
సాక్షి, విజయవాడ : విజయవాడ రైల్వే స్టేషన్ ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సీపీఎం కార్యకర్తలు రైల్వే స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రవేటీకరణను కేంద్రం ఉపసంహరించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని సీపీఎం నాయకులు హెచ్చరించారు.