
న్యూఢిల్లీ: దేశద్రోహం కేసుల్లో దోషులకు విధించే జైలుశిక్షను కనిష్టంగా మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ పెంచాలని భారత న్యాయ కమిషన్ సిఫార్సు చేసింది. దీనివల్ల నేర తీవ్రతను బట్టి శిక్ష విధించే అవకాశం న్యాయస్థానాలకు లభిస్తుందని వెల్లడించింది.
ఈ మేరకు ఈ నివేదికను న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ రితూరాజ్ అవస్థీ (రిటైర్డ్) ఇటీవల కేంద్ర న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్‌కు సమర్పించారు. దేశద్రోహానికి జైలు శిక్షను ఏడేళ్లకు పెంచాలంటూ న్యాయ కమిషన్ సిఫార్సు చేయడాన్ని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ తప్పుబట్టారు. దేశద్రోహ చట్టాన్ని మరింత క్రూరంగా మార్చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. మెక్సికోలో కలకలం..
Comments
Please login to add a commentAdd a comment