విజయవాడలో తప్పిన రైలు ప్రమాదం | Coaches of Shirdi Express Detached From Engine in Vijayawada | Sakshi
Sakshi News home page

బెజవాడ: ఇంజిన్‌ నుంచి విడిపోయిన బోగీలు

Published Fri, Feb 21 2020 8:39 PM | Last Updated on Fri, Feb 21 2020 8:59 PM

Coaches of Shirdi Express Detached From Engine in Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు విజయవాడలో శుక్రవారం పెద్ద ప్రమాదం తప్పింది. రైలు అజిత్‌సింగ్ నగర్‌లో ఉండగా ఇంజన్‌ నుంచి బోగీలు ఒక్కసారిగా వేరైపోయాయి. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు గాభరా పడ్డారు. ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులతో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.



సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్టు అధికారులు వెల్లడించారు. సమస్యను పరిష్కరించి రైలును అక్కడి నుంచి పంపించారు. సాంకేతిక సమస్య తలెత్తడానికి గల కారణాలపై ఉన్నత అధికారులు ఆరా తీస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement