seven years jail
-
ఇనుప ఖనిజం అక్రమ ఎగుమతి కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు
బెంగళూరు: బెళెకెరి నౌకాశ్రయంలోని ఇనుప ఖనిజం దొంగతనం, అక్రమ ఎగుమతి కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ కృష్ణ సాయిల్‌కు ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.6 కోట్ల భారీ జరిమానా విధించింది. ప్రజాప్రతినిధులపై కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం సాయిల్‌తోపాటు ఆరుగురికి జైలు శిక్ష, భారీగా జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. శ్రీ మల్లికార్జున షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఉన్న సాయిల్(58) తాజా పరిణామంతో ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యే అవకాశముంది. బళ్లారి గనిలో అక్రమంగా వెలికి తీసిన ఇనుప ఖనిజాన్ని 2010లో బెళెకెరి పోర్టులో అధికారులు నిల్వ ఉంచారు. దీనిపై కన్నేసిన సాయిల్, మరికొందరు కోట్లాది రూపాయల ఖనిజాన్ని దొంగచాటుగా చైనాకు ఎగుమతి చేశారు. తాజాగా దోషులుగా తేలిన వారిలో ప్రైవేట్ కంపెనీల నిర్వాహకులతోపాటు పోర్టుల డిప్యూటీ కన్జర్వేటర్ మహేశ్ జె బిలియె కూడా ఉన్నారు. ఈ నెల 24వ తేదీన తీర్పు వెలువడిన వెంటనే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు సాయిల్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
Russia-Ukraine war: యుద్ధ వ్యతిరేక లేబుళ్లు అంటించినందుకు.. రష్యా కళాకారిణికి ఏడేళ్ల జైలు
మాస్కో: సూపర్మార్కెట్లోని వస్తువులపై ఉండే ధరల లేబుళ్లను తొలగించి, వాటి స్థానంలో యుద్ధ వ్యతిరేక నినాదాలున్న లేబుళ్లు అంటించిన నేరంపై ఓ కళాకారిణికి రష్యా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలయ్యాక.. సెయింట్ పీటర్స్బర్గ్కు చెందిన సాషా స్కోచిలెంకో(33) అనే కళాకారిణి స్థానిక ఫెమినిస్టు బృందం పిలుపు మేరకు స్థానిక సూపర్మార్కెట్లోని వస్తువుల ధర లేబుళ్లను తీసేసి..‘రష్యా ఆర్మీ మరియుపోల్‌లోని స్కూల్‌పై బాంబు వేసింది’... ‘రష్యా ఫాసిస్ట్ రాజ్యంగా మారి ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు మా ముత్తాత రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడలేదు’ అంటూ రాసి ఉన్న కొన్ని లేబుళ్లను అంటించింది. ఈ నేరానికి అధికారులు గత ఏడాది ఏప్రిల్ అదుపులోకి తీసుకున్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా ఎలాంటి వైఖరి తీసుకున్నా కఠిన శిక్షలకు అవకాశం కల్పిస్తూ పుతిన్ ప్రభుత్వం చట్టాలు తీసుకువచి్చంది. ఈ చట్టాలు అమల్లోకి వచ్చాక జరిగిన మొట్టమొదటి అరెస్ట్ ఇది. దీంతో, విచారణ సుదీర్ఘంగా సాగింది. తనపై వచి్చన ఆరోపణలను సాషా అంగీకరించింది కూడా. తీవ్ర అరోగ్య సమస్యలతో బాధపడుతున్న సాషా జైలులోనే చనిపోయే ప్రమాదముందని ఆమె తరఫు లాయర్లు తెలిపారు. అయినప్పటికీ జడ్జి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచి్చనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రభుత్వ టీవీలో లైవ్‌లో వ్యతిరేకించారన్న ఆరోపణలపై కోర్టు ఒకటి మరినా అనే జర్నలిస్టుకు ఎనిమిదిన్నరేళ్ల జైలు శిక్ష విధించింది. యుద్ధాన్ని నిరసించిన వ్లాదిమిర్ కారా ముర్జా అనే ప్రతిపక్ష నేతకు ఏప్రిల్‌లో 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. -
దేశద్రోహానికి ఏడేళ్ల జైలు శిక్ష
న్యూఢిల్లీ: దేశద్రోహం కేసుల్లో దోషులకు విధించే జైలుశిక్షను కనిష్టంగా మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ పెంచాలని భారత న్యాయ కమిషన్ సిఫార్సు చేసింది. దీనివల్ల నేర తీవ్రతను బట్టి శిక్ష విధించే అవకాశం న్యాయస్థానాలకు లభిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు ఈ నివేదికను న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ రితూరాజ్ అవస్థీ (రిటైర్డ్) ఇటీవల కేంద్ర న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్కు సమర్పించారు. దేశద్రోహానికి జైలు శిక్షను ఏడేళ్లకు పెంచాలంటూ న్యాయ కమిషన్ సిఫార్సు చేయడాన్ని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ తప్పుబట్టారు. దేశద్రోహ చట్టాన్ని మరింత క్రూరంగా మార్చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. మెక్సికోలో కలకలం.. -
ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు
రాంచీ: హత్యాయత్నం, దోపిడీ కేసులో జార్ఖండ్ చెందిన ఏజేఎస్‌యూ ఎమ్మెల్యే కమల్ కిశోర్ భగత్‌కు ఏడేళ్ల జైలు శిక్షపడింది. మంగళవారం రాంచీ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. 23 ఏళ్ల కిందటి ఈ కేసులో కమల్‌తో పాటు మరో ఏజేఎస్‌యూ సభ్యుడిని న్యాయస్థానం దోషులుగా ప్రకటించింది. కమల్‌ను బిర్సా ముండా సెంట్రల్ జైలుకు తరలించారు. 1993లో డాక్టర్ కే కే సిన్హా ఇంటికి వెళ్లి పార్టీకి విరాళం ఇవ్వాలని కోరారు. చందా ఇచ్చేందుకు సిన్హా నిరాకరించడంతో ఆయనపై దాడికి పాల్పడి అవతలకు తోసేశారు. జార్ఖండ్‌లో బీజేపీ మిత్రపక్షంగా ఏజేఎస్‌యూ కొనసాగుతోంది. గత ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి పోటీ చేశాయి. -
రూ. 90 చోరీకి పదమూడేళ్ల జైలుశిక్ష
న్యూఢిల్లీ: రూ. 90 చోరీ చేశాడన్న ఆరోపణలపై అరెస్టయి, ఏడేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించిన ‘నిందితుడి’ని ఢిల్లీ హైకోర్టు ఆదివారం విడుదల చేసింది. కేసులో దోషిని తప్పుగా గుర్తించారనే విషయాన్ని కూడా కొట్టిపారేయలేమని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. వివరాల్లోకెళ్తే... 2001, ఏప్రిల్ 9న ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ ఖాలిద్ ఖురేషీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో తనను తప్పుగా ఇరికించారని పిటిషన్లో పేర్కొన్నారు.కాగా ఈ కేసులో ట్రయల్ కోర్టు ఖాలిద్‌కు ఏడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.10 జరిమానా కూడా విధించింది. అయితే ఈ కేసు విషయమై పోలీసులు ఎటువంటి దర్యాప్తు జరపలేదని, ఖాలిద్‌కు వ్యతిరేకంగా ఎవరూ సాక్ష్యం కూడా చెప్పలేదని హైకోర్టు గుర్తించింది. నిజానికి చోరీ జరిగిన సమయంలో కాకుండా రెండు మూడు గంటల తర్వాత ఖాలిద్‌ను అరెస్టు చేశారు. దీంతో తప్పుడు వ్యక్తిని దోషిగా నిర్ధారించారే విషయాన్ని కూడా కొట్టిపారేయలేమని హైకోర్టు న్యాయమూర్తి ఎస్పీ గార్గ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేసులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఖురేషీ తన అనుచరుడు జీతుతో కలిసి పురణ్సింగ్, జగన్నాత్ల వద్ద రూ. 50, రూ. 40 చోరీ చేశారు. జీతుపై పోలీసులు ఎటువంటి అనుమానం వ్యక్తం చేయకపోవడంతో ట్ర యల్ కోర్టు అతణ్ని విడుదల చేసింది. బాధితుడు పురణ్సింగ్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. జగన్నాథ్, తాను మార్కెట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు తమను దోచుకున్నారని, పట్టుకునేందుకు ప్రయత్నించేలోగానే వారు అడవిలోకి పారిపోయారని చెప్పాడు. దీతో తాము పనిచేస్తున్న ఇంటి సెక్యూరిటీ గార్డులకు అడవిలోకి వెళ్లాల్సిందిగా చెప్పడంతో వారు ఖాలిద్‌ను పట్టుకున్నారని తెలిపాడు. జీతూ తర్వాత అరెస్టయ్యాడన్నారు. అయితే ఈ కేసులో జీతూ, ఖాలిద్, పోలీసులు ఇచ్చిన వాంగ్మూలాలు దేనికది భిన్నంగా ఉందని, ఖాలిద్‌ను కూడా తప్పుగా కేసులో ఇరికించే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.