ఎటు చూసినా జనమే
ఎటు చూసినా జనమే
Published Sun, Aug 21 2016 9:32 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
కిక్కిరిసిన రైల్వే స్టేషన్
సాక్షి, విజయవాడ :
జనం.. జనం.. ఎటు చూసినా జనమే.. ఏ ప్లాట్‌ఫాం చూసినా కిక్కిరిసిన యాత్రికులు.. అసలైన పుష్కర శోభ ఆదివారం కనిపించింది. తెల్లవారు జాము నుంచి రాత్రి పొద్దు పోయే వరకు ఇసుకవేస్తే రాలనంతంగా పుష్కర యాత్రికులు వచ్చారు. దీంతో స్టేషన్ పరిసర ప్రాంతాలు యాత్రికులతో నిండిపోయాయి. సాధారణంగా రెండు లక్షల మంది ప్రయాణికులు ప్రతి రోజు విజయవాడ రైల్వేస్టేçÙన్‌కు వస్తారని అంచనా. అయితే ఒక్క ఆదివారమే నాలుగైదు లక్షల మంది వచ్చారని భావిస్తున్నారు.
తనిఖీ అనంతరమే స్టేషన్‌లోకి..
రైల్వే స్టేషన్‌లోని వెళ్లాలంటే జాగా లేదు. స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరి పోవడంతో స్టేషన్‌లోకి వచ్చే వారిని పోలీసులు తనిఖీలు చేసి లోపలకు పంపారు. రిజర్వేషన్లు టిక్కెట్లు లేకుండా, కుటుంబ సభ్యులు లేకుండా అనుమానంగా వున్న వారిని స్టేషన్‌లోకి అనుమతించకపోవడం గమన్హారం. ఇక వచ్చివెళ్లే ప్రయాణికుల వద్ద రోప్‌లకు బదులుగా పోలీసులు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నిలబడి తొక్కిసలాట జరగకుండా జాగ్రత్త వహించారు.
రైళ్ల సమాచారం ముందుగానే..
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏ ప్లాట్‌ఫాం పైకి ఏ రైలు వస్తుంది. ఒకే ప్లాట్ ఫాం పైకి ఒక రైలు తరువాత మరొక రైలు, దాని తరువాత వచ్చే రైళ్ల సమాచారం ముందుగానే ప్రకటించారు. దీంతో ప్రయాణికులకు తేలికగా రైళ్ల రాకపోకల సమాచారం చేరువైంది.
టిక్కెట్ బుకింగ్ కౌంటర్ వద్ద
టిక్కెట్ బుకింగ్ కౌంటర్ వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చీఫ్ ట్రాఫిక్ Sమేనేజర్ స్థాయి అధికారులు నిలబడి మానిటరింగ్ చేశారు. రద్దీని బట్టి ఎప్పటికప్పుడు తగు నిర్ణయాలు తీసుకుంటూ ప్రయాణికులకు టిక్కెట్ల జారీలో బిజీబిజీగా గడిపారు.
అర్ధరాత్రి వరకు..
ఆదివారం తెల్లవారు జామున ప్రారంభమైన రద్దీ అర్ధరాత్రి దాటిన తరువాత కూడా కొనసాగింది. ఏ వైపు వెళ్లే రైలైనా భక్తులు వేళ్లాడుతూ వెళాల్సిన పరిస్థితి కనిపించింది. ప్రత్యేక రైళ్లు ఉన్నా ఏ మాత్రం సరిపోలేదు.
ఫుడ్ ఇన్స్‌పెక్టర్ పరిశీలన
రైల్వే స్టేడియంలోని పుష్కర్ నగర్‌ను కృష్ణా పుష్కరాల ఫుడ్ ఇన్‌చార్జ్ బి.రామారావు ఆదివారం సదర్శించారు. యాత్రికులకు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న ఆహార పదార్థాలను ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు 70 లక్షల మంది యాత్రికులకు స్వచ్ఛంద సంస్థలు ఆహార పదార్థాలు అందించాయని వివరించారు.
ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాం పైన మొదటి అంతస్తులో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ కార్యాలయాన్ని)స్పెషల్ రూంగా ఏర్పాటు చేశారు. అక్కడే అన్ని ప్లాట్‌ఫాంలకు సంబంధించి తెరలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ, రైల్వే, పోలీసు అధికారులు అక్కడి నుంచే మానిటరింగ్ చేశారు. రైల్వే ఉన్నతాధికారులు ప్రతి ఐదారు నిముషాలకు అక్కడికి వచ్చి ట్రాఫిక్ ఏవిధంగా ఉందో వీడియో స్కీన్స్‌పై చూసుకుంటూ ఆయా ప్లాట్‌ఫాంలపై ఉన్న సిబ్బందికి తగిన ఆదేశాలు ఇచ్చారు.
Advertisement
Advertisement