
పత్తనంతిట్ట: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి మాలధారుల తాకిడి పెరిగింది. దీంతో దర్శన సమయాన్ని గంట పొడిగించినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు(టీడీబీ)ఆదివారం ప్రకటించింది. సాయంత్రం దర్శనం 4 బదులు 3 గంటల నుంచే మొదలవనుంది.
రోజూ వర్చువల్ క్యూ ద్వారా 90 వేల బుకింగ్‌లు, 30 వేల స్పాట్‌లో బుకింగ్స్ ఉంటున్నాయని ఆలయ ఏర్పాట్లను చూసే ఐజీ స్పర్జన్ కుమార్ చెప్పారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో దర్శనాలను త్వరత్వరగా సాఫీగా సాగేలా చూడాలన్న ప్రయత్నాలకు విఘాతం కలుగుతోందని వివరించారు. దర్శనానికి 15 నుంచి 20 గంటల వరకు భక్తులు ఎదురుచూపులు చూడాల్సి వస్తోందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ పేర్కొన్నారు.