కిక్కిరిసిన రైళ్లు
రైల్వేస్టేషన్ :
పుష్కరాలు మరి కొద్ది గంటల్లో ముగుస్తున్న తరుణంలో రైల్వేస్టేషన్ యాత్రికుల రద్దీతో కిక్కిరిసింది. విశాఖ, సికింద్రాబాద్, చెన్నై, సికింద్రాబాద్, తిరుపతి వైపు వెళ్లే పలు రైళ్లు రద్దీతో నడిచాయి. విశాఖ వైపు వెళ్లే రత్నాచల్, లింక్, జన్మభూమి, ఈస్ట్‌కోస్ట్, కోణార్క్,సికింద్రాబాద్ వైపు వెళ్లే శాతవాహన,గోల్కొండ, జన్మభూమి,తిరుపతి వైపు కృష్ణా ఎక్స్‌ప్రెస్, చెన్నై వైపు వెళ్లే పినాకినీ, కోరమాండల్, జనశతాబ్ధి రైళ్లు కిటకిటలాడాయి. వివిధ ప్రాంతాలకు నడుపుతున్న పుష్కర ప్రత్యేక రైళ్లలోను కాసింత చోటు కోసం ప్రయాణికులు అపసోపాలు పడ్డారు. మరో రెండురోజులు రద్దీ కొనసాగే అవకాశం ఉంది.