షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు | Fumes in Train due to Break jam under AC compartment | Sakshi
Sakshi News home page

షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

Published Sat, Nov 28 2015 3:12 PM | Last Updated on Sun, Sep 3 2017 1:10 PM

Fumes in Train due to Break jam under AC compartment

డోర్నకల్ (వరంగల్) : మహారాష్ట్రలోని షిర్డీ సాయి నగర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న షిర్డీ ఎక్స్‌ప్రెస్ శనివారం డోర్నకల్ సమీపంలోకి రాగానే ఏసీ బోగీ కింది భాగంలో సమస్య తలెత్తడంతో.. బోగీలో పొగలు కమ్ముకున్నాయి. ఈ సమస్యను గుర్తించిన డ్రైవర్ వెంటనే డోర్నకల్ రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది మూడో ఏసీ బోగీ కింద బ్రేక్ జామ్ అయిన విషయాన్ని గుర్తించి దాన్ని సరిచేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో షిర్డీ ఎక్స్‌ప్రెస్ డోర్నకల్‌లో అరగంటకు పైగా ఆగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement