
న్యూఢిల్లీ: భారత హాకీ కెప్టెన్, మన్‌ప్రీత్ సింగ్ పేరును ‘అర్జున’ అవార్డుకు పరిశీలించాలని హాకీ ఇండియా (హెచ్‌ఐ) భారత ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇతనితో పాటు మరో ఇద్దరిని కూడా నామినేట్ చేసింది. మిడ్‌ఫీల్డర్ ధరమ్‌వీర్ సింగ్, మహిళల జట్టు గోల్ కీపర్ సవితను హెచ్‌ఐ సిఫార్సు చేసింది. దశాబ్దానికి పైగా మహిళల హాకీ జట్టుకు సేవలందించిన మాజీ ప్లేయర్ సంగాయి ఇబెంహల్ చాను, పురుషుల మాజీ కెప్టెన్ భరత్ చెత్రిలను ‘ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య’ పురస్కారానికి... కోచ్ బి.ఎస్.చౌహాన్‌ను ‘ద్రోణాచార్య’ అవార్డుకు ప్రతిపాదించామని హెచ్‌ఐ కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment