బెజవాడ రైల్వేస్టేషన్ కళకళ
విజయవాడ (రైల్వేస్టేషన్) :
పది రోజులుగా వెలవెలబోయిన విజయవాడ రైల్వేస్టేçÙన్ బుధవారం ప్రయాణికులతో కళకళలాడింది. రూట్ రిలే ఇంటర్‌లాకింగ్(ఆర్‌ఆర్‌ఐ) పనుల నేపథ్యంలో పది రోజులుగా విజయవాడ స్టేషన్‌లోకి రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఐ పనులు పూర్తికావడంతో బుధవారం నుంచి అన్ని రైళ్లు యథావిథిగా స్టేషన్‌కు వచ్చి, వెళ్లాయి. దీంతో ప్రయాణికులతో అన్ని ప్లాట్‌ఫాంలపై సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం స్టేషన్‌లోని పది ప్లాట్‌ఫాంలపై 24 బోగీల రైళ్లు నిలపవచ్చని అధికారులు తెలిపారు.