Law Commission of India
-
Law Commission: 2029 నుంచే జమిలి ఎన్నికలు!
న్యూఢిల్లీ: లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. జమిలి ఎన్నికలు వచ్చే ఏడాది సాధ్యం కాదని లా కమిషన్ తేలి్చచెప్పినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై జస్టిస్ రితూరాజ్ అవస్థీ నేతృత్వంలోని లా కమిషన్ అధ్యయనం చేస్తోంది. 2029 నుంచి లోక్‌సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా కమిషన్ ఓ ఫార్ములాను ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. దాని ప్రకారం.. కొన్ని రాష్ట్రాల శాసనసభల కాలపరిమితిని పొడిగించాలి. మరికొన్ని రాష్ట్రాల శాసనసభల కాలపరిమితిని తగ్గించాలి. ఈ ఫార్ములాతోజమిలి ఎన్నికలు నిర్వహించడం సులువేనని లా కమిషన్ నిర్ణయానికి వచి్చనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జమిలి ఎన్నికలపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని సైతం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఓటర్ల జాబితాతో మేలు ఓటర్ల జాబితా విషయంలోనూ లా కమిషన్ కీలక సిఫార్సును తెరపైకి తీసుకొస్తోంది. లోక్‌సభ, శాసనసభలు, స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రస్తుతం వేర్వేరు ఓటర్ల జాబితాలను ఉపయోగిస్తున్నారు. వీటిని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రాల ఎన్నికల సంఘాలు రూపొందిస్తున్నాయి. అన్ని రకాల ఎన్నిలకు ఒక ఉమ్మడి ఓటర్ల జాబితా ఉండాలన్నదే లా కమిషన్ ఉద్దేశమని సమాచారం. దీనివల్ల ఖర్చు, మానవ వనరుల వినియోగం గణనీయంగా తగ్గుతాయని అభిప్రాయపడుతోంది. ఉమ్మడి ఎన్నికల జాబితా కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని చెబుతోంది. జమిలి ఎన్నికల ప్రక్రియలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్ బూత్‌కు కేవలం ఒకే ఒక్కసారి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని లా కమిషన్ సూచిస్తోంది. అంటే ఒకే పోలింగ్ బూత్‌లో ఒకేసారి రెండు ఎన్నికల్లో ఓట్లు వేసేలా ఏర్పాట్లు ఉండాలని చెబుతోంది. జమిలి ఎన్నికలపై లా కమిషన్ సిఫార్సులు కొన్ని అనధికారికంగా బయటకు వచి్చనప్పటికీ తుది నివేదిక ఇంకా సిద్ధం కాలేదు. ఇంకా కొన్ని అంశాలపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది వ్యవధిలో రెండు దశలు లోక్‌సభ, శాసనసభలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధ్యయనం బాధ్యతను రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీకి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. లా కమిషన్ మాత్రం ఏకకాలంలో లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు నిర్వహించడంపై అధ్యయనం చేస్తోంది. కోవింద్ కమిటీ ఏర్పాటు నేపథ్యంలో లా కమిషన్ కూడా మూడు రకాల ఎన్నికలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. లోక్‌సభ, శాసనసభల ఎన్నికలను ఒక దశలో, స్థానిక సంస్థల ఎన్నికలను రెండో దశలో నిర్వహించాలని లా కమిషన్ అభిప్రాయపడుతోంది. -
దశల వారీగా ఈ–ఎఫ్ఐఆర్ల రిజిస్ట్రేషన్
న్యూఢిల్లీ: దేశంలో ఈ–ఎఫ్ఐఆర్ల (ఎల్రక్టానిక్ ప్రాథమిక సమాచార నివేదిక) రిజి్రస్టేషన్ ప్రక్రియను దశల వారీగా అమల్లోకి తీసుకురావాలని లా కమిషన్ సూచించింది. ఈ మేరకు తన నివేదికను ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. తొలుత మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే నేరాల్లో ఈ–ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని వెల్లడించింది. ఈ–ఎఫ్ఐఆర్ల రిజిస్ట్రేషన్ కోసం దేశవ్యాప్తంగా కేంద్రీకృత జాతీయ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించింది. -
శృంగారానికి సమ్మతి వయసు మార్చొద్దు
న్యూఢిల్లీ: శృంగార కార్యకలాపాల్లో పాల్గొనే విషయంలో ‘సమ్మతి వయసు’ను తగ్గించాలన్న వాదనను లా కమిషన్ వ్యతిరేకించింది. ఈ విషయంలో ఎలాంటి మార్పులు చేయొ ద్దని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. లైంగిక హింస నుంచి చిన్నారులకు రక్షణ కలి్పంచేందుకు తీసుకొచ్చిన పోక్సో చట్టం ప్రకారం.. శృంగారానికి సమ్మతి వయసు ప్రస్తుతం 18 ఏళ్లుగా ఉంది. దీన్ని 16 ఏళ్లకు తగ్గించాలన్న వినతులు వచ్చాయి. లా కమిషన్ తన నివేదికను తాజాగా కేంద్రప్రభుత్వానికి సమర్పించింది. పోక్సో చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వయసు వారంతా బాలలే. వారిపై అత్యాచారానికి, లైంగిక నేరాల కు పాల్పడితే 20 ఏళ్లకుపైగా జైలు శిక్ష విధించవచ్చు. -
2024లోగా జమిలి ఎన్నికలు సాధ్యం కాదు: లా కమిషన్
-
జమిలి ఎన్నికలపై లా కమిషన్ కీలక ప్రకటన..
సాక్షి, ఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదని లా కమిషన్ తేల్చి చెప్పింది. దీంతో, 2024లో జమిలి ఎన్నికలు ఉండవని తెలుస్తోంది. ప్రతీసారిలాగే ఈసారి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే, 2024లో లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని లా కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో 2029 నుంచి లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేలా లా కమిషన్ ఓ ఫార్ములా రూపొందిస్తున్నట్లు స్పష్టం చేసింది. వీటిపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ కసరత్తు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అలాగే, జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక 2024 లోక్‌సభ ఎన్నికలలోగా ప్రచురించే అవకాశం ఉందని లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రుతురాజ్ అవస్ధి ఇటీవల వెల్లడించారు. ఏకకాల ఎన్నికలపై కసరత్తు ఇంకా జరుగుతున్నందున నివేదిక పనులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. దేశంలో జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణలను ఈ నివేదిక ప్రభుత్వానికి సూచిస్తుందని తెలిపారు. ఇక, జమిలి ఎన్నికలపై లోతుగా చర్చించాలని కమిషన్ సూచించింది. గత ఏడాది డిసెంబర్లో 22వ లా కమిషన్ జమిలి ఎన్నికల ప్రతిపాదనపై జాతీయ రాజకీయ పార్టీలు, ఈసీ, అధికారులు, విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయాలు కోరేందుకు ఆరు ప్రశ్నలను రూపొందించింది. On One Nation One Election, The Law Commission of India says, "The consultations with regard to the finalisation of the report on One Nation One Election would require some more meetings. We believe that certain Constitutional amendments would make the process of One Nation One… — ANI (@ANI) September 29, 2023 ఇది కూడా చదవండి: ఇస్కాన్‌పై సంచలన ఆరోపణలు.. మేనకా గాంధీకి బిగ్ షాక్ -
ప్రక్షాళన అవసరమే కానీ...
ఎప్పుడో 19వ శతాబ్దంలో తొలిసారిగా చట్టంగా రూపుదాల్చిన భారత నేరసంహితను సమూలంగా మార్చేందుకు ఒక అడుగు ముందుకు పడింది. భారత క్రిమినల్ న్యాయ వ్యవస్థను మారుస్తూ,కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 11న లోక్‌సభలో మూడు కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) –1860 స్థానంలో ‘భారతీయ న్యాయ సంహిత’, తొలిసారిగా 1898లో చట్టమై ఆనక కొద్దిగా మార్పులు జరిగిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) – 1973 బదులు ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ – 1872 స్థానంలో ‘భారతీయ సాక్ష్య బిల్లు’ రానున్నాయి. మధ్యలో కొద్ది మినహా గణనీయమైన మార్పులేమీ చేయని భారత సర్కార్ 160 ఏళ్ళ పైచిలుకు క్రితం బ్రిటీషు వారి చట్టాలను సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మార్చాలను కోవడం సహేతుకమే. అయితే, కొత్త బిల్లుల్ని తీసుకొచ్చే ముందు న్యాయనిపుణులతో, ప్రతిపక్షా లతో ఎంత లోతుగా చర్చించారు? ఇది ప్రశ్నార్థకం. ఈ పరిస్థితుల్లో 3 బిల్లుల్నీ సమీక్షించి, సిఫా ర్సులు చేయడానికి ప్రభుత్వం వాటిని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపడం స్వాగతనీయం. బిల్లుల్లోని అంశాలపై ప్రజలతో సంప్రతింపులు జరిపి, సిఫార్సులు చేసేందుకు కరోనా కాలంలో 2020 మేలో ప్రభుత్వం నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ సంప్రతింపుల ప్రక్రియ విధి విధా నాలు అయోమయమే. వచ్చిన అభ్యర్థనల్ని పరిశీలించి, విశ్లేషించడానికి సదరు నిపుణుల సంఘం ఏ పద్ధతిని అనుసరించిందీ తెలీదు. ఆ నిపుణుల సంఘం ప్రభుత్వానికి ఇచ్చిన సిఫార్సుల్ని ప్రజాక్షేత్రంలో పెట్టనేలేదు. వచ్చిన సిఫార్సులకూ, ప్రభుత్వం బిల్లుల్లో పెట్టిన అంశాలకూ పొంతన ఉండివుండ దని కూడా నిపుణుల మాట. ఇన్ని లోపాలున్నాయి గనకే కొత్త బిల్లుల సామర్థ్యం సందేహాస్పాదం. బ్రిటీషు పాలనా అవశేషాలను తొలగించడమే ధ్యేయమంటూ మోదీ సర్కార్ చెబుతున్న మాట లకూ, కొత్త చట్టాల్లో నిజంగా ఉన్న అంశాలకూ మధ్య ఎంత పొంతన ఉందో చెప్పలేం. క్రిమినల్ న్యాయ వ్యవస్థకు ఈ ప్రక్షాళన సర్వరోగ నివారణి అంటున్నా అదీ అనుమానమే. ఎందుకంటే, పాత చట్టాల్లోని అనేక అంశాలు యథాతథంగా ఈ కొత్త బిల్లుల్లోనూ చోటుచేసుకున్నాయి. కొన్ని మార్పులు ప్రతిపాదించారు కానీ, అవి వ్యవస్థలోని సంక్షోభంపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో చెప్పలేం. పైపెచ్చు, కొత్త బిల్లులు ప్రతిపాదించిన కొన్ని మార్పులు ఆందోళన రేపుతున్నాయి. పాత రాజద్రోహ చట్టాన్ని తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి, సామాజిక కార్య కర్తలు, జర్నలిస్టులపై తరచూ దుర్వినియోగమవుతున్న ఈ చట్టానికి గత ఏడాది మేలోనే సుప్రీమ్ కోర్ట్ అడ్డుకట్ట వేసి, సమీక్షను పెండింగ్‌లో పెట్టింది. లా కమిషన్ మాత్రం ఐపీసీలో రాజద్రోహానికి సంబంధించిన ‘సెక్షన్ 124ఏ’ను కొనసాగించాలనీ, శిక్షను పెంచాలనీ రెండునెలల క్రితం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ సెక్షన్‌ను తొలగించాలని సర్కార్ నిర్ణయించడం ఆశ్చర్యమే. లార్డ్ మెకాలే 1837లో రూపకల్పన చేయగా, 1862లో అమలులోకి వచ్చిన ఐపీసీలో రాజద్రోహ చట్టం లేదు. 1870లో దాన్ని చేర్చి, స్వాతంత్య్ర సమరాన్ని అణిచేసేందుకు విస్తృతంగా వినియోగించారు. 1898లో పరిధిని విస్తరించారు. స్వాతంత్య్రం వచ్చాకా ఈ చట్టం కొనసాగుతూ వచ్చింది. దాని రాజ్యాంగబద్ధతపై కోర్టులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. కొత్త బిల్లులో రాజద్రోహమనే పేరు తొలగించినా, సార్వభౌమాధికారానికి హానికారక చర్యలు శిక్షార్హమంటూ కొత్త మాట తగిలించారు. ఏ చర్యలు ఈ నేరమనేది స్పష్టత లేనందున పోలీసుల ఇష్టారాజ్యపు అరెస్ట్‌లకు అధికారం దఖలు పడుతోంది. అలాగే, ఇప్పటి దాకా ఐపీసీలో లేని వ్యవస్థీకృత నేరం, తీవ్రవాద నేరాలు, మూకదాడి లాంటివీ కొత్తగా చేర్చారు. వివాదాస్పద ‘ఉపా’ చట్టం నుంచి తీసుకున్నవీ ఇందులో ఉండడం విషాదం. అలాగే, సీఆర్పీసీ కింద అరెస్టయిన వ్యక్తిని గరిష్ఠంగా 15 రోజులే పోలీస్ కస్టడీలో ఉంచవచ్చు. కొత్త చట్టంలో చేసిన నేరాన్ని బట్టి 60 నుంచి 90 రోజుల దాకా కస్టడీని పొడిగించవచ్చు. ఇదీ దుర్విని యోగమయ్యే ముప్పుంది. అయితే ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఎఫ్ఐఆర్ నమోదు అవకాశమివ్వడం, పోలీసు సోదా – స్వాధీనాల వేళ తప్పనిసరి వీడియో రికార్డింగ్ లాంటివి బాధితుల హక్కుల్ని కాపాడతాయి. ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాల్ని వినియోగిస్తూ, ఫోరెన్సిక్స్‌కు పెద్ద పీట వేయడం బాగానే ఉన్నా, ఆ సాక్ష్యాల సేకరణ, విశ్లేషణ, వాటిని కోర్టుల్లో వినియోగించే తీరుపై స్పష్టత లేదు. విచారణతోనే జైళ్ళలో మగ్గుతున్న జనం, క్రిక్కిరిసిన జైళ్ళ లాంటి దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దిశగా ఆలోచించ లేదు. బెయిల్ నిర్ణయంలో చేపట్టాల్సిన సంస్కరణల్ని పట్టించుకోలేదు. ప్రస్తుతం మన కోర్టుల్లో 4.7 కోట్లపైగా కేసులు పెండింగ్‌లో ఉంటే, మూడింట రెండొంతులు క్రిమినల్ కేసులే. క్రిమినల్ న్యాయవ్యవస్థలో సంస్కరణలపై జస్టిస్ మలిమత్ కమిటీ తన నివేదికను సమర్పించి రెండు దశాబ్దాలు దాటింది. 2007లో మాధవ్ మీనన్ కమిటీ సహా అనేకం వచ్చాయి. చివరకిప్పుడు రథం కదిలింది. కానీ, ఇంగ్లీష్ పేర్లు తీసేసి సంస్కృత, హిందీ పేర్లు పెట్టి, కొత్త సీసాలో పాత సారా నింపితే లాభం లేదు. దశాబ్దాల తర్వాతి ఈ ప్రయత్నమూ చిత్తశుద్ధి లోపించి, అసంతృప్తినే మిగిలిస్తే అంతకన్నా అన్యాయం లేదు. కొత్త చట్టాలకు సర్కార్ మరింత కసరత్తు చేయాలి. పార్లమెంట్లో క్షుణ్ణంగా చర్చించాలి. నేరన్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరమే కానీ, వట్టి చట్టాలు మారిస్తే సరిపోదు. వ్యవస్థకూ, పౌరులకూ మధ్య బంధంలో మార్పు తేవాలి. అప్పుడే వలసవాద వాసనలు వదులుతాయి. అలాకాక ఎన్నేళ్ళయినా పాత పాలకులనే నిందించడం అసమంజసం. అది ఇన్నేళ్ళ సొంత తప్పుల్ని కాలమనే తివాచీ కిందకు నెట్టేసే విఫలయత్నమే! -
దేశద్రోహానికి ఏడేళ్ల జైలు శిక్ష
న్యూఢిల్లీ: దేశద్రోహం కేసుల్లో దోషులకు విధించే జైలుశిక్షను కనిష్టంగా మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ పెంచాలని భారత న్యాయ కమిషన్ సిఫార్సు చేసింది. దీనివల్ల నేర తీవ్రతను బట్టి శిక్ష విధించే అవకాశం న్యాయస్థానాలకు లభిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు ఈ నివేదికను న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ రితూరాజ్ అవస్థీ (రిటైర్డ్) ఇటీవల కేంద్ర న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్కు సమర్పించారు. దేశద్రోహానికి జైలు శిక్షను ఏడేళ్లకు పెంచాలంటూ న్యాయ కమిషన్ సిఫార్సు చేయడాన్ని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ తప్పుబట్టారు. దేశద్రోహ చట్టాన్ని మరింత క్రూరంగా మార్చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. మెక్సికోలో కలకలం.. -
విమర్శిస్తే దేశద్రోహం కాదు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశాన్ని విమర్శించినంత మాత్రన దేశద్రోహంగా పరిగణించరాదని. హింస, చట్టవిరుద్ధ మార్గాల్లో ప్రభుత్వాన్ని కూలదోసే ఉద్దేశం ఉన్నట్టు వెల్లడైతేనే దేశద్రోహంగా పరిగణించాలని లా కమిషన్ స్పష్టం చేసింది. బ్రిటన్ నుంచి మనం ఐపీసీ సెక్షన్ 124ఏను సంగ్రహించగా ఆ దేశం పదేళ్ల కిందటే దేశద్రోహ చట్టాలను రద్దు చేసిందని పేర్కొంది. అలాంటి నియంతృత్వ చట్టాలను కొనసాగించేందుకు బ్రిటన్ సుముఖంగా లేదని తెలిపింది. దేశద్రోహంపై సలహా పత్రంపై లా కమిషన్ ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ వంటి దేశాల్లో రాజ్యాంగం ప్రాథమిక హక్కులుగా గుర్తించిన భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించేలా దేశద్రోహ చట్టాలను పునర్నిర్వచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. దేశాన్ని విమర్శించడం దేశద్రోహంగా పరిగణించరాదని, సానుకూల విమర్శలను దేశం స్వాగతించకుంటే స్వాతంత్ర్యం రాకముందు, వచ్చిన తర్వాత పరిస్థితులకు పెద్దతేడా ఉండదని వ్యాఖ్యానించింది. విమర్శించే హక్కు, సమర్ధించుకునే హక్కు భావప్రకటనా స్వేచ్ఛ కింద కాపాడాలని సలహా పత్రంలో లా కమిషన్ పేర్కొంది. -
జమిలి ఎన్నికలకు సై : వైఎస్సార్ సీపీ
సాక్షి, న్యూఢిల్లీ : ఒకే దేశం-ఒకే ఎన్నికలను(జమిలి ఎన్నికలు) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమర్ధిస్తోందని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి దృష్ట్యానే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. మంగళవారం లా కమిషన్‌తో పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సమావేశమయ్యారు. జమిలి ఎన్నికలను ఉద్దేశించి పార్టీ తరఫున తొమ్మిది పేజీల సూచనలను సమర్పించారు. సమావేశ అనంతరం విజయసాయి రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉమ్మడి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌కు కొత్తేమి కాదని అన్నారు. 2004 నుంచి 2014 వరకూ ఏపీలో ఎన్నికలు అలానే జరుగుతూ వస్తున్నాయని చెప్పారు. జమిలి ఎన్నికలను వైఎస్సార్ సీపీ సమర్ధిస్తోందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు, అవినీతి బాగా తగ్గుతుందని, అప్పుడే ఓటుకు కోట్లు లాంటి కేసులు పునరావృతం కావని అభిప్రాయపడ్డారు. ఫిరాయింపుల నిరోధక చట్టం.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు చేయాలని లా కమిషన్‌కు సూచించినట్లు విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఫిరాయింపుల చట్టాన్ని వినియోగించి స్పీకర్ తన విధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఫిరాయింపుల విషయంలో అనర్హత వేసే అధికారం నుంచి స్పీకర్‌ను తప్పించి, ఆ స్థానంలో ఎన్నికల కమిషన్‌కు పవర్ ఇవ్వాలని, అందుకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయాలని కోరినట్లు వివరించారు. జమిలి ఎన్నికలతో జాతీయ పార్టీలకే అధిక లాభం చేకూరుతుందని అన్నారు. ప్రాంతీయ పార్టీల మనుగడ దెబ్బతినకుండా వాటికి స్పష్టమైన భరోసా ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ముందుగా లోక్‌సభ లేదా అసెంబ్లీ రద్దయితే ఏం చేస్తారని లా కమిషన్‌ను ప్రశ్నించగా.. రద్దు అయిన కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తామని కమిషన్ సభ్యులు చెప్పారని వివరించారు. జమిలి ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి ఏకాభిప్రాయ సాధన చేయాలని కోరినట్లు తెలిపారు. బీజేపీకి మద్దతు ఇవ్వం.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి మద్దుతు ఇచ్చే ప్రసక్తే లేదని విజయసాయి రెడ్డి తేల్చి చెప్పారు. బీజేపీ, దాని తరఫు మిత్ర పక్షాలకూ మద్దతు ఇవ్వబోమని వివరించారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను బీజేపీ మోసం చేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ప్రత్యేక హోదా ఇస్తారనే ఆశతోనే ఆనాడు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ తరఫు అభ్యర్థికి మద్దుతు ఇచ్చామని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. హోదా విషయంలో వైఎస్సార్ సీపీ ఏనాడు రాజీపడలేదని గుర్తు చేశారు. 2014 నుంచి హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీనే అని పేర్కొన్నారు.