నిజామాబాద్ : పద్మ పురస్కారాలకు సంబంధించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం క్క ప్రతిపాదన కూడా పంపలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ పురస్కారాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మ పురస్కారం అందుకునే అర్హత తెలంగాణలో ఎవరికీ లేదా అని ప్రశ్నించారు. కాగా, విమర్శలు చేసే వారిని కోర్టు అనుమతి లేకుండా జైలుకు పంపిస్తామనడం పిరికిపంద చర్య అంటూ ఒకవేళ అలాంటి చట్టం తేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని హరించడమే అవుతుందన్నారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని, తెలంగాణను వ్యతిరేకించిన వారిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment