ఢిల్లీ: లోక్‌సభ లోపలికి ఆగంతకులు ప్రవేశించి బుధవారం గందరగోళం సృష్టించారు. సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకి టియర్ గ్యాస్ వదిలారు. దీంతో ఎంపీలంతా భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిందితులను పట్టుకుని సిబ్బందికి అప్పగించారు. పార్లమెంట్‌పై దాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన వేళ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. నిందితులు బూట్లలో గ్యాస్ క్యానిస్టర్లను దాచుకుని వెంట తెచ్చుకున్నారు. అసలు ఏంటి ఈ గ్యాస్ క్యానిస్టర్లు? ఎక్కడ ఉపయోగిస్తారు?
Sansad breaking.
— sansadflix (@sansadflix) December 13, 2023
Two people with tear gas canisters jumped into Lok Sabha well and opened it. House adjourned. #LokSabha pic.twitter.com/UrFZ7xE8pB
గ్యాస్ క్యానిస్టర్ల అంటే..?
గ్యాస్ క్యానిస్టర్లను స్మోక్ బాంబులు, పొగ డబ్బాలు అని కూడా పిలుస్తుంటారు. వీటిని బహిరంగంగా ఉపయోగించేందుకు చట్టబద్ధత ఉంది. సినిమాలు, ఫొటోషూట్‌లలో పొగ తెరలను సృష్టించడానికి, మిలిటరీ విభాగాల్లోనూ వీటిని ఉపయోగిస్తుంటారు. శత్రువుల కళ్లను పొగతో ఏమార్చడానికి వాడుతారు. క్రీడలలో ముఖ్యంగా ఫుట్‌బాల్‌లో అభిమానులు తమ క్లబ్‌ల రంగులను ప్రదర్శించడానికి పొగ డబ్బాలను ఉపయోగిస్తారు.
గ్రనైడ్లతో కూడిన క్యానిస్టర్లను సైనిక ఆపరేషన్లలో వాడతారు. దట్టమైన పొగ తెరలను సృష్టించడం ద్వారా దళాల కదలికలు అస్పష్టంగా మారుతాయి. తద్వారా శత్రువుల కంటపడకుండా కీలక ఆపరేషన్లను కొనసాగించడంలో దోహదం చేస్తాయి. గగనతల దాడులు, భద్రతా దళాలు దిగడం, తరలింపు కేంద్రాలను లక్ష్యంగా చేసుకునేందుకు వీటిని ఉపయోగిస్తుంటారు.
నిందితుల వివరాలు..
లోక్‌సభలో టియర్ గ్యాస్ ప్రయోగానికి సంబంధించి నిందితులను సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి కౌర్, లలిత్ ఝా, విక్కీ శర్మలుగా గుర్తించారు. కాగా, దర్యాప్తులో భాగంగా సాగర్ శర్మ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో కాగా.. మనో రంజన్ కర్ణాటకలోని మైసూర్. అమోల్ షిండే స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్ కాగా.. నీలం దేవి కౌర్ స్వస్థలం హర్యాణాలోని హిస్సార్. ఈ కుట్ర వెనుక మరో కీలక సూత్రదారి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు చేపట్టారు.
"Main conspirator someone else" in Parliament security breach: Police sources
— ANI Digital (@ani_digital) December 14, 2023
Read @ANI Story | https://t.co/A1Tn7NerpO#ParliamentSecurityBreach #India #Delhi pic.twitter.com/qSRwgdGVPB
ఇదీ చదవండి: Parliament Issue: నా కొడుకు చేసింది తప్పే.. ఉరి తీయండి
Comments
Please login to add a commentAdd a comment