Recommended
-
దేశద్రోహానికి ఏడేళ్ల జైలు శిక్ష
న్యూఢిల్లీ: దేశద్రోహం కేసుల్లో దోషులకు విధించే జైలుశిక్షను కనిష్టంగా మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ పెంచాలని భారత న్యాయ కమిషన్ సిఫార్సు చేసింది. దీనివల్ల నేర తీవ్రతను బట్టి శిక్ష విధించే అవకాశం న్యాయస్థానాలకు లభిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు ఈ నివేదికను న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ రితూరాజ్ అవస్థీ (రిటైర్డ్) ఇటీవల కేంద్ర న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్కు సమర్పించారు. దేశద్రోహానికి జైలు శిక్షను ఏడేళ్లకు పెంచాలంటూ న్యాయ కమిషన్ సిఫార్సు చేయడాన్ని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ తప్పుబట్టారు. దేశద్రోహ చట్టాన్ని మరింత క్రూరంగా మార్చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. మెక్సికోలో కలకలం.. -
దేశంలో రిజర్వుడ్ హెల్త్ ఫోర్స్
సాక్షి, హైదరాబాద్: దేశానికి రిజర్వుడ్ ఆర్మీ దళం ఉన్నట్లుగానే వైద్య దళాన్ని సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి 15వ ఆర్థిక సంఘం అత్యంత కీలకమైన సిఫార్సు చేసింది. 15వ ఆర్థిక సంఘం పరిధి లోని ఆరుగురు సభ్యుల ఉన్నతస్థాయి వైద్య బృందం ఆరోగ్య రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై పలు సూచనలు చేస్తూ కేంద్రానికి తాజాగా నివేదిక సమర్పించింది. ఈ విషయంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇండియన్ రిజర్వుడ్ ఆర్మీ మాదిరిగా షార్ట్ సర్వీస్ కమిషన్‌కు రూపకల్పన చేసి దేశంలో వైద్యుల కొరత ఎక్కడ ఉంటే అక్క డకు రిజర్వుడు స్పెషలిస్టు వైద్యులను పంపించడమే దీని ఉద్దేశం. అనేక రాష్ట్రాల్లో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఎప్పుడైనా.. ఎక్కడైనా ఆరోగ్యపరమైన విపత్తులు తలెత్తినా, ఎక్కడైనా కొరత ఉన్నా ఈ రిజర్వుడు వైద్య దళం అక్కడకు వెళ్తుంది. అవసరమైనన్ని రోజులు అక్కడ ఉండి వైద్య సేవలు అందిస్తుంది. అందుకోసం జాతీయ స్థాయిలో ఒక వైద్య దళాన్ని జాతీయస్థాయి పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇక ఇప్పటివరకు రాజ్యాంగంలో వైద్య ఆరోగ్య రంగం రాష్ట్ర జాబితాలో ఉంది. దీన్ని ఉమ్మడి జాబితాలోకి చేర్చాలని మరో కీలకమైన సిఫార్సు చేసింది. ఆరోగ్యం ప్రాథమిక హక్కు.. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 2021లో ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా మార్చాలని ఆర్థిక సంఘం మరో ముఖ్యమైన సిఫార్సు చేసింది. దీనివల్ల ప్రతీ ఒక్కరికి ఆరోగ్య భరోసా లభిస్తుందని తెలిపింది. 2025 నాటికి బడ్జెట్లో ప్రభుత్వం వైద్యంపై పెట్టే ఖర్చును ఇప్పుడున్న దానికి రెండింతలు చేయాలని సూచించింది. రాష్ట్రాలు వైద్య బడ్జెట్లో పరిశోధనకు 2 శాతానికి తగ్గకుండా కేటాయించాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే 10 శాతం నిధుల్లో మూడింట రెండొంతులు ప్రాథమిక ఆరోగ్యంపై ఖర్చు పెట్టాలని తెలిపింది. ప్రోత్సాహకాల వ్యవస్థను వైద్య ఆరోగ్య రంగంలో ప్రవేశపెట్టాలని, ప్రాథమిక వైద్య రంగాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీర్చిదిద్దాలని నివేదించింది. ప్రైవేటు ప్రాక్టీసు రద్దు.. వైద్య కళాశాలల్లో పనిచేసే ప్రొఫెసర్లు, డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీసు చేయకూడదని మరో కీలక సిఫార్సు చేసింది. ఇప్పటికే ఎవరైనా చేస్తుంటే తమ ప్రైవేట్ ప్రాక్టీసును వదులుకోవాలని, తమ జీతం ప్రాతిపదికనే పనిచేయాలని సూచించింది. ప్రైవేట్ ప్రాక్టీస్‌ను అనుమతించడం వల్ల వైద్య బోధనలో నాణ్యత దెబ్బతింటుందని తేల్చిచెప్పింది. ప్రభుత్వ వైద్యులను ఇతర విభాగాలతో పోల్చకుండా సముచిత వేతనాలు, సౌకర్యాలు, ఇతరత్రా రాయితీలు ఇవ్వాలంది. మెడికల్ కాలేజీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఆదేశాల ప్రకారం వైద్యరంగంలో పరిశోధనలు చేయాలని పేర్కొంది. వైద్య కళాశాలకు రేటింగ్.. మెడికల్ కాలేజీలకు అవి సాధించే పీజీ సీట్లు, ఉత్తీర్ణత ఆధారంగా గుర్తింపు, రేటింగ్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఎంబీబీఎస్ స్థాయిలోనే కొన్ని స్పెషాలిటీ కోర్సులను ప్రోత్సహించాలని సూచించింది. అనస్థీషీయా, గైనిక్, పీడియాట్రిక్స్ విభాగాల్లో డిప్లొమా వైద్యులను కొనసాగిస్తూ వారి సేవలను మాధ్యమిక స్థాయి ఆస్పత్రుల్లో వినియోగించుకోవాలని వెల్లడించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్ కోర్సు చేయాలనుకునే విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇది అనైతికం, అహేతుకం, మానవ విలువలకు వ్యతిరేకమని వ్యాఖ్యానించింది. దీనివల్ల అర్హులైన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత వైద్య విద్యను పొందటానికి అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తంచేసింది. ప్రభుత్వ యంత్రాంగం ఈ పరిస్థితులను నియంత్రించాలని సిఫార్సు చేసింది. నిష్క్రమణకూ పరీక్ష.. వైద్య విద్య నాణ్యతను నిర్ధారించడానికి ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ పూర్తి చేసిన విద్యార్థులకు ఒక సాధారణ ఎగ్జిట్ ఎగ్జామ్(నిష్క్రమణ పరీక్ష) పెట్టాలని సూచించింది. నర్సింగ్ వృత్తిని బలోపేతం చేయాలని సూచించింది. నర్సింగ్ కౌన్సిల్ చట్టం ద్వారా నర్సింగ్ కౌన్సిల్ పనితీరును సమీక్షించడం అవసరమని చెప్పింది. తద్వారా నర్సింగ్ నాణ్యతను మెరుగుపరచాలని సూచించింది. ఎయిమ్స్‌లను విస్తరించడం, జిల్లా ఆస్పత్రులను, మెడికల్ కాలేజీలను పెంచడం అవసరమని పేర్కొంది. 250 పడకల కంటే ఎక్కువగా ఉన్న ఆస్పత్రులను మెడికల్ కాలేజీలుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ఫ్యామిలీ మెడిసిన్ కోర్సు దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, సబ్ సెంటర్లను 2011 జనాభా లెక్కల ప్రకారం పెంచాలని పేర్కొంది. దీనికి సుమారు రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. దేశంలో ప్రస్తుతం వెయ్యి జనాభాకు ఒక బెడ్ ఉంటే, దాన్ని రెండుగా చేయాలని తెలిపింది. ఆ ప్రకారం వచ్చే ఐదేళ్లలో ప్రైవేటు భాగస్వామ్యం తో 3 వేల నుంచి 5 వేల ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని చెప్పింది. అలాగే ఆరోగ్య కార్డులను తీసుకురావాలని సూచించింది. 2025 నాటికి ఎంబీబీఎస్ సీట్లతో సమానంగా పీజీ వైద్య సీట్లను పెంచాలని, ఎంబీబీఎస్‌లోనే కొన్ని స్పెషాలిటీ కోర్సులను పెట్టాలని పేర్కొంది. ఫ్యామి లీ మెడిసిన్ కోర్సును ప్రాచుర్యంలోకి తీసుకురావాలని, దానికి శాఖను ఏర్పాటు చేయాలని సూచించింది. -
మన్‌ప్రీత్‌కు అర్జున, చెత్రికి ధ్యాన్‌చంద్...
న్యూఢిల్లీ: భారత హాకీ కెప్టెన్, మన్‌ప్రీత్ సింగ్ పేరును ‘అర్జున’ అవార్డుకు పరిశీలించాలని హాకీ ఇండియా (హెచ్ఐ) భారత ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇతనితో పాటు మరో ఇద్దరిని కూడా నామినేట్ చేసింది. మిడ్‌ఫీల్డర్ ధరమ్వీర్ సింగ్, మహిళల జట్టు గోల్ కీపర్ సవితను హెచ్ఐ సిఫార్సు చేసింది. దశాబ్దానికి పైగా మహిళల హాకీ జట్టుకు సేవలందించిన మాజీ ప్లేయర్ సంగాయి ఇబెంహల్ చాను, పురుషుల మాజీ కెప్టెన్ భరత్ చెత్రిలను ‘ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య’ పురస్కారానికి... కోచ్ బి.ఎస్.చౌహాన్‌ను ‘ద్రోణాచార్య’ అవార్డుకు ప్రతిపాదించామని హెచ్ఐ కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ తెలిపారు. -
పద్మ పురస్కారాలకు అర్హులెవరూ లేరా?: పొన్నం
-
పద్మ పురస్కారాలకు అర్హులెవరూ లేరా?: పొన్నం
నిజామాబాద్ : పద్మ పురస్కారాలకు సంబంధించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం క్క ప్రతిపాదన కూడా పంపలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ పురస్కారాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మ పురస్కారం అందుకునే అర్హత తెలంగాణలో ఎవరికీ లేదా అని ప్రశ్నించారు. కాగా, విమర్శలు చేసే వారిని కోర్టు అనుమతి లేకుండా జైలుకు పంపిస్తామనడం పిరికిపంద చర్య అంటూ ఒకవేళ అలాంటి చట్టం తేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని హరించడమే అవుతుందన్నారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని, తెలంగాణను వ్యతిరేకించిన వారిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. -
కేరళలో పూజారుల పోస్టులకు దళితులు!
తిరువనంతపురం: కేరళలో ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) నిర్వహణలోని ఆలయాల్లో 36 మంది బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించడానికి సిఫారసు చేశారు. వీరిలో ఆరుగురు దళితులుండటం విశేషం. ఇందుకు సంబంధించి కేరళ దేవస్థానం నియామక బోర్డు సిఫార్సు చేసింది. దళితుల నుంచి ఆరుగురిని పూజారులుగా నియమించడానికి సిఫార్సు చేయడం ఇదే తొలిసారి. ఈ నియామకాలు చేపట్టేందుకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఇందులో అవినీతికి చోటులేదని, ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగానే ఎంపిక చేస్తున్నామని దేవస్థాన మంత్రి కదకంపల్లి రామచంద్రన్ చెప్పారు. -
ఆర్టీచీ..!
• ఆర్టీసీ ప్రకాశం రీజియన్‌లో అన్నీ అక్రమాలే • వినతులకు చెల్లుచీటీ సిఫార్సులకే పెద్దపీఠ • వెల్లువెత్తుతున్న విమర్శలు స్పందించని అధికారులు ‘రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నాం.. నష్టాలు తగ్గించి లాభాల బాటలోకి తీసుకొస్తున్నాం.. అధికారులు, సిబ్బంది, కార్మికులతో పాటు ప్రజలు కూడా సహకరించాలి. ఆర్టీసీని ఆదరించాలి’... ఇవీ.. రవాణా శాఖామంత్రి, ఆర్టీసీ ఉన్నతాధికారులు నిత్యం వల్లెవేసే మాటలు. కానీ, వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నారుు. సంస్థలో అంతర్గతంగా అన్నీ అక్రమాలు జరుగుతున్నారుు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల పైరవీల కారణంగా ఆర్టీసీకి మరింత నష్టం జరుగుతోంది. ప్రతిభ గల వారికి బదులుగా అసమర్థులకే ఆర్టీసీలో పెద్దపీఠ పడుతోంది. ఫలితంగా సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లుతోంది. రాష్ట్ర రవాణా శాఖామంత్రి జిల్లాలోనే ఇలా జరుగుతుండటం పలు విమర్శలకు తావిస్తోంది. ఒంగోలు : ‘వినతులకు చెల్లుచీటి.. సిఫార్సులకే పెద్దపీఠ’ అన్న చందంగా మారింది ఆర్టీసీ ప్రకాశం రీజియన్‌లో పరిస్థితి. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు పడరాని పాట్లు పడుతున్నామంటూ ఆ సంస్థ ఉన్నతాధికారులు మొదలు ప్రజాప్రతినిధుల వరకూ ప్రతిఒక్కరూ ఆర్భాటంగా ప్రకటిస్తున్నప్పటికీ, ఎక్కడా ఆచరిస్తున్న దాఖలాలు లేవు. ఇంకా చెప్పాలంటే.. ఆదాయ మార్గాలను సైతం పెడచెవిన పెట్టి సిఫార్సులకు వారంతా పెద్దపీఠ వేస్తున్నారు. ఈ క్రమంలో ఏవైనా అక్రమాలు జరిగితే కనీసం వాటిపై కచ్చితమైన విచారణ చేసేవారు కూడా లేకపోతుండడం గమనార్హం. ఇటీవల ఆర్టీసీ ప్రకాశం రీజియన్‌లో జరిగిన పలు ఘటనలే అందుకు నిదర్శనంగా ఉన్నారుు... ⇔ ఆర్టీసీలో నైపుణ్యం గల అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చే వేతనం నెలకు రూ.17 వేలు మాత్రమే. కానీ, కేవలం కార్గోలో పనిచేసేందుకు ఒక టీడీపీ నేత కుమారుడిని రూ.20 వేలు వేతనంతో తీసుకోవాలని సాక్షాత్తూ ఆర్టీసీ ఎండీ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు అతని నియూమకం కూడా జరిగింది. అరుుతే, అనంతరం అధికారుల తనిఖీల్లో ఒకేరోజు రూ.2 వేల వరకు అతని వద్ద లెక్కల్లో తేడాలు బయటపడ్డారుు. దీంతో అతనిని విధుల నుంచి తప్పించారు. దీనికి సంబంధించి ఆర్టీసీ కార్గోలో ఒక రికార్డే మాయమైందంటే ఆర్టీసీలో అక్రమాలు ఏ స్థారుులో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ⇔ ఆర్టీసీలో కార్గో సర్వీసులకు సంబంధించి ప్రస్తుతం ఒక మేనేజర్, ఇద్దరు అధికారులు, మరికొంతమంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉంటారు. కాగా, తమకు అవకాశమిస్తే ఆర్టీసీకి లక్ష రూపాయలు అడ్వాన్స్ చెల్లించి తామే విధులు నిర్వహించుకుంటామని, ఏరోజుకారోజు అధికారులకు లెక్కలు చూపిస్తామని సుబ్బారావు అనే వ్యక్తి ముందుకు వచ్చాడు. రోజుకు 3 షిఫ్టుల చొప్పున 24 గంటలపాటు సేవలకు అందుబాటులో సిబ్బందిని కూడా ఉంచుతామన్నారు. అందుకు విరుద్ధంగా కేవలం ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే విధుల్లో ఉండేలా రూ.20 వేలు అడ్వాన్స్ చెల్లించిన వ్యక్తికి ఆ అవకాశం కల్పించారు ఆర్టీసీ అధికారులు. దీనివెనుక కూడా అక్రమాలు జరిగాయన్నది బహిరంగ రహస్యం. ⇔ ఆర్టీసీలో వాటర్ ట్యాంకర్‌కు ప్రత్యేకంగా శాశ్వత ప్రాతిపదికన ఒక డ్రైవర్‌ను నియమించారు. అతని జీతం సుమారు రూ.50 వేలు ఉంటుంది. ఇది కాకుండా ఇతరత్రా ఖర్చులు కలుపుకుని ఆర్టీసీ రూ.85 వేల వరకు ఆర్టీసీ ఖర్చుచేస్తోంది. ఇదిలా ఉండగా, ట్యాంకర్‌కు రూ.340 చొప్పున ఇస్తే తామే నీరు సరఫరా చేస్తామంటూ కొంతమంది ముందుకొచ్చారు. దీని ప్రకారం ఆర్టీసీ చెల్లించే మొత్తం సుమారుగా నెలకు రూ.40 వేలు. దీన్ని అమలుచేస్తే నెలకు రూ.45 వేల వరకూ ఆర్టీసీకి మిగిలే అవకాశం ఉంది. దీనిపై ఆరు నెలలుగా చర్చిస్తున్న అధికారులు నేటికీ ఓ నిర్ణయం తీసుకోలేదు. ⇔ చివరకు సాక్షాత్తూ ప్రస్తుత రవాణాశాఖామంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఒంగోలు సిటీ సర్వీసులను సైతం ఆర్టీసీ అధికారులు తొలగించారు. వాటిపై మంత్రి సైతం మాట్లాడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. దీనికోసం బస్టాండ్లు, తదితరాల కోసం వెచ్చించిన నిధులు వృథా అయ్యూరుు. ఇక పబ్లిక్ టాయిలెట్ల వద్ద టోకెన్లు ఇవ్వాలని అధికారులు హెచ్చరించినా..నేటికీ అమలుకాకపోవడంపై కూడా పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ⇔ ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో రెండు ఆధునిక మెషిన్లను ఇటీవల ప్రారంభించారు. వాటిలో ఏ బస్సు ఎప్పుడు వస్తుందో చూసుకునే సౌలభ్యాన్ని ప్రయాణికులకు కలిగిస్తున్నట్లు ఆర్భాటంగా అధికారులు ప్రకటించారు. తీరా చూస్తే అవి ఎప్పుడు పనిచేస్తాయో, ఎప్పుడు పనిచేయవో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. -
మా ఫోన్ల వాడకం ఆపండి..!
-
మా ఫోన్ల వాడకం ఆపండి..!
సియోల్ : దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం, ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ శాంసంగ్ వినియెగదారులకు క్షమాపణలు చెప్పింది. శాంసంగ్ జెంబో స్మార్ట్ ఫోన్ గెలాక్సీ నోట్ 7 వాడకం పై శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. బ్యాటరీ పేలుతున్న ఘటనలతో ప్రపంచవ్యాప్తంగా 2.5 మిలియన్ల ఫోన్లను రీకాల్ చేస్తున్న సంస్థ చివరికి తమ గెలాక్సీ నోట్ 7 ఫోన్ల వాడకాన్ని నిలిపివేయాలని ప్రకటించింది. దక్షిణకొరియాలోని వినియోగదారులు గెలాక్సీ నోట్ 7 ఫోన్లను వినియోగించవద్దంటూ అధికారిక వెబ్ సైట్ లో ప్రకటించింది. తాత్కాలిక వినియోగం కోసం అద్దె ఫోన్లను తమ కంపెనీ సేవాకేంద్రాలనుంచి పొందొచ్చని స్థానిక వినియోగదారులకు సూచించింది. అలాగే కొత్త బ్యాటరీలతో సెప్టెంబర్ 19 నుంచి ఫోన్లను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. తన ఉత్పత్తులకు విలువనిచ్చే వినియోగదారులకు హృదయపూర్వక క్షమాపణలు తెలియజేసింది. అమెరికా యూజర్లకు కూడా ఇదే సూచనలు జారీ చేసింది. కాగా ఆగస్ట్ 19 న అట్టహాసంగా విడుదల చేసిన గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు పేలుతున్నాయన్న వార్తలు సంచలనంగా మారాయి. దాదాపు 35 ప్రమాదాలు సంభవించాయని స్వయంగా సంస్థ ధృవీకరించింది. లిథియం రీచార్జబుల్ బ్యాటరీలో లోపాన్ని కనుక్కున్నట్టు, వీటిని తమకు అందించిన సంస్థ తప్పిదమని తెలిపింది. దీంతో గ్లోబల్ గా కొన్ని విమాన యాన సంస్థలు నిషేధాజ్ఞలు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రామసుబ్రమణియన్
సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ వి.రామసుబ్రమణియన్ రానున్నారు. ప్రస్తుతం ఆయన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. అక్కడ ఆయన 5వ స్థానంలో కొనసాగుతున్నారు. ఉమ్మడి హైకోర్టుకు వచ్చేపక్షంలో ఆయన ఇక్కడ మూడవ స్థానం లో ఉంటారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రామసుబ్రమణియన్ బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం కొద్ది రోజులక్రితం సిఫారసు చేసింది. అయితే ఇందుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. తమిళనాడుకు చెందిన జస్టిస్ రామసుబ్రమణియన్ 1958 జూన్ 30న జన్మించారు. మద్రాసు వివేకానంద కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాదులు కె.సార్వభౌమన్, టి.ఆర్.మణిల వద్ద న్యాయ మెళకువలు నేర్చుకున్నారు. 2006 జూలై 31న మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2009 నవంబర్ 9న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ రామసుబ్రమణియన్కు మంచి వక్తగా పేరుంది. -
ఏవియేషన్ లో 5/20 తొలగింపునకు సిఫార్సు?
న్యూఢిల్లీ: పౌర విమానయాన రంగానికి సంబంధించి వివాదాస్పదమైన 5/20 నిబంధనను తొలగించాలంటూ అంతర్మంత్రిత్వ శాఖల కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ 5/20 నిబంధనను తొలగించి, అంత ర్జాతీయ సర్వీసులు నడిపేందుకు మరో ప్రాతిపదికను పరిగణించాలని ఈ కమిటీ అభిప్రాయపడినట్లు వివరించాయి. విదేశాలకు సర్వీసులు నడపాలంటే దేశీ విమానయాన సంస్థలు దేశీయంగా అయిదేళ్ల పాటు కార్యకలాపాలు నిర్వహించి, కనీసం 20 విమానాలనైనా కలిగి ఉండాలని 5/20 నిబంధన నిర్దేశిస్తోంది. టాటా సన్స్ పెట్టుబడులతో కొత్తగా ఏవియేషన్ రంగంలోకి ప్రవేశించిన విస్తార, ఎయిర్ఏషియా ఇండియా సంస్థలు దీన్ని ఎత్తివేయాలని కోరుతుండగా .. జెట్ ఎయిర్వేస్, ఇండిగో తదితర సంస్థలు నిబంధనను కొనసాగించాల్సిందేనంటున్నాయి. -
సిగరెట్టుకు గొలుసుకట్టు
పీఛేముడ్ పొగాకుతో ‘చుట్ట’రికం మనుషులకు శతాబ్దాల కిందటే మొదలైనా, ఇరవయ్యో శతాబ్దంలో ఇది కొత్తపుంతలు తొక్కింది. పొగచుట్టలు నాజూకుదేరి సిగరెట్లుగా రూపాంతరం చెందాయి. ఇవి నవనాగరికతకు నిదర్శనాలుగా మారాయి. మన దేశంలో ఇంకా పొడవాటి లంక పొగాకు చుట్టలు రాజ్యమేలుతున్న కాలంలో పడమటి దేశాల్లో సిగరెట్ల ఫ్యాషన్ మొదలైంది. ఆడా మగా తేడా లేకుండా వాటిని ఊది పారేసేవారు. మరీ విచిత్రంగా అప్పటి వైద్యులు కూడా పొగతాగడం వల్ల చాలా జబ్బులు నయమవుతాయని చెప్పేవారు. సిగరెట్ తయారీ కంపెనీలు డాక్టర్ల సిఫారసులతో కూడిన ప్రకటనలు గుప్పించేవి. ఫలితంగా ఆ కాలంలో పడమటి ప్రపంచంలో మెజారిటీ జనాభాకు పొగ పీల్చనిదే ఊపిరాడని పరిస్థితి దాపురించింది. కొందరు పొగరాయుళ్లు ఒక సిగరెట్టుతో తృప్తి పడేవారు కాదు. ఒకటి వెంట మరొకటి... వెనువెంటనే ముట్టించేవారు. వాళ్ల శ్వేతకాష్టదహన క్రతువుకు నిద్రపోయే సమయంలో మాత్రమే విరామం దొరికేది. అలాంటి పరిస్థితుల్లో గొలుసుకట్టు పొగరాయుళ్ల కోసం ఒక సాధనం అందుబాటులోకి వచ్చింది. ఒక ప్యాకెట్ సిగరెట్లను ఏకకాలంలో అందులో ఒకటొకటిగా దట్టించి, ముట్టించి ధూమమేఘాలను సృష్టించే పరికరం అరచేతుల్లోకి చేరింది. ఆ పరికరమే ఈ ఫొటోలో కనిపిస్తున్న సిగరెట్ హోల్డర్. పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అనే ప్రచారం మొదలవడంతో ఈ పరికరం ప్రాచుర్యం పొందక ముందే అంతరించింది. -
బది‘లీలలు’ రాయబేరాలు
మేయర్ ఆదేశాలు బేఖాతర్ పదిరోజులు తిరక్కుండానే కోరుకున్న చోటుకు ప్రజారోగ్య శాఖలో సి‘ఫార్సు’లు మెత్తబడుతున్న అధికారులు విజయవాడ సెంట్రల్ : ‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి’ పాట గుర్తొస్తోంది నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖలో జరుగుతున్న అంతర్గత బదిలీలను చూస్తుంటే. పట్టు మని పది రోజులు కూడా కాకుం డానే తమకు కావాల్సిన డివిజన్లలో పాగా వేసేందుకు కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు (ఎస్.ఐ.లు) పావులు కదుపుతున్నారు. ఇందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫార్సులు కూడగడుతున్నారు. మూడేళ్లకు పైగా ఒకే సీట్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని కదిలించాలని మేయర్ కోనేరు శ్రీధర్ కమిషనర్ జి.వీరపాండియన్‌ను కోరారు. ఈ క్రమంలో ఆయన అన్ని విభాగాల దుమ్ము దులిపారు. ఇష్టమైనా.. కష్టమైనా కదలాల్సిందేనని కరాఖండిగా తేల్చి చెప్పారు. అవకతవకలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో లాటరీ విధానంలో బదిలీలు చేశారు. కొద్దిపాటి వివాదాలు మినహా బదిలీలు ప్రశాంతంగానే సాగాయి. డివిజన్లో బాధ్యతలు చేపట్టిన రెండో రోజు నుంచే తాము కోరుకున్న డివిజన్ల కోసం కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. పావులు కదుపుతున్నారు.. డివిజన్ పెద్దదైంది. మేం చేయలేం. మమ్మల్ని చిన్న డివిజన్‌కు పంపా లంటూ శానిటరీ ఇన్స్పెక్టర్లు రాయ‘బేరాలు’ సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజారోగ్య శాఖలో 55 ఎస్.ఐ.ల పోస్టులకు గాను 36 మందిని బదిలీ చేశారు. లాటరీ విధానంలో దండిగా ఆదాయం వచ్చే డివిజన్లను కొందరు కోల్పోయారు. దీంతో తిరిగి వాటిని దక్కించుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. వన్‌టౌన్, సూర్యారావుపేట, సింగ్‌నగర్ ప్రాంతాల్లోని కొన్ని డివిజన్లలో ఎస్.ఐ. పోస్టుల్లో మార్పులు చేయాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ఎస్.ఐ.ల మార్పులకు సంబంధించి గట్టిగా పట్టుబడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 21వ డివిజన్లో నైట్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ మార్పుకు సంబంధించి పాలక పక్షానికి చెందిన కార్పొరేటర్ దగ్గరుండి పనిచేయించారనే గుసుగుసలు వినిపిస్తున్నాయి. మీరు కమిషనర్‌కు ఫైల్ పెట్టండి.. మేం మాట్లాడుకుంటాం అంటూ హుకుం జారీ చేయడంతో అధికారులు కిమ్మనకుండా చెప్పినట్లు చేస్తున్నారని తెలుస్తోంది. రెండు నెలల కిందట 56 మంది శానిటరీ మేస్త్రుల్ని లాటరీ పద్ధతిలో అంతర్గత బదిలీలు చేశారు. ఇందులో 17 మంది పోస్టింగ్ ఇచ్చిన డివిజన్లలో కాకుండా తాము పనిచేద్దామనుకున్న డివిజన్లలో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. రాతపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు లేనట్లు సమాచారం. ఇదే తరహాలో ఎస్.ఐ. పోస్టుల్ని మార్చేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కొత్త డీసీఆర్ కోసం టీడీపీ ఎమ్మెల్యే యత్నం.. నగరపాలక సంస్థలో మేయర్ ఆదేశాలు బేఖాతర్ అవుతున్నాయి. ఒకే సీటులో మూడేళ్లు దాటిన వారిని కదల్చడం ద్వారా కొంత వరకు అవినీతిని కట్టడి చేయవచ్చన్నది మేయర్ ఆలోచన. కమిషనర్ సహకారంతో పీఠాలు కదిలించగలిగారు. అయితే ఇది మూణ్ణాళ్ల ముచ్చటేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు కార్పొరేటర్లు టౌన్‌ప్లానింగ్‌ను శాసిస్తున్నారు. మరి కొందరు ప్రజారోగ్య శాఖలో చక్రం తిప్పుతున్నారు. అవసరమైతే తమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చెప్పి పనిచేయించుకుంటున్నారనే వాదనలు న్నాయి. డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) డి.వెంకటలక్ష్మి త్వరలో రిలీవ్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఖాళీ అవుతున్న డీసీఆర్ పోస్టులో తనకు అనుకూలంగా ఉండే అధికారిని తెచ్చుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే ఒకరు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మున్సిపల్ మంత్రి నారాయణతో సంప్రదింపులు జరిపారని సమాచారం. మేయర్‌తో సంబంధం లేకుండానే పోస్టింగ్‌లు.. ఊస్టింగ్‌లు జరిగిపోవడంతో ఆయన ఒకింత ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. -
అక్రమార్కులకు అండగా భాయ్
- అనుగ్రహిస్తే ఓకే.. లేకుంటే కూల్చివేతే - నగరంలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు - 300కు పైగా అక్రమ బహుళ అంతస్తులు - అధికారులు గుర్తించినవి 50 మాత్రమేనట - 30 నిర్మాణాలపై కేసులకు సిఫార్సు - రెండు నిర్మాణాలపైనే చర్యలు సాక్షి, నెల్లూరు : నెల్లూరు నగర మేయర్ అజీజ్ భాయ్ అనుగ్రహం ఉంటే చాలు అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగించవచ్చు. ప్రైవేటు, ప్రభుత్వ స్థలమైనా ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తులు నిర్మించినా కార్పొరేషన్ అధికారులు కన్నెత్తి కూడా చూడరు. కాకపోతే వారడిగినంత ముట్ట చెప్పాలి. మేయర్ ఆగ్రహించాడా చిన్న ప్రహరీ అయినా, బహుళ అంతస్తు అయినా నేల మట్టం కావాల్సిందే. 5 వేలకు పైగా అక్రమ నిర్మాణాలు నగరంలో ఆక్రమణలకు, అక్రమ నిర్మాణాలకు కొదవలేదు. నగరంలో 5 వేలకు పైగా అక్రమ కట్టడాలు ఉన్నాయని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఇటీవల కుప్పలు తెప్పలుగా వెలుస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాల్లోనూ పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 500 వరకు బహుళ అంతస్తులు ఉండగా 300కు పైగా నిబంధనలు అతిక్రమించి నిర్మించినవే ఉన్నాయని కార్పొరేషన్ అధికారులే చెబుతున్నారు. ఆక్రమణల్లో ఇరుగు పొరుగు పేదల స్థలాలతో పాటు నగరపాలక సంస్థ స్థలాలను సైతం స్వాహా చేసిన ఉదంతాలు కోకొల్లలు. ఇంత జరుగుతుంటే ఘనత వహించిన కార్పొరేషన్ అధికారులు అక్రమ కట్టడాలుగా గుర్తించినవి 50 మాత్రమేనట. వాటిలో క్రిమినల్ కేసుల కోసం ప్రతిపాదించినవి 30 అక్రమ కట్టడాలకేనట. పోనీ వాటి మీద అయినా చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. ముఖ్యంగా ఎస్పీ ఆఫీసు, మినీబైపాస్ రోడు,్డ చిన్నబజార్, ట్రంకురోడు, పొదలకూరు రోడ్డ్డు తదితర ప్రాంతాల్లో అధికారులు గుర్తించిన అక్రమ భవనాలే 50కి పైగా ఉన్నాయి. ఇక ఇరిగేషన్ కాలువల ఆక్రమణలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కానీ మేయర్ అజీజ్ వాటిని పట్టించుకోకుండా రవీంద్రభారతి పాఠశాల, ములుమూడి బస్టాండ్ ప్రాంతంలో ఒక ఇంటినే టార్గెట్ చేయడంపై కార్పొరేషన్ అధికారులు విమర్శిస్తున్నారు. మేయర్ పక్షపాతం ఇదే సమయంలో అజీజ్ మేయరయ్యారు. ఇక నగరంలో కార్పొరేషన్ స్థలాల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్టపడుతుందని అందరూ భావించారు. అందుకు తగినట్లుగానే అజీజ్ తొలుత నగరంలోని ఫతేఖాన్‌పేట రమేష్‌రెడ్డినగర్‌లో రవీంద్రభారతి పాఠశాల ప్రహరీని, అక్కడున్న రేకుల షెడ్‌ను దగ్గరుండి మరీ కూల్చి వేయించారు. నగరంలో ఇక ఎవరు ఆక్రమణలకు పాల్పడినా సహించేది లేదని మేయర్ విలేకరుల సమావేశంలో ఆవేశ పూరితంగా చెప్పారు. రెండు నెలల తరువాత తాజాగా ములుమూడి బస్టాండ్ ప్రాంతంలో ఓ వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం సాగించాడని మేయర్ ఆగ్రహం వ్యక్తం చేయడం, హుటాహుటిన అధికారులు వెళ్లి ఆ భవనాన్ని కూల్చివేయడం తెలిసిందే. మేయర్, కార్పొరేషన్ అధికారులు ఇలా ఎందుకు చేస్తున్నారో నగర వాసులకు తెలియంది కాదు. అనుచరుల సూచనల మేరకు అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఒకరిద్దరినో, ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలకు చెందిన ఇంటినో కూల్చి కక్షపూరిత చర్యలకు దిగడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. అధికారుల అవినీతికి అడ్డు ఏదీ మరో వైపు కార్పొరేషన్ అధికారుల అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతోందన్న ఆరోపణలు వెల్లువెల్లువెత్తుతున్నాయి. ప్రతి నిర్మాణంలోనూ ముఖ్యంగా బహుళ అంతస్తుల నిర్మాణ సమయంలో నిర్మాణంలో 10 శాతం కట్టడాన్ని ఉదాహరణకు 10 ప్లాట్ల బిల్డింగ్ నిర్మిస్తుంటే ఒక ప్లాట్‌ను కార్పొరేషన్‌కు మార్ట్గేజ్ చేయాలి. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగితే వారిపై చర్యలు తీసుకునేందుకే ఈ పద్ధతి కార్పొరేషన్ అవలంబిస్తుంది. నిబంధనలు పాటించేందుకు నిర్మాణదారు ససేమిరా అంటే 10 శాతం కట్టడాన్ని కార్పొరేషన్ స్వాధీన పరచుకోవచ్చు. అయితే అధికారులు అందిన కాడికి డబ్బులు దండుకుని ఈ నిబంధనలకు పాతరేస్తున్నారు. అధికారులు మాత్రం ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ సొంత ఆదాయం లక్షల్లో పెంచుకుంటున్నారు.