యకలాపాల్లో పాల్గొనే విషయంలో ‘సమ్మతి వయసు’ను తగ్గించాలన్న వాదనను లా కమిషన్ వ్యతిరేకించింది. ఈ విషయంలో ఎలాంటి మార్పులు చేయొ ద్దని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది.
లైంగిక హింస నుంచి చిన్నారులకు రక్షణ కలి్పంచేందుకు తీసుకొచ్చిన పోక్సో చట్టం ప్రకారం.. శృంగారానికి సమ్మతి వయసు ప్రస్తుతం 18 ఏళ్లుగా ఉంది. దీన్ని 16 ఏళ్లకు తగ్గించాలన్న వినతులు వచ్చాయి. లా కమిషన్ తన నివేదికను తాజాగా కేంద్రప్రభుత్వానికి సమర్పించింది. పోక్సో చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వయసు వారంతా బాలలే. వారిపై అత్యాచారానికి, లైంగిక నేరాల కు పాల్పడితే 20 ఏళ్లకుపైగా జైలు శిక్ష విధించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment