Heavy crowd
-
పోటెత్తిన రద్దీ.. దీపావళికి సొంతూరి బాటలో జనం
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీ పోటెత్తింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు మంగళవారం కిటకిటలాడాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో సందడి నెలకొంది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజలకు దీపావళి, ఛట్ పండుగలు ఎంతో ముఖ్యం. ఈ మేరకు నగరంలో ఉంటున్న వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తప్పనిసరిగా సొంత ఊళ్లకు తరలి వెళ్తారు. దీపావళి పర్వదినానికి మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో మంగళవారం పెద్ద ఎత్తున బయలుదేరారు. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే అన్ని రైళ్లు కిక్కిరిశాయి. నెల రోజుల క్రితమే రిజర్వేషన్లు.. 👉హైదరాబాద్ నుంచి పాటా్న, కోల్‌కతా, వారణాసి, దానాపూర్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రెగ్యులర్ రైళ్లలో సాధారణ రోజుల్లోనే రద్దీ ఎక్కువగా ఉంటుంది. దానాపూర్ ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా, దర్బంగా తదితర రైళ్లలో నెల రోజుల క్రితమే రిజర్వేషన్లు భర్తీ అయ్యాయి. వెయిటింగ్ లిస్ట్ సైతం వందల్లోకి చేరింది. కొన్ని రైళ్లలో బుకింగ్‌కు కూడా అవకాశం లేకుండా నో రూమ్ దర్శనమిస్తోంది. దీంతో ప్రయాణికులు అనివార్యంగా జనరల్ బోగీలపై ఆధారపడాల్సి వస్తోంది. 👉 ప్రయాణికుల రద్దీ మేరకు అదనపు రైళ్లను నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. కానీ డిమాండ్ మేరకు రైళ్లు అందుబాటులో లేవు. జనరల్ బోగీల్లో కాలు మోపేందుకు కూడా చోటు లేకుండాపోయిందని దానాపూర్ ప్రయాణికులు పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా సరే ఏదోఒక విధంగా సొంత ఊళ్లకు వెళ్లాలనే పట్టుదలతో జనరల్ బోగీల్లోనే అతికష్టంగా బయలుదేరి వెళ్తున్నారు. మరో రెండు రోజుల పాటు కూడా ఇదే రద్దీ ఉండవచ్చని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అధికారులు తెలిపారు. జనరల్ టికెట్ల కోసం అదనపు బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదనంగా 30 వేల మంది ప్రయాణికులు.. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది వలస కూలీలు నగరంలో నిర్మాణరంగంలో పని చేస్తున్నారు. కుటుంబాలతో సహా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న కూలీలంతా దీపావళి వేడుకల కోసం సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. దూరభారం దృష్ట్యా రోడ్డు మార్గంలో కంటే రైళ్లలో బయలుదేరి వెళ్లేందుకు ఎక్కువ మంది మొగ్గుచూపడంతో అనూహ్యంగా రద్దీ పెరిగింది. ఈ రద్దీని ముందే ఊహించి అదనపు రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ అవి ఏ మాత్రం చాలడం లేదు. ముఖ్యంగా జనరల్ బోగీల కొరత కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా వరకు 18 బోగీలు ఉన్న రైళ్లలో కేవలం 2 మాత్రమే జనరల్ బోగీలు ఉన్నాయి. కొన్నింటిలో మాత్రం 3 నుంచి 4 సాధారణ బోగీలు ఉన్నాయి. అయినప్పటికీ అందుకు 5 రెట్ల మంది ప్రయాణికులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు తరలి వస్తున్నారు. భార్యాపిల్లలతో సహా సికింద్రాబాద్ స్టేషన్‌కు తరలి వచి్చన ప్రయాణికులు చివరకు జనరల్ బోగీల్లో కూడా వెళ్లేందుకు అవకాశం లేక స్టేషన్ బయటపడిగాపులు కాస్తున్నారు. ‘తిరిగి ఇంటికి వెళ్లడం కంటే ఇక్కడే ఉండి ఏదో ఒక ట్రైన్ పట్టుకొని వెళ్లిపోవడం మంచిది కదా’ అని సంజన్ అనే ప్రయాణికుడు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజు సుమారు 1.85 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా.. మంగళవారం అదనంగా మరో 30 వేల మందికి పైగా సొంత ఊళ్లకు బయలుదేరినట్లు అంచనా. షాపింగ్ సందడి దీపావళి, ధన్తేరస్ సందర్భంగా నగరంలోని టపాసులు, బంగారం, వస్త్ర దుకాణాలు మంగళవారం కిటకిటలాడాయి. ఎటు చూసినా దీపావళి సందడే కనిపించింది. కాగా.. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బంగారం రేట్లు కాస్త పెరిగినప్పటికీ... దీపావళితో పాటు ధన్ తేరస్, ముఖ్యంగా వివాహాల సీజన్ కావడంతో నగరంలో బంగారం కొనుగోళ్లు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలకున్న సెంటిమెంట్లు, అపోహలు ఇతర ఏ అంశాలు బంగారం కొనుగోళ్లపై ప్రభావం చూపలేదు. అంతేకాకుండా పండుగ నేపథ్యం, వివాహాల శుభకార్యాల కారణంగా వజ్రాభరణాల దుకాణాల యాజమాన్యాలు వినియోగదారులను సంతృప్తి పరచడానికి ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే.. షాపింగ్ మాల్స్ సైతం కొనుగోనుదారులతో కిటకిటలాడుతూ కనిపించాయి. -
Travancore Devaswom Board: శబరిమలలో భారీ రద్దీ.. దర్శన సమయం గంట పెంపు
పత్తనంతిట్ట: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి మాలధారుల తాకిడి పెరిగింది. దీంతో దర్శన సమయాన్ని గంట పొడిగించినట్లు ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డు(టీడీబీ)ఆదివారం ప్రకటించింది. సాయంత్రం దర్శనం 4 బదులు 3 గంటల నుంచే మొదలవనుంది. రోజూ వర్చువల్ క్యూ ద్వారా 90 వేల బుకింగ్‌లు, 30 వేల స్పాట్లో బుకింగ్స్ ఉంటున్నాయని ఆలయ ఏర్పాట్లను చూసే ఐజీ స్పర్జన్ కుమార్ చెప్పారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో దర్శనాలను త్వరత్వరగా సాఫీగా సాగేలా చూడాలన్న ప్రయత్నాలకు విఘాతం కలుగుతోందని వివరించారు. దర్శనానికి 15 నుంచి 20 గంటల వరకు భక్తులు ఎదురుచూపులు చూడాల్సి వస్తోందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ పేర్కొన్నారు. -
Tirumala: వరుస సెలవులతో తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ (ఫొటోలు)
-
జనంతో కిటకిటలాడుతున్న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (ఫొటోలు)
-
అమ్మలను దర్శించుకున్న భక్తజనం
తాడ్వాయి: మేడారానికి అప్పుడే భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడం, ఈనెల 31నుంచి జాతర నిర్వహించనుండడంతో భక్తజనులు సమ్మక్క, సారలమ్మ తల్లులను ముందస్తుగానే దర్శించుకున్నారు. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు దేవతల గద్దెలకు చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, చీరసారె, గాజులు, ఒడి బియ్యం, కానుకలను సమర్పించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ప్రైవేట్ వాహనాల్లో భారీగా మేడారం తరలివచ్చారు. సుమారు 2 లక్షల మంది తల్లులను దర్శించుకున్నట్లు అంచనా. భక్తులు ఇబ్బందులు పడకుండా దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. -
కార్తీక శోభ
-
టికెట్ల కోసం ఐమ్యాక్స్ వద్ద భారీ క్యూ లైన్
-
ఏటీఎంల వద్ద గంటల కొద్ది నిరీక్షణ
-
ఉదయం నుంచే బ్యాంకుల వద్ద పడిగాపులు
-
ఏపీలో బ్యాంకుల వద్ద జనం పడిగాపులు
-
ఏపీలో కిక్కిరిసిన పంచారమ క్షేత్రాలు
-
అడుగడుగునా నిర్లక్ష్యం
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : పౌర్ణమి.. ఆదివారం సెలువు రోజు.. పైగా ఈ పౌర్ణమి నుంచి అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనం.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ దుర్గగుడి అధికారులు ఏర్పాట్ల గురించి పెద్దగా పట్టించుకోలేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండలోనే మండిపోయారు. ప్రసాదాలు కూడా లభించక నిరాశకు గురయ్యారు. సాధారణంగా దసరా ఉత్సవాల తర్వాత రెండు, మూడు రోజులు భక్తులు, భవానీల రద్దీ కొనసాగుతుంది. ఈ ఏడాది అనూహ్యంగా ఉత్సవాలు ముగిసి ఐదు రోజులైనా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదాలు, అన్నదానం, మంచినీరు, షామియానాల ఏర్పాటు వంటి సదుపాయాల గురించి పట్టించుకోకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు కేవలం ఆలయ ప్రాంగణంలోని గాలిగోపురం వద్ద రెండు చిన్న షామియానాలు ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఒకవైపు రద్దీ.. మరోవైపు క్యూలైన్ తొలగింపు... దసరా అనంతరం భక్తుల రద్దీ కొనసాగుతున్నా, క్యూలైన్లను హడావుడిగా తొలగిస్తున్నారు. ఆదివారం అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. ఘాట్ రోడ్డులోని పొంగలి షెడ్డు వరకు భక్తులు బారులు తీరారు. అయినా ఒకవైపు నుంచి క్యూలైన్లు తొలగిస్తూ ఉండటంతో భక్తులు ఎండలోనే పడిగాపులు పడ్డారు. కానరాని సిబ్బంది... భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆలయ సిబ్బంది కనిపించలేదు. ఉచిత దర్శనానికి విచ్చేసిన భక్తులను నియంత్రించేందుకు దేవస్థానం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు విధి నిర్వహణలో కనిపించలేదు. ఆలయ ప్రాంగణంలోని గాలిగోపురం వద్ద ఉచిత క్యూలైన్ వద్ద భక్తులు గుంపులు గుంపులుగా చేరారు. దీంతో చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధుల తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేయాల్సిన సూపరింటెండెంట్లు, సెక్షన్ ఇన్చార్జిలు అసలు ఉన్నారా.. లేరా.. అని భక్తులు మండిపడ్డారు. దర్శనానికి నాలుగు గంటలు ఆదివారం స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. దసరా ఉత్సవాల్లో సైతం రెండు నుంచి మూడు గంటల్లోనే అమ్మవారిని దర్శించుకుని కొండ దిగి వెళ్లామని నగరానికి చెందిన సత్యవతి అనే మహిళా భక్తురాలు తెలిపారు. ఇప్పుడు మాత్రం ఏర్పాట్లు సక్రమంగా చేయకపోవడంతో దర్శనానికి కూడా ఆలస్యమైందని ఆమె చెప్పారు. దర్శనానంతరం కొండ దిగువకు చేరుకున్న భక్తులు ప్రసాదం కోసం మరో క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. భక్తుల రద్దీకి తగినట్టుగా ప్రసాదాలను తయారు చేయించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఉత్సవాల తర్వాత నుంచి ఆదివారం వరకు ప్రతి భక్తునికి రెండు లడ్డూల చొప్పున రేషన్ విధించి విక్రయిస్తున్నారు. కొన్నిసార్లు అసలు ప్రసాదం లేదంటూ భవానీ ప్రసాదాలను బలవంతంగా అంటగడుతున్నారని భక్తులు తెలిపారు. -
బెజవాడ రైల్వేస్టేషన్ కళకళ
విజయవాడ (రైల్వేస్టేషన్) : పది రోజులుగా వెలవెలబోయిన విజయవాడ రైల్వేస్టేçÙన్ బుధవారం ప్రయాణికులతో కళకళలాడింది. రూట్ రిలే ఇంటర్‌లాకింగ్(ఆర్ఆర్ఐ) పనుల నేపథ్యంలో పది రోజులుగా విజయవాడ స్టేషన్లోకి రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఐ పనులు పూర్తికావడంతో బుధవారం నుంచి అన్ని రైళ్లు యథావిథిగా స్టేషన్‌కు వచ్చి, వెళ్లాయి. దీంతో ప్రయాణికులతో అన్ని ప్లాట్‌ఫాంలపై సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం స్టేషన్‌లోని పది ప్లాట్‌ఫాంలపై 24 బోగీల రైళ్లు నిలపవచ్చని అధికారులు తెలిపారు. -
పర్యాటకులతో ఖిల్లా కిటకిట!
ఇబ్రహీంపట్నం : ప్రపం^è పర్యాటకుల దినోత్సవం సందర్భంగా కొండపల్లి ఖిల్లా మంగళవారం కిటకిటలాడింది. సాధారణ పర్యాటకులతో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నుంచి వివిధ పాఠశాలలకు చెందిన మానసిక వైకల్యం కలిగిన విద్యార్థులు ఖిల్లాను సందర్శించారు. దీంతో ఖిల్లాపై సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు రాణిమహాల్‌లో ఉన్న ఎగ్జిబిషన్‌ను తిలకించారు. పురాతన కట్టడాలను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. పురాతన సంపద వివరాలను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. రాష్ట్ర పురావస్తు శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ పురాతన కాలం నాటి శిల్ప సంపద విశేషాలను మానసిక వైకల్యం కలిగిన విద్యార్థులు తెలుసుకునేందుకు ఈ పర్యటనను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం నూతన శోభను సంతరించుకోనుందని చెప్పారు. ఈ పర్యటనలో మడోన్నా హైస్కూల్, మానసిక వికాస కేంద్రం, చేయూత పాఠశాల, విజయమేరి ఇంటిగ్రేటెడ్ బ్లైండ్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ సృజన, పురావస్తు శాఖ డీఈ కోటేశ్వరరావు, ఈఈ ఉమామహేశ్వరరావు, ఏడీ దీపక్, మానసిక వికాస కేంద్రం అధ్యక్షురాలు పాలడుగు పార్వతీదేవి, సూపర్వైజర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన దేవదేవుని దివ్య దర్శనం
విజయవాడ కల్చరల్: స్వరాజ్య మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన నమూనా దేవాలయంలో 17 రోజులుగా పూజలందుకున్న దేవ దేవదేవుని దివ్యదర్శనం మంగళవారం పవళలింపు సేవ అనంతరం ముగిసింది. రికార్డు స్థాయిలో భక్తులు వేంకటేశ్వరున్ని దర్శించుకున్నారు. కృష్ణ పుష్కరాలు ముగియడంతో స్వామిని దర్శించుకోవటానికి భక్తులు పోటెత్తారు. దేవాలయ ఉద్యోగులు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు దర్శనం అనంతరం లడ్డూప్రసాదాలు అందించారు. టీటీడీ పాలక మండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో దేవాలయ నిర్మాణం పూర్తిచేశామని తెలిపారు. స్వరాజ్యమైదానంలో భక్తులకు ఏ మాత్రం అసౌకర్యాలు కలుగకుండా కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. పుష్కర సమయంలో దాదాపు 5 లక్షల మంది దేవదేవున్ని దర్శించుకున్నారని వివరించారు. పుష్కరకాలంలో 12 లక్షల మందికి అన్నప్రసాదం అందిచామని తెలిపారు. టీటీడీలో పనిచేస్తున్న వందల మంది ఉద్యోగుల భాగస్వామ్యం వల్లనే సాధ్యమైందని అన్నారు. పద్మావతి ఘాట్‌లో నిర్వహించిన చక్రస్థానంలో కార్యక్రమాలు ముగిసాయని ప్రభుత్వానికి చెందిన అన్నీ శాఖలు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం పూజలు నిర్వహించామని తెలిపారు. దేవదేవునకు శోడషోపచారతో అర్చకులు పూజలు నిర్వహించారు. వేదపఠం, ఘన స్వస్తి, దాస సాహిత్యసేవా సాహిత్య పరిషత్, ధర్మప్రచార మండలి సంయుక్తంగా భక్తి గీతాలను ఆలపించారు. -
కిక్కిరిసిన రైళ్లు
రైల్వేస్టేషన్ : పుష్కరాలు మరి కొద్ది గంటల్లో ముగుస్తున్న తరుణంలో రైల్వేస్టేషన్ యాత్రికుల రద్దీతో కిక్కిరిసింది. విశాఖ, సికింద్రాబాద్, చెన్నై, సికింద్రాబాద్, తిరుపతి వైపు వెళ్లే పలు రైళ్లు రద్దీతో నడిచాయి. విశాఖ వైపు వెళ్లే రత్నాచల్, లింక్, జన్మభూమి, ఈస్ట్‌కోస్ట్, కోణార్క్,సికింద్రాబాద్ వైపు వెళ్లే శాతవాహన,గోల్కొండ, జన్మభూమి,తిరుపతి వైపు కృష్ణా ఎక్స్‌ప్రెస్, చెన్నై వైపు వెళ్లే పినాకినీ, కోరమాండల్, జనశతాబ్ధి రైళ్లు కిటకిటలాడాయి. వివిధ ప్రాంతాలకు నడుపుతున్న పుష్కర ప్రత్యేక రైళ్లలోను కాసింత చోటు కోసం ప్రయాణికులు అపసోపాలు పడ్డారు. మరో రెండురోజులు రద్దీ కొనసాగే అవకాశం ఉంది. -
ఎటు చూసినా జనమే
కిక్కిరిసిన రైల్వే స్టేషన్ సాక్షి, విజయవాడ : జనం.. జనం.. ఎటు చూసినా జనమే.. ఏ ప్లాట్‌ఫాం చూసినా కిక్కిరిసిన యాత్రికులు.. అసలైన పుష్కర శోభ ఆదివారం కనిపించింది. తెల్లవారు జాము నుంచి రాత్రి పొద్దు పోయే వరకు ఇసుకవేస్తే రాలనంతంగా పుష్కర యాత్రికులు వచ్చారు. దీంతో స్టేషన్ పరిసర ప్రాంతాలు యాత్రికులతో నిండిపోయాయి. సాధారణంగా రెండు లక్షల మంది ప్రయాణికులు ప్రతి రోజు విజయవాడ రైల్వేస్టేçÙన్కు వస్తారని అంచనా. అయితే ఒక్క ఆదివారమే నాలుగైదు లక్షల మంది వచ్చారని భావిస్తున్నారు. తనిఖీ అనంతరమే స్టేషన్లోకి.. రైల్వే స్టేషన్‌లోని వెళ్లాలంటే జాగా లేదు. స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరి పోవడంతో స్టేషన్లోకి వచ్చే వారిని పోలీసులు తనిఖీలు చేసి లోపలకు పంపారు. రిజర్వేషన్లు టిక్కెట్లు లేకుండా, కుటుంబ సభ్యులు లేకుండా అనుమానంగా వున్న వారిని స్టేషన్లోకి అనుమతించకపోవడం గమన్హారం. ఇక వచ్చివెళ్లే ప్రయాణికుల వద్ద రోప్‌లకు బదులుగా పోలీసులు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నిలబడి తొక్కిసలాట జరగకుండా జాగ్రత్త వహించారు. రైళ్ల సమాచారం ముందుగానే.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏ ప్లాట్‌ఫాం పైకి ఏ రైలు వస్తుంది. ఒకే ప్లాట్ ఫాం పైకి ఒక రైలు తరువాత మరొక రైలు, దాని తరువాత వచ్చే రైళ్ల సమాచారం ముందుగానే ప్రకటించారు. దీంతో ప్రయాణికులకు తేలికగా రైళ్ల రాకపోకల సమాచారం చేరువైంది. టిక్కెట్ బుకింగ్ కౌంటర్ వద్ద టిక్కెట్ బుకింగ్ కౌంటర్ వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చీఫ్ ట్రాఫిక్ Sమేనేజర్ స్థాయి అధికారులు నిలబడి మానిటరింగ్ చేశారు. రద్దీని బట్టి ఎప్పటికప్పుడు తగు నిర్ణయాలు తీసుకుంటూ ప్రయాణికులకు టిక్కెట్ల జారీలో బిజీబిజీగా గడిపారు. అర్ధరాత్రి వరకు.. ఆదివారం తెల్లవారు జామున ప్రారంభమైన రద్దీ అర్ధరాత్రి దాటిన తరువాత కూడా కొనసాగింది. ఏ వైపు వెళ్లే రైలైనా భక్తులు వేళ్లాడుతూ వెళాల్సిన పరిస్థితి కనిపించింది. ప్రత్యేక రైళ్లు ఉన్నా ఏ మాత్రం సరిపోలేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్ పరిశీలన రైల్వే స్టేడియంలోని పుష్కర్ నగర్‌ను కృష్ణా పుష్కరాల ఫుడ్ ఇన్చార్జ్ బి.రామారావు ఆదివారం సదర్శించారు. యాత్రికులకు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న ఆహార పదార్థాలను ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు 70 లక్షల మంది యాత్రికులకు స్వచ్ఛంద సంస్థలు ఆహార పదార్థాలు అందించాయని వివరించారు. ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాం పైన మొదటి అంతస్తులో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ కార్యాలయాన్ని)స్పెషల్ రూంగా ఏర్పాటు చేశారు. అక్కడే అన్ని ప్లాట్‌ఫాంలకు సంబంధించి తెరలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ, రైల్వే, పోలీసు అధికారులు అక్కడి నుంచే మానిటరింగ్ చేశారు. రైల్వే ఉన్నతాధికారులు ప్రతి ఐదారు నిముషాలకు అక్కడికి వచ్చి ట్రాఫిక్ ఏవిధంగా ఉందో వీడియో స్కీన్స్పై చూసుకుంటూ ఆయా ప్లాట్‌ఫాంలపై ఉన్న సిబ్బందికి తగిన ఆదేశాలు ఇచ్చారు. -
దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దర్శనానికి పుష్కర యాత్రికులు బారులు తీరారు. పుష్కరాలు, శ్రావణ పౌర్ణమి కలిసి రావడంతో గురువారం రికార్డు స్థాయిలో రెండు లక్షల మంది దుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. దేవస్థానికి రూ. 22.72 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. అమ్మవారి సన్నిధిలో అశోకగజపతిరాజు దుర్గమ్మను పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనంతో పాటు అమ్మవారి ప్రసాదాలను ఆలయ ఈవో సూర్యకుమారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. -
నల్గొండలో భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
-
శ్రీవారి గరుడ సేవకు పోటెత్తిన భక్తులు
తిరుమల: తిరుమలలో శ్రీవారి గరుడసేవకు ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. రామ్ బగిచ అతిధి గృహం వద్ద భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. భక్తులు బారీకేడ్లను విరగ్గొట్టి తిరుమాడ వీధుల్లోకి ప్రవేశించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వారిని అదుపు చేయడానికి సిబ్బంది, పోలీసులు శ్రమించారు. -
భక్తులతో కిటకిటలాడిన శ్రీశైల క్షేత్రం
శ్రీశైలం (కర్నూలు): శ్రీశైల దేవస్థానానికి సోమవారం భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో దాదాపు 90వేలకు పైగా భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నట్లు అంచనా. రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీశైలం తరలివచ్చారు. భక్తులందరికీ స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించేందుకు దూర(లఘు) దర్శనం ఏర్పాటు చేశారు. అయితే మల్లన్నను స్పర్శ దర్శనం చేసుకోవాలనే సంకల్పంతో వందల సంఖ్యలో భక్తులు రుద్రాభిషేకం టికెట్లను కొనుగోలు చేశారు. దాదాపు 1,300 పైగా అభిషేకాలను గర్భాలయంలో నిర్వహించినట్లు ఈవో సాగర్‌బాబు తెలిపారు. కాగా, ఈ నెల 13తో శ్రావణమాసం ముగుస్తుందని.. చివరి శని, ఆదివారాల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో వెల్లడించారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: ఆదివారం సెలవు దినం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 57,504 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 10 గంటలు, 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న కాలిబాట భక్తులకు 5 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభిస్తోంది. -
తొలిఏకాదశి సందర్భంగా శ్రీశైలంలో రద్దీ
-
బోగీలోకాలు పెట్టేందుకు కూడావీలులేదు
-
పోటెత్తిన భక్తజన గోదారి
-
పుష్కరాలకు ఐదోరోజు పోటెత్తినభక్తులు
-
కొవ్వూరులో పుష్కర రద్దీ
-
కొవ్వూరు ఫుష్కర ఘాట్‌కు పోటెత్తుతున్న భక్తులు
-
భాసరలో పోటెత్తిన జనం
-
స్వామీ...కనవేమిరా..!
-
'నడకదారి భక్తులకు దివ్యదర్శనం టోకన్ల రద్దు'