తిరువనంతపురం : దేశ చరిత్రలో తొలిసారి ఆలయాల్లో దళితులను అర్చకులుగా నియమించి సంచలనం ట్రావెన్‌కోర్ దేవస్థానంబోర్డు (టీడీబీ) సంచలనం సృష్టించింది. శబరిమల ఆలయం సహా కేరళలోని పలు దేవస్థానాల్లో కొత్తగా 62 మందిని అర్చకులుగా నియమించింది. ఇందులో 36 మంది బ్రాహ్మణేతరులుకాగా.. ఆరుగురు దళితులున్నారు. టీడీబీ నమ్మకాలను, భక్తుల విశ్వాసాలను నిలబెడుతూ.. దళిత అర్చకులు కొత్త చరిత్ర సృష్టించారు.
ఎర్నాకుళం జిల్లా అర్కెపాడులోని మహదేవాలయంలో అర్చకునిగా నియమించబడ్డ.. 31 ఏళ్ల మనోజ్ (దళిత అర్చకుడు) టీడీబీ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భగవంతుడికి.. ఆయన భక్తులకు సేవలు చేయాలన్న నాకలను టీడీబీ నిజం చేసిందని అన్నారు. భక్తులు నన్ను ఎంతో ఆదరంగా చూస్తున్నారని.. నాతో పూజలు చేయించుకునేందుకు ఇష్టపడుతున్నారని చెప్పారు. ‘నేను చిన్నతనంలో మా గ్రామంలోని ఆలయంలో బ్రాహ్మణ పురోహితునికి సేవలు చేసేవాడిని.. ఆయన నన్ను ఏనాడు కులపట్టింపుతో చూడలేదు.. ఆయన దయవల్లే నేను ఈ రోజు ఈస్థానంలోకి రాగలిగాను’ అని ఆనందంగా చెప్పారు. జన్మతో కులాన్ని చూడకుండా.. గుణాలతో చూడాలని మనోజ్ అన్నారు. మా గ్రామ అర్చకుడి సేవలో గడడం వల్ల నేను ఏనాడు మద్య, మాంసాలు ముట్టుకోలేదని చెప్పారు.
సంస్కృతంలో పీజీ చేసిన మరో దళిత అర్చకుడు మదుకృష్ణ కూడా టీడీబీ నిర్ణయంపట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. పథినంతిట్ట జిల్లాలోని కిచ్చీరివల్ శివాలయంలో యదుకృష్ణ అర్చకత్వం వహిస్తున్నారు. యదుకృష్ణ కూడా ఎనిమిదేళ్ల వయసులో గ్రామంలోని శివాలయంలో అర్చకుడికి సహాయకుడిగా విధులు నిర్వహించారు. మా అమ్మకు భక్తి చాలా ఎక్కువ. అందువల్ల నన్ను చిన్నతనం నుంచే ధార్మిక కార్యక్రమాలు, పూజాదికాలు, సంస్కృతంపై ఆసక్తి పెంచుకున్నానని చెప్పారు. యదుకృష్ణ రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ.. అభిషేకం చేస్తుంటే చూడడానికి రెండు కళ్లు సరిపోవని భక్తులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment