తిరువనంతపురం: కేరళలో ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) నిర్వహణలోని ఆలయాల్లో 36 మంది బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించడానికి సిఫారసు చేశారు. వీరిలో ఆరుగురు దళితులుండటం విశేషం. ఇందుకు సంబంధించి కేరళ దేవస్థానం నియామక బోర్డు సిఫార్సు చేసింది. దళితుల నుంచి ఆరుగురిని పూజారులుగా నియమించడానికి సిఫార్సు చేయడం ఇదే తొలిసారి. ఈ నియామకాలు చేపట్టేందుకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఇందులో అవినీతికి చోటులేదని, ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగానే ఎంపిక చేస్తున్నామని దేవస్థాన మంత్రి కదకంపల్లి రామచంద్రన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment