shirdi express
-
విజయవాడలో తప్పిన రైలు ప్రమాదం
-
విజయవాడలో తప్పిన రైలు ప్రమాదం
సాక్షి, విజయవాడ: షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలుకు విజయవాడలో శుక్రవారం పెద్ద ప్రమాదం తప్పింది. రైలు అజిత్‌సింగ్ నగర్లో ఉండగా ఇంజన్ నుంచి బోగీలు ఒక్కసారిగా వేరైపోయాయి. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు గాభరా పడ్డారు. ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులతో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్టు అధికారులు వెల్లడించారు. సమస్యను పరిష్కరించి రైలును అక్కడి నుంచి పంపించారు. సాంకేతిక సమస్య తలెత్తడానికి గల కారణాలపై ఉన్నత అధికారులు ఆరా తీస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
పట్టాలు తప్పిన షిరిడీ ఎక్స్‌ప్రెస్
సాక్షి, వైఎస్సార్: ఆంధ్రప్రదేశ్‌లో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి షిరిడీకి వెళుతున్న సాయినాథ్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం ఉదయం పట్టాలు తప్పింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. అయితే రైల్వేస్టేషన్‌ను సమీపించిన రైలు నెమ్మదిగా రావడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన రైల్వేకోడూర్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వేసిబ్బంది మరమ్మత్తు చర్యలు చేపట్టారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా ఈ ఘటనపై షిరిడీకి వెళ్తున్న భక్తులు ఆందోళన చెందుతున్నారు. -
షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
డోర్నకల్ (వరంగల్) : మహారాష్ట్రలోని షిర్డీ సాయి నగర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న షిర్డీ ఎక్స్‌ప్రెస్ శనివారం డోర్నకల్ సమీపంలోకి రాగానే ఏసీ బోగీ కింది భాగంలో సమస్య తలెత్తడంతో.. బోగీలో పొగలు కమ్ముకున్నాయి. ఈ సమస్యను గుర్తించిన డ్రైవర్ వెంటనే డోర్నకల్ రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది మూడో ఏసీ బోగీ కింద బ్రేక్ జామ్ అయిన విషయాన్ని గుర్తించి దాన్ని సరిచేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో షిర్డీ ఎక్స్‌ప్రెస్ డోర్నకల్‌లో అరగంటకు పైగా ఆగిపోయింది. -
షిర్డీ ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి మహిళ మృతి
నల్గొండ : ప్రమాదవశాత్తూ షిర్డీ ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన నల్గొండ జిల్లా భువనగిరి రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. మృతురాలు కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్‌కు చెందిన రమాదేవిగా గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.